మార్చి 14, 15 తేదీల్లో అరకు ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. అలాగే సవర భాషకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన గురువారమిక్కడ తెలిపారు.
విజయనగరం : మార్చి 14, 15 తేదీల్లో అరకు ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. అలాగే సవర భాషకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన గురువారమిక్కడ తెలిపారు. చంద్రన్న సంక్షేమ పాలన కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో ఏర్పాటు చేసిన ర్యాలీని మంత్రి రావెల ఈరోజు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్వతీపురం, గజపతినగరం నియోజకవర్గాల్లో రూ.26 కోట్లతో రెండు రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచుతామని రావెల తెలిపారు.