ఈరోజు ఉదయం పాదయాత్ర మొదలవగా నే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉపాధ్యాయులు కలిశారు. వారంద రూ గిరిజనులే. గిరిజన గ్రామాల్లో సరైన వసతు ల్లేకున్నా, చాలీచాలని జీతాలతో పదహారేళ్లుగా సేవలందిస్తున్నామని చెప్పారు. ఏడాదిలో సెలవు లు పోనూ వారికి జీతాలిచ్చేది 10 నెలలేనట. ‘రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నాం.