వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా విస్తృత స్థాయి సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది.
విజయనగరం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా విస్తృత స్థాయి సమావేశం గురువారమిక్కడ ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాలు ఎండగడుతూ, సర్కార్ మోసపూరిత తీరును ప్రజలకు వివరిస్తూ, వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ...ఆ దిశగా శ్రేణులను మరింత సమాయత్తపరిచేందుకు పార్టీ త్రిసభ్య కమిటీ నేడు జిల్లాకు వచ్చింది.
ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాదరాజు...జిల్లా నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు... గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయటం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ సమావేశానికి బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, రాజన్నదొర, పుష్పశ్రీవాణి, నియోజకవర్గాల కన్వీనర్లు, కార్యకర్తలు హాజరయ్యారు.