రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 293వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం జననేత నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సన్యాసిరాజుపేట, బాగువలస మీదుగా నక్కడవలస క్రాస్ వరకు వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తడిలోవ, మక్కువ మండలంలోని గునికొండవలస మీదుగా చప్ప బుచ్చంపేట వరకు జననేత పాదయాత్ర సాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.