YS Jagan Diary
-
సీఎం జగన్ సంక్షేమ పాలన దేశానికే ఆదర్శం...
-
ఐటీసీకి చెందిన వెల్కమ్ హోటల్ ను ప్రారంభించిన సీఎం జగన్
-
2021 వైఎస్ఆర్ సీపీ విజయ ప్రస్థానం పై స్పెషల్ ఫోకస్
-
స్కూలు అమ్మలకు ఆసరా
సాక్షి కడప/ ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల కిందట ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. అవ్వతాతల కోసం వైఎస్సార్ పింఛన్ పథకాన్ని తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్...కిడ్నీ బాధితులకు పింఛన్ కింద రూ. 10 వేలు, దివ్యాంగులకు రూ. 3 వేలు అందించేలా తొలి సంతకాన్ని చేసి దివంగత సీఎం వైఎస్సార్‌ను తలపించారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఎడతెరిపి లేకుండా శాఖలపై సమీక్ష చేస్తూ ప్రతి పథకాన్ని పేదలకు అందేలా రూపకల్పన చేస్తున్నారు. మొదటగా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి అందించే మహిళా కార్మికుల కష్టాలను అధ్యయనం చేసిన సీఎం వారి గౌరవ వేతనం పెంపునకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రూ.1000 మాత్రమే...అందునా అది కూడా టీడీపీ సర్కార్ హయాంలో నెలనెల ఇవ్వని పరిస్థితి ఇప్పటికీ కూడా మూడు, నాలుగు నెలల గౌరవ వేతనం కూడా పెండింగ్‌లో పెట్టి ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా కార్మికులు పడుతున్న ఇబ్బందులను గమనించిన సీఎం వైఎస్ జగన్ రూ. 1000 నుంచి రూ. 3000లకు గౌరవ వేతనాన్ని పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 5745 మందికి లబ్ది జిల్లాలో 3654 పాఠశాలల్లో సుమారు 2,17,536 మందికి పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. వంట ఏజెన్సీల ద్వారా 5745 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా సీఎం తీసుకున్న నిర్ణయంతో గౌరవ వేతనం నెలకు రూ.3 వేలు చొప్పున అందనుంది. మధ్యాహ్న భోజన కార్మికులు వంట వండే సమయంలో అనేక అవస్థలకు గురవుతున్నా వారిని ఎవరూ పట్టించుకోలేదు. ఒకపక్క సమస్యలు...మరోవైపు సక్రమంగా రాని గౌరవ వేతనం.....అదికూడా అంతంత మాత్రంగా ఇస్తుండడంతో అవస్థలు పడుతున్న వారి కష్టానికి సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇవ్వనుంది.జిల్లాలో 5745 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుండడంతో మహిళా కార్మికుల మోముల్లో చిరునవ్వులు విరజిల్లుతున్నాయి. వైఎస్సార్ అక్షయపాత్రగా నామకరణం ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. మొదటగా మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్సార్ అక్షయపాత్రగా నామకరణం చేశారు. అంతేకాకుండా ఉన్నతాధికారులతో సమీక్షించి ప్రతి పాఠశాలలో నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. పథకానికి నామకరణం చేసిన ఆయన పిల్లల కడుపుకు అందించే ఆహార విషయంలోనూ ప్రతి ఒక్కరూ బాద్యతగా వ్యవహారించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మహిళా కార్మికుల్లో సంబరాలు మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. తక్కువ గౌరవ వేతనమే కాకుండా వారికి నెలనెల కూడా సక్రమంగా ఇవ్వలేదు. గౌరవ వేతనం పెంచుతామని హామి ఇచ్చినా దాన్ని అమలు చేయలేదు. వరత్నాలతోపాటు మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనాన్ని మేనిఫెస్టోలో లేకపోయినా....ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వస్తూనే సీఎం వైఎస్ జగన్ వారికి న్యాయం చేశారు. దీంతో మధ్యాహ్న భోజన కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మహిళా కార్మికులు సంబరాలు చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. -
341వ రోజు పాదయాత్ర డైరీ
-
341వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,648 కిలోమీటర్లు 341వ రోజు నడిచిన దూరం: 9.1 కిలోమీటర్లు 09–01–2019, బుధవారం, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం జిల్లా రాజన్న రాజ్యాన్ని తేవాలన్న ప్రజా సంకల్పం.. నాలో వజ్ర సంకల్పంగా మారింది మన సంకల్పం మంచిదైతే దేవుని దయ కూడా తోడవుతుంది. 14 నెలల కిందట ఇడుపులపాయలో నాన్నగారి పాదాల చెంత ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర.. ఇచ్ఛాపురంలో విజయ సంకల్ప స్తూపాన్ని చేరింది. 341 రోజులుగా 13 జిల్లాల్లో.. 3,648 కి.మీ సాగిన యాత్ర.. నేటితో ముగిసింది. నాన్నగారు, సోదరి షర్మిల, నేను.. మా ముగ్గురి పాదయాత్రలు ఇచ్ఛాపురంలోనే ముగియడం చరిత్రాత్మకం. దానికి గుర్తుగా 3 స్తూపాలుండటం ఓ మధుర జ్ఞాపకం. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు వేలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం.. కోట్లాది మంది ప్రజలను ప్రత్యక్షంగా కలవడం.. ప్రపంచ చరిత్రలో ఎవరికీ దొరకని అదృష్టం. ఇది దైవ నిర్ణయం.. ఇది ప్రజల ఆశీర్వాదం. కోట్లాదిమంది గుండె చప్పుళ్లు వినగలగడం.. నా జీవితానికే గొప్ప అనుభవం. నా ఈ పాదయాత్ర ప్రజల కష్టాలను, కడగండ్లను దగ్గరగా చూడగలిగిన అవకాశం. పరిష్కరించదగిన చిన్న చిన్న సమస్యలూ తీరకపోవడంతో ఏళ్ల తరబడి వారు చేస్తున్న జీవన పోరాటం.. గుండెను బరువెక్కించింది. అత్యధికశాతం సమస్యలకు పాలకులే కారణమవడం ఆశ్చర్యమేసింది. గుండె ను పిండే దయనీయ గాథలెన్నో ఎదురయ్యాయి. ఉదయగిరిలో అంకమ్మరావు అనే బలహీనవర్గాలకు చెందిన ఇంజినీరింగ్ చదువుతున్న ఓ సోదరుడు.. ఫీజురీయింబర్స్కాక, బకాయిలు కట్టడానికి కూలి చేసే తండ్రి పడుతున్న కష్టాన్ని చూడ లేక ఆత్మహత్య చేసుకోవడం మనసును కలచివేసింది. అప్పులు తీర్చడానికి కిడ్నీ అమ్ముకున్న ఓ అన్నదాత.. బతుకుదెరువుకు గుంటూరు జిల్లా లోని ఓ చిన్న హోటల్లో పనిచేస్తుండటం అత్యంత దయనీయం. కొండకెంగువలో 108 రాక.. దండసి మేరీ అనే ఓ సోదరి ఆటోలో కుదుపులకు రక్తస్రావమై పురిటిలోనే బిడ్డను కోల్పోయిన ఘటన చలింపజేసింది. విజయవాడలో నిండా 30 ఏళ్లు నిండని ఓ ముస్లిం సోదరి.. ఆరోగ్యశ్రీ అందక, సీఎం సహాయ నిధి రాక, కిడ్నీ చికిత్స కోసం భర్త నడుపుకుంటున్న ఆటోనూ అమ్మేసుకుని.. ఆదుకునేవారి కోసం ఎదురుచూస్తుండటం గుండెను పిండేసింది. రుణమాఫీ మాటలు నమ్మి మోసపోయి.. చేయని పాపానికి లాయర్‌ను పెట్టుకుని కోర్టు మెట్లెక్కిన వెంకటాపురం దళితవాడ డ్వాక్రా అక్కచెల్లెమ్మల కష్టాలు కళ్లారా చూశాను. 90 ఏళ్లు పైబడ్డ పండు ముసలివాళ్లు.. భర్తలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతువులు మొదలుకుని.. వందశాతం వైకల్యంతో మంచానికే పరిమితమైన దివ్యాంగుల వరకు.. దాదాపు 900 మంది కి నిర్దాక్షిణ్యంగా పింఛన్లు తొలగించిన పాలక నేతల రాక్షసత్వం పొందూరులో నా దృష్టికొచ్చింది. అమ్మణ్ణమ్మ అనే అవ్వ చనిపోయిందని పింఛన్ ఆపితే.. ‘నేను బతికే ఉన్నా’నని కోర్టులో చెప్పుకోవాల్సిరావడం.. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖం లఉన్న మెట్ట లక్ష్మి అనే సోదరి వితంతువు కాదం టూ పింఛన్ ఆపితే.. ‘నాకు పింఛన్ అవసరం లేదు.. నా భర్తను చూపండిచాలు’ అంటూ న్యాయమూర్తికి మొరపెట్టుకోవడం.. ప్రభుత్వ దాష్టీకాలకు పరాకాష్ట. భర్తలుండగనే పిఠాపురంలో తప్పుడు డెత్ సర్టిఫికెట్లు సృష్టించి.. సుమంగళిలను వితంతువులుగా చూపించి.. పింఛన్లు మింగేసిన వైనం.. అధికార నేతల దిగజారుడుతనానికో నిదర్శనం. అన్నపూర్ణగా పేరుగాంచిన గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు మండలంలోనే.. ఈ పాలనలో ఏకంగా ఏడుగురు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వ్యవసాయ దుస్థితికి అద్దం పట్టింది. ప్రభుత్వ సాయం కరువై.. జీవచ్ఛవాల్లా బతుకుతున్న ప్రకాశం ఫ్లోరైడ్ కథలు.. ఉద్దానం కిడ్నీవెతలు.. కంటతడి పెట్టించాయి. ముఖ్య మంత్రిగారిచ్చిన తుపాను పరిహారపు చెల్లని చెక్కు ల మోసాలు.. వనరులన్నింటినీ దోచేసిన వైనాలు.. జన్మభూమి కమిటీల దుర్మార్గాలు.. వంచిపబడ్డ అన్ని కులాల, వర్గాల, సంఘాల ఆక్రోశాలు.. జీవితాలను ఛిద్రంచేసిన మద్యం కథలు.. వలసల వెతలు.. అభివృద్ధిలేక, సంక్షేమం అందక సంక్షోభంలో కూరుకుపోయిన జనజీవితాలు.. ఒక్కటేమి టి, సమస్తం పాదయాత్రలో సాక్షాత్కరించాయి. చెప్పుకునే దారిలేక.. మనసు విప్పే మార్గం కనిపించక.. తల్లడిల్లుతున్న కోట్లాది జనం నా అడుగులో అడుగులేశారు. వారి ప్రేమ, ఆప్యాయతలే నన్ను నడిపించాయి. ఆ ప్రజా సంకల్పమే దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికింది. అధికార పార్టీ అవకాశవాద ముసుగు తొలగించింది. కన్ను కుట్టిన పాలక నేతల కుట్రల నుంచి పుట్టుకొచ్చిన హత్యాయత్నం నుంచి.. ప్రజాశీర్వాదమే నన్ను కాపాడింది. ఆ ప్రజల నమ్మకం.. నా బాధ్యతను మరింత పెంచింది. ‘ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎంతమంది హృదయాల్లో జీవించామన్నది ముఖ్యం’ అన్న నాన్నగారి మాటలు నా మదిలో మెదలుతున్నాయి. రాజన్న రాజ్యాన్ని తేవాలన్న ప్రజా సంకల్పం.. నాలో వజ్ర సంకల్పంగా మారింది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాన్నగారి పాదయాత్ర నుంచి ఆరోగ్యశ్రీ, 108, ఫీజురీయింబర్స్‌వంటి అనేక అద్భుత పథకాలు పుట్టుకొచ్చాయి. మీ పాదయాత్ర నుంచి వచ్చిన ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా? మీ పాదయాత్ర హామీలు నెరవేరకపోగా.. ఆ నాటి సమస్యలు మరింత జటిలమయ్యాయని.. మీ వల్లే మరిన్ని సమస్యలు పుట్టుకొచ్చాయని.. జీవితాలు దుర్భర మయ్యాయని.. ప్రజలు ఆక్రోశిస్తున్నారు.. వారికేం సమాధానం చెబుతారు? -వైఎస్ జగన్ -
340వ రోజు పాదయాత్ర డైరీ
-
340వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం – 3,638.9 కి.మీ. 340వ రోజు నడిచిన దూరం – 10.7 కి.మీ. 08–01–2019, మంగళవారం,అగ్రహారం, శ్రీకాకుళం జిల్లా. ఉద్దానంలో దారుణ పరిస్థితిని మార్చాలన్న తపన కాస్తయినా లేని ప్రభుత్వాన్ని ఏమనాలి? పాదయాత్ర చివరి అంకానికి చేరుకుంది. ‘విజయ సంకల్పం’ స్తూపం వైపు అడుగులు చేరువయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పాదయాత్ర చేసేటప్పుడు వెంకట రాంబాబు అనే ఆటో డ్రైవర్ కలిశాడు. ఆయన ఒక్కగానొక్క కొడుకు మణికంఠకు బ్రెయిన్ ట్యూమర్. ఆస్పత్రులకు వెళ్తే రూ.ఆరు లక్షలు అవుతుందన్నారు.. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. ఆ తండ్రి నిస్సహాయతను చూసి జాలేసింది. పిల్లాడికి వైద్యసాయం అందేలా చేశాను. ఆపరేషన్ పూర్తయి ఆ బిడ్డ ఆరోగ్యవంతుడయ్యాడు. ఈరోజు ఆ తండ్రి కొడుకును ఎత్తుకుని వచ్చి సంతోషాన్ని పంచుకుంటుంటే మనసంతా తృప్తితో నిండిపోయింది. ఈరోజు కవిటి మండలంలో పాదయాత్ర సాగింది. దేశంలోనే అత్యధికంగా కిడ్నీ వ్యాధికి గురయ్యే ప్రాంతమిది. కాళ్లు, మొహం, కళ్ల వాపులతో నడవడానికి సత్తువ లేని ఎందరో కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు. వారిలో నాలుగైదేళ్ల చిన్నారుల నుంచి పండు ముసలివారి వరకు ఉన్నారు. వారంతా నిరుపేదలైన వ్యవసాయ కూలీలు, మత్స్యకార కుటుంబాలవారే. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. మందులు లేక, డాక్టర్లు అందుబాటులో లేక, డయాలసిస్ సేవలు సరిగా అందక, పింఛన్లు రాక, ఆదుకునేవారే లేక జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. శ్రీహరిపురం వద్ద కలిసిన ఆ విధివంచితుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో దయనీయ గాథ. బుథియా అనే తాత ఒక కొబ్బరి కూలీ. కిడ్నీ వ్యాధిబారిన పడి ఏ పనీ చేయలేకపోతున్నాడు. అతని బిడ్డలు వలస కూలీలు. వేలకు వేలు ఖర్చు చేసి తండ్రికి చికిత్స చేయించలేని దుస్థితి వారిది. విధిరాత ఇంతేననుకుని, దేవుడిపై భారం వేసి ఇంటిపట్టునే ఉంటున్నానని ఆ తాత చెబుతుంటే గుండె బరువెక్కింది. బొడియా జమున కుటుంబ గాథ మరింత దయనీయం. ఒకే కుటుంబంలో కిడ్నీ వ్యాధితో నలుగురిని కోల్పోయిన విషాదం. ఒక్కొక్కరి వ్యథ వింటుంటే మనసు కలత చెందింది. ఒకప్పుడు ఉద్యానవనంలా వెలుగొందిన ఉద్దానాన్ని కిడ్నీ వ్యాధి కబళించి వేస్తోందా అనిపిస్తోంది. ఇక్కడివారిని పెళ్లి చేసుకోవడానికి బయట ప్రాంతాలవారు వెనుకంజ వేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పనిచేయడానికి ఉద్యోగులు కూడా ముందుకు రావడం లేదట. వలస వెళ్లిపోయినవారు, ఈ ప్రాంతాన్ని వదిలేసి బయట ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఎందరో ఉన్నారట. ఉద్దానం ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితిని మార్చాలన్న తపన కాస్తయినా లేని ప్రభుత్వాన్ని ఏమనాలి? చుట్టా దున్నా అనే అన్న కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ‘ఈ ప్రభుత్వం మంచినీళ్లు ఇవ్వడం లేదు కానీ వద్దన్నా మద్యాన్ని మాత్రం సరఫరా చేస్తోంది. అంతంతమాత్రంగా ఉన్న కిడ్నీలు మద్యం దెబ్బకు పూర్తిగా పాడయ్యాయి’ అంటూ ఆయన భార్య చుట్టా లక్ష్మి కన్నీటిపర్యంతమైంది. ప్రజల ప్రాణాలు పోతున్నా కనీస వైద్య సాయం అందించడంలో లేని శ్రద్ధ మద్యం వ్యాపారంపై ఉండటం దౌర్భాగ్యం. ప్రజల ఆరోగ్యం పాడైనా పర్లేదు.. ఆదాయం వస్తే చాలనుకునే పాలనలో ఉద్దానం వెలుగులు ఎండ మావులేనేమో! ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న..మీరు ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సేవలే లేనప్పుడు ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షలకు పెంచుతున్నామని, ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తున్నామని పెద్దపెద్ద ప్రకటనలివ్వడం ప్రజలను దారుణంగా వంచించడం కాదా? -వైఎస్ జగన్ -
339వ రోజు పాదయాత్ర డైరీ
-
జగమెరుగని యాత్ర
సాక్షి, అమరావతి: మొత్తం 341 రోజులు.. 3,648 కిలోమీటర్లు.. ప్రతి పల్లెను పలుకరిస్తూ.. కోటి 25 లక్షల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ వారితో మమేకం...తెలుగు గడ్డపై కనీవినీ ఎరుగని ఇలాంటి పాదయాత్ర చరిత్రలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు...ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’ ఈనెల 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. అప్పటికి ఈ అపూర్వ పాదయాత్ర 3,648 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. రాష్ట్రంలోని దాదాపు 2,516 గ్రామాల మీదుగా సాగే ప్రతిపక్ష నేత పాదయాత్రలో బుధవారం నాటికి 124 బహిరంగ సభలు (ఇప్పటికి 123 సభలు) పూర్తవుతాయి. చిన్న పట్టణాల్లో ఈ సభలకు కనిష్టంగా 30 వేల నుంచి గరిష్టంగా 50 వేల మంది వరకు జనం తరలివచ్చారు. ముఖ్య పట్టణాలు, నగరాల్లో జనం పోటెత్తడంతో 60 వేల నుంచి లక్ష మందికిపైగా హాజరైనట్లు అంచనా. ఈ లెక్కన బహిరంగ సభల్లోనే ఒక్కో సభకు సరాసరిన 60 వేల మంది హాజరైనట్లు భావించినా మొత్తం 74.40 లక్షల మంది హాజరైనట్టు లెక్క. కోట్ల మందిని కలుసుకుంటూ... ప్రతిపక్షనేత తన వెంట నడిచిన వారితోపాటు గ్రామాల్లో బారులు తీరిన ప్రజలను రోజుకు కనిష్టంగా 15 వేల మందిని స్వయంగా కలుసుకున్నారు. 341 రోజుల పాదయాత్రలో ప్రతిపక్ష నేతను కలిసే వారి సంఖ్య 51.15 లక్షలు అవుతోంది. మొత్తంగా చూస్తే 1.25 కోట్ల మందికిపైగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారితో మమేకమై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగించిన ఈ పాదయాత్ర ఓ అరుదైన ఘట్టంగా చరిత్రపుటల్లోకెక్కనుంది. మరోపక్క ఆత్మీయ సమావేశాలకూ వేలసంఖ్యలో ఆయా వర్గాల ప్రజలు హాజరయ్యారు. వీరితో పాటు ప్రసారమాధ్యమాల ద్వారా పాదయాత్ర, బహిరంగ సభలను వీక్షించిన దేశ విదేశాల్లోని కోట్లాది తెలుగు ప్రజలందరినీ కలుపుకొంటే ఈ సంఖ్య భారీగానే ఉండనుంది. పోటెత్తిన జనసంద్రం.. ముగింపురోజు నాటికి పాదయాత్ర గ్రామాల సంఖ్య 2,516కి చేరనుంది. 231 మండల కేంద్రాలు, 54 మున్సిపాలిటీలు, 8 నగరాలు, మహానగరాల మీదుగా సాగిన జగన్ పాదయాత్రకు జనం అడుగడుగునా వెల్లువెత్తారు. ప్రతిపక్షనేతను కలసి సమస్యలు చెప్పుకునేందుకు, టీడీపీ సర్కారు అరాచకాలు, అక్రమాలు, అవినీతిని వివరించేందుకు ప్రతిపక్ష నేతను కలిసేందుకు బారులుతీరారు. ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీపడ్డారు. వృద్ధులు, యువత, మహిళలు, విద్యార్ధులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, చిరుద్యోగులు, వివిధ సామాజికవర్గాల ప్రతినిధులు, కర్షకులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌ను కలిసేందుకు కదలి వచ్చారు. పాదయాత్ర గ్రామాల మీదుగా సాగినప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, రైతు కూలీలు పరుగు పరుగున వచ్చిన దృశ్యాలు అనేకం. పట్టణాలు, నగరాల్లో ప్రతిపక్ష నేతను అనుసరిస్తూ పాదయాత్రలో మమేకమైన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. ప్రతిపక్ష నేతను కలిసేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. మేడలు, మిద్దెలు ఎక్కి వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు జనం పోటెత్తారు. తమ ప్రియతమ నాయకుడు, ప్రతిపక్ష నేతను కళ్లారా తిలకించి ఆయన ప్రసంగాన్ని వినేందుకు పోటెత్తిన జనంతో బహిరంగ సభలు జనసంద్రంలా మారాయి. పాదయాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించినప్పుడు కనకదుర్గమ్మ వారధి జనప్రవాహంతో నిండిపోయింది. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోకి యాత్ర చేరుకున్నప్పుడు రాజమండ్రి వద్ద గోదావరిపై ఉన్న రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి జనవారధిగా మారింది. విశాఖలో కంచరపాలెం వద్ద జరిగిన సభ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. రాజకీయ అజెండాగా మారిన ‘ప్రత్యేక హోదా’ వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పలు సమస్యలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజల్లో భరోసా, స్థైర్యాన్ని నింపుతూ సాగిన ఈ పాదయాత్ర అధికార టీడీపీని బెంబేలెత్తించగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో గుబులు రేపింది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో వేడిని రగిల్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చి రాష్ట్ర ప్రజల ఆశలకు కొత్త ఊపిరులూదింది. ప్రజలందరూ ప్రత్యేక హోదాపైనే ఆశలు పెట్టుకోగా అదే హామీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలు, ఓటుకు కోట్లు కేసు భయంతో హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారు. అయితే దాదాపు ఐదేళ్ల పాటు నిరంతర పోరాటం ద్వారా ప్రజలను జాగృతం చేసి ప్రత్యేక హోదా నినాదాన్ని వైఎస్ జగన్ సజీవంగా ఉంచారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమ ఎంపీలతో రాజీనామా చేయించి ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చారు. హోదాపై పలుమార్లు మాటమార్చి ‘యూటర్న్’ తీసుకున్న చంద్రబాబు ఎన్నికలు సమీపించడంతో గత్యంతరం లేక ప్రత్యేక హోదా బాట పట్టారు. వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలతో చంద్రబాబు మరోదారి లేక కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ నుంచి వైదొలగారు. నవరత్నాలతో భరోసా.. టీడీపీ పాలనలో విచ్చలవిడిగా సాగుతున్న అరాచకాలు, అక్రమాలు, అవినీతి, దుర్మార్గాల గురించి పాదయాత్ర పొడవునా ప్రజలు ప్రతిపక్షనేతతో మొరపెట్టుకున్నారు. పెన్షన్లు, ఇళ్ల మంజూరులో జన్మభూమి కమిటీల దందాలు, టీడీపీ నేతల భూ కబ్జాలు, ఇసుక దందాలు, అక్రమంగా గనుల తవ్వకాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. టీడీపీ ప్రజాకంటక పాలన నుంచి తమను ఆదుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, అసంఘటిత కార్మికులు కోరారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో తమ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టనున్న పలు కార్యక్రమాల గురించి పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో వైఎస్ జగన్ ప్రస్తావించారు. వైఎస్సార్ సీపీ ప్రకటించిన నవరత్నాల హామీ ద్వారా ప్రజలకు భరోసా కల్పించారు. ఇవే కాకుండా పాదయాత్రలో తన దృష్టికి వచ్చే సమస్యలపైనా తాము అధికారంలోకి రాగానే ఎలాంటి చర్యలు తీసుకుంటామో జగన్ స్పష్టంగా వివరిస్తున్నారు. ప్రతి సభలోనూ ప్రతిపక్షనేత ప్రసంగం ప్రజలను ఆకట్టుకోవడంతోపాటు సర్కారు అరాచకాలపై లోతుగా ఆలోచించేలా సాగింది. ఇక వివిధ కులాలు, సామాజిక వర్గాల ప్రజలతో వైఎస్ జగన్ నిర్వహించిన ఆత్మీయ సమావేశాలు వారికి ఎంతో భరోసాను కల్పించాయి. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన సమయంలో కాపుల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో పాటు వారిని ఆదుకునేందుకు కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.10 వేల కోట్ల నిధిని సమకూరుస్తామని ప్రతిపక్ష నేత ప్రకటన చేశారు. స్పష్టమైన కార్యాచరణ పాదయాత్ర పొడవునా అనాథలు, అణగారిన వర్గాలను ఓదారుస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, మెగా డీఎస్సీ తదితర హామీలతో భరోసా కల్పించారు. వివిధ కులాల సంక్షేమానికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ డెయిరీలు, చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, తిత్లీ తుపాను బాధితులకు పరిహారం మొత్తాన్ని చెల్లిస్తామని వైఎస్ జగన్ స్పష్టమైన ప్రకటన చేసి వారికి స్థైర్యాన్ని కల్పించారు. ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం పాదయాత్ర సందర్భంగా విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పర్యటన అనంతరం హైదరాబాద్‌కు పయనమైన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం రాష్ట్ర ప్రజలనే కాకుండా జాతీయ స్థాయిలోనూ అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. టీడీపీ నేత హర్షవర్థన్ చౌదరి నిర్వహిస్తున్న క్యాంటీన్లో పనిచేసే దుండగుడు ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడగా వైఎస్ జగన్ అప్రమత్తమై పక్కకు తప్పుకోవడంతో ఆయన భుజంపై కత్తి దిగబడింది. సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే డీజీపీ ఆర్పీ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కేసు దర్యాప్తును నీరుగార్చేలా వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముగింపు సభకు భారీ ఏర్పాట్లు ఇచ్ఛాపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : జననేత జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 9వతేదీన ఇచ్ఛాపురం ఆర్టీసీ పాత బస్టాండ్ వద్ద జరిగే భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాదయాత్రలో ఇప్పటికే ఇచ్ఛాపురం సమీపంలోకి వచ్చిన జగన్ కొత్త కొజ్జీరియా గ్రామం నుంచి 9వ తేదీ ఉదయం తన పాదయాత్రను ప్రారంభించి లొద్దపుట్టి గ్రామం వద్ద మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు. అక్కడి నుంచి మధ్యాహ్న విరామం తరువాత జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విజయసంకల్ప స్తూపం వద్దకు బయలు దేరుతారు. తన యాత్ర ముగింపు సూచకంగా ఆకర్షణీయంగా నిర్మించిన ఈ స్తూపాన్ని జగన్ ఆవిష్కరించి..ఆ తరువాత అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని ఇచ్ఛాపురం పట్టణంలోకి అడుగుపెట్టి బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయస్తూపం, తన సోదరి షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం స్తూపం మీదుగా జగన్ బహిరంగ సభకు వెళతారు. అక్కడితో ఆయన చారిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తుంది. బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సాక్షితో మాట్లాడుతూ 341వ రోజు యాత్ర ముగింపు రోజున జగన్ సుమారు 9 కిలోమీటర్ల మేరకు నడిచే అవకాశం ఉందన్నారు. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద తొలి అడుగు పడిన జగన్ పాదయాత్రకు చివరి అడుగు ఇచ్ఛాపురం బస్టాండులో పూర్తవుతుందన్నారు. జగన్ యాత్ర ముగింపు అపూర్వ ఘట్టాన్ని కళ్ళారా చూసేందుకు, ఆయన సందేశం వినేందుకు ఆసక్తితో ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. రాష్ట్ర పార్టీ ప్రముఖ నేతలంతా హాజరవుతున్నట్లు రఘురామ్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుందన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. విజయసంకల్పం స్తూపానికి తుది మెరుగులు మరో రెండు రోజుల్లో యాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం విజయసంకల్పం స్తూపానికి రాత్రింబవళ్లు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే స్తూపంపై వైఎస్ చిత్రాలను, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలను అమర్చారు. నిర్మాణం పటిష్టంగా జరుగుతోందని.. మొత్తం మీద దీన్నొక దర్శనీయమైన స్థలంగా తీర్చి దిద్దేందుకు నిర్వాహకులు కృషిచేస్తున్నారని రఘురామ్ వివరించారు. -
339వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం – 3,628.2 కి.మీ. 339వ రోజు నడిచిన దూరం – 10.2 కి.మీ. 07–01–2019, సోమవారం, జగతి, శ్రీకాకుళం జిల్లా. ఉద్దానం ప్రాంతానికి మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి బాబూ? ఈరోజు మాణిక్యపురం, బల్లిపుట్టుగ, వరక, బొరివంక, జగతి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. ఉదయం వికలాంగుల హక్కుల సంఘం ప్రతినిధులు కలిశారు. బాబుగారి పాలనలో ఉద్యోగాలే భర్తీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులు కుటుంబానికి భారం కారాదని, ఆ విధివంచితులు సమాజంలో గౌరవంగా బతకాలని.. నాన్నగారు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. ఉద్యోగావకాశాలు కూడా కల్పించారు. ఇప్పుడా అవకాశాలు మృగ్యమయ్యాయన్నది వారి వ్యథ. ఉదయం భీమవరం నుంచి వచ్చిన నిర్మలకుమారి, విమలకుమారి అనే అక్కాచెల్లెళ్లు ఇదే విషయం చెప్పారు. వారి చెల్లెలు శాంతకుమారి పుట్టుకతోనే మూగ, చెవుడు. నాన్నగారి హయాంలో ఆ దివ్యాంగురాలికి వచ్చిన ఉద్యోగమే ఆమె జీవితాన్ని నిలబెట్టిందట. మా కుటుంబమంతా రుణపడి ఉన్నామని ఆ అక్కాచెల్లెళ్లు చెబుతుంటే చాలా సంతోషమనిపించింది. నా పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా.. రోజూ ‘సాక్షి’లో వచ్చిన పాదయాత్ర డైరీ పేజీలను సేకరించి, పుస్తకంలో పొందుపరిచి బహూకరించారు. పదమూడు జిల్లాల్లో జరిగిన పాదయాత్రపై కవితను కూర్చి వినిపించారు. నన్ను కలిసిన ఆనందంతో ఉద్వేగానికి గురై కంటతడిపెట్టడం కదిలించింది. ఈరోజు పాదయాత్ర జరిగిన ప్రాంతమంతా కొబ్బరిచెట్లే. అతి పొడవుగా పెరిగే దేశీయ చెట్ల కొబ్బరి ఈ ప్రాంతానికే ప్రత్యేకం. ఉత్తరాది రాష్ట్రాలకు బాగా ఎగుమతి అవుతుంది. నూనె శాతం, పోషక విలువలు అధికంగా ఉండి నాణ్యమైన కొబ్బరినందించే ఈ చెట్లను ఇప్పుడు తిత్లీ తుపాను దారుణంగా దెబ్బతీసింది. ఎటు చూసినా పూర్తిగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు, వాలిపోయిన చెట్లే కనిపించాయి. ఉద్దానం కొబ్బరి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు కోనసీమను మరిపించిన ఈ కొబ్బరి తోటల్లో నేడు స్మశాన ఛాయలు కనిపిస్తున్నాయి. ముప్పై, నలభై ఏళ్ల చెట్లు అలా నేలవాలిపోవడంతో, వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల్లో చీకట్లు పరుచుకున్నాయి. ఇక్కడ కొబ్బరి చెట్టంటే ఇంటికి పెద్ద కొడుకుతో సమానం. మళ్లీ చెట్లను నాటినా ఫలసాయం రావడానికి పదేళ్లు పడుతుందని వాపోయారు. వలసలు మినహా మరో గతి లేదంటూ రైతన్నలు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక్కడి కళింగపట్నం, ఇద్దెవానిపాలెం తదితర గ్రామాల్లో కేవలం పిల్లలు, వృద్ధులు, మహిళలు తప్ప మగవాళ్లందరూ వలసెళ్లి పోయారని తెలిసి చాలా బాధేసింది. కుసుంపురం వద్ద రోడ్డు పక్కనే పెద్ద అమ్మవారి గుడి ఉంది. దాన్ని కేవలం వలస కార్మికులే నిర్మించారట. అది ఈ ప్రాంత వలసల తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక్కడి ప్రజలకు చేయూతనిచ్చి, వలసలను నివారించి ఉద్దానానికి పునర్వైభవం తేవాలన్న నా సంకల్పం మరింత బలపడింది. సర్వశిక్షా అభియాన్‌లో పనిచేసే కంచిలి, కవిటి మండలాల ఉద్యోగులు కలిశారు. ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటూ వేతనాల్లో మాత్రం కోత విధిస్తోందని చెప్పారు. పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన బాబుగారు ఓట్లేయించుకుని మోసం చేశారని వాపోయారు. ఈరోజు ఉదయం నడిచిన గ్రామాలన్నింటిలో బెం తో ఒరియా కులస్తులు అత్యధికంగా ఉన్నారు. గతంలో ఎస్టీలుగా గుర్తించిన తమకు ఇప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వ డం లేదని మొరపెట్టుకున్నారు. తల్లిదండ్రులకేమో ఎస్టీ సర్టిఫికెట్లున్నాయి. పిల్లలకు మాత్రం ఇవ్వడం లేదట. ‘సంవత్సరాలుగా కుల ధృవీకరణ లేక, కనీసం నేటివిటీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి?’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఈ ఉద్దానం ప్రాంతానికి కొబ్బరి పరిశోధన కేంద్రం, కోకోనట్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తానంటూ మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి? కొబ్బరి తోటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నా.. పరిహారం మాత్రం ఇవ్వడం లేదని, చెల్లని చెక్కులిచ్చి మోసం చేస్తున్నారని మొరపెట్టుకుంటున్న రైతన్నలకు ఏం సమాధానం చెబుతారు? మూడేళ్లకే ఫలసాయాన్ని అందించే కొబ్బరి మొక్కలను సరఫరా చేస్తానన్నారు. ఆ కార్య క్రమం ఏమైంది? -వైఎస్ జగన్ -
338వ రోజు పాదయాత్ర డైరీ
-
338వ రోజు పాదయాత్ర డైరీ
06–01–2019, ఆదివారం తలతంపర, శ్రీకాకుళం జిల్లా దళారీల రాజ్యంలో రైతన్నలకు ధరలెలా గిట్టుబాటు అవుతాయి? పాదయాత్ర ప్రారంభించి నేటికి సరిగ్గా 14 నెలలు గడిచిపోయాయి. ఉదయం పాదయాత్ర ప్రారంభంలోనే చంద్రబాబుపై ప్రచురించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని నాతో ఆవిష్కరింపజేశారు. శ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా వలసల కథలు కదిలించాయి. వలసల్లో అగ్రస్థానం ఇచ్ఛాపురం నియోజకవర్గానిదే. ఈ పాలనలో వ్యవసాయం కష్టమైంది. చేపల వేట భారమైంది. పరిశ్రమలు లేవు.. ఉపాధి కరువైంది. ఉపాధి పనులూ లేవాయే. వలసలు తప్ప మరో మార్గం లేని దుర్భర పరిస్థితి. ఎక్కడో దూరాన చెన్నైలో, కోల్‌కతాలో బిల్డింగులు కూలినా, పాకిస్థాన్ సముద్ర జలాల్లో అక్కడి సైన్యానికి బందీలుగా చిక్కినా, విదేశాలకు పంపే బ్రోకర్ల చేతుల్లో మోసపోయినా, అండమాన్ దీవుల్లో, గల్ఫ్ దేశాల్లో విషాద గాథలు బయటపడ్డా.. బాధితుల్లో శ్రీకాకుళం జిల్లా వాసుల పేర్లే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. వేలాదిమంది కాలే కడుపులతో వలస వెళ్లడం ప్రభుత్వ వైఫల్యమే. వలస కూలీల కష్టాలు వింటుంటే మనసంతా బరువెక్కిపోయింది. కురేష్, మహాలక్ష్మిల కుమారుడు దుంపరాజు అలా వలస వెళ్లిపోయి రెండేళ్లవుతున్నా ఆచూకీ లేదట. అలాంటి కథే రాజేశ్వరిది. ఆమె భర్త బైరాగి మూడేళ్లయినా ఇంటికి తిరిగిరాలేదట. చాలా బాధనిపించింది. ప్రజలకు ఉపాధి కల్పించడానికి కనీస ప్రయత్నమే చేయని ప్రభుత్వాన్ని ఏమనాలి? దళారీ వ్యవస్థలతో రైతాంగాన్ని, మత్స్యకారులను దెబ్బతీస్తున్న ఈ పాలకులే వలసలకు బాధ్యులు కారా? జింకిబద్ర వద్ద టమాటా రైతులు కలిశారు. ఆరుగాలం కష్టించే వీరు అద్భుతమైన దేశవాళీ టమాటాలు పండించడంలో చేయితిరిగినవారు. నాణ్యమైన టమాటాల అధిక దిగుబడి సాధిస్తూనే ఉంటారు. ‘అదేం మాయో కానీ.. అంతవరకు బాగా ఉన్న టమాటా ధర తీరా పంట చేతికొచ్చే సమయానికి ఒక్కసారిగా పతనమైపోతుంది’ అంటూ బావురుమన్నారు. పెట్టుబడి కూడా రాక నష్టపోతున్నా ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నమే చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళారీల రాజ్యంలో రైతన్నలకు ధరలెలా గిట్టుబాటు అవుతాయి? రాత్రికి రాత్రే ధరలు పతనమయ్యే మాయలు, మోసాలు లేకపోతే అది బాబుగారి పాలన ఎలా అవుతుంది? సోంపేటలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్డు విస్తరణ పనులు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ గురించి ప్రజలు ఫిర్యాదులు చేశారు. కవిటి జూనియర్ కళాశాల విద్యార్థినులది పైకి చెప్పుకోలేని కష్టం. ఈ కాలేజీలో దాదాపు 300 మంది విద్యార్థినులు ఉన్నారట. ఎలాంటి టాయ్‌లెట్ సౌకర్యాలు లేవు. అవసరం పడితే ఆరుబయట బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుందట. సిగ్గుతో చితికిపోతున్నామని.. ఎదిగిన ఆ ఆడబిడ్డలు చెబుతుంటే చాలా బాధనిపించింది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఇక్కడ బతకలేని పరిస్థితుల్లో అయినవారిని, ఉన్నవారిని వదులుకుని, పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిపోతుంటే.. అధిక ఆదాయం కోసం అలవాటుగా వలస వెళ్తున్నారని వ్యాఖ్యానించడం మానవత్వమేనా? -వైఎస్ జగన్ -
337వ రోజు పాదయాత్ర డైరీ
-
337వ రోజు పాదయాత్ర డైరీ
05–01–2019, శనివారం, లక్కవరం క్రాస్, శ్రీకాకుళం జిల్లా , తిత్లీ పరిహారం చెక్కులు చెల్లకపోవడం మీకు సిగ్గుగా అనిపించడంలేదా బాబూ? ఈరోజు సోంపేట మండలంలో తురకశాసనం నుంచి, పాలవలస, కొర్లాం, బారువ జంక్షన్, లక్కవరం క్రాస్ వరకు పాదయాత్ర సాగింది. అన్నీ బాగా వెనుకబడిన ప్రాంతాలే. పైగా వరుస తుపానులకు బాగా నష్టపోయాయి. ఎన్నో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఎంతోమంది పంటలు కోల్పోయారు. అయినా పట్టించుకున్నవారే లేరు. వారికి తుపాను పరిహారం ఇవ్వలేదు సరికదా.. కనీసం సంక్షేమ పథకాలు అందించలేదనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలవలస కాలనీకి చెందిన దున్నశేషమ్మ ఛాతిలో గడ్డతో బాధ పడుతోంది. జరాబందకు చెందిన కొండ రాముకు గుండెలో రంధ్రం ఉంది. ఆస్పత్రికెళితే ఆరోగ్యశ్రీ లేదని వెనక్కి పంపించేశారట. సుంకిడి గ్రామానికి చెందిన బొండాడ రాజమ్మ, మడ్డు దాలమ్మ, పాలవలసకు చెందిన గోకర్ల ధర్మావతి నిరుపేద వితంతువులు. కూలిపనులు చేసి పొట్టపోసుకుంటున్నారు. మూడేళ్లుగా వితంతు పింఛన్ల కోసం అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏడు పదులు నిండిన కర్రి ఎండమ్మ, బదకల కొసరాజులు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం లేదని కంటతడిపెట్టారు. బారువా కొత్తూరులో మత్స్యకార కుటుంబానికి చెందిన స్వాతి పుట్టుకతోనే మూగ,చెవుడు బాధితురాలు. వందశాతం వైకల్యం ఉన్న ఆ పాప చనిపోయినట్లు రికార్డుల్లో పెట్టి మరీ పింఛను ఆపేశారట. అదే ఊరికి చెందిన వలిశెట్టి రుషికి నాన్నగారి హయాం నుంచి వస్తున్న పింఛన్‌ను.. ఈ ప్రభుత్వం వచ్చాక తీసేసింది. సుంకిడి గ్రామానికి చెందిన మహాలక్ష్మి, ఇప్పిలి లక్ష్మి, గీతాంజలికి ఒక్కొక్కరికి ఇద్దరేసి ఆడబిడ్డలున్నారు. బంగారుతల్లి పథకం కింద పేర్లు నమోదు చేయించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆ పథకం కింద దశల వారీగా రావాల్సిన సొమ్ము జమ అయిందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో తర్వాత రావాల్సినది ఒక్క పైసా కూడా జమ కాలేదని చెప్పారు. బలహీనవర్గాలకు చెందిన స్వాతి, సాయికిరణ్‌లు అర్హత ఉన్నా.. తమకు స్కాలర్షిప్పులు రావడం లేదని వాపోయారు. ఎన్నిసార్లు తిరిగినా ఇల్లు ఇవ్వడంలేదని దాలమ్మ అనే అవ్వ కన్నీరు పెట్టుకుంది. ఆ దిక్కులేని అవ్వ.. పూటకో పంచన చేరి కాలం వెళ్లదీస్తోందట. ఇవన్నీ చూస్తుంటే.. అసలు ప్రభుత్వం అనేది ఉందా? సంక్షేమాన్ని పట్టించుకుంటోందా? అని అనిపించింది. తొండిపూడి గ్రామానికి చెందిన ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థినులు కలిశారు. ఈ ఊరిలో జిల్లా పరిషత్ హైస్కూలు తుపానుకు దెబ్బతిందని చెప్పారు. తరగతి గదుల పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయట. బడికెళ్లాలంటేనే భయమేస్తోందని బాధపడ్డారు. ఆరుబయట చెట్ల కిందే చదువుకోవాల్సి వస్తోందన్నారు. అధికారులనేవారెవ్వరూ ఈ పాఠశాల దుస్థితిని పట్టించుకున్నపాపానే పోలేదట. కార్పొరేట్ స్కూళ్లకు లబ్ధి్ద చేకూర్చడానికి.. బాగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే ఏదో వంక పెట్టి మూసేస్తున్న బాబుగారు.. ఇక దెబ్బతిన్న స్కూళ్ల మరమ్మతుల గురించి ఏం పట్టించుకుంటారు? సోంపేటకు చెందిన వినోద్, మేనకాప్రధాన్ అనే దంపతులు కలిశారు. వాళ్ల పాప నదియా ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో సెకండ్ర్యాంక్ సాధించింది. మూడేళ్ల కిందట తిరుపతిలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇద్దరూ ఆ పాపకు సన్మానం చేసి, మెడల్ ఇచ్చి, ప్రతిభ అవార్డునిచ్చారు. ఆ అవార్డు పారితోషికం కింద రూ. 20 వేలు అకౌంట్లో పడతాయని చెప్పారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, మూడేళ్లుగా ఆ పారితోషికం కోసం ఎదురుచూస్తూ బీకాం కూడా పూర్తి చేసింది. కానీ, ఆ సొమ్ము ఇప్పటికీ ఒక్క పైసా కూడా పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విద్యార్థికీ ఇట్లాంటి మోసం జరగకూడదని కోరుకున్నారు. అవార్డులిచ్చే పేరుతో ప్రచారం చేసుకుని పేద విద్యార్థులను మోసం చేయడానికి మనసెలా ఒప్పుతుంది? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న... ఈ ఒక్కరోజే ఎంతో మంది ప్రజలు నన్ను కలిసి, సంక్షేమ పథకాలు అందడం లేదని, కనీసం తిత్లీ పరిహారమైనా ఇవ్వలేదని చెప్పారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. మీరేమో ‘‘ప్రతి కుటుంబ వికాసం.. వంద శాతం సంక్షేమం.. వందశాతం సంతృప్తి’’ అంటూ పత్రికలన్నింటిలో భారీ ప్రకటనలు ఇచ్చారు. ఇది మోసం కాదా? ఒకవైపు ప్రతిభా అవార్డులిస్తూ మీరే స్వయంగా ప్రకటించిన పారితోషికమే అందడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మీరిచ్చిన చెక్కులే బౌన్స్ అయిన సందర్భాలు కోకొల్లలు. తిత్లీ తుపాను పరిహారం కింద మీరిచ్చిన చెక్కులు చెల్లడం లేదని జనం మొర పెట్టుకుంటున్నారు. మీకు కాస్తయినా సిగ్గుగా అనిపించడం లేదా? వాస్తవాలు ఈ విధంగా ఉండగా.. అన్నీ అద్భుతంగా ఉన్నాయంటూ శ్వేతపత్రాలు విడుదల చేయడం ప్రజలను వంచించడం కాదా? -వైఎస్ జగన్ -
336వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,593.6 కిలోమీటర్లు 336వ రోజు నడిచిన దూరం: 8.6 కిలోమీటర్లు 02–01–2019, బుధవారం తురకశాసనం, శ్రీకాకుళం జిల్లా చావు కోసం ఎదురుచూస్తున్నామని చెబుతుంటే గుండె తరుక్కుపోయింది.. ఈ రోజు మందస, సోంపేట మండలాల్లో పాదయాత్ర సాగింది. ఉదయం బాలిగంకు చెందిన భారతీ, ప్రవీణ్ అనే దంపతులు కలిశారు. నాన్నగారి వల్ల వారి కుటుంబానికి జరిగిన ఎనలేని మేలును తలచుకుని కృతజ్ఞతలు చెప్పారు. నాన్నగారి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల సోదరి భారతీ అక్క డాక్టర్ అయ్యిందట. భారతీతో పాటు ఆమె అన్న కూడా ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నారు. ప్రవీణ్‌కేమో నాన్నగారి హయాంలో రుణమాఫీ అయ్యింది.. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఉచిత విద్యుత్ అందింది. వారింట్లో పాపకు ఒళ్లు కాలిపోతే నాన్నగారి ఆరోగ్యశ్రీ పుణ్యమాని ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ జరిగిందని చెప్పారు. మీ నాన్నగారే లేకుంటే ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన మాకు ఇవన్నీ సాధ్యమయ్యేవా? అంటూ ఆ దంపతులు ఉద్వేగానికి గురయ్యారు. వాళ్లను చూసి చాలా సంతోషమేసింది. నాన్నగారిలా జనం గుండెల్లో నిలిచిపోవడం కన్నా అదృష్టం ఏముంటుంది? మనిషి జన్మకు ఇంతకంటే సార్థకత ఏముంటుంది? ఈ రోజు కూడా ప్రతి చోటా కిడ్నీ బాధితులు కలుస్తూనే ఉన్నారు. లోహరిబంద పంచాయతీ నుంచి చాలామంది కిడ్నీ బాధితులు వచ్చి కలిశారు. ఆ పంచాయతీలోనే వందల సంఖ్యలో కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారట. విషాదమేంటంటే.. ఈ మధ్యనే పదుల సంఖ్యలో కిడ్నీ వ్యాధులతో మరణించారట. ప్రజలిలా పిట్టల్లా రాలిపోతున్నా.. అధికార పార్టీ నేతలకు చీమకుట్టినట్లయినా లేకపోవడం అత్యంత బాధాకరం. ఆ గ్రామమంతా యాదవులు, మత్స్యకార సోదరులే. కిడ్నీ రోగాల బారినపడి ఓ వైపు భూములు అమ్ముకుంటూ, మరో వైపు అప్పులు చేస్తున్నారు. పింఛన్లు రావడం లేదు. మందులివ్వడం లేదు. ఆస్పత్రికి వెళ్తే వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. బస్ పాసుల్లేవు. డయాలసిస్‌కు వెళ్తే నెల రోజులు ఆగమంటున్నారు. విధిలేక ప్రయివేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. అదీ లేనివాళ్లు.. చావుకోసం ఎదురుచూస్తున్నామని చెబుతుంటే గుండె తరుక్కుపోయింది. ఇంత దారుణ బాధలు అనుభవిస్తున్న ఆ పంచాయతీ ప్రజలకు సరిగా మంచినీరు కూడా సరఫరా చేయడం లేదట. రక్షిత మంచినీటి పథకంలో కూడా బురదనీరే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే. గౌడగొరంటి నుంచి ఒక కౌలు రైతు కొడుకు రమేష్‌చౌదరి వచ్చి కలిశాడు. నాలుగేళ్ల కిందట కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడట. ఆరోగ్యశ్రీ వర్తించక, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయమూ అందక.. ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్ముకున్నాడు. అదీ సరిపోక లక్షల్లో అప్పు చేశాడు. నెలనెలా వడ్డీలకు రూ.10 వేలు, మందులకు రూ.15 వేలు అవుతున్నాయని కన్నీరు పెట్టాడు. ఓ సాధారణ కౌలు రైతు కుటుంబానికి నెలకు పాతిక వేలు ఖర్చన్నది తలకు మించిన భారం కాదా? ప్రజా సంకల్ప యాత్రలో చిట్టచివరి నియోజకవర్గమైన ఇచ్ఛాపురంలోకి అడుగుపెట్టాను ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. మీరు రూ.500 కోట్లకు పైగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. మీ విలాసాలకు, విదేశీయానాలకు, ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ధర్మపోరాట దీక్షలకు, తుపాను పరిహారం పేరిట మీరిచ్చిన చెల్లని చెక్కుల పంపిణీ ప్రచార కార్యక్రమాలకు వందల కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెడుతున్న మీరు.. పేదల ప్రాణాలను రక్షించే పథకాలకు మాత్రం నిధు లివ్వకపోవడం మానవత్వమేనా? - వైఎస్ జగన్ -
335వ రోజు పాదయాత్ర డైరీ
-
335వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,585 కిలోమీటర్లు 01–01–2019, మంగళవారం హరిపురం శివారు, శ్రీకాకుళం జిల్లా 335వ రోజు నడిచిన దూరం:10.9 కి.మీ. కొత్త సంవత్సరంలోనైనా రాష్ట్ర ప్రజలకు వంచన నుంచి విముక్తి లభించాలి ఉదయం శిబిరం వద్ద వందలాది మంది ఆత్మీయుల మధ్య నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాదయాత్రను ప్రారంభించాను. శిబిరం బయటకు వస్తూనే వంకులూరు గ్రామ అక్కచెల్లెమ్మలు సంప్రదాయ కలశాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేయించారు. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని శివారు మత్స్యకార గ్రామమది. నేడు ఆదర్శ గ్రామంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే అభివృద్ధికి నడుం బిగించారు. చేపల వేట భారమై, జీవనోపాధి వెతుక్కుంటూ, ఆ గ్రామం నుంచి వలస వెళ్లిపోయి బయట ప్రాంతాల్లో బాగా స్థిరపడినవారు.. తాము పుట్టిన ఊరిని దత్తత తీసుకున్నారట. ప్రతి రోజూ ఊళ్లోని ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధి లో మమేకమవుతున్నారని తెలిసి సంతోషమేసింది. వారి స్ఫూర్తి ఆదర్శదాయకం. తిత్లీ బాధితుల విషయంలో సర్కార్ మాయాజాలం అన్ని గ్రామాల్లో కనబడుతోంది. అనర్హులైన పచ్చచొక్కాల వారు బాధితుల పరిహారాన్ని మింగేస్తున్నారని శ్రీరామ్‌నగర్ గ్రామస్తులు చెప్పారు. మరోవైపు అసలైన బాధితుల్లో కొందరినే గుర్తించిందీ ప్రభుత్వం. వారికి బాబుగారి ఫొటోలున్న చెక్కులిచ్చి చేతులు దులుపుకుంది. అవి కేవలం ప్రచారం కోసమే ఇచ్చినవని గ్రామస్తులు వాపోయారు. పరిహారం మాత్రం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాహడాపల్లి.. సాయుధ విప్లవ పోరాటాలకు పేరెన్నికగన్నది. ఆ ఊరి దగ్గర రైతు సంఘాల ప్రతినిధులు కలిశారు. తిత్లీ తుపాను తర్వాత ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలే లేవట. దాంతో అక్కడి ప్రజాసంఘాలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించాయి. దాతల నుంచి సేకరించిన బియ్యాన్ని, నిత్యావసర సరుకులను బాధితులకు పంచిపెడుతూ ఉంటే 16 మంది మీద రాజద్రోహం కేసులు పెట్టారని వాపోయారు. బాధితులకు పరిహారం చెల్లించకుండా చెల్లని చెక్కులిచ్చి మోసం చేస్తున్న చంద్రబాబుపై ఏ కేసులు పెట్టాలంటూ రైతు సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. అదే గ్రామంలో జీడి పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికులు కలిశారు. వారి కష్టాలను కళ్లారా చూశాను. చేతులన్నీ పొక్కిపోతున్నా, రోజంతా నిలబడి పనిచేస్తున్నా కూలీ రూ.200 కూడా రాకపోతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టం చూసి బాధనిపించింది. వారికి మంచి చేయాలన్న ఆలోచన దృఢపడింది. ఈ రోజు పాదయాత్ర సాగిన మందస మండలం పాలకోవాకు బాగా ప్రసిద్ధి. స్వచ్ఛమైన పాలతో, సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేసే కోవా మందసకే పేరు తెచ్చిపెట్టింది. ఈ నూతన సంవత్సరంలోనైనా రాష్ట్ర ప్రజలకు వంచన నుంచి విముక్తి లభించాలి.. జీవన ప్రమాణాలు పెరగాలి.. సుఖసంతోషాలు వెల్లివిరియాలి. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. వ్యాట్‌ను 12.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించి, హార్టికల్చర్ సబ్సిడీని 40 శాతానికి పెంచి, పావలా వడ్డీ రుణాలిచ్చి నాన్నగారు పలాస జీడి పరిశ్రమను ఆదుకున్నారు. ఆ పరిశ్రమ అభివృద్ధి కోసం మీరు తీసుకున్న ఒక్కటంటే ఒక్క చర్య అయినా ఉందా? - వైఎస్ జగన్ -
334వ రోజు పాదయాత్ర డైరీ
-
334వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,574.1 కి.మీ 334వరోజు నడిచిన దూరం: 11.1 కి.మీ 31–12–2018, సోమవారం దెప్పూరు కూడలి, శ్రీకాకుళం జిల్లా వారు కన్నీరుమున్నీరవుతుంటే.. నా గుండె బరువెక్కింది ఈ రోజు కిడ్నీ వ్యాధి పీడితులు, తిత్లీ తుపాను బాధితులు గ్రామగ్రామానా కలిశారు. ఈ రోజు పాదయాత్ర సాగిన వజ్రపుకొత్తూరు మండలంలోనే తిత్లీ తుపాను తీరం దాటింది. ఎటు చూసినా నేలవాలిన పెద్ద పెద్ద కొబ్బరి, జీడి మామిడి చెట్లే కనిపించాయి. తుపాను బీభత్సాన్ని కళ్లకు కట్టాయి. మామిడిపల్లికి చెందిన కూలీపని చేసుకునే జోగారావు అనే అన్న కలిశాడు. తిత్లీ తుపానప్పుడు ఆ గాలులకు పక్కింటి పైకప్పు ఎగిరిపడి ఆయన కాలు తెగిపోయిందట. గంటల తరబడి ఎదురుచూసినా సాయమందని పరిస్థితి. విధిలేని పరిస్థితిలో భుజాలమీద ఎత్తుకుని కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారట. అక్కడ వైద్యం చేయలేమన్నారని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళితే.. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారట. లక్షల రూపాయలు అప్పుచేసి వైద్యం చేయించుకోవాల్సి వచ్చిందంటూ ఆ సోదరుడు కంటతడిపెట్టాడు. అధికారుల చుట్టూ, అధికార పార్టీ నేతల చుట్టూ పరిహారం కోసం నేటికీ తిరుగుతూనే ఉన్నాడు. చినవంక గ్రామస్తులది మరో జాలి కథ.. తిత్లీ తుపాను తర్వాత కొద్ది రోజుల వరకూ ఏ సాయమూ అందని దుస్థితి వారిది. ఆ ఊరికే వచ్చిన ముఖ్యమంత్రిగారికి తమ కష్టాలు చెప్పుకుందామని పోతే ‘నోర్లు మూసుకోండి.. అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కించేస్తా’.. అంటూ బెదిరించాడని వాపోయారు. విప్లవాల పురిటిగడ్డ.. బొడ్డపాడు గ్రామం సమీపంలో పాదయాత్ర సాగింది. భూమి కోసం.. భుక్తి కోసం.. సాయుధ రైతాంగ పోరాటాలు ప్రారంభమైన గ్రామమది. మామిడిపల్లి, బొడ్డపాడు గ్రామాల మహిళలు కలిశారు. వారంతా జీడి కార్మికులే. చాలామంది 60 ఏళ్లు పైబడ్డ అవ్వలే. జీడి పిక్కలు ఒలిచి.. చర్మమంతా పోయి.. చేతులు నల్లగా పొక్కిపోయాయి. రోజంతా కష్టపడ్డా రూ.130 కూడా గిట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేతులకు గ్లౌజులు కూడా కొనుక్కోలేని దుస్థితి వారిది. చేతి వేళ్లు దెబ్బతినడంతో పింఛనూ, రేషన్‌కు సమస్యే అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. సాయంత్రం గునిపల్లి, మిట్టూరు గ్రామాలకు చెందిన దాదాపు 20 మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు. ఈ నియోజకవర్గంలోనే అత్యధిక కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నది గునిపల్లిలోనేనట. దాదాపు ప్రతి ఇంట్లో కిడ్నీ బాధితులున్నారని చెప్పారు. ఆ ఊరంతా మత్స్యకారులే. ఉపాధి కోసం వలసలుపోయి తెచ్చిన సంపాదనంతా.. ఇంట్లో కిడ్నీ బాధితుల చికిత్సకే సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు కిడ్నీ వ్యాధిగ్రస్తులున్న కుటుంబాలూ ఉన్నాయట. రేషన్‌కార్డును బట్టి ఒక ఇంట్లో ఒకరికే డయాలసిస్ చేస్తున్నారట. మరి మిగతావారి పరిస్థితేం కావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు మందుల్లేక.. మరోవైపు డయాలసిస్ సేవలు సరిగా అందక.. ఇంకోవైపు పింఛన్లు రాక.. వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఈ బాధలుపడటం కన్నా ఆత్మహత్యే మేలని ఓ అన్న కన్నీరుమున్నీరవుతుంటే.. గుండె బరువెక్కిపోయింది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ‘ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ప్రతి పీహెచ్సీలో మందులు ఉచితంగా అందిస్తాం.. ప్రతి డయాలసిస్ సెంటర్లో ఒక నెఫ్రాలజిస్ట్‌ను నియమిస్తాం’.. అంటూ పలాస బహిరంగ సభలో ప్రకటించారు. రెండేళ్లు దాటిపోయింది.. మరి ఆ హామీ ఏమైంది? - వైఎస్ జగన్ -
333వ రోజు పాదయాత్ర డైరీ
-
333వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,563 కిలోమీటర్లు 30–12–2018, ఆదివారం రాజంకాలనీ, శ్రీకాకుళం జిల్లా 333వ రోజు నడిచిన దూరం: 12.7 కి.మీ. వ్యవసాయాధారిత పరిశ్రమలకు ఒక్క ప్రోత్సాహకమైనా ఇచ్చారా? ఈరోజు వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో పాదయాత్ర చేశాను. ఈ సందర్భంగా నువ్వలరేవు గ్రామానికి చెందిన కేవిటి కులస్తులు కలిశారు. పదివేల మంది ఉన్న ఈ గ్రామంలో అంతా ఒకే కులస్తులట. ఇది వరకు వాళ్లకు కుల ధ్రువీకరణే లేదు. నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు ఈ పరిస్థితి ఆయన దృష్టికొచ్చింది. వాళ్లు పడే ఇబ్బందులు కళ్లారా చూశారు. అధికారంలోకి రావడంతోనే వాళ్లను బీసీ–ఏ జాబితాలో చేర్చారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ వారంతా ఈ రోజు నా వద్దకు వచ్చి కృతజ్ఞతలు చెప్పారు. నిజంగా వాళ్ల ఆచార, వ్యవహారాలు గమ్మత్తుగా అన్పించాయి. గ్రామంలో పెళ్లీడుకొచ్చిన పిల్లలంతా ప్రతి రెండేళ్లకోసారి సామూహిక వివాహాలు చేసుకుంటారట. ఇలా ప్రతి ఇల్లు పచ్చతోరణం కట్టుకోవడం.. ఏక కాలంలో వివాహాలు జరగడం వల్ల వాళ్లకు ఆర్థిక భారం కూడా తగ్గుతోంది. నేస్తరికం పేరుతో వాళ్లు జరుపుకునే వేడుకలు స్నేహపూర్వక ధోరణికి అద్దం పడుతున్నాయి. నిజంగా వాళ్ల సంప్రదాయ ధోరణులు సమాజానికి స్ఫూర్తినిస్తాయనేది నా విశ్వాసం. చేపల వేటే జీవనాధారమైన ఈ కులస్తులనూ సమస్యలు వెంటాడుతున్నాయి. జెట్టీ లేక చేపల వేటే కష్టమైందని.. కోల్డ్‌స్టోరేజీలు లేక దళారుల చేతుల్లో మోసçపోతున్నామన్న వాళ్ల ఆవేదన బాధ కలిగించింది. ఉదయం పలు యూనివర్సిటీల విద్యార్థి సంఘాల ప్రతినిధులు, అధ్యాపకులు నన్ను కలిశారు. నాలుగేళ్ల టీడీపీ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క పోస్టూ భర్తీ చేయలేదని చెప్పారు. యూనివర్సిటీల్లో భర్తీ చేయాల్సిన 2,200 పోస్టులను సైతం కుదించిన వైనాన్ని నా వద్ద ఏకరవు పెట్టారు. ఈ సర్కార్.. ప్రభుత్వ యూనివర్సిటీ విద్యను ఉద్దేశపూర్వకంగా ఎలా నిర్వీర్యం చేస్తోందో వివరించారు. రాష్ట్రంలో ఏడు యూనివర్సిటీలకు వైస్‌చాన్స్‌లర్స్ కూడా లేని దౌర్భాగ్యస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్య పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికిది అద్దం పడుతోందన్నారు. నిజంగా ఇది దారుణమే. ఓవైపు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ.. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీలకు ఎర్రతివాచీ పరుస్తున్నారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కూడా తూట్లు పొడుస్తున్నారు. కార్పొరేట్ కొమ్ముగాసే చంద్రబాబు ప్రభుత్వం పేదవాడి విద్యకు సహకరిస్తుందా? ఈ పరిస్థితిని తప్పకుండా మార్చాల్సిన అవసరముంది. పలాస పేరు వింటే గుర్తుకొచ్చేది జీడిపప్పు. ఇక్కడి ప్రజలు దీన్ని తెల్లబంగారం అంటారు. ఈ ప్రాంతంలో జీడిపిక్కల పరిశ్రమలు మూడొందల వరకు ఉన్నాయి. విదేశస్తులూ ఇక్కడి జీడిపప్పు అంటే ఎంతో మక్కువ చూపుతారు. తిరుపతి లడ్డూలోనూ పలాస జీడిపప్పునే వాడతారని స్థానికులు గర్వంగా చెప్పుకుంటారు. ఎలాంటి ప్రచారం లేకుండా ప్రపంచానికి పరిచయమైన పలాసలో జీడి కార్మికుల తెర వెనుక జీవితం పూర్తిగా అంధకారమని వారి మాటల్లో తెలిసింది. ఇక్కడ జీడి పరిశ్రమను నమ్ముకుని 20 వేల మందికి పైగా బతుకుతున్నారు. నాన్నగారి హయాంలో జీడిపిక్కల పరిశ్రమను వ్యవసాయాధారిత పరిశ్రమగా గుర్తించారు. పన్నులు తగ్గించి ఊతమిచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తమ గురించి కలలో కూడా ఆలోచించలేదని జీడి పిక్కల కార్మికులు వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యా న్ని నా దృష్టికి తెచ్చారు. కుటీర పరిశ్రమ కింద ప్రోత్సాహకాలిచ్చిన పాపాన పోలేదన్నారు. కార్మి క చట్టాల అమలు.. అందని ద్రాక్షని చెప్పారు. జీడి పిక్కల వలిచే కార్మికుల వేలిముద్రలు పడటం కూడా కష్టమే. ఈ కారణంతో ప్రభుత్వ సంక్షే మ పథకాలు కూడా అందడం లేదని వాపోయా రు. అసలే పరిశ్రమదారులు ప్రభుత్వ నిర్ల క్ష్యంతో కలత చెందుతుంటే.. మరోవైపు స్థానిక టీడీపీ నేతలు ప్రతి కేజీ జీడిపప్పుపై అనధికార సుంకా న్ని ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారట. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. మండలానికొక ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్, గోడౌన్.. జిల్లాకొక మెగా ఫుడ్‌పార్క్ నెలకొల్పుతామన్నారు. అగ్రికల్చరల్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలను, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. మీ మేనిఫెస్టోలోని ఈ హామీలన్నీ ఏమయ్యాయి? వ్యవసాయాధారిత పరిశ్రమలకు మీరిచ్చిన ఒక్కటంటే ఒక్క ప్రోత్సహకమైనా ఉందా? - వైఎస్ జగన్ -
332వ రోజు పాదయాత్ర డైరీ
-
332వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,550.3 కిలోమీటర్లు 332వ రోజు నడిచిన దూరం:11.3 కిలోమీటర్లు 29–12–2018, శనివారం ఉండ్రకుడియా జంక్షన్, శ్రీకాకుళం జిల్లా అబద్ధాలు, మోసాలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు బాబూ? ఈ రోజు పెదమడి, చీపురుపల్లి, రేగులపాడు, టెక్కలిపట్నం గ్రామాల మీదుగా నా పాదయాత్ర సాగింది. రోడ్డుకిరువైపులా నేల కూలిన చెట్లు కనిపించాయి. తిత్లీ బీభత్సాన్ని అవి చెప్పకనే చెబుతున్నాయి. ఉదయం ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కలిశారు. ఈ ప్రభుత్వం వచ్చాక గిరిజన సహకార సంస్థ నిర్వీర్యమైందని, ఐటీడీఏ నిరుపయోగంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ పరిధిలోని ఉద్యోగాల్లో సైతం గిరిజనులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. రేగులపాడు ఆఫ్‌షోర్ ప్రాజెక్టు నిర్వాసితులు గ్రామగ్రామానా ఆవేదన చెప్పుకున్నారు. పునరావాస, పరిహార చర్యల్లో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తూర్పారబట్టారు. తమకు పరిహారమే ఇవ్వడం లేదని కొందరు.. అర్హులకు ఇవ్వకపోగా, అనర్హులకు దోచిపెడుతున్నారని మరికొందరు.. ఇచ్చేదాంట్లోనూ వివక్షేనని ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో ఆందోళన. సమస్యలేవీ పరిష్కరించని ప్రభుత్వం.. తమను పునరావాస ప్రాంతాలకు వెళ్లాలని ఒత్తిడి తెస్తోందన్నారు. మౌలిక వసతుల్లేని, నివాసయోగ్యంకాని చోట మేమెలా ఇళ్లు కట్టుకోగలమని దీనంగా ప్రశ్నించారు. అందరిలోనూ తీవ్ర ఆవేదన కనిపించింది. నాన్నగారి హయాంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. అప్పుడులేని అభద్రత, ఆందోళన నేడు మాత్రమే కనిపించడానికి కారణం.. నేటి పాలకులకు ప్రాజెక్టులు కట్టడంపై కన్నా.. వాటిమీద వచ్చే కమీషన్ల పైనే మక్కువ ఎక్కువగా ఉండటం.. నిర్వాసితులకు న్యాయం చేయాలన్న మానవీయ కోణం మచ్చుకైనా లేకపోవడం. మధ్యాహ్నం పాతపట్నం నియోజకవర్గం పూర్తిచేసి పలాస నియోజకవర్గంలో అడుగుపెట్టాను. రేగులపాడు ఆఫ్‌షోర్ ప్రాజెక్టు మీదుగా పాదయాత్ర సాగించాను. నాన్నగారు 2008లో దానికి శంకుస్థాపన చేసిన శిలాఫలకం కనిపించింది. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన కొద్దికాలానికే ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారు. అప్పటి దాకా శరవేగంగా సాగిన పనులన్నీ ఒక్కసారిగా నత్తనడకపట్టడం చాలా బాధనిపించింది. పదేళ్లయినా ఏ కొంచెం ముందుకెళ్లని స్థితని స్థానికులు మనోవ్యథతో చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్న డ్రామాలను వివరించారు. ప్రాజెక్టు కోసం ఇక్కడి టీడీపీ ఎమ్మెల్యే ఆందోళనలు చేసినట్టు నటించడం.. అంతలోనే నిధులిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించడం.. దీంతో ఎమ్మెల్యే, టీడీపీ నేతలు బాబుగారికి కృతజ్ఞతలు చెబుతూ సంబరాలు చేసుకోవడం.. అంతా ఓ ప్రహసనంగా సాగుతోందని చెప్పారు. పనులు జరిగిందీ లేదు.. ప్రాజెక్టు ముందుకెళ్లిందీ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అబద్ధాలు.. మోసాలు.. నయవంచనతో ఇంకెన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారు? సాయంత్రం కళింగవైశ్య సోదరులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఈ నాలుగున్నరేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.63,657 కోట్లు ఖర్చుచేశామని చెబుతున్నారు. అంచనాలు పెంచి నిధులు మింగేయడం తప్ప.. మీకు మీరుగా ప్రారంభించి పూర్తిచేసిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? - వైఎస్ జగన్ -
331వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం 3,539 కిలోమీటర్లు 26–12–2018, బుధవారం రంగడి ఘాటి క్రాస్, శ్రీకాకుళం జిల్లా మీ శ్వేతపత్రంలో ఇసుమంతైనా నిజముందా? అభివృద్ధి ఆనవాళ్లు మచ్చుకైనా కనిపించని మెళియాపుట్టి మండలంలో ఈ రోజు నా పాదయాత్ర సాగింది. అడుగడుగునా అమాయక గిరిజనులు ఎన్నో బాధలు చెప్పారు. చాపర గ్రామ రైతన్నలు.. అధికార పార్టీ నేతలే కల్తీకి కొమ్ముగాస్తున్నారని చెబుతుంటే ఆశ్చర్యమేసింది. పొలాలకేసే ఎరువులు, మనుషులు తినే ఆహార పదార్థాలు అన్నీ కల్తీ చేస్తున్నారని తెలిపారు. ఓ పక్క.. వేసిన పంటలను తుపానులు ఊడ్చిపెట్టుకుపోతుంటే, మరోపక్క.. కల్తీ ఎరువులు తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని బావురుమన్నారు. కల్తీ సరుకులతో ఆరోగ్యాలు గుల్లవుతున్నా ఏ అధికారీ పట్టించుకోవడం లేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. సరిహద్దు రాష్ట్రం ఒడిశాను ఆసరా చేసుకుని సాగుతున్న ఈ కల్తీ వ్యాపారం మూలాల్లో తెలుగుదేశం వాళ్లే ఉన్నారని.. అందుకే అన్నీ తెలిసినా ఏ అధికారీ ముందుకెళ్లడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. నిజంగా దారుణం. పాలక నేతలే కల్తీకి కొమ్ము గాస్తూ.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ ఆరోగ్యాంధ్రప్రదేశ్, ఆనందాంధ్రప్రదేశ్ అంటూ కోతలు కోయడం హాస్యాస్పదం కాదా? చాపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థినుల ఆందోళన విన్నాక.. ఈ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును ఎంతగా దెబ్బతీస్తుందో తెలుస్తోంది. మరో రెండు నెలల్లో పబ్లిక్ పరీక్షలున్నాయి. ఇప్పటి దాకా సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకమే అందలేదట. 8వ తరగతి పిల్లలకు సైన్స్ పుస్తకం ఇవ్వలేదట. మేమేం చదువుకోవాలి? ఎలా పరీక్షలు రాయాలన్నా.. అంటూ అమాయకంగా వాళ్లడిగిన ప్రశ్నకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? పరీక్ష తప్పినా, మార్కులు తగ్గినా.. దానికి ప్రభుత్వమే కారణం కాదా.. అని నిలదీస్తున్న ఆ చిన్నారుల ఆవేశంలో న్యాయముంది. అమాయక గిరిజన ఆవాసాల్లోంచి పాదయాత్ర చేస్తున్నప్పుడు నా గుండె బరువెక్కింది. అభివృద్ధికి నోచుకోని గ్రామాలు.. సంక్షేమం అసలే తెలియని గిరిజనం. వీధికో సమస్య.. ఇంటికో కష్టం.. వృద్ధుల పరిస్థితి మరీ దారుణం. చాపరకు చెందిన 70 ఏళ్ల జానకమ్మ భర్తను కోల్పోయింది. వృద్ధాప్య, వితంతు పింఛన్లో ఏ ఒక్కటైనా అందినా బాగుండేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదీ ఇవ్వడం లేదని బాధపడింది. పాతమారుడుకోటకు చెందిన యండమ్మ వితంతు పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగింది. కనిపించిన ప్రతి అధికారికీ మొక్కింది. అయినా ఫలితం లేదు. యలమంచిలి అమ్ములమ్మ చెప్పింది వింటుంటే ఆశ్చర్యమేసింది. అర్హులైన 80 మంది అమాయక ప్రజలపై అధికార పార్టీ నేతలే కక్షగట్టి.. పింఛన్లు ఊడబీకి రోడ్డునపడేశారు. వాళ్లంతా కోర్టుకెళితే.. న్యాయస్థానం మొట్టికాయలేసి పింఛన్లు ఇవ్వాలని గడ్డి పెట్టిందట. కానీ బరితెగించిన ఈ నేతలు మూడు నెలలు పింఛన్ ఇచ్చి.. మళ్లీ మొదటికొచ్చారట. ఇప్పుడు మళ్లీ కోర్టుకెళితేగానీ ఆ పింఛన్లు వచ్చే పరిస్థితి లేదు. నిజంగా ఎంత అన్యాయం? పేదవాడి సంక్షేమం.. కోర్టు మెట్లెక్కాల్సిన దయనీయ స్థితి ఎక్కడైనా ఉందా? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించానని.. ఎవరిపైనా వివక్ష చూపనేలేదని శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రస్తుతం నేను పాదయాత్ర చేస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని ఒక్క పొందూరు మండలంలో.. మీరు అధికారంలోకి రాగానే వివక్షతో దాదాపు 900 మంది పింఛన్లు తీసేసింది వాస్తవం కాదా? వారు కోర్టుకెళితే.. న్యాయమూర్తులు దిగ్భ్రాంతి చెంది మీ ప్రభుత్వానికి అక్షింతలేసి.. పింఛన్లు పునరుద్ధరించాలని ఆదేశించిన విషయం మర్చిపోయారా? మరి మీ శ్వేతపత్రంలో ఇసుమంతైనా నిజముందా? - వైఎస్ జగన్ -
330వ రోజు పాదయాత్ర డైరీ
-
330వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,529.1 కిలోమీటర్లు 24–12–2018, సోమవారం చేపర, శ్రీకాకుళం జిల్లా ప్రచారం మీదున్న శ్రద్ధ పరిహారంపై పెట్టుంటే.. బాధితులకు న్యాయం జరిగేది కాదా? గిరిజన సోదరులు ఎక్కువగా ఉండే మెళియాపుట్టి మండలంలో ఈ రోజు నా పాదయాత్ర సాగింది. ప్రారంభం నుంచే గిరిజన సంప్రదాయ నృత్యాలతో.. తప్పెటగుండ్లతో ఎంతో ఆప్యాయంగా వాళ్లు స్వాగతం పలకడం ఆనందాన్నిచ్చింది. ఉప్పొంగే ప్రేమానురాగాలతో వాళ్లు నా చేతులు పట్టుకుని థింసా నృత్యం చేయడం నాకో మధుర స్మృతే. ఉదయం ఆదివాసీ సంఘాల ప్రతినిధులు కలిశారు. అమాయక గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. తిత్లీ తుపానుకు ఈ మండలం కూడా బాగా దెబ్బతింది. సాయం కోసం అల్లాడిపోతున్న వారి వద్దకు 15 రోజుల తర్వాతగానీ అధికారులు రాలేదని చెప్పారు. తుపాను బీభత్సానికి వేల సంఖ్యలో ఇళ్లు దెబ్బతింటే.. అధికారులు మాత్రం వందల్లోనే గుర్తించారట. పరిహారంలో సైతం వివక్ష చూపించారట. ఆకలి కేకలతో తహసీల్దార్ కార్యాలయాన్ని చుట్టుముడితే.. దయలేని ఈ సర్కార్ కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టిందన్నా.. అంటూ బావురుమన్నారు. తమ బాధలు తెలుసుకున్న న్యాయమూర్తి.. పోలీసులనే మందలించారని చెప్పారు. గిరిజన ఉత్పత్తులకు ఏమాత్రం ప్రోత్సాహం లభించడం లేదని వాళ్లు నిస్సహాయత వ్యక్తం చేశారు. మా సంపదంతా ప్రైవేటు వాళ్లకు దోచిపెట్టడానికి గిరిజన సహకార సంస్థను సైతం నిర్వీర్యం చేస్తున్నారన్నా.. అంటూ ఏకరువుపెట్టారు. బందపల్లికి చెందిన అప్పన్న అనే నిరుపేద గిరిజన రైతు పంట మొత్తం తిత్లీ దెబ్బకు తుడిచిపెట్టుకుపోయిందట. పరిహారం కింద రూ.12,145 ఇస్తున్నట్టు చంద్రబాబు బొమ్మతో ఉన్న ఓ పత్రాన్ని అతని చేతికిచ్చారు. కానీ అప్పన్న ఖాతాలో మాత్రం ఇంతవరకూ ఒక్క పైసా పడలేదట. సర్కారీ సాయం కోసం తిరగడానికే వెయ్యి రూపాయలకు పైగా ఖర్చయిందట.. ఎంత దారుణం! దీనబంధుపురం గిరిజన అక్కచెల్లెమ్మలు ఎన్నో బాధలు చెప్పుకున్నారు. బీఈడీ చదువుకుంటూ.. ఉపాధి పనులకెళ్లిందట అరుణకుమారి అనే సోదరి. అంత కష్టపడ్డా.. ఏడాదయినా ఇంత వరకు ఆ ఉపాధి పనుల డబ్బులు మాత్రం ఇవ్వలేదట. ఇది శ్రమదోపిడీ కాక మరేంటి? ఈ రోజు పాదయాత్రలో ఇందిరమ్మ వికలాంగుల స్వయం శక్తి సంఘానికి చెందిన అక్కచెల్లెమ్మలు కలిశారు. రుణమాఫీ కాలేదని, పసుపు–కుంకుమల డబ్బు బూటకమేనని వివరించారు. బాధనిపించింది. మహిళలు.. పైగా గిరిజనులు.. ఆపై దివ్యాంగులు.. వారి పరిస్థితి చూస్తే.. వంచించే పాలకులకు తప్ప ఎవరికైనా జాలి కలుగుతుంది. సాయంత్రం మెళియాపుట్టిలో భారీ బహిరంగ సభ జరిగింది. ప్రజలు క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకొనే వెసులుబాటు కల్పించడం కోసం పాదయాత్రకు ఒక రోజు విరామాన్నిచ్చాను. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. తుపానుకు సర్వం కోల్పోయి పరిహారం కోసం బాధితులు అలమటిస్తుంటే.. మీరు మాత్రం కోట్లాది రూపాయల ప్రజా ధనం ఖర్చుచేసి.. అందరినీ ఆదుకుంటున్నట్టుగా ప్రచారం చేసుకోవడం వంచన కాదా? ప్రచారం మీదున్న శ్రద్ధ.. పరిహారం ఇవ్వడంపై పెట్టి ఉంటే కాస్తయినా న్యాయం జరిగేది కాదా? - వైఎస్ జగన్ -
329వ రోజు పాదయాత్ర డైరీ
-
329వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,518.2 కిలోమీటర్లు 23–12–2018, ఆదివారం కొత్తూరు క్రాస్, శ్రీకాకుళం జిల్లా ఇది ప్రభుత్వమా.. భూ మాఫియానా?! ఈ రోజు టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల ప్రజలు వేలాదిగా నా అడుగులో అడుగులేశారు. నాన్నగారి జ్ఞాపకాలు పంచుకున్నారు. ఆయన సాయం గుర్తుచేసుకున్నారు. సీతారాంపురానికి చెందిన ఏడు పదుల వృద్ధుడు బెండి రాజ్‌గోపాలరావు ఒకప్పుడు టీడీపీ వీరాభిమాని. ఇప్పుడాయన గుండె చప్పుడులో నాన్నేగారే వినిపిస్తున్నారు. అంతగా అభిమానించడానికి ఆయన చెప్పిన కారణం విని నాకెంతో ఆనందమేసింది. గుండె ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో.. నాన్నగారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ప్రాణం పోసిందన్నాడు. ఆ కొత్త జీవితం నాన్నగారిచ్చిందేనని పొంగుకొస్తున్న ఆనందబాష్పాలను తుడుచు కుంటూ చెప్పాడు. పదమూడేళ్ల దేవ్‌మహాపాత్రో ఆత్మీయత, నన్ను కలవాలన్న ఆరాటాన్ని చూసి ముచ్చటేసింది. నిజంగా అతనో బాల మేధావి. అందరిలా స్కూలుకెళ్లడమే కాదు.. అందమైన చిత్రాలకు ప్రాణం పోసే చిత్రకారుడు. పనికిరాని వస్తువులనే బొమ్మలుగా మలిచే కళాకారుడు. కళలే కాదు.. చదువుల్లోనూ ముందేనట. నేనంటే ఎంత అభిమానమో అతని చేతిలో ఉన్న చిత్రాన్ని చూస్తేనే తెలిసింది. నన్ను, నాన్నను, నవరత్నాలను చిత్రంలో పొదిగాడు. రెండు రోజులుగా బడి మానుకుని తయారుచేసి, దానిమీద నా సంతకం పెట్టించుకోవాలని వచ్చాడు. సంతకం చేశాక ఆనందంతో ఉప్పొంగిపోయాడు. విషాదమేంటంటే.. అం తమంచి లక్షణాలున్న ఆ పసివాడు తలసేమియాతో పోరాడుతున్నాడు. నెలనెలా రక్తం ఎక్కించుకుంటే తప్ప బతకలేని జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఆ పరిస్థితుల్లోనూ.. ఆరోగ్య శ్రీతో తనలాంటి వారిని ఆదుకోవాలన్నాడు. కొల్లివలసకు చెందిన ఫల్గుణరావు.. సికిల్‌సెల్ అనీమియాతో బాధపడుతున్నాడు. ప్రతి నెలా రక్తం మార్చాల్సిందే. దీనికి తోడు తుంటి ఎముక ఆపరేషన్ అవసరమైంది. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. సాయం చేయాలని మంత్రిగారిని ప్రాధేయపడ్డాడట. నువ్వయితే ఆపరేషన్ చేయించుకో.. సీఎంకు చెప్పయినా ఖర్చుచేసిన మొత్తం ఇప్పిస్తానన్నాడట. ఆయన చెప్పాడని.. ఉన్న ఎకరా 90 సెంట్లు తనఖా పెట్టి, రెండు లక్షలు అప్పుచేశాడట. సాయం రాకపోగా.. అమరావతి చుట్టూ, మంత్రిగారి చుట్టూ తిరగడానికి కూడా అప్పు చేయాల్సి వచ్చిందని బావురుమన్నాడు.. ఆ సోదరుడి తండ్రి జగన్నాయకులు. సహజవనరులపై కన్నేసిన తెలుగుదేశం సర్కార్.. పేదలను వంచించడానికి ఎంతకైనా తెగబడుతుందని చింతామణి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గిరిజనులు, దళితులు అంటున్నారు. పాదయాత్రలో నన్ను కలిసి అనేక విషయాలు చెప్పారు. సాగు భూములకు నీళ్లివ్వాలని ఎంత అర్థించినా.. టీడీపీ నేతలు ఆలకించడం లేదని ఆగ్రహించారు. కొండవాగుల్లోంచి వచ్చే నీటిని ఒడిసిపట్టి చెరువుల ద్వారా నీళ్లిచ్చినా, వంశధార ఎడమకాల్వ నుంచి ఎత్తిపోతల పెట్టినా.. తమ భూముల్లో బంగారం పండిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరించడానికి వాళ్లు చెప్పిన కారణం వింటే ఆశ్చర్యమేసింది. ఆ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలున్నాయట. అందుకే ఉద్దేశపూర్వకంగా నీళ్లు లేకుండా చేసి.. బీళ్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారట. నిరుపయోగమైన భూములుగా ముద్రవేసి బినామీలకు కట్టబెట్టాలనేది వ్యూహమన్నారు. మంత్రిగారి పీఏ పేరిట ఆ భూముల్ని లీజుకిప్పించే ప్రయత్నా లు జరుగుతున్నాయని వివరించారు. ఇది ప్రభుత్వమా.. భూమాఫియానా?! అనిపించింది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు అందుతున్న అరకొర ఆరోగ్యశ్రీ సేవలను సైతం ఆస్ప త్రులవారు ఆపేస్తామంటున్నారు. మీ మంత్రి గారి పంటినొప్పి సింగపూర్ చికిత్సకు క్షణాల్లో లక్షలు మంజూరు చేసిన మీరు.. ఇక్కడ పేదవాడి ప్రాణాలను కాపాడే ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల చేయకపోవడం మానవత్వమేనా? -
328వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,505.6 కిలోమీటర్లు 22–12–2018, శనివారం గూడెం, శ్రీకాకుళం జిల్లా పేదలకు అందాల్సిన పరిహారాన్ని సైతం దోచుకోవాలనుకుంటున్న ఈ పెద్దలను ఏమనాలి? ప్రజలతో మమేకమై నడుస్తుంటే.. వేల కిలోమీటర్లు కూడా పెద్ద దూరం అనిపించడం లేదు. అప్పుడే 3,500 కిలోమీటర్లు పూర్తయిందా? అనిపించింది. అందుకు గుర్తుగా రావివలస వద్ద ఓ మామిడి మొక్కను నాటించారు. ఇక్కడికి అతి సమీపంలోనే తేలినీలాపురం పక్షుల కేంద్రం ఉంది. ఏటా పెలికాన్ పక్షులు, రంగుల కొంగలు పెయింటెడ్ స్టోర్క్స్ వేలాదిగా సైబీరియా నుంచి వేలమైళ్లు దాటి వస్తాయి. కనువిందు చేస్తాయి. అవి వస్తేనే సుభిక్షంగా ఉంటామని ఇక్కడి రైతన్నలు ప్రగాఢంగా విశ్వసిస్తారట. వాటిని ఇంటి ఆడబిడ్డలుగా గ్రామస్తులు చూసుకుంటారట. ఆ పక్షులకూ పెద్ద కష్టం వచ్చిపడింది. తిత్లీ తుపాను దెబ్బకు వందల ఏళ్ల నాటి వృక్షాలు సైతం నేలకొరగడంతో ఆవాసాలు కోల్పోయిన ఆ పక్షుల దీనస్థితిని చూసి గ్రామస్తులు విలవిల్లాడుతున్నారు. జయకృష్ణాపురానికి చెందిన సత్తార్ వేణుగోపాల్‌కు నాన్నగారంటే ప్రాణం. నాన్నగారి పాదయాత్రలోనూ ఆయన పాల్గొన్నాడు. నాన్నగారు చనిపోయినప్పుడు సొంత తండ్రిని కోల్పోయినట్టు తల్లడిల్లిపోయాడట. సంప్రదాయబద్ధంగా కర్మకాండలూ నిర్వహించాడట. ఏటా నాన్నగారి వర్ధంతి రోజున పిండప్రదానం చేసి, వందలాది మందికి భోజనాలు పెడుతున్నాడట. ఈ రోజు పాదయాత్రలో నన్ను కలిసిన ఆ సోదరుడు.. నాన్నగారితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ నాలుగేళ్లలో గుండె జబ్బుతో అన్నను, తల్లిని కోల్పోయాడు. భార్య సైతం కేన్సర్‌తో మరణించింది. వైద్యానికే లక్షలాది రూపాయల అప్పులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నాన్నగారి హయాంలోలా ఆరోగ్యశ్రీ వర్తించి ఉంటే బాగుండేదంటూ బావురుమన్నాడు. రావివలస వద్ద.. మూతపడ్డ ఫెర్రో అల్లాయ్ ఫ్యాక్టరీ కార్మికులు కలిశారు. రెండేళ్లుగా జీతాల్లేక, బకాయిలు రాక, ఆ కుటుంబాలు పడుతున్న బాధ వర్ణనాతీతం. 28 ఏళ్ల ఆ ఫ్యాక్టరీ చరిత్రలో రెండుసార్లు మూతపడితే.. రెండుసార్లూ బాబుగారే ముఖ్యమంత్రి. రెండేళ్ల కిందట ఆ ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడే సమయానికి కార్మిక మంత్రిగా ఉన్నది స్థానిక ఎమ్మెల్యేనే కావడం గమనార్హం. సొంత నియోజకవర్గ కార్మికులను ఆదుకోవాల్సిందిపోయి.. దగ్గరుండి ద్రోహం చేశారని ఆ సోదరులు వాపోయారు. నాన్నగారు ముఖ్యమంత్రి కాగానే.. అంతకు మునుపు బాబుగారు ఇబ్బడి ముబ్బడిగా పెంచిన కరెంటు చార్జీలను తగ్గించి, మూతపడ్డ ఫ్యాక్టరీలను తెరిపించారు. ఆ చేయూత వల్లనే.. బాబుగారి పాలనలో ఆరు ఫ్యాక్టరీలుంటే, నాన్నగారి హయాంలో 32 అయ్యాయని గుర్తుచేసుకున్నారు. మళ్లీ 2014లో బాబుగారు వచ్చాక అవన్నీ మూతపడ్డాయని ఆ సోదరులు చెబుతుంటే చాలా బాధేసింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడటానికి ఏకైక కారణం బాబుగారేనని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆ సోదరులకు మంచి రోజులొస్తాయని భరోసా ఇచ్చాను. నందిగం మండలానికి చెందిన నడుపూరు శ్యామల, చిన్ని జోగారావు, తమిరే దేవేందర్ తదితర తాజా మాజీ సర్పంచులు కలిశారు. ఈ ప్రభుత్వం వచ్చాక 26 మంది సర్పంచ్‌లకు చెక్‌పవర్ తీసేశారట. మండలం మొత్తానికి హార్టీకల్చర్ ఉన్నదే 1690 ఎకరాల్లో అయితే.. దాదాపు 2,700 ఎకరాల్లో కొబ్బరి, మామిడి జీడి తోటలు దెబ్బతిన్నట్టు.. పరిహారం కోసం పచ్చ నేతలు రాయించారట. మంత్రిగారి సమీప బంధువుకు సంతోషపురంలో రెండున్నర ఎకరాల భూమి ఉందట. అది ఖాళీ భూమి. ఒక్క చెట్టూ లేదు. కానీ 4.95 ఎకరాల్లో వరి దెబ్బతిందని పరిహారం కోసం రాయించారట. ఆశ్చర్యమేంటంటే అదే భూమిలో మామిడి, జీడి తోటలు దెబ్బతిన్నట్టు మరో నివేదిక రాయించారట. తుపానుకు సర్వం కోల్పోయి విలవిల్లాడుతున్న పేదలకు అందాల్సిన పరిహారాన్ని సైతం దోచుకోవాలనుకుంటున్న ఈ పెద్దలను ఏమనాలి? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఆముదాలవలస షుగర్ ఫ్యాక్టరీ మొదలుకుని.. జిల్లాలోని జూట్ మిల్లులు, ఫెర్రో అల్లాయ్ ఫ్యాక్టరీల వరకు మీ హయాంలోనే మూతబడటం వాస్తవం కాదా? దానికి కారణం మీరేనని కార్మికులు వాపోతున్నారు. ఓ వైపు.. ఉన్న పరిశ్రమలు మీ వల్లే మూతపడుతుంటే, మీరేమో.. శ్రీకాకుళానికి కొత్తకొత్త పరిశ్రమలు తెస్తానని, ప్రపంచం మొత్తం.. పెట్టుబడులు పెట్టాలంటే శ్రీకాకుళం వచ్చేట్టుగా ఏర్పాటుచేస్తానని మీ ధర్మపోరాట సభలో చెప్పడం.. ఎన్నికలకు మూడు నెలల ముందు ప్రజల్ని మభ్యపెట్టి మోసపుచ్చడానికే కాదా? - వైఎస్ జగన్ -
327వ రోజు పాదయాత్ర డైరీ
-
327వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,498.7 కిలోమీటర్లు 21.12.2018, శుక్రవారం దామోదరపురం క్రాస్, శ్రీకాకుళం జిల్లా నాన్నగారిలా జనం గుండెల్లో స్థానం సంపాదించాలన్నదే నా పుట్టినరోజు సంకల్పం సరిగ్గా పదిహేనేళ్ల క్రితం 2003, జూన్ 11న... తన పాదయాత్రలో భాగంగా, ఇదే దండుగోపాలపురంలో నాన్నగారు బసచేశారు. అదే గ్రామంలో, అదే చోట నేడు నేనూ బస చేయడం విశేషం. నా 327 రోజుల సుదీర్ఘ పాదయాత్రలో జరిగిన అపురూపమైన సంఘటన ఇది. నా పుట్టిన రోజునాడు ఇటువంటి ప్రదేశంలో నిదురించే అవకాశం రావడం దైవ నిర్ణయం. నాన్నగారే నా జన్మదినాన స్వయంగా ఆశీర్వదించిన మధురానుభూతి కలిగింది. ‘ప్రతి పేదవాడి ముఖాన నవ్వులు చూసినప్పుడే నా నిజమైన పుట్టినరోజు’ అని నాన్నగారు తరచూ అనే మాటలు పదే పదే గుర్తొచ్చాయి. జనం మెచ్చిన పాలన అందించిన ఆయన ఆ జనం గుండెల్లో నిలిచిపోయారు. జనహితంలో ఆయన కన్నా రెండడుగులు ముందుకు వేయాలని, నాన్నగారిలా జనం గుండెల్లో స్థానం సంపాదించాలన్నదే నా పుట్టినరోజు సంకల్పం. అప్పట్లో నాన్నగారు ఇక్కడ విడిది చేసిన రోజు కొన్ని వందల కోయిలలు ఇక్కడికి వచ్చి, తమ కుహూ కుహూ రాగాలతో సంగీతామృతాన్ని పంచాయని స్థానికులు గుర్తుచేసుకున్నారు. శిబిరం నుంచి బయటకు రాగానే ఎందరో ఆత్మీయులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వరుస తుపానులతో ప్రజలు కష్టాల్లో ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని, నా సూచన మేరకు పార్టీ శ్రేణులు, ఆత్మీయ అభిమాన జనం.. ఆడంబరాలకు దూరంగా ఉండి, అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిసి సంతోషం కలిగింది. దారి పొడవునా ఎంతో మంది అక్కచెల్లెమ్మలు, చిన్నచిన్న పిల్లలు సైతం పూలు పట్టుకుని వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారులకు నాతో అన్నప్రాసనలు, మరికొందరు అక్షరాభ్యాసాలు చేయించారు. వారందరి ప్రేమ, ఆప్యాయతలు నా పుట్టినరోజును మరింత ఆనందమయం చేశాయి. ఈ నియోజకవర్గంలో మంత్రిగారి అరాచకాలు దళిత మహిళ చుక్కా గున్నమ్మతో మొదలయ్యాయట. చాకిపల్లి దళితవాడకు చెందిన గున్నమ్మకు భర్త చనిపోయి ఐదేళ్లయిందట. ఒక్కగానొక్క కూతురుతో బతుకుతోంది. గతంలో ఉన్న కాస్త స్థలాన్ని అంగన్వాడీ కేంద్రానికి వితరణగా ఇచ్చిన కుటుంబం వారిది. ఆ కేంద్రానికి దగ్గర్లోనే చిన్నబడ్డీ కొట్టు పెట్టుకుని జీవిస్తోంది. నాన్నగారంటే ఎనలేని అభిమానం. ఆ ఊరికి సర్పంచ్ కూడా అయింది. ఇక్కడి నాయకుడు మంత్రి పదవి చేపట్టిన మరునాడే, పార్టీ వివక్షతో, దుగ్ధతో జేసీబీలు తెప్పించి, వారి బడ్డీకొట్టును పెకలించి, ధ్వంసం చేయించి మరీ.. అదే స్థానంలో మరో బడ్డీకొట్టును పచ్చచొక్కాతో పెట్టించారట. ఉపాధి కోల్పోయిన గున్నమ్మ కూలీగా మారింది. ఇది చాలదన్నట్లు ఆమెకు వితంతు పింఛన్ కూడా రానీయకుండా, నాలుగేళ్లు వేధించిన దుర్మార్గం ఈ నేతలది. ఇంతకన్నా పైశాచికత్వం ఉంటుందా? ఈ నియోజకవర్గంలో ఈ తరహా అరాచకాలు లేని గ్రామమే లేదట. తాళ్లవలసలో పది దళిత కుటుంబాలు నాలుగున్నర ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొంది సాగుచేసుకుంటున్నాయట. కేవలం రాజకీయకక్షతోనే నీరు–చెట్టు పేరు చెప్పి ఆ భూముల్ని చెరువులో కలిపేశారని ఆ దళిత సోదరులు వాపోయారు. ఎస్బీ కొత్తూరులో నిర్దాక్షిణ్యంగా యాభై ఎనిమిది మంది పింఛన్లు తొలగిస్తే, కోర్టుకు వెళ్లి తెచ్చుకోవాల్సివచ్చిందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉన్నది అహంకారంతో విర్రవీగడానికా? పదవులొచ్చింది ప్రజలను పీడించడానికా? చివరిగా ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాజధాని భూములు మొదలుకొని గ్రామస్థాయి నీరు–చెట్టు వరకూ ప్రతి చోటా అధిక శాతం పేదవారైన బడుగు బలహీన వర్గాలు, దళితులనే బలి చేస్తుండటం వాస్తవం కాదా? రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా దళితులపై దౌర్జన్యాలు, దారుణాలు, అరాచకాలు, అఘాయిత్యాలు జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనన్న వాస్తవాన్ని కాదనగలరా? మరి ఎవర్ని మోసగించడానికి మీ దళిత తేజం?. - వైఎస్ జగన్ -
326వ రోజు పాదయాత్ర డైరీ
-
326వ రోజు పాదయాత్ర డైరీ
సామాన్యులు స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా హరించాలనుకోవడం ఎంత ఆటవికం? ఈరోజు కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో పాదయాత్ర సాగింది. మంత్రి గారు, ఆయన అనుచరుల అరాచకాల మీద రోజంతా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిన్న రాత్రి బస చేసిన రైస్‌మిల్ యజమాని, ఆయన కుటుంబీకులు వచ్చి కలిశారు. బసకు చోటిచ్చినందుకు వారింటికి వెళ్లి మరీ బెదిరించారట. మిల్లును, వ్యాపారాన్ని దెబ్బ కొడతామని హుంకరించారట. అయినా అభిమానం ముందు ఆ బెదిరింపులేవీ పనిచేయలేదు. మంత్రి గారి స్వగ్రామం నిమ్మాడ గ్రామస్తులు కలిశారు. నిరుపేద ఎరకయ్యకు ఉన్న ఒకే ఒక ఎకరా భూమికి దారి లేకుండా చేసి సెల్‌ఫోన్ టవర్ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారట. మంత్రి గారి అడుగులకు మడుగులొత్తలేదని అదే గ్రామంలో 20 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారట. వారితో ఎవరూ మాట్లాడకూడదు.. వారి భూములెవ్వరూ సాగు చేయకూడదు. అమ్మరాదు.. కొనరాదు. ఎటువంటి వ్యాపారాలూ చేయరాదు. ఆఖరికి చాకలి, మంగలి కూడా వెళ్లకుండా ఆంక్షలు విధించారట. ఏ పథకాలు అందకుండా చేయడం, బతుకుదెరువే లేకుండా చేయాలనుకోవడం విస్మయం కలిగించింది. సామాన్యులకు స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా హరించాలనుకోవడం ఎంత ఆటవికం? పాదయాత్రకు వెళితే పింఛన్లు ఆపేస్తామంటూ ప్రజల్ని బెదిరిస్తున్నారని ముద్దపు కవిత అనే సోదరి వాపోయింది. టీడీపీ దుర్మార్గ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షకు చిహ్నంగా లక్ష్మి అనే సోదరి పావురాలను ఎగురవేయించింది. మరోవైపు మంత్రి గారి సొంత మండలంలోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటికి సైతం అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఊసే లేదట. రోడ్లు, మౌలికవసతులే లేవని పల్లెపల్లెనా ప్రజలు మొర పెట్టుకున్నారు. నాన్నగారిచ్చిన కొండపేట, పొడుగుపాడు, కొత్తపేట తదితర చిన్నచిన్న ఎత్తిపోతల పథకాలను సైతం పూర్తి చేయకపోవడంతో తమ పొలాలకు సాగునీరందడం లేదన్నది రైతన్నల వ్యథ. వారి కష్టాలు తీర్చి మంచి చేసి మనసులు గెలవాల్సింది పోయి.. బెదిరింపులు, దౌర్జన్యాలు, మోసాలతో లొంగదీసుకోవాలనుకోవడం మూర్ఖత్వం కాక మరేమిటి? నేను ఈరోజు నడిచిన దారిలోనే నాన్నగారి పాదయాత్ర కూడా సాగింది. నాడు పాదయాత్రలో ఈ ప్రాంత ఉప్పు రైతుల కష్టాలు చూశారాయన. అధికారంలోకి రాగానే ‘నాలా’పన్ను తీసేసి ఆదుకున్నారని నాన్న గారిని గుర్తు చేసుకున్నారు నౌపడ గ్రామస్తులు. ఉప్పు రైతులకు తుపాను పరిహారమిచ్చిన గొప్ప మనç సు ఆయనదన్నారు. నాన్నగారి పాదయాత్రప్పుడు ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజలు విసుగెత్తిపోతే.. నేడు ప్రజా వ్యతిరేక పాలన, పాలకులే ప్రజాకంటకులై ప్రజలను కాల్చుకుతింటున్న అరాచకం నెలకొంది. సాయంత్రం వడ్డితాండ్ర వద్ద కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా 3,051 రోజులుగా దీక్షలు చేస్తున్న మత్స్యకారుల శిబిరానికి వెళ్లాను. తరతరాలుగా వారు ఆధారపడి జీవిస్తున్న తంపర భూములను థర్మల్ పవర్ ప్లాంట్‌కు కట్టబెట్టే జీవో నంబర్ 1108 రద్దు కోసం పోరాడుతున్నారు. ఆ జీవోను రద్దు చేస్తామని గత ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన బాబు మోసం చేశారని మండిపడ్డారు. ఓవైపు మేము తంపర భూములపై హక్కులు కోల్పోయి పోరాడుతుంటే.. మరోవైపు మంత్రి గారి బినామీలు అవే భూముల్లో అక్రమ రొయ్యల చెరువులు ఏర్పాటు చేసుకొని దోచుకుంటున్నారని వాపోయారు.ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. తాగడానికి మంచి నీరు లేక, నీటిని కొనలేక కిడ్నీ వ్యాధులు తదితర రోగాల బారినపడతామని తెలిసి కూడా విధి లేని పరిస్థితిలో అక్కడున్న నీటినే తాగుతున్నామని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ఏమైంది మీ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం? ఆ పథకం కింద ప్రతి గ్రామానికి రక్షిత నీటి సరఫరా, ప్రతి వీధికి ఉచిత కుళాయి, రూ2.కే 20 లీటర్ల మినరల్ వాటర్ అంటూ మీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాల్లో పేర్కొన్నారు. అదైనా గుర్తుందా? ఆఖరికి మీ మేనిఫెస్టో కూడా ప్రజల్ని మోసగించడానికేనా? -
325వ రోజు పాదయాత్ర డైరీ
-
325వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,486.9 కిలోమీటర్లు 19–12–2018, బుధవారం దుర్గమ్మపేట, శ్రీకాకుళం జిల్లా మీ మొదటి సంతకాలు గుర్తున్నాయా బాబూ? ఈరోజు కోటబొమ్మాళి మండలంలో పాదయాత్ర సాగింది. రోజంతా పెద్ద సంఖ్యలో జనం కలిశారు. సమస్యల బరువూ అంతే ఉంది. ఇది మంత్రి గారి సొంత మండలం. కానీ ఇక్కడ అభివృద్ధి కాసింతైనా కనబడలేదు. సమస్యల్లో అధిక భాగం మంత్రి గారి పుణ్యమేనని జనం చెప్పారు. మంత్రి పదవులనేవి సమస్యలు తీర్చడానికా? పెంచడానికా? అనిపించింది. జర్జంగి గ్రామ అక్కచెల్లెమ్మలు కలిశారు. ఆ ఒక్క గ్రామంలోనే పదమూడు దాకా బెల్టుషాపులున్నాయన్నారు. ఆరోగ్యాలు పాడై ప్రాణాలు పోతున్నా.. కుటుంబాలు నాశనమవుతున్నా చెప్పుకునే దిక్కే లేకుండా పోయిందని వాపోయారు. మరోవైపు ఇక్కడంతా కల్తీ మద్యమేనని గ్రామస్తులు చెప్పారు. నాసిరకం మద్యాన్ని బ్రాండెడ్ కంపెనీల బాటిళ్లలో పోసి అధిక ధరలకు అమ్ముతున్నారట. జేబులకు చిల్లులు పెడుతూ ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారట. ఆ కల్తీ మద్యం వెనుక మంత్రి గారే ఉంటే ఇక అధికారులేం చేస్తారని బావురుమన్నారు. అడ్డదారుల్లో ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత దారుణం. మంత్రి గారి ఇలాఖాలో అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందన్నది యలమంచిలి అక్కచెల్లెమ్మల ఆవేదన. వారి కష్టాలు వివక్షకు పరాకాష్టగా అనిపించాయి. ఈ ప్రభుత్వం వస్తూనే కక్షగట్టి మరీ అక్కడి మహిళా సర్పంచ్ చెక్‌పవర్ తీసేయించారట. హైకోర్టుకు వెళ్లి చెక్‌పవర్ తెచ్చుకుంటే.. ఆ తర్వాత కొద్దిరోజులకే మళ్లీ తీసేయించిన దుర్మార్గం వారిది. అన్ని అర్హతలున్నా.. 80 మందికి పెన్షన్లు పీకేశారట. 98 ఏళ్ల దుంపల లచ్చమ్మకు, కూలీ పని చేసుకునే వితంతువైన ఆమె కూతురుకు, 90 ఏళ్ల పైబడ్డ రెండు కళ్లూ లేని పొట్నూరు చిన్నమ్మి అనే అవ్వకు పింఛన్లు తీసేశారట. రేషన్ కూడా ఆపేశారట. రెండు కాళ్లూ లేని వంద శాతం వైకల్యమున్న కోన అప్పన్న అనే దివ్యాంగుడికి రేషన్ డీలర్షిప్ తీసేసి వేధించారట. ఆ అభాగ్యుడు మానసిక క్షోభతోనే చివరకు మరణించాడట. కోర్టుకెళ్లి కొందరు పింఛన్లు తెచ్చుకున్నా మూడు నెలలకే మళ్లీ ఆపేసిన పైశాచికత్వం వారిది. నాన్న గారు ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి పథకానికి తాగునీరివ్వని దుర్మార్గం. మరోవైపు ఇచ్చిన అరకొర తుపాను పరిహారమూ ‘పచ్చ’చొక్కాలకే పరిమితం చేసిన అరాచకత్వం. తుపాను కేవలం ఒక్క పార్టీ వారినే ఎంచుకొని మరీ నష్టపరుస్తుందా? అది కూడా తెలుగుదేశం వారిని మాత్రమేనా? కేవలం పరిహారం కోసమేనా? ఈరోజు విపరీతమైన జనం మధ్య నుంచే లలిత అనే స్కూలుకెళ్లే చిట్టితల్లి వచ్చి కలిసింది. రెండు కిలోమీటర్ల నుంచి నన్ను కలవాలని పరిగెత్తుకొని వస్తోందట. చెప్పులు కూడా పోయాయి. ఆ గుంపులో ఎవ్వరో కాళ్లు కూడా తొక్కేశారట. పంటి బిగువన నొప్పిని అదిమిపట్టి నన్ను కలవాలని వచ్చింది. ఒక్కసారిగా కన్నీళ్లను ఆపుకోలేక భోరున విలపించింది. ఆ చిట్టితల్లి స్వచ్ఛమైన అభిమానం నన్ను కూడా ఉద్వేగానికి గురిచేసింది. కోటబొమ్మాళి దగ్గర కొంతమంది దళితులు కలిశారు. దాదాపు 23 కుటుంబాల వారు 40 ఏళ్లుగా ఏడున్నర ఎకరాలు సాగుచేసుకుంటున్నారట. ఆ ఊరికి ఆనుకొని ఉన్న ఆ భూముల ధరలు బాగా పెరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులు వాటిపై కన్నేశారట. అక్కడ పౌర సరఫరాల స్టాక్ పాయింట్లు, డిగ్రీ కాలేజీ కడతామని.. మంత్రి గారి అండతో వారి డీ పట్టాలు రద్దు చేయించి ఆ భూములను ఆక్రమించారట. ఈ ప్రభుత్వ కాలమైపోతున్నా ఇప్పటిదాకా ఒక్క ఇటుక కూడా పడలేదంటే దాని వెనుకున్న దురుద్దేశం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. మీరు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే.. మీ హయాంలోనే బెల్టుషాపులు పురుడు పోసుకుంది వాస్తవం కాదా? మద్యం ఆదాయం పెంచడం కోసం టార్గెట్లు పెట్టి మరీ బెల్టుషాపులు ఎక్కువ చేస్తుండటం గ్రామగ్రామానా కనిపిస్తోంది. దీనికి ఏం సమాధానం చెబుతారు? బెల్టుషాపుల రద్దు మీ మొదటి సంతకాల్లో ఒకటి. కనీసం అదైనా గుర్తుందా? మీ మొదటి సంతకాలు మొదటి మోసాలుగా మిగిలిపోవ డం మీకు అవమానంగా అనిపించడం లేదా? -
324వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,478.9 కిలోమీటర్లు 18–12–2018, మంగళవారం కొబ్బరిచెట్లపేట, శ్రీకాకుళం జిల్లా ఈ విషాద ఘటన అయినా రైతు వ్యతిరేక ప్రభుత్వం కళ్లు తెరిపిస్తుందా? ఈరోజు నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఉదయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కచెల్లెమ్మలు పూజలు చేసి ప్రసాదాలు తెచ్చారు. నిన్నటిలాగే ఈరోజు కూడా మబ్బులు కమ్ముకునే ఉన్నాయి. చలిగాలులు, వర్షపు జల్లుల మధ్యనే పాదయాత్ర సాగింది. నిన్నటి నుంచి పడుతున్న వర్షానికి రోడ్లన్నీ బురదమయమయ్యాయి. వర్షం కారణంగా మధ్యాహ్నం తర్వాత పాదయాత్ర కొనసాగించలేని పరిస్థితి. ఒకప్పుడు చల్ల అంటే.. అక్కడి చల్లే అన్నంత పేరు. మజ్జిగకు బాగా ప్రసిద్ధి కావడం వల్ల చల్లవానిపేటకు ఆ పేరు వచ్చిందట. అయితే పాడి గిట్టుబాటు కాక పశువులన్నీ పక్కనే ఉన్న నారాయణవలస సంత నుంచి కబేళాలకు తరలిపోయాయని ఆ ఊరి పెద్దలు చెప్పారు. ఇప్పుడు తమ ఊరికి పేరు మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. దరివాడ గ్రామానికి చెందిన ఉప్పు వ్యాపారులు కలిశారు. ఆ ఊరుఊరంతా ఉప్పు అమ్ముకొని బతుకుతారట. వరుస తుపానులు, వర్షాలతో ఉప్పు పాడై ఉపాధి దెబ్బతింటోందని గోడు వెళ్లబోసుకున్నారు. లింగాలవలస ఎత్తిపోతల ద్వారా తమ ఊరికి సాగునీరు అందడం లేదని దరివాడ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిపోయిన కాస్త పైప్లైన్లు వేయకుండా అధికార నేతలు వివక్ష చూపుతున్నారని చెప్పారు. వెంకటాపురం ఎత్తిపోతల ద్వారా ఊడిగిలపాడుకు సాగునీరు అందకపోవడానికి ‘పచ్చ’ నాయకుల వివక్షే కారణమని రైతన్నలు వాపోయారు. ఈ ప్రాంతమంతా వరి ధాన్యం పండించే రైతన్నలే ఎక్కువ. కోత కోసిన వరి ధాన్యాన్ని రక్షించుకునేందుకు ఆ రైతన్నలు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశాను. పూత దశలో ఒక తుపాను, కోత దశలో మరో తుపాను కొంప ముంచాయని రైతన్నలు వాపోయారు. వరి దిగుబడిపై తిత్లీ తీవ్ర ప్రభావం చూపిస్తే.. మిగిలిన కాస్త పంటను పెథాయ్ తుపాను లాగేసుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన కాస్త పంటను దాచుకోవడానికి గిడ్డంగులు లేక, అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లేక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. గత నెలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ‘ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదన్నా..’ అని రైతన్నలు వాపోయారు. పొలంలోని ఈ ధాన్యాన్ని ఏం చేసుకోవాలన్నా అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. ఏటా ఇన్ని ప్రకృతి విపత్తుల నడుమ ఎలా బతకాలన్నా అంటూ బావురుమన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమేమో ధాన్యం కొనుగోలులోను, పరిహారం విషయంలోను మీనమీషాలు లెక్కిస్తోంది. ఏ మూలకు చాలని సాయం ప్రకటిస్తోంది. అరకొర సాయంలోనూ అవినీతి వెల్లువెత్తుతోంది. బాధితుల ఎంపిక మొదలుకొని నష్టాన్ని లెక్కగట్టడం, పరిహారం చెల్లించడం వరకు ప్రతి అడుగులోనూ వివక్ష కనిపిస్తోంది. జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యమేలుతోంది. ఓవైపు ప్రకృతి, మరోవైపు ప్రభుత్వం రైతన్నల ఉసురు తీస్తున్నాయి. అన్నదాతల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే ఓ హృదయ విదారక ఘటన నన్ను కలిచివేసింది. నీట మునిగిన తన పంటను చూసి తీవ్ర మానసిక క్షోభతో పంట పొలంలోనే ప్రాణాలొదిలేశాడు చిన్నయ్య అనే రైతన్న. పంట నష్టానికి భరోసా ఉంటే ఇలా జరిగేదా? శ్రీకాకుళం జిల్లాలోని కొసమాల గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన అయినా ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం కళ్లు తెరిపిస్తుందా? ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. ప్రపంచంలో ఎక్కడా లేని టెక్నాలజీని వాడి తుపాను నష్టాన్ని పూర్తిగా తగ్గించానని, తుపాను వల్ల ఒక్క మరణమూ లేదంటూ క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టాలనుకోవడం బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీకు భావ్యమేనా? కేవలం ఐఎండీ వారిచ్చిన నివేదికలపైనే ఆధారపడి, ఆ సమాచారాన్నే వాడుకుని అదంతా మీ గొప్పగా చెప్పుకోవడానికి నామోషీగా అనిపించడం లేదా? తుపాను గమనాన్ని గానీ, తీవ్రతను గానీ, కనుగొనడానికి మీరు వాడిన ప్రత్యేక పరిజ్ఞానం గానీ, పరికరాలు గానీ ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నాయా? - వైఎస్ జగన్ -
323వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం– 3,470.3 కిలోమీటర్లు 17–12–2018, సోమవారం లింగాలవలస, శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర ప్రజల కన్నా రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యమా బాబూ? ఈరోజు సోదరి షర్మిల పుట్టినరోజు. గతంలో ఆమె పాదయాత్రలో నడిచిన దారిలోనే నేటి నా పాదయాత్ర కూడా సాగడం విశేషం. ఈరోజు టెక్కలిపాడు, లింగాలవలస రైతన్నలు కలిసి నాన్నగారిని గుర్తు చేసుకున్నారు. తమ గ్రామాలకు సాగునీరు అందుతోందంటే నాన్నగారు ఏర్పాటు చేసిన టెక్కలిపాడు ఎత్తిపోతల, లింగాలవలస ఎత్తిపోతల పుణ్యమేనని చెప్పారు. సాగునీటి అవసరాలు తీర్చాలే గానీ కలకాలం రైతన్నలు గుండెల్లో పెట్టుకుంటారు. వెటర్నరీ పాలిటెక్నిక్ పూర్తి చేసిన యువకులు కలిశారు. 1,200కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని వాపోయారు. ‘పాలిటెక్నిక్ చేసినవారు ఇంజనీరింగ్ డిగ్రీ చేయ గలుగుతున్నారు. అగ్రికల్చర్ డిప్లొమా చేసినవారిని ఏజీ బీఎస్సీ చేయడానికి అనుమతిస్తున్నారు. కానీ వెటర్నరీ డిప్లొమా చేసిన మాకు మాత్రం వెటర్నరీ సైన్స్ డిగ్రీ చేయడానికి అర్హత లేదంటున్నారు’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ఉద్యోగ అవకాశాలు లేక, మరోవైపు పై చదువులకూ పనికి రాకపోతే ఇక మేం చదివిన డిప్లొమా ఎందుకంటూ నిరాశ వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ కళాశాలలకన్నా రెట్టింపు సీట్లతో ప్రైవేటు కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అవన్నీ టీడీపీ నాయకులవే కావడం గమనార్హం. నిన్న కలిసిన వ్యవసాయ విద్యార్థులైనా.. నేటి వెటర్నరీ వారైనా ఒకటే ఆవేదన. ఈ నాలుగున్నరేళ్లలో వేలాది మంది చదువులు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నా ఒక్కటంటే ఒక్క ఉద్యోగ అవకాశం కల్పించకపోగా రూ.లక్షల్లో ఫీజులు దండుకోవడానికి ప్రమాణాలు లేని ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు పచ్చచొక్కాలకు అనుమతులివ్వడం ఆందోళనకరం. విద్యను కేవలం వ్యాపార దృష్టితో చూసే పాలనలో నిరుద్యోగ సమస్య పెరగక ఏమవుతుంది? నారాయణవలసలో దారిపక్కనే ఉన్న పశువుల సంతను చూశాను. వంద సంవత్సరాల పైబడిన చరిత్ర గల ఆ సంత జిల్లాలోనే పెద్దదని గ్రామస్తులు చెప్పారు. ఒకప్పుడు ఈ ప్రాంత పాడిరైతుల వైభవానికి అద్దం పట్టిన ఆ సంత.. ఈరోజు వ్యవసాయ దుస్థితిని పట్టిచూపుతోంది. గతంలో ఈ ప్రాంత రైతులు మంచి మంచి పశువులను కొనడానికి ఉపయోగపడ్డ ఈ సంత.. ఈరోజు పశువులను అమ్ముకునే కేంద్రంగా మారింది. ఆ పశువులన్నీ కబేళాలకు తరలిపోతున్నాయని తెలిసి గుండె బరువెక్కింది. అక్రమ రవాణాకు అడ్డాగా మారిన ఈ ప్రాంతం నుంచే ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌కు సైతం పశువులను తరలిస్తున్నారట. ఈ అక్రమాలకు పాత్రధారులు, సూత్రధారులు స్థానిక పచ్చనేతలు, మంత్రివర్యులేనట. వ్యవసాయం భారమై, పాడి గిట్టుబాటుకాక విధిలేక పశువులను అమ్ముకుంటున్న రైతన్నలను.. దళారులను పెట్టి మరీ దోచుకోవడం చాలా బాధనిపించింది. ఈరోజు ఉదయం నుంచి పెథాయ్ తుపాను ప్రభావంతో వీస్తున్న చలిగాలులు, అప్పుడప్పుడు పడుతున్న వర్షపు చినుకుల మధ్యనే పాదయాత్ర సాగింది. గత తుపానులప్పుడు ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గుర్తొచ్చి ఆందోళన కలిగింది. ఆ వైఫల్యాల పాఠాలను గుర్తుంచుకొనైనా సహాయక చర్యలు చేపడితే బాగుంటుందనిపించింది. మధ్యాహ్నం నుంచి తుపాను ప్రభావంతో వర్షం అధికమవ్వడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నేటి పాదయాత్ర అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. తుపాను భయంతో ప్రాణాలు చేతపట్టుకొని ప్రజలు తీవ్ర ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ ఉంటే.. అనుక్షణం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాల్సింది పోయి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాల సంబరాల్లో పాల్గొనడానికి వెళ్లడం భావ్యమేనా? రాష్ట్ర ప్రజలకన్నా రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యమా? - వైఎస్ జగన్ -
322వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం– 3,462.3 కిలోమీటర్లు 16–12–2018, ఆదివారం, జమ్ము, శ్రీకాకుళం జిల్లా. యూనిఫామ్ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి బాబూ? ఉదయం నుంచి మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఎండ జాడే లేదు. తుపాను ప్రభావం ప్రారంభమైనట్టు ఉంది. అయినా భారీగా జనం నా అడుగులో అడుగు వేశారు.శ్రీకాకుళానికి చెందిన ఓ మహిళా స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలిశారు. ‘సంవత్సరాల తరబడి స్కూల్ యూనిఫామ్ కుడుతున్నాం.. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం మా కడుపులు కొడుతోంది.. మేము ఎలా బతకాలి’ అంటూ మొరపెట్టుకున్నారు. దాదాపు వంద మందికి పైగా మహిళలు ఆ సంస్థలో ఉన్నారట. ‘బట్టలు కుడితే ఇచ్చే రూ.40లో రూ.10 ఆప్కో చైర్మన్‌కు లంచం ఇచ్చుకోవాల్సి వస్తోంది.. ఆ మిగతా డబ్బు కూడా సంవత్సరం పైగా చెల్లించకపోతే మా పరిస్థితి ఏం కావాలి?’ అంటూ ఆ అక్కచెల్లెమ్మలు బావురుమన్నారు. ‘ఈ పాలనలో ఆప్కో సంస్థ అక్రమాల పుట్టగా మారిపోయింది.. బడిపిల్లలకు ఉచిత యూనిఫామ్ పథకం అధ్వానంగా తయారైంది.. విద్యా సంవత్సరం పూర్తవుతున్నా యూనిఫామ్ పూర్తిగా స్కూళ్లకు అందడం లేదు.. అరకొరగా ఇచ్చినవి కూడా నాసిరకమైనవే.. కొలతలు సరిగా లేనివి. ఓవైపు విద్యార్థులు వాటిని వేసుకోలేక మూలనపడేస్తుంటే.. మరోవైపు చాలీచాలని కొలతలతో కుట్టినవి వేసుకుంటూ విద్యార్థినులు సిగ్గుతో చితికిపోతున్నారు. అసలీ పథకం ఎవరి కోసం?’ అంటూ ఆ మహిళా సంఘం సభ్యులు మండిపడ్డారు. పేద పిల్లల స్కూల్ యూనిఫామ్ పథకాన్ని సైతం దోపిడీమయం చేసిన ఆప్కో చైర్మన్, సంబంధిత మంత్రి, ప్రభుత్వ పెద్దలే ఈ పథకం అసలైన లబ్ధిదారులంటూ చెప్పుకొచ్చారు. వంశధార నది వరద ముంపును నివారించాలని కరకట్టల నిర్మాణాన్ని చేపట్టారు.. నాన్నగారు. నిధులు కూడా మంజూరు చేశారు. కానీ పెండింగ్ పనులు కూడా పూర్తిచేయని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏటా వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయన్నది నరసన్నపేట రైతన్నల ఆవేదన. ‘నియోజకవర్గంలోని ఆరు ఓపెన్ హెడ్ చానల్స్ ఆధునికీకరణలోనూ అదే నిర్లక్ష్యం. ఆ పనులు పూర్తిచేయకపోవడంతో వరదలు వచ్చినప్పుడు వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలు లేనప్పుడు సాగునీరు అందక ఎండిపోతున్నాయి’ అంటూ ఆ అన్నదాతలు గోడు వెళ్లబోసుకున్నారు. ఇలా ఏటా ఏదో ఒక రూపంలో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నా చీమకుట్టినట్టయినా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? కేవలం వైఎస్సార్ హయాంలో నియామకాలు పొందామన్న ఏకైక కారణంతో వేధింపులకు గురిచేస్తోంది ఈ ప్రభుత్వమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఆరోగ్యమిత్రలు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వీరి ఉద్యోగాల పరిస్థితి దినదినగండంగా మారిందట. ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తే కోర్టునాశ్రయించి న్యాయం పొందారట. జీతాలు పెంచాలని కోర్టు తీర్పు ఇస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదట. ‘ఇప్పటికీ మమ్మల్ని తీసేయాలనే చూస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ మన్ననలు పొందిన ఆరోగ్యశ్రీ పథకంలో మా నియామకాలు జరగడమే తప్పా సార్’ అంటూ వాపోయారు. నాన్నగారికి పేరొస్తుందేమోనన్న సంకుచితత్వంతో.. పేదలపాలిట సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీని నీరుగార్చడం, అందులో పనిచేసే చిరుద్యోగులను వేధించడం కన్నా అన్యాయం ఏముంటుంది? ఎవరి మీద ఈ ప్రభుత్వం కక్ష? అందులో పనిచేసే చిరుద్యోగులు, ఆ పథకం వల్ల లబ్ధి పొందే లక్షలాది పేద కుటుంబాలపైననా? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి సంవత్సరం విద్యార్థులందరికీ యూనిఫామ్ సరఫరా చేస్తున్నామని ప్రకటిస్తున్నారు. కానీ వస్త్రం సరఫరా చేసిన చేనేత సొసైటీలు తమకు ఇప్పటిదాకా బకాయిలు చెల్లించనే లేదని వాపోతున్నాయి.. తమకు డబ్బులు ఇవ్వలేదని దుస్తులు కుట్టినవారు గగ్గోలు పెడుతున్నారు. విద్యా సంవత్సరం పూర్తవుతున్నా ఇప్పటికీ కొన్ని స్కూళ్లకు యూనిఫామ్ అందడం లేదని, అందినవి కాస్తా నాసిరకమైనవని విద్యార్థులు చెబుతున్నారు. మరి ఈ పథకానికి ఖర్చు చేశామంటున్న వందల కోట్ల నిధులు ఏమవుతున్నాయి? ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి? - వైఎస్ జగన్ -
321వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం– 3452.7 కిలోమీటర్లు 15–12–2018, శనివారం దేవాది, శ్రీకాకుళం జిల్లా ఇసుక తవ్వకాలతో గుంతలమయమైన వంశధార నదిని చూసి బాధేసింది తెలుగు ప్రజల స్వరాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు, సమగ్ర భారత రూపశిల్పి సర్దార్ వల్లభ్‌భాయ్‌పటేల్‌ల వర్ధంతి సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకుంటూ పాదయాత్ర ప్రారంభించాను. నైరలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ కళాశాల మీదుగా పాదయాత్ర సాగింది. అక్కడ నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న కళాశాల విద్యార్థులు కలిశారు. ఈ నాలుగున్నరేళ్లలో వందలాది ఖాళీలున్నా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని చెప్పారు. కోర్సు పూర్తి చేసుకొని ఏటా వేలాది మంది నిరుద్యోగులుగా బయటకొస్తున్నామని వివరించారు. మరోవైపు ఎలాంటి అర్హతలూ లేకున్నా.. ఎటువంటి ప్రమాణాలు పాటించకున్నా కమీషన్ల కోసం ప్రైవేటు కళాశాలలకు ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చేస్తోందంట ఈ ప్రభుత్వం. ఆ ప్రైవేటు కళాశాలలన్నీ టీడీపీ నాయకులవేనని.. విద్యార్థుల నుంచి దాదాపు 10 లక్షల రూపాయలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. అసలే ఉద్యోగాలు లేక విలవిల్లాడుతుంటే.. ప్రైవేటు కళాశాలల నుంచి పోటీ మరింత పెరిగిపోయిందన్నారు. నిరుద్యోగుల సమస్యను పెంచి పోషిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేస్తున్నామని చెప్పారు. ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అని గళమెత్తిన గరిమెళ్ల సత్యనారాయణ నడయాడిన నేల.. కంచు సామగ్రి తయారీలో పేరెన్నికగన్న ప్రాంతం నరసన్నపేట. మధ్యాహ్నం వంశధార నదిని దాటి మడపాం వద్ద నరసన్నపేట నియోజకవర్గంలో అడుగుపెట్టాను. ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో పూర్తిగా గుంతలమయమైన వంశధారను చూసి బాధేసింది. నదిలో భారీ వాహనాల కోసం ఏర్పాటు చేసిన బాటలు చూసి ఆశ్చర్యమేసింది. జిల్లాలోనే అత్యధిక ఇసుక దోపిడీ జరిగే ప్రాంతం ఇదేనని గ్రామస్తులు చెప్పారు. వందలాది వాహనాలు, భారీ యంత్రాలతో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందన్నారు. రాత్రింబవళ్లు తిరిగే వాహనాలతో భీతిల్లిపోతున్నామంటూ వాపోయారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వరద వచ్చినప్పుడు 40కిపైగా భారీ వాహనాలు, జేసీబీలు, వందలాది మంది ఇసుక తవ్వుతున్న కూలీలు రాత్రి పూట నది మధ్యలో చిక్కుకుపోయి హాహాకారాలు చేశారట. అధికారులు పట్టించుకోకున్నా ప్రకృతే ఇసుక దొంగల్ని పట్టించిందని స్థానికులు చెప్పుకొచ్చారు. పాలకుల విచ్చలవిడి ఇసుక దోపిడీకి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు హోదాను సమాధి చేయాలని విశ్వప్రయత్నం చేసిన మీరు.. నేడు కాంగ్రెస్‌తో మీ అనైతిక అవకాశవాద పొత్తును సమర్థించుకోవడానికి హోదా అంశాన్ని సాకుగా చూపడం, అదేదో వాళ్లిప్పుడే కొత్తగా ఇస్తామన్నట్టుగా మాట్లాడటం.. మీ దిగజారుడుతనానికి పరాకాష్ట కాదా? - వైఎస్ జగన్ -
320వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,441.9 కిలోమీటర్లు 12–12–2018, బుధవారం, నక్కపేట క్రాస్, శ్రీకాకుళం జిల్లా డ్వాక్రా అక్కచెల్లెమ్మలను డిఫాల్టర్లుగా మార్చింది మీరు కాదా బాబూ? శిథిలమైన ఒక ప్రహరీ గోడ పక్కగా ఉదయం పాదయాత్ర సాగింది. ఒకప్పుడు ఘనచరిత్ర కలిగిన ఆమదాలవలస చక్కెర ఫ్యాక్టరీ అది. నేడు ఆ వైభవం గత చరిత్రగా మిగిలిపోయింది. ఆ పాపానికి బాబుగారే కారణమన్నారు.. రైతన్నలు. ఆయన గత హయాంలో కమీషన్ల కోసం కారుచౌకగా ఆ ఫ్యాక్టరీనే అమ్మేశారు. దానిపై రైతన్నలు న్యాయపోరాటం చేస్తే వారికి వ్యతిరేకంగా కోర్టులో కేసు నడిపిన ఘనత కూడా ఆయనదే. మళ్లీ మొన్న ఎన్నికల ముందు.. ఆమదాలవలస బహిరంగ సభలో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని, సహకార రంగంలో నడిపిస్తానని హామీ ఇచ్చారట. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన తర్వాత ఏరువాక కార్యక్రమంలో ఆ హామీని రైతన్నలు గుర్తు చేస్తే అది గడిచిపోయిన అధ్యాయమని నిర్లజ్జగా మాట్లాడారట. రంగులు మార్చే ఊసరవెల్లి కూడా ఈయనకు సాటిరాదేమో. కళాకారులకు, క్రీడాకారులకు ప్రసిద్ధి చెందిన కుగ్రామం.. ఊసవానిపేట. మృదంగంలో ఐదుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్న బంకుపల్లి శ్రీనివాసశర్మ కలిశాడు. మూడుసార్లు నాన్నగారి చేతుల మీదుగా అవార్డుల్ని, నగదు బహుమతిని అందుకున్నానని ఆనందంగా చెప్పాడు. ఆ ఫొటోలు కూడా చూపించాడు. ఇప్పుడు అలా గుర్తించేవారే లేకపోవడంతో కళ వైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారని వాపోయాడు. అదే గ్రామం కరణం మల్లీశ్వరి, నీలంశెట్టి లక్ష్మి లాంటి అంతర్జాతీయ స్థాయి వెయిట్లిఫ్టర్లను అందించింది. వారే కాకుండా ఈ ఆమదాలవలస ప్రాంతంలో గుర్తింపే లేని మట్టిలో మాణిక్యాలెన్నో ఉన్నాయట. పశువులశాలల్లోనే ప్రాక్టీస్ చేసి జాతీయ స్థాయిలో పతకాలందుకున్న వెయిట్‌లిఫ్టర్లూ ఉన్నారు. పేదరికమున్నా వారి తల్లిదండ్రులు పస్తులుండి మరీ పౌష్టికాహారం అందించారట. పాతికపైగా జాతీయ స్థాయి పతకాలు సాధించిన ఎందరో క్రీడాకారులు ప్రోత్సాహం లేక చిరు వ్యాపారాలు చేసుకుంటూ, తోపుడు బళ్ల మీద పండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారని తెలిసి చాలా బాధేసింది. ఆ క్రీడాకారులకు చిన్నపాటి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా అమ్మేసుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం పట్టెడన్నం సంపాదించలేని క్రీడలెందుకని వాటివైపు వెళ్లేవారే తక్కువైపోయారట. శ్రీకాకుళం, ఆమదాలవలసలకు వంశధార నీటిని అందించడానికి నాన్నగారు ఏర్పాటు చేసిన వయాడక్ట్‌ను చూశాను. కాలువ ద్వారా నీళ్లందించడానికి రైల్వే ట్రాక్ అడ్డుగా ఉండటంతో అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్ కింద నుంచి నీటిని తీసుకొచ్చే పథకం అది. మనసు ఉండాలే కానీ మార్గముంటుందనడానికి అది ఓ మంచి ఉదాహరణ. బాబుగారి రుణమాఫీ మోసానికి బలైన వెంకటాపురం డ్వాక్రా అక్కచెల్లెమ్మలు కలిశారు. ఆయన మాటలు నమ్మి అప్పు కట్టకపోవడంతో మొండి బకాయిదారులంటూ వారి పేర్లు బోర్డులపై రాసి పంచాయతీ కార్యాలయాల్లోనూ, బ్యాంకుల్లోనూ పెట్టారట. ఎగవేతదారులంటూ దండోరాలు కూడా వేయించారట. ఇంతకన్నా అమానుషం ఉంటుందా? కోర్టు నోటీసులూ ఇచ్చారట. ఇంటికొచ్చి మరీ అధికారులు వేధిస్తున్నారట. ‘మాఫీ చేయండని మేము అడిగామా? కట్టవద్దని బాబుగారే చెప్పి ఇప్పుడిలా అవమానించడం, వేధించడం న్యాయమా?’అని కన్నీటిపర్యంతమయ్యారు. ఇవి భరించలేక నాఅన్నవాళ్లెవరూ లేని తవిటమ్మ అవ్వ ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిందట. కేవలం తన ఒక్కడి స్వార్థం కోసం ఇంతమంది అక్కచెల్లెమ్మలను కన్నీరు పెట్టించడం ఎంత ఆటవికం? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రుణమాఫీ చేయాలని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు అడిగారా? అడగకుండానే రుణాలు కట్టవద్దండి.. అన్నీ మాఫీ చేసేస్తానని ప్రకటించి ఇంటింటికీ ప్రచారం చేయించింది మీరే కదా! అధికారంలోకి వచ్చాక మాఫీ చేయ కపోగా.. వారిని డిఫాల్టర్లుగా మార్చి, కొత్త రుణాలు పుట్టకుం డా చేసింది మీరు కాదా? వారి పేర్లను బోర్డులపై రాయించి.. బ్యాంకు నోటీసులు ఇప్పించి.. అవమానించడం ద్రోహం కాదా? - వైఎస్ జగన్ -
319వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,435.1 కిలోమీటర్లు 11–12–2018, మంగళవారం, కృష్ణాపురం, శ్రీకాకుళం జిల్లా. తెలంగాణ ఫలితాలు ఊసరవెల్లికి ఉండేలు దెబ్బల్లాంటివి.. ఈరోజు పాదయాత్ర ఆమదాలవలసలో సాగింది. వైఎస్సార్‌గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహా మా జీతాలు పెరిగింది లేదన్నారు.. అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది. బాబుగారొచ్చాక జీతాల మాట దేవుడెరుగు.. ఉద్యోగ భద్రతే కరువైందని బాధపడ్డారు. అర్బన్ హెల్త్ సెంటర్లను సీఎం ఆరోగ్య కేంద్రాలుగా మార్చి.. కమీషన్ల కోసం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారట. గతంలో ఒక్కో సెంటర్ నిర్వహణకు నెలకు రూ.66,700 ఇస్తే.. ఇప్పుడు దాదాపు ఆరు రెట్లు పెంచేసి ఏకంగా రూ.4.20 లక్షలు ఇస్తున్నారట. మరి ఉద్యోగుల జీతభత్యాలు పెరిగాయా అంటే ఒక్క పైసా పెరగకపోగా ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారట. మందులు, వైద్య సదుపాయాలన్నా మెరుగయ్యాయా అంటే పూర్తిగా పడిపోయాయట. మరి ఆ నిధులన్నీ ఎవరి జేబులు నింపుతున్నాయో అర్థం చేసుకోండంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.. సీపీఎస్ ఉద్యోగ సంఘం వారు. తెలంగాణ అసెంబ్లీలోనేమో సీపీఎస్‌ను ఎందుకు రద్దు చేయరని నిలదీస్తారు. ఇక్కడ మాత్రం నా పరిధిలో లేదంటారు. తెలంగాణలోనేమో సీపీఎస్‌ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెడతారు. ఇక్కడ మాత్రం రద్దు చేయాలని అడిగిన పాపానికి ఉద్యోగుల మీద కేసులు పెడతారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని గాంధీ జయంతి రోజు ధర్నా చేసినందుకు 26 మందిపై కేసులు పెట్టారట. వారిలో ఓ ఉద్యోగి తండ్రిగారైన 80 ఏళ్ల వృద్ధుడు సైతం ఉండటం చాలా బాధనిపించింది. రైతుల మీద, ఉద్యోగుల మీద, ప్రజల మీద ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గ పాలన కాక మరేమిటి? ఈరోజు పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఆత్రుతగా ఆరా తీస్తుండటం గమనించాను. పార్టీ పుట్టుక నుంచి వచ్చిన వైరాన్ని సైతం పక్కనపెట్టి, సిద్ధాంతాలకు.. విలువలకు నిస్సిగ్గుగా తిలోదకాలిచ్చి, అనైతిక.. అవకాశవాద పొత్తులతో, ఓటుకు కోట్లు తదితర అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి, ఆంధ్రాలో దోచిన వేల కోట్లతో తెలంగాణ ప్రజా తీర్పును కొనుగోలు చేయాలని చూసిన ఊసరవెల్లికి ఉండేలు దెబ్బలాంటిది.. తెలంగాణ ఎన్నికల ఫలితం. అవినీతి సొమ్ముతో, అనుకూల మీడియాతో ఏదైనా సాధించగలనని, ప్రజలను కొనేయగలనని విర్రవీగే నిరంకుశ నేతలకు చెంపపెట్టులాంటిది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఓటుకు కోట్లు కేసులో మీరే దొంగని తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ పార్టీలు పదేపదే మిమ్మల్ని విమర్శిస్తున్నా తేలుకుట్టిన దొంగలా నోరు మెదపకపోవడానికి కారణమేంటి? ఫిరా యింపు ఎమ్మెల్యేలను చిత్తుచిత్తుగా ఓడించండని తెలంగాణలో ప్రచారం చేసిన మీకు.. అదే మాట మన రాష్ట్రంలోనూ చెప్పగల నిజాయితీ, ధైర్యం ఉన్నాయా? - వైఎస్ జగన్ -
318వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,426.5 కిలోమీటర్లు 10–12–2018, సోమవారం, నందగిరిపేట, శ్రీకాకుళం జిల్లా. మత్స్యకారులకు వేట గిట్టుబాటు కాక వలసలు పెరిగిన మాట వాస్తవం కాదా బాబూ? ఈరోజు శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. వంజంగి గ్రామ రైతన్నలు కలిశారు. వంశధార ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు చెందిన 27వ డిస్ట్రిబ్యూటరీ నుంచి పిల్లకాలువను తవ్వకపోవడంతో తమ గ్రామంలోని నరసింగరావు చెరువుకు నీరందడం లేదన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. టీడీపీ నేతలు ఇక్కడి నాగావళి నదిలో ఇసుకే లేకుండా చేసేశారనేది దూసి గ్రామస్తుల ఆవేదన. భారీ యంత్రాలు పెట్టి నది మొత్తం తవ్వేశారని చెప్పారు. ఈ ఇసుక దాష్టీకాలతో నదిలోని రైల్వే బ్రిడ్జి మనుగడకే ముప్పు వాటిల్లిందన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోగా.. ఇసుక దొంగలకే వత్తాసు పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక రైల్వే ఉన్నతాధికారులు.. బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఏర్పడిందని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా చేశారట. హోంశాఖ తీవ్రంగా పరిగణించాక గానీ ఇసుక తవ్వకాలు ఆగలేదని తెలిపారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి బ్రిడ్జి ఇంకా ప్రమాదకర స్థితిలోనే ఉందన్నారు. అక్రమార్జన మత్తులో మునిగితేలుతున్న నేతలకు ప్రజల భద్రత గురించి ఆలోచన ఎందుకుంటుంది? నాలుగున్నరేళ్లుగా రైతన్నలు ఎంతగా ప్రాధేయపడ్డా చిన్నచిన్న పిల్ల కాలువలను కూడా తవ్వని నేతలు.. ప్రజలు వద్దని ఎంతగా మొరపెట్టుకున్నా ఇసుక కోసం రాత్రింబవళ్లు భారీ యంత్రాలు తెచ్చి నదులనే తవ్వేయడం విస్మయం కలిగిస్తోంది. మూతపడ్డ కాన్‌కాస్ట్ ఫ్యాక్టరీ కార్మికులు కలిశారు. ఆరు నెలలకుపైగా జీతాలివ్వక.. బకాయిలు చెల్లించక.. రాత్రికి రాత్రే అక్రమ లాకౌట్ ప్రకటించి తమ బతుకుల్ని రోడ్డున పడేశారని వాపోయారు. దాదాపు 700 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయన్నారు. ఈ ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేయడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఫ్యాక్టరీని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే చేసిన కుటిల యత్నాలే మూసివేతకు కారణమన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మత్స్యకారులు కలిశారు. పాకిస్తాన్ చెరలో ఉన్న తమ సోదర జాలర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వలసలు నివారించి ఇలాంటి దుస్థితి రాకుండా చూడాలని కోరారు. మత్స్యకారులపై ఈ ప్రభుత్వం మోసపూరిత నిర్లక్ష్యాన్ని చూపుతోందని వివరించారు. మరణించిన జాలర్లకు ఇచ్చిన పరిహారమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఈ నాలుగున్నరేళ్లలో 200 మందికిపైగా మత్స్యకారులు వేటకు వెళ్లి మరణిస్తే కనీసం పదిమందికి కూడా పరిహారం ఇచ్చిన పాపానపోలేదట. ఆ కొద్దిమంది కుటుంబాలకు కూడా బాబుగారు హామీ ఇచ్చినట్టుగా రూ.5 లక్షలు కాకుండా రూ.2 లక్షలే ఇచ్చారట. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ‘వేటకెళ్లే మత్స్యకారులకు 50 శాతం సబ్సిడీపై డీజిల్’అనే మీ మేనిఫెస్టోలోని హామీ ఏమైంది? సుదీర్ఘ తీర ప్రాంతం, అపార మత్స్య సంపద ఉన్నప్పటికీ మీరు అధికారం చేపట్టాకనే ప్రభుత్వ ప్రోత్సాహం లేక.. దళారీ వ్యవస్థ పెరిగిపోయి.. వేట గిట్టుబాటు కాక.. వలసలు పెరిగిన మాట వాస్తవం కాదా? - వైఎస్ జగన్ -
317వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,419.7 కిలోమీటర్లు 09–12–2018, ఆదివారం రాగోలు, శ్రీకాకుళం జిల్లా. ఏం పాపం చేశారని పేద ప్రజలపై ఈ కక్ష సాధింపు బాబూ? ఈరోజు ఉదయం బలగ ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించాను. ఇక్కడి రిమ్స్ ఆస్పత్రిని ‘బలగ పెద్దాస్పత్రి’గా కూడా పిలుస్తారట. వెనుకబడ్డ ఈ జిల్లాకు అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని నాన్నగారు ఏర్పాటు చేసిన సంస్థ.. రిమ్స్. ఆ రిమ్స్‌లో పనిచేసే వైద్యులు, నర్సింగ్, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ సిబ్బంది వచ్చి కలిశారు. రిమ్స్‌కు పట్టిన దుస్థితిని వివరించారు. ‘ఈ ప్రభుత్వం వచ్చాక నిధులు మంజూరు చేయడం లేదు.. సిబ్బందిని నియమించడం లేదు.. నిర్వహణ అసలు లేదు.. నాణ్యమైన వైద్యసేవలు అందడం లేదు.. దీంతో అన్ని కేసులూ ప్రైవేటు ఆస్పత్రులకు రిఫరల్ కేసులుగా వెళ్లిపోతున్నాయి.. వసతులు, సౌకర్యాలు, సరైన ప్రమాణాలు లేకపోవడంతో పీజీ కోర్సులు కూడా మంజూరు కావడం లేదు’ అని చెప్పారు. రిమ్స్ లక్ష్యమే నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నగారికి ఎక్కడ పేరొస్తుందోనన్న దుగ్ధతోనే ఈ వివక్ష చూపిస్తున్నారని బాధపడ్డారు. వెనుకబడ్డ మండలాల్లో గ్రామీణ పేద విద్యార్థులకు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆంగ్ల విద్యను అందించాలని ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లది కూడా రిమ్స్‌లాంటి దుస్థితే. ఈరోజు మోడల్ స్కూళ్ల టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కలిశారు. కార్పొరేటు స్కూళ్లకు లబ్ధి చేకూర్చాలని, వాటికి దీటుగా ఎదిగిన మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారని ఆక్రోశించారు. జీతాల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మోడల్ స్కూల్ కాన్సెప్టే మరుగునపడిపోతోందని వాపోయారు. పొన్నాడ సంజీవరావు అనే సోదరుడు తన ఇద్దరు ఆడబిడ్డల్ని ఎత్తుకుని వచ్చాడు. బంగారు తల్లి పథకం లబ్ధి తమకు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రిమ్స్ అయినా, మోడల్ స్కూల్స్ అయినా, బంగారు తల్లి వంటి పథకాలైనా.. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయనో, మరొకరికి పేరొస్తుందనో వాటిని నిర్లక్ష్యం చేయడం, వివక్ష చూపించడం దారుణం. ఏం పాపం చేశారని పేద ప్రజలపై ఈ కక్ష సాధింపు? బుడతవలసకు చెందిన డ్వాక్రా అక్కచెల్లెమ్మలు కలిశారు. పొదుపు సంఘాల నిధులను ఫోర్జరీ సంతకాలతో, తప్పుడు డాక్యుమెంట్లతో ఆ ఊళ్లోని అధికార పార్టీ నేతలు స్వాహా చేశారని గోడు వెళ్లబోసుకున్నారు. రుజువులతో సహా దొరికిపోయినా.. దోషులను మంత్రిగారే రక్షిస్తున్నారని చెప్పారు. ఓ వైపు పైస్థాయిలోనేమో రుణమాఫీ పేరుతో ఆయన మోసం చేశారు.. ఇక్కడ కిందస్థాయిలోనేమో తెలుగు తమ్ముళ్లు ఇలా దోచేస్తున్నారు.. ఇక మేము ఏమైపోవాలి అనేది ఆ అక్కచెల్లెమ్మల వ్యథ. ఈ రోజు నా భార్య భారతి జన్మదినం. ప్రజాసంకల్ప యాత్రలో ఏడాదికిపైగా నేను ప్రజాక్షేత్రంలోనే ఉండటంతో వరుసగా ఆమె రెండు పుట్టిన రోజులూ పాదయాత్రలోనే జరిగిపోవడం విశేషం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలు, రిమ్స్‌లాంటి ఆస్పత్రులు, సాగునీటి ప్రాజెక్టులు మొదలుకుని రాష్ట్ర ప్రజలకు అత్యంత ఉపయుక్తమైన అన్ని పథకాలను నాన్నగారి హయాంలో ఏర్పడ్డాయన్న ఏకైక కారణంతో నిర్లక్ష్యం చేయడం, నిర్వీర్యం చేస్తుండటం రాష్ట్ర ప్రజలకు చేస్తున్న తీరని ద్రోహం కాదా? - వైఎస్ జగన్ -
316వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,416.1 కిలోమీటర్లు 08–12–2018, శనివారం. ఆదివారంపేట, శ్రీకాకుళం జిల్లా. నోటికాడ కూటిని లాగేసుకుని.. పరమాన్నం పెడతాననేవాడిని నమ్మేదెలా?! ఈ రోజు ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. కుశాలపురం వద్ద.. నారాయణపురం కాలువ కళావిహీనంగా కనిపించింది. ఈ ఎచ్చెర్ల మండలంలో 3000 ఎకరాలకు నీరందించాల్సిన కాలువ పూర్తిగా ఎండిపోయింది. రైతన్నలపై ఈ పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. ఉదయం తేజ అనే యువ అథ్లెట్ కలిశాడు. 1500, 5000 మీటర్ల పరుగు పందేల్లో జాతీయ స్థాయిలో పాల్గొన్న ప్రతిభావంతుడు. ఈ ప్రభుత్వ హయాంలో క్రీడలకు పట్టిన దుస్థితి గురించి చెప్పాడు. ‘అన్నా.. శ్రీకాకుళం పట్టణంలో రెండు క్రీడామైదానాలుంటే.. రెండింటినీ పనికిరాకుండా చేశారు. కోడి రామ్మూర్తి స్టేడియాన్నీ.. ఆధునికీకరణ పేరుతో పడగొట్టి గాలికొదిలేశారు. ఆగస్టులో జరిగిన బాబుగారి పర్యటన ఏర్పాట్ల కోసం.. ఇక్కడి ఆర్ట్స్ కాలేజీకి చెందిన మరో మైదానాన్ని వాడుకుని పాడుచేశారు. మైదానమే లేకపోతే నాలాంటి వారు ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి? పోటీలను వదులుకోవాల్సిందేనా’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పేదరికం, వెనుకబాటుతనం ఎక్కువగా ఉన్నా.. ప్రతిభకు, సామర్థ్యానికి కొదువలేనిది సిక్కోలు జిల్లా. అరకొర సౌకర్యాల మధ్యనే అద్భుతాలు సృష్టించిన కోడి రామ్మూర్తి లాంటి యోధుడిని, కరణం మల్లీశ్వరిలాంటి ఒలింపియన్‌ను అందించిన గడ్డ ఇది. అలాంటి జిల్లాకు మరింత ప్రోత్సాహం అందించి.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాల్సిందిపోయి.. ఉన్న వసతుల్ని కూడా నాశనం చేసి, ప్రతిభావంతుల నైపుణ్యాన్ని సమాధి చేయడం చూస్తుంటే.. చాలా బాధేసింది. పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో రోడ్డుకిరువైపులా కూల్చేసిన ఇళ్లు, షాపులు కనిపించాయి. ఆ బాధితులొచ్చి కలిశారు. ఎన్నడూ లేని ఇబ్బంది.. ఈ పాలనలోనే వచ్చిందన్నారు. గత 30 ఏళ్లుగా వారంతా అక్కడే నివాసాలు ఏర్పర్చుకుని.. ఇంటి పన్ను, కరెంటు బిల్లులు కడుతూనే ఉన్నారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపించకుండా రాత్రికి రాత్రే ఇళ్లు, షాపులు కూల్చేశారట. ఎక్కడ బతకాలన్నా.. అంటూ కంటతడి పెడుతుంటే మనసుకు బాధేసింది. కూల్చేసినవారు.. అక్కడ పార్కులు ఏర్పాటుచేస్తామని చెప్పారట. నిజంగా ఎంత హాస్యాస్పదం! లక్షణంగా ఉన్న మైదానాలు, పార్కులను కబ్జా చేస్తున్న నేతలకు.. పార్కులను ఏర్పాటుచేసేంత గొప్ప మనసు ఉంటుందా? ఇళ్లే లేని నిరుపేదలకు ఆవాసం కల్పించాల్సిన ప్రభుత్వం.. బాధ్యతను విస్మరించి ఉన్న గూళ్లను చెదరగొట్టడం మానవత్వమేనా? నోటికాడ కూటిని లాగేసుకుని.. పరమాన్నం తెచ్చిపెడతాననేవాడిని నమ్మేదెలా?! హుద్‌హుద్ తుపాను బాధితులు కలిశారు. తమ పునరావాసం కోసం 50శాతం కేంద్ర నిధులతో శ్రీకాకుళం పట్టణంలో 192, రూరల్‌లో 288 ఇళ్లు కట్టి రెండేళ్లయినా ఏ ఒక్కరికీ ఇంకా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చనేతలు.. అసలైన లబ్ధిదారులను పక్కనపెట్టి, అనర్హులకు ఆ ఇళ్లను కేటాయిస్తామని ఆశచూపి ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని చెప్పారు. సర్వం కోల్పోయిన తుపాను బాధితుల్ని సైతం దోచుకుంటున్న వీరిని ఏమనాలి? వీరికన్నా రాబందులే నయమేమో! సాయంత్రం ఉత్తరాంధ్ర వరప్రదాయని నాగావళి నదిని దాటి అరసవల్లి క్షేత్రం వెలసిన శ్రీకాకుళంలోకి అడుగుపెట్టాను. పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభ తర్వాత బసకు చేరుకున్నాను. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని 3000 పాఠశాల మైదానాల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన రూ.150 కోట్లు ఏమయ్యాయి? వాటితో మీరు అభివృద్ధి చేసిన ఒక్క స్కూల్ గ్రౌండ్నయినా చూపగలరా? మీ ప్రచారార్భాట కార్యక్రమాల కోసం రాష్ట్రంలోనే ప్రధానమైన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం మొదలుకుని.. శ్రీకాకుళం మైదానం దాకా.. ఎన్నింటినో ఆడుకునే అవకాశం లేకుండా పాడుచేసిన మాట వాస్తవం కాదా? ఈ నాలుగున్నరేళ్లలో మీరు కొత్తగా కట్టిన.. లేదా అభివృద్ధిచేసిన ఒక్కటంటే ఒక్క క్రీడామైదానం కూడా లేకపోగా.. 1200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కడతాననడం.. ఎవర్నిమోసం చేయడానికి? - వైఎస్ జగన్ -
315వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,408 కిలోమీటర్లు 07–12–2018, శుక్రవారం. ఫరీద్‌పేట, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ భవనానికి ఒక్క ఇటుకైనా వేశావా బాబూ? ఈ రోజు ఎచ్చెర్ల మండలంలో పాదయాత్ర సాగింది. ఉదయం కేశవరెడ్డి స్కూలు వద్ద కలిసిన బాధితులు తమగోడు వినిపించారు. ఎస్ఎం.పురానికి చెందిన 80 ఏళ్ల భారతమ్మ అనే అవ్వకు భర్త చనిపోయాడు. ఆమె భర్త ప్రభుత్వోద్యోగి కావడంతో ఆమెకు పింఛన్ వస్తోంది. ఆమె కుమారుడు ఏ పనీ చేయలేని దివ్యాంగుడు. అటు కొడుక్కి, ఇటు మనవడికి ఆ అవ్వే దిక్కు. మనవడి చదువుకోసం మూడున్నర లక్షల రూపాయలు అప్పుచేసి కేశవరెడ్డి స్కూల్లో చేర్పించింది. బిడ్డ చదువు అయిపోగానే డిపాజిట్ సొమ్మంతా వస్తుందని చెప్పిన మేనేజ్మెంట్.. బోర్డు తిప్పేసింది. తెచ్చిన అప్పునకు వడ్డీలు కట్టలేక, ఇంటిని నడపలేక వృద్ధాప్యంలో తల్లడిల్లిపోతోంది. మరో కన్నీటి కథ అరుణమ్మది. తనకున్న చిన్నపాటి ఇంటిని తాకట్టు పెట్టి మరీ కొడుకును కేశవరెడ్డి స్కూల్లో చేర్పించింది. ఆ బిడ్డ పదో తరగతి పూర్తిచేసినా డిపాజిట్ సొమ్ము వెనక్కి రాలేదు. ఇంటిని విడిపించుకోలేక.. కొడుకును పైచదువులు చదివించుకోలేక నానా అవస్థలు పడుతోంది. ఎంతోమంది కడుపు కోత ఇది! కేశవరెడ్డి వల్ల అయినా, అగ్రిగోల్డ్ వల్ల అయినా లక్షల కుటుంబాలు యాతనపడుతున్నాయి. వారికి బాసటగా నిలిచి ఊరటనివ్వాల్సిన ప్రభుత్వం.. నిందితులకు కొమ్ముకాయడం, ప్రజల కష్టార్జితంపై కన్నేయడం అత్యంత దుర్మార్గం. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ప్రాంగణం పక్కనుంచే పాదయాత్ర సాగింది. కొద్దిమంది విద్యార్థులొచ్చి కలిశారు. బాబుగారు మూడేళ్ల కిందట శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని ఆర్భాటంగా ప్రకటించి.. ఒక్క ఇటుక కూడా వేయకపోవడంతో ఇప్పటి దాకా> నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే నడిపించారట. కాగా, ఎన్నికలొస్తున్నాయని హడావుడిగా 500 మంది రెండో సంవత్సరం విద్యార్థినులను ఇక్కడికి తరలించి.. ఇదివరకే నాన్నగారు కట్టిన ట్వంటీఫస్ట్ గురుకులం భవనాల్లో పెట్టారట. మరో 500 మంది విద్యార్థులను.. మూతబడ్డ ఓ ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఉంచారట. వసతుల్లేవని, సౌకర్యాలుండటం లేదని విద్యార్థులంతా ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మొదటి, మూడో సంవత్సరం విద్యార్థులింకా నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే ఉన్నారట. కేవలం మేమూ ఓ ట్రిపుల్ ఐటీ పెట్టామని అనిపించుకోవడానికి శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని ప్రకటించడం.. దానికోసం శ్రీకాకుళంలో ఒక్క ఇటుక కూడా వేయకుండా.. ఈ సంస్థను కూడా నూజివీడు ట్రిపుల్ ఐటీలోనే నిర్వహించడం.. వసతులు సరిపోక రెండు ట్రిపుల్ ఐటీల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులుపడటం.. తీరా ఎన్నికలొస్తున్నాయని హడావుడిగా కొద్దిమందిని శ్రీకాకుళానికి తరలించడం.. పిచ్చి చేష్టలుకాక మరేంటి? అనమిత్ర వద్ద రాజీవ్‌స్వగృహ లబ్ధిదారులు కలిశారు. నాన్నగారు మధ్య తరగతివారి సొంతింటి కలను నిజం చేయాలనుకున్నారు. ఆయన మరణమే వారికి శాపమైంది. ఏళ్లు గడిచినా ఇళ్లు పూర్తికాలేదు. ఓ వైపు.. పెరిగిపోతున్న అప్పుల భారం, మరోవైపు.. అద్దె ఇంటి భారం. సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినా ఫలితంలేక కోర్టును ఆశ్రయిస్తే చివరికి ఇళ్లు అప్పగించారట. ఆ ఇళ్లలో అన్నీ అరకొర పనులే జరిగాయని, ఎలాంటి మౌలిక వసతులూ లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్రిశంకు స్వర్గంలా ఉంది వారి పరిస్థితి. ఈ కష్టాలు చాలవన్నట్టు.. వారి ఇళ్లను ఆనుకునే ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వుకుపోతున్నారట పచ్చ నాయకులు. తమ ఇళ్ల మనుగడకే ప్రమాదమని భోరుమన్నారు బాధితులు. ప్రభుత్వాలు మారొచ్చు, పాలకులూ మారొచ్చు.. కానీ పథకాలను నిర్లక్ష్యం చేసి.. ప్రజలను ఇక్కట్ల పాల్జేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గ్రామీణ పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్నత విద్యనందించడమే ట్రిపుల్ ఐటీల లక్ష్యం. కాగా.. భవనాలే నిర్మించకుండా, వసతులు కల్పించకుండా, సరైన సిబ్బందిని నియమించకుండా, విద్యాప్రమాణాలే పాటించకుండా.. కేవలం ప్రచారం కోసం ట్రిపుట్ ఐటీలను ప్రారంభించడం.. పేద విద్యార్థుల భవిష్యత్తును çపణంగా పెట్టడం కాదా? - వైఎస్ జగన్ -
314వ రోజు పాదయాత్ర డైరీ..
భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తపించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి పాదయాత్ర మొదలుపెట్టాను. నాన్నగారు ఆ మహనీయుడి పేరు మీద ఎచ్చెర్లలో యూనివర్సిటీ ఏర్పాటుచేయడం గొప్పగా అనిపించింది. సాయంత్రం ఆ యూనివర్సిటీ ఎదురుగా వెళుతున్నప్పుడు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఎంతో ఆత్మీయంగా స్వాగతించారు. సిబ్బందిని కూడా నియమించని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం.. యూనివర్సిటీని కళావిహీనం చేసిందని వాపోయారు. ఉదయం అంబేడ్కర్ సేవా సమితి, జై భీమ్ యువజన సంఘం ప్రతినిధులు తదితరులు కలిశారు. కొద్ది నెలల కిందట కొత్తవలస గ్రామంలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి అపచారం చేసిన విషయం చెప్పారు. కనిమెట్ట ఎస్సీ కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరైనప్పటికీ అభివృద్ధి పనులు జరక్కుండా జన్మభూమి కమిటీలు అడ్డుకున్నాయని తెలిపారు. 30కి పైగా ఎస్సీ కుటుంబాలు నాలుగు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న ఐదెకరాల భూమిని నీరు–చెట్టు పేరుతో జన్మభూమి కమిటీలు తవ్వేశాయని, చెరువులో కలిపేశాయని ముషినివలస గ్రామస్తులు మండిపడ్డారు. అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురవడం, ఆయన విగ్రహాలకు అపచారం జరగడం, గ్రామగ్రామానా జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా అరాచకాలు చేస్తుండటం, పాలించేవారు రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేసేలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడం.. ఇవన్నీ చూస్తుంటే ఇదేనా రాజ్యాంగాన్ని రచించిన ఆ మహనీయుడికి ఇచ్చే నివాళి.. అనిపించింది. తిత్లీ దెబ్బకు తీవ్ర నష్టం వాటిల్లినా ఈ ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలేదని లోలుగు వద్ద కుమ్మరులు వాపోయారు. తమ గ్రామాల వద్దనున్న కెమికల్ ఫ్యాక్టరీ వదిలే వ్యర్థాలు జీవితాలను కబళించి వేస్తున్నాయని కేశవదాసుపురం, నర్సాపురం అగ్రహారం గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. నీరు కలుషితమై కిడ్నీ, క్యాన్సర్ తదితర జబ్బులు ప్రబలుతున్నాయన్నారు. భూములు నిస్సారమైపోతున్నాయని వాపోయారు. వైఎస్సార్ అంటే వల్లమాలిన అభిమానం.. ఆయనే మా నిజమైన హీరో.. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 పథకాలు మా రాష్ట్రంలోనూ అమలుచేస్తున్నారంటూ సంబరపడ్డారు.. ఒడిశా నుంచి వచ్చి నన్ను కలిసిన యువకులు. నాన్నగారి పథకాలు దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందడం, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం చాలా గర్వంగా అనిపించింది. జన్మభూమి కమిటీల అరాచకాలకు, పాలక నేతల కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా నిలిచిన ఘటన ఈ రోజు నా దృష్టికొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. పొందూరు మండలంలో 880 మందికి అన్ని అర్హతలున్నా నిర్దాక్షిణ్యంగా పింఛన్లు పీకేశారట. మంచానికే పరిమితమైపోయిన దివ్యాంగులకు సైతం వైకల్యమే లేదనడం.. బతికి ఉన్న వాళ్లను కూడా చనిపోయినట్టు చూపించడం.. భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతువులకు భర్తలు బతికే ఉన్నారంటూ పింఛన్లు పీకేయడం ఎంత దారుణం! ‘నేను చనిపోలేదు బతికే ఉన్నా’ అని పింఛన్ కోల్పోయిన అమ్మణ్ణమ్మ అనే అవ్వ కోర్టుకు పోయి మొరపెట్టుకోవాల్సి వచ్చింది. భర్త చనిపోయినా.. నువ్వు వితంతువు కాదంటూ మెట్ట లక్ష్మి అనే సోదరి పింఛన్‌ను ఆపేశారు. ‘ఈ పింఛన్ అక్కర్లేదు.. నా భర్తను చూపెట్టండి చాలు’.. అంటూ న్యాయమూర్తిని వేడుకుందట ఆ అభాగ్యురాలు. ఇలాంటి కేసులన్నీ విన్న న్యాయమూర్తులు దిగ్భ్రాంతికి గురై ప్రభుత్వానికి అక్షింతలు వేశారట. కోర్టును ఆశ్రయించిన 498 మందికి బకాయిలతో సహా పింఛన్లు ఇవ్వాలని ఆదేశించారట. ఈ పాలకులకు ఇది చెంపపెట్టే. పింఛనే జీవనాధారంగా బతికే నిరుపేదల కడుపుకొట్టడం న్యాయమేనా? ఈ న్యాయపోరాటం సాగుతున్న సమయంలోనే 40 మంది లబ్ధిదారులు చనిపోయారట. వారి జీవనాధారమైన పింఛన్ ఆపేసి వారి ఉసురు తీసిన ప్రభుత్వానిదే బాధ్యత కాదా? వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని జిల్లాల్లో వేలాది మంది కోర్టుకెళ్లి తమకు నిలిపేసిన పింఛన్లు తెచ్చుకోవడం మీకు సిగ్గుచేటైన విషయం కాదా? కోర్టుకెళ్లలేని నిస్సహాయులు లక్షల్లో ఉండటం వాస్తవం కాదా? ఇదిలా ఉంటే.. సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇచ్చేశామని చెప్పుకోవడం ఆత్మవంచన కాదా? అర్హత ఉండి.. పింఛన్లు రానివారెవ్వరూ లేరని ప్రచారం చేయడం.. ఎవర్ని మోసం చేయడానికి? -
314వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,400.7 కిలోమీటర్లు 06–12–2018, గురువారం ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా నాన్నగారి పథకాలు దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందడం గర్వంగా అనిపించింది.. భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తపించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి పాదయాత్ర మొదలుపెట్టాను. నాన్నగారు ఆ మహనీయుడి పేరు మీద ఎచ్చెర్లలో యూనివర్సిటీ ఏర్పాటుచేయడం గొప్పగా అనిపించింది. సాయంత్రం ఆ యూనివర్సిటీ ఎదురుగా వెళుతున్నప్పుడు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఎంతో ఆత్మీయంగా స్వాగతించారు.సిబ్బందిని కూడా నియమించని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం.. యూనివర్సిటీని కళావిహీనం చేసిందని వాపోయారు. ఉదయం అంబేడ్కర్ సేవా సమితి, జై భీమ్ యువజన సంఘం ప్రతినిధులు తదితరులు కలిశారు. కొద్ది నెలల కిందట కొత్తవలస గ్రామంలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి అపచారం చేసిన విషయం చెప్పారు. కనిమెట్ట ఎస్సీ కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మంజూరైనప్పటికీ అభివృద్ధి పనులు జరక్కుండా జన్మభూమి కమిటీలు అడ్డుకున్నాయని తెలిపారు. 30కి పైగా ఎస్సీ కుటుంబాలు నాలుగు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న ఐదెకరాల భూమిని నీరు–చెట్టు పేరుతో జన్మభూమి కమిటీలు తవ్వేశాయని, చెరువులో కలిపేశాయని ముషినివలస గ్రామస్తులు మండిపడ్డారు. అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్లక్ష్యానికి గురవడం, ఆయన విగ్రహాలకు అపచారం జరగడం, గ్రామగ్రామానా జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా అరాచకాలు చేస్తుండటం, పాలించేవారు రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేసేలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడం.. ఇవన్నీ చూస్తుంటే ఇదేనా రాజ్యాంగాన్ని రచించిన ఆ మహనీయుడికి ఇచ్చే నివాళి.. అనిపించింది. తిత్లీ దెబ్బకు తీవ్ర నష్టం వాటిల్లినా ఈ ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలేదని లోలుగు వద్ద కుమ్మరులు వాపోయారు. తమ గ్రామాల వద్దనున్న కెమికల్ ఫ్యాక్టరీ వదిలే వ్యర్థాలు జీవితాలను కబళించి వేస్తున్నాయని కేశవదాసుపురం, నర్సాపురం అగ్రహారం గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. నీరు కలుషితమై కిడ్నీ, క్యాన్సర్ తదితర జబ్బులు ప్రబలుతున్నాయన్నారు. భూములు నిస్సారమైపోతున్నాయని వాపోయారు. వైఎస్సార్ అంటే వల్లమాలిన అభిమానం.. ఆయనే మా నిజమైన హీరో.. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 పథకాలు మా రాష్ట్రంలోనూ అమలుచేస్తున్నారంటూ సంబరపడ్డారు.. ఒడిశా నుంచి వచ్చి నన్ను కలిసిన యువకులు. నాన్నగారి పథకాలు దేశవిదేశాల్లో ప్రాచుర్యం పొందడం, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం చాలా గర్వంగా అనిపించింది. జన్మభూమి కమిటీల అరాచకాలకు, పాలక నేతల కక్ష సాధింపు చర్యలకు పరాకాష్టగా నిలిచిన ఘటన ఈ రోజు నా దృష్టికొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే.. పొందూరు మండలంలో 880 మందికి అన్ని అర్హతలున్నా నిర్దాక్షిణ్యంగా పింఛన్లు పీకేశారట. మంచానికే పరిమితమైపోయిన దివ్యాంగులకు సైతం వైకల్యమే లేదనడం.. బతికి ఉన్న వాళ్లను కూడా చనిపోయినట్టు చూపించడం.. భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతువులకు భర్తలు బతికే ఉన్నారంటూ పింఛన్లు పీకేయడం ఎంత దారుణం! ‘నేను చనిపోలేదు బతికే ఉన్నా’అని పింఛన్ కోల్పోయిన అమ్మణ్ణమ్మ అనే అవ్వ కోర్టుకు పోయి మొరపెట్టుకోవాల్సి వచ్చింది. భర్త చనిపోయినా.. నువ్వు వితంతువు కాదంటూ మెట్ట లక్ష్మి అనే సోదరి పింఛన్‌ను ఆపేశారు. ‘ఈ పింఛన్ అక్కర్లేదు.. నా భర్తను చూపెట్టండి చాలు’.. అంటూ న్యాయమూర్తిని వేడుకుందట ఆ అభాగ్యురాలు. ఇలాంటి కేసులన్నీ విన్న న్యాయమూర్తులు దిగ్భ్రాంతికి గురై ప్రభుత్వానికి అక్షింతలు వేశారట. కోర్టును ఆశ్రయించిన 498 మందికి బకాయిలతో సహా పింఛన్లు ఇవ్వాలని ఆదేశించారట. ఈ పాలకులకు ఇది చెంపపెట్టే. పింఛనే జీవనాధారంగా బతికే నిరుపేదల కడుపుకొట్టడం న్యాయమేనా? ఈ న్యాయపోరాటం సాగుతున్న సమయంలోనే 40 మంది లబ్ధిదారులు చనిపోయారట. వారి జీవనాధారమైన పింఛన్ ఆపేసి వారి ఉసురు తీసిన ప్రభుత్వానిదే బాధ్యత కాదా? వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని జిల్లాల్లో వేలాది మంది కోర్టుకెళ్లి తమకు నిలిపేసిన పింఛన్లు తెచ్చుకోవడం మీకు సిగ్గుచేటైన విషయం కాదా? కోర్టుకెళ్లలేని నిస్సహాయులు లక్షల్లో ఉండటం వాస్తవం కాదా? ఇదిలా ఉంటే.. సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇచ్చేశామని చెప్పుకోవడం ఆత్మవంచన కాదా? అర్హత ఉండి.. పింఛన్లు రానివారెవ్వరూ లేరని ప్రచారం చేయడం.. ఎవర్ని మోసం చేయడానికి? -
313వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,390.3 కిలోమీటర్లు 05–12–2018, బుధవారం రెడ్డిపేట, శ్రీకాకుళం జిల్లా బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సంక్షేమం అరచేతిలో స్వర్గమేనా?! ఈ రోజు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ధవళపేట వద్ద ప్రారంభమైన పాదయాత్ర పొందూరు వద్ద ఆమదాలవలస నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పొందూరు అనగానే ఖద్దరు గుర్తుకొస్తుంది. అది ఒక వృత్తి మాత్రమే కాదు.. ఓఅద్భుతమైన కళ. జాతిపిత మహాత్మాగాంధీ నుంచి.. ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ నేతల్ని ఆకట్టుకున్న ఘనత కలిగినది. నాన్నగారికి కూడా పొందూరు ఖద్దరంటే చాలా ఇష్టం. ఆ ఖద్దరు ఇప్పుడు కళ తప్పింది. పనికి తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో ఎంతోమంది వృత్తిని మానేసి వలస బాట పడుతున్నారని ఉదయం కలిసిన ఖాదీ కార్మికులు చెప్పారు. కాసింతైనా ప్రోత్సాహం అందివ్వని ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే.. ఆ కళ అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆమదాలవలస.. కరణం మల్లీశ్వరిలాంటి ఎంతోమంది అంతర్జాతీయ మహిళా వెయిట్ లిఫ్టర్లను అందించిన ప్రాంతం. క్రీడా ప్రతిభకు కొదవే లేదు. ప్రభుత్వ ప్రోత్సాహమే కరువైంది. ఇదే విషయాన్ని ఈ రోజు నన్ను కలిసిన అన్మిష్‌వర్మ అనే సోదరుడు కూడా చెప్పాడు. ఈ యువకుడు అక్టోబర్‌లో ఏథెన్స్లో జరిగిన వరల్డ్ కిక్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెలిచాడట. ప్రభుత్వం నుంచి ఏ కాస్త ప్రోత్సాహం ఉన్నా.. తనలాంటి ఎంతోమంది చాంపియన్లు తయారవుతారని చెప్పాడు. ఈ రోజు ఆనందాపురం, వాండ్రంగి, రాపాక.. ఇలా అన్ని చోట్లా ఎంతోమంది స్కూళ్లకు వెళ్లే విద్యార్థినులు కలిశారు. చాలా ఊళ్లకు రహదారులే లేవన్నారు. మొన్నటి పాలకొండ, నిన్నటి ఎచ్చెర్ల, నేటి ఆమదాలవలస.. ఎక్కడ చూసినా చాలా గ్రామాల రహదారులు అధ్వానంగా ఉన్నాయని చెబుతూనే ఉన్నారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు చెబుతోందీ ప్రభుత్వం. మరి ఆ నిధులన్నీ ఏమవుతున్నాయో.. ఎక్కడికి పోతున్నాయో! తమకు స్కాలర్షిప్పులు రావడం లేదని చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులు చెప్పారు. ఏ మూలకూ చాలదన్నట్టు.. వారికిచ్చేదే ఏడాదికి దాదాపు రూ.2 వేలు. అవి కూడా ఎగ్గొడితే ఏమనుకోవాలి?! ఏటా బడ్జెట్లో చూపెడుతున్న బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సంక్షేమం అరచేతిలో స్వర్గమేనా? రెల్లుగడ్డపై కోట్లాది రూపాయలతో కట్టిన చెక్ డ్యామ్ మూడు నెలలకే కొట్టుకుపోయిందని తాడివలస గ్రామస్తులు చెప్పారు. అధికార నేతల విచ్చలవిడి అవినీతికి ఇది నిదర్శనమన్నారు. నాన్నగారి హయాంలో నిధులు మంజూరవడంతో సగానికి పైగా మడ్డువలస ఫేజ్–2 విస్తరణ పనులు పూర్తయినా.. బాబుగారొచ్చాక మిగిలిన పనులు అటకెక్కాయని పొందూరు మండల రైతన్నలు చెప్పారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందకున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దురదృష్టకరం. మరోవైపు మడ్డువలస కుడి ప్రధాన కాలువకు నీరే రావడం లేదని జీసిగడాం రైతన్నలు చెప్పారు. నీరు–చెట్టు పేరుతో కోట్లు దోచేశారే తప్ప.. కాలువ లైనింగ్ పనులు, మరమ్మతులు చేయకపోవడమే దీనికి కారణమన్నారు. ఈ సర్కారు తీరు ఇలా ఉంటే.. రైతన్నలు వ్యవసాయాన్ని వదిలేసి ఇటుక బట్టీలు, కోళ్లఫారాల వైపు, వలసల వైపు మొగ్గు చూపక మరేం చేయగలరు? ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.. బలసలరేవు వంతెన. దాదాపు 80 గ్రామాలకు 40 కిలోమీటర్ల మేర దూరాభారాన్ని తగ్గిస్తుందని వంతెన సాధన సమితి సభ్యులు చెప్పారు. ఆ వంతెన గతంలో బాబుగారిచ్చిన హామీ. దాని కోసం ప్రజలు 650 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నారట. ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలక నేతల స్వార్థ ప్రయోజనాలే ఈ వంతెన నిర్మాణానికి అడ్డంకిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులందరికీ ప్రతినెలా ఠంచన్‌గా స్కాలర్షిప్పులు చెల్లిస్తానని గొప్పగా చెప్పారు. అది చేయకపోగా.. ఆ తర్వాత మూడు నెలలకోసారి ఇస్తామని అధికారులతో చెప్పించారు.. అదీ జరగలేదు. చాలామందికి సంవత్సరానికి కూడా ఇచ్చిన దాఖలాల్లేకపోవడం వాస్తవం కాదా? మీరు అధికారం చేపట్టాక అసలు స్కాలర్షిప్పే రాలేదంటున్న ఎంతోమంది పేద విద్యార్థులకు ఏం సమాధానంచెబుతారు? - వైఎస్ జగన్ -
312వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడిచిన దూరం: 3,380.8 కిలోమీటర్లు 04–12–2018, మంగళవారం, సంతవురిటి, శ్రీకాకుళం జిల్లా. ‘సంక్షోభంలో సైతం అవకాశాలు వెతుక్కోవడం’ అంటే ఇదేనా బాబూ? ‘తన కోసం తపించేవాడు.. సామాన్యుడు. పరుల కోసం జీవించేవాడు.. మహనీయుడు’ అన్నారు.. పెద్దలు. నిరంతరం ప్రజల కోసం పడ్డ తపనే నాన్నగారిని కోట్లాది మనసుల్లో చిరస్థాయిగా నిలిపింది. కొండంపేటకు చెందిన జ్యోతిర్మయి, రేష్మ, రూప తదితర చెల్లెమ్మలు కలిశారు. నాన్నగారి జ్ఞాపకార్థం ఆ గ్రామస్తులు ఏటా వేసవిలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు పెడుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెబుతుంటే చాలా సంతోషమేసింది. అవధులు లేని అభిమానం భక్తిగానూ మారింది. దేవుడిలా వరాలిచ్చిన నాన్నగారికి గుడి కట్టుకున్నామన్నారు.. కోదులగుమ్మడ గ్రామ స్తులు. ఉపాధి కూలీలు, స్వయం సహాయక సంఘాల విరాళాలతో, శ్రమదానంతో ఆలయం వెలసిందట. పదిమందికి మంచి చేసి వారి గుండెల్లో స్థానం పొందడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది? పేదరికమే పెద్ద శాపం. ఆ పై పెద్ద జబ్బు చేస్తే.. ఏలినవారి నుంచి ఏ సాయం అందకపోతే.. ఆ అభాగ్యుల జీవితాలు ఎంతలా విలవిల్లాడిపోతాయో! పొగిరి గ్రామానికి చెందిన గౌరునాయుడు అనే సోదరుడు 18 ఏళ్ల క్రితమే పదో తరగతిలో 80 శాతానికి పైగా మార్కులు తెచ్చుకుని పాఠశాలలో ప్రథముడిగా నిలిచాడట. కానీ పై చదువులు చదివే స్తోమత లేక పెయింటింగ్ పనులు, కూలి పనుల్లోనే జీవనోపాధి వెతుక్కున్నాడు. ఇప్పుడు అతని బిడ్డకు తలసీమియా జబ్బట. నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించాలి.. మందులూ కొనాలి. వాటికే రూ.3 వేల వరకు ఖర్చవుతోందట. ‘రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులో.. ఈ కష్టం తలకు మించిన భారమైంది.. కనీసం రక్తమైనా ఉచితంగా అందిస్తే బాగుండేది’ అని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అదే పొగిరి గ్రామానికి చెందిన మరో సోదరి.. హెచ్ఐవీ బాధితురాలు. ఆ జబ్బుతోనే భర్త చనిపోయాడట. తనకు న్యాయంగా రావాల్సిన పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా వంకలు పెట్టి ఇవ్వడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకన్నా దయనీయ స్థితి ఉంటుందా? జగన్నాథపురానికి చెందిన షిరిడి సాయి, నటరాజు, శివశక్తి డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలు కలిశారు. అందరూ దళిత మహిళలే. కూలినాలి చేసుకుంటూ సక్రమంగా రుణం తీర్చుకుంటున్నవారే. బాబుగారి రుణమాఫీ మాటలు నమ్మి కట్టడం ఆపేశారట. వడ్డీల మీద వడ్డీలు పడి అప్పు తడిసి మోపెడైంది. బ్యాంకువాళ్లు నోటీసులు ఇచ్చారట. దాచుకున్న పొదుపు డబ్బంతా వడ్డీలకే జమ అయిపోయిందట. అప్పుగా ఇచ్చిన పసుపు, కుంకుమల డబ్బు వడ్డీ భారాన్ని ఇంకాస్త పెంచింది. సాఫీగా బతుకుతున్న మమ్మల్ని మోసం చేసి, వేధింపులకు గురిచేసిన బాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆవేదనలో అర్థం ఉంది. అవమానాలపాలు చేసిన బాబుగారిది ద్రోహం కాక మరేమిటి? సాయంత్రం పాలఖండ్యాంకు చెందిన రమణారావు అనే కౌలు రైతు కలిశాడు. హుద్‌హుద్ తుపానప్పుడు పంట మొత్తం కోల్పోయాడట. నష్టపరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రకటించిన లిస్టులో తన పేరు ఉండటం చూసి సంబరపడ్డాడు. ఏళ్లు గడిచినా ఒక్క పైసా జమైంది లేదు. అధికారుల చుట్టూ, కలెక్టర్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. దానికైన ఖర్చే పరిహారం కన్నా ఎక్కువైందని వాపోయాడు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. తుపానులు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలలో సైతం ఏ సహాయం అందించకపోయినా.. ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడము, రాజకీయ స్వార్థం చూసుకోవడము, నిధులు దోచుకోవడము ధర్మమేనా? మీరు తరచూ చెప్పే.. ‘సంక్షోభంలో సైతం అవ కాశాలు వెతుక్కోవడం’ అంటే ఇదేనా? - వైఎస్ జగన్ -
311వ రోజు పాదయాత్ర డైరీ
03–12–2018, సోమవారం అంతకాపల్లి, శ్రీకాకుళం జిల్లా 108, 104 పథకాలు కూడా అక్రమాదాయ మార్గాలుగా మారడం శోచనీయం ఈ రోజు పాదయాత్ర రేగిడి, రాజాం మండలాల్లో సాగింది. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ఉదయం రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిశారు. నాతో కేక్ కట్చేయించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. అదే సమయంలో తమ బాధల్ని, తమకు జరిగిన మోసాలను వివరించారు. ఆ సంఘం అధ్యక్షుడు సగం గుండు గీయించుకుని.. మీసం, గడ్డం సగం తీయించుకుని వచ్చాడు. ఇదేంటన్నా అంటే.. దివ్యాంగులకు బాబుగారు చేసిన మోసానికి నిరసన అన్నాడు. బాబుగారు దివ్యాంగ దినోత్సవం నాడు ఇచ్చిన హామీలకే దిక్కులేదన్నాడు. మేనిఫెస్టోలోని హామీలు ఎప్పుడో మర్చిపోయాడని చెప్పాడు. రెండు కాళ్లు, రెండు చేతులు పూర్తిగాలేని సాయిబాబు అనే అభాగ్యుడిని ఎత్తుకుని గతంలో అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి.. సాయం కోసం అర్థించారట. వారిచ్చిన వినతిపై రూ.లక్ష సాయం రాశారట బాబుగారు. ఇప్పుటికి తొమ్మిది నెలలైనా రూపాయి కూడా ఇచ్చిన పాపానపోలేదన్నారు. ముఖ్యమంత్రిని నాలుగుసార్లు కలసినా ఫలితం కనిపించలేదని చెప్పారు. బాబుగారిని కలిసి సాయం అడుగుతున్న ఫొటోలను కూడా చూపించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే తను మాటిచ్చిన.. కేవలం రూ.లక్ష సాయం కూడా ఇవ్వకపోవడమన్నది దారుణం కాదా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో 104 ఉద్యోగులు కలుస్తూనే ఉన్నారు. ఈ రోజు ఆ సిబ్బందితో పాటు అందులో పనిచేసే వైద్యులు కలిశారు. ‘పేదలకు ఇంటి వద్దే వైద్యం’.. అనే 104 ఆశయమే నీరుగారి మొక్కుబడి కార్యక్రమంగా మారిందన్నారు. 104లో నాసిరకం మందులిస్తున్నారని.. కానీ వాటిని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. పరికరాల కొనుగోలులోనూ అక్రమాలేనట. ప్రయివేటు ఆస్పత్రుల్లోని పరికరాలు ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. వాటికన్నా అధిక ధరలు పెట్టి కొంటున్న 104లోని పరికరాలు మాత్రం రెండు నెలలకే మూలన పడుతున్నాయని చెప్పారు. ఈ ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలకు మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతోందని ఆ డాక్టర్లు చెబుతుంటే చాలా బాధేసింది. ఇసుక, మట్టి, నీరే కాదు.. ఆఖరికి పేదల మందులు, వైద్యంలో కూడా దోపిడీ సాగుతుండటం క్షమించరాని నేరం. 108, 104 వంటి ఉదాత్త పథకాలు కూడా అక్రమాదాయ మార్గాలుగా మారిపోవడం శోచనీయం. ఇండిట్రేడ్ పేరుతో ఈ నియోజకవర్గంలో వెలసిన ఓ బోగస్ కంపెనీ బారినపడ్డ బాధితులు కలిశారు. ఆ కంపెనీ చేసిన మోసాలలో పాత్రధారులు, సూత్రధారులందరూ టీడీపీ నాయకులేనన్నారు. తెలుగుదేశంవారే ఆ బోగస్ కంపెనీకి బ్రోకర్లుగా పనిచేసి, అధిక వడ్డీల ఆశచూపి ప్రజల నుంచి కోట్ల డిపాజిట్లు సేకరించారట. అలా వందల కోట్లు సేకరించి బోర్డు తిప్పేశారట. ప్రభుత్వాధినేతలే నిందితుల్ని వెనకేసుకొస్తుంటే ఇక మాకు న్యాయం ఎలా జరుగుతుంది.. అని ప్రశ్నించారు. తూతూమంత్రంగా సీఐడీ దర్యాప్తునకు ఆదేశించి ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేదని, ఒక్క రూపాయీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ప్రభుత్వ పెద్దల లాలూచీ వ్యవహారమని చెప్పారు. ఆ బాధితుల్లో దాసరి సావిత్రమ్మ అనే అక్క కూడా ఉంది. ఆమె భర్త.. తన కొడుకును ఎంబీబీఎస్ చదివించడం కోసం పొలం అమ్మగా వచ్చిన రూ.20 లక్షలను ఆ సంస్థలో డిపాజిట్ చేశాడట. సంస్థ మోసం చేయడంతో మానసిక క్షోభకు గురై 45 ఏళ్ల వయసుకే గుండెపోటుతో చనిపోయాడని ఆ తల్లి కంటతడి పెట్టింది. ఇదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు కూడా ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు పోవడంతో గుండె ఆగి మరణించారట.. చాలా బాధనిపించింది. అగ్రిగోల్డ్ మొదలుకుని కేశవరెడ్డి విద్యాసంస్థలు, ఇండిట్రేడ్ దాకా సీఐడీ దర్యాప్తు జరుగుతున్నా డిపాజిట్‌దారులకు ఒక్క రూపాయి కూడా రాకపోవడం.. దోషులెవరికీ శిక్ష పడకపోవడం.. ఓ వైపు ప్రభుత్వ పెద్దలే నిందితుల్ని కాపాడుతూ సంస్థ ఆస్తులను కాజేస్తుండటం.. మరోవైపు న్యాయం అడిగిన బాధితులపై ముఖ్యమంత్రే చేయిచేసుకునే స్థాయికి దిగజారడం చూసి ఆశ్చర్యమేసింది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గత నాలుగేళ్లలో దివ్యాంగుల దినోత్సవాల సందర్భంగా మీరిచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? కాగా నేడు ఎన్నికల ముందు హడావుడి.. మరోమారు దివ్యాంగులను మోసపుచ్చడానికే కాదా? మీ మేనిఫెస్టోలో కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య మొదలుకుని.. ప్రత్యేక మంత్రిత్వశాఖ వరకు దివ్యాంగుల సంక్షేమం కోసమంటూ పది హామీలిచ్చారు.. కనీసం గుర్తయినా ఉన్నాయా? - వైఎస్ జగన్ -
310వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,360.5 కిలోమీటర్లు 02–12–2018, ఆదివారం, బూరాడ, శ్రీకాకుళం జిల్లా. ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇచ్చి అదే ఆదరణ అంటే సరిపోతుందా బాబూ? ఈ రోజంతా రేగిడి మండలంలోనే పాదయాత్ర సాగింది. పేదల బతుకుల్ని అంధకారం చేస్తున్న పాలకుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. సంక్షేమం తెలియని సర్కారు జనజీవితాలపై చూపే దుష్ప్రభావాన్ని చూశాను. కన్నీళ్లు పెట్టే కిడ్నీ బాధితులు.. జీవితాలు బూడిదవుతున్న ఇటుకబట్టీదారుల దయనీయ గాథలు.. ఛిద్రమైన జాలర్ల బతుకులు.. సాయం కోసం నా వద్దకు వచ్చాయి. అంబకండి గ్రామంలో ఆరేడేళ్లుగా కిడ్నీ సమస్యలు విజృంభిస్తున్నాయట. ఇవాళ నన్ను కలిసిన ఓ పదిహేనుమంది బాధితుల మాటల్లో గుండె తరుక్కుపోయే బాధ కనిపించింది. పాలకుల నిర్లక్ష్యంతో కిడ్నీ సమస్యకు పరిష్కారమే లభించలేదని చెప్పారు. ఇప్పటికే 20 మందిని కిడ్నీ రోగం పొట్టనపెట్టుకుందని వాపోయారు. మరో 40 మంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వమే దీనికి ప్రథమ కారణమన్నారు. తాగునీరే కిడ్నీలను గుల్ల చేస్తోందని నిపుణులు చెప్పినా వినిపించుకోవడం లేదన్నారు. ప్రాణాలు హరించుకుపోతున్నా.. బోర్లు, బావుల్లోని నీరే దిక్కని చెప్పారు. రక్షిత మంచినీటి కోసం ఊరు ఊరంతా ఏళ్ల తరబడి ఇస్తున్న అర్జీలకు దిక్కే లేకుండా పోయిందని బాధపడ్డారు. వింటుంటే చాలా బాధనిపించింది. పేదవాడి ప్రాణాలు కాపాడేందుకు కనీసం గుక్కెడు రక్షిత మంచినీరు కూడా ఈ సర్కార్ ఇవ్వలేదా? లేక ఇవ్వాలని లేదా? ఉదయం అంతా ఇటుక బట్టీల మధ్య నుంచే సాగింది.. యాత్ర. బట్టీదారుల కష్టాలు విన్నాను. వారంతా ఒకప్పుడు నేలతల్లిని నమ్ముకున్న సన్న, చిన్నకారు రైతులేనట. సాగునీరు లేక, వర్షపు చినుకులు రాక వ్యవసాయాన్ని వదిలేసినవారే. పొలాలను బీళ్లుగా పెట్టి.. బట్టీలవైపు బతుకుదారి పట్టినా బావుకున్నదేమీ లేదని బావురుమన్నారు. అప్పుల మీద అప్పులు తెచ్చి బట్టీలు పెట్టినా.. ఆదాయం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. కులవృత్తికి ఆదరణ లేక ఎందరో కుమ్మరులు ఆ ఇటుక బట్టీలలో కూలీలుగా మారడం బాధనిపించింది. బుల్లిబాబు అనే రైతన్న అనుభవం ప్రభుత్వ వంచనకు అద్దం పట్టింది. బంగారం తాకట్టుపెట్టి పంట రుణం తీసుకున్నాడట. బాబుగారి రుణమాఫీ దెబ్బకు ఆ బంగారాన్ని బ్యాంకువాళ్లు వేలం వేసేశారట. విధిలేక పొలం వదిలి ఇటుక బట్టీ పెట్టుకున్నానని చెప్పాడు. బుల్లిబాబే కాదు.. చంద్రబాబు మోసానికి బలికాని రైతన్నే లేడనడం అతిశయోక్తి కాదేమో! బిక్కుబిక్కుమని బతుకుతున్న ఎచ్చెర్ల మండలానికి చెందిన తొమ్మిది జాలర్ల కుటుంబాల మహిళలు సాయం కోరుతూ నన్ను కలిశారు. ఉపాధి కరువై బతుకు భారమైన దుస్థితిని వివరించారు. వలసల బాట.. సముద్రపు వేట జాలర్ల బతుకుల్లో కల్లోలం రేపుతున్న పరిస్థితిని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనంతగా డీజిల్ ధరలు పెంచితే వేట ఎలా గిట్టుబాటవుతుందని ప్రశ్నించారు. భారమైన తమ బతుకులకు ఈ సర్కార్ ఇసుమంతైనా సాయం చేయడం లేదని కళ్లనీళ్లు పెట్టుకున్నారు. బోట్లు ఇవ్వరు.. పనిముట్లు ఇచ్చిన పాపానపోలేదు.. వలలు ఇచ్చిందీ లేదు.. నిషేధ సమయంలో పస్తులున్నా సాయం చేసిన దిక్కే లేదు.. ప్రకృతి వైపరీత్యాలు జాలర్ల బతుకులను కమ్మేస్తున్నా ప్రభుత్వ సాయం ఇసుమంతైనా లేదని తెలిపారు. అడ్డగోలుగా వచ్చిన పరిశ్రమలు విడిచే కాలుష్యంతోచేపలూ తగ్గాయట. జట్టీలు లేకపోవడం, దళారీల రాజ్యం ఇక్కట్లపాలు చేస్తోందట. పొద్దంతా వేటకెళ్లినా పొట్టపోసుకోవడం కష్టమవుతోందట. బతకలేక.. చావలేక పెళ్లాం, పిల్లల్ని వదిలేసి చేపలవేట కోసం గుజరాత్ వలస వెళ్లిపోయారని చెప్పారు. గీత దాటారని పాకిస్థాన్ సైన్యం పట్టుకెళ్తే సమాచారం కూడా అందడం లేదన్నారు. తిరిగొచ్చేదాకా నమ్మకం లేదని బావురుమన్నారు. ఈ చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు ఏ మాత్రం చేయూతనిచ్చి ఉన్నా ఈ వలస బాధలు ఉండేవికావు.. ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని తెలిపారు. నిజమే.. ఏ ఒక్క కులానికైనా కాస్తంతైనా మంచి చేయాలనే ఆలోచన ఏ కోశానా లేని ఈ ప్రభుత్వ వైఖరే ఈ దుస్థితికి మూలకారణం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. బలహీనవర్గాల వారిని ఎన్నికల వేళ మభ్యపెట్టి ఓటుబ్యాంకుగా వాడుకోవడమే తప్ప వారి సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి మీ ప్రభుత్వం తీసుకున్న నిర్మాణాత్మక చర్య ఒక్కటైనా ఉందా? నాలుగున్నరేళ్లుగా మీరు మరిచిపోయిన బీసీలు.. ఎన్నికలనగానే మూడు నెలల ముందు గుర్తుకొచ్చారా? ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు వంటి వస్తువులు ఇచ్చి అదే ఆదరణ అంటే సరిపోతుందా? కమీషన్లకు కక్కుర్తిపడి అధిక ధరలకు నాసిరకం పనిముట్లను సరఫరా చేస్తున్నారంటున్న లబ్ధిదారులకు ఏం సమాధానం చెబుతారు? - వైఎస్ జగన్ -
309వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,352.3 కిలోమీటర్లు 01–12–2018, శనివారం ఉంగరాడమెట్ట, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పెద్దలే ఇసుక మాఫియాను నడిపిస్తుంటే..వారి అనుచరులను అనుకుని ఏం లాభం?! ఈ రోజు పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఉదయం శిబిరం వద్ద ఆదిలక్ష్మి అనే చెల్లెమ్మ కలిసింది. నిరుపేద యాదవ కుటుంబం ఆమెది. ఆమె తండ్రి గతేడాది ఎద్దు పొడవడంతో చనిపోయాడు. ఐదుగురు ఆడబిడ్డలున్న ఆ కుటుంబం పరిస్థితి దుర్భరంగా మారింది. కాస్తోకూస్తో ఆదుకుంటుందనుకున్న చంద్రన్న బీమా ఇప్పటిదాకా రాలేదంది. చేతిలో బాండ్ ఉన్నా.. ప్రయోజనమేంటని ఆవేదన వ్యక్తం చేసింది. పేద కుటుంబాన్ని ఆదుకోని పథకాలెందుకు? పథకాలన్నీ కేవలం ప్రచారానికేనా! విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జీవనాధారమైన నాగావళి నదిని దాటి రాజాం నియోజకవర్గంలోకి అడుగుపెట్టాను. ఈ రాజాం ప్రాంతం.. పౌరుషానికి మారుపేరైన తాండ్ర పాపారాయుడు ఏలినగడ్డ. సంకిలి గ్రామం వద్ద సత్యవతి అనే అవ్వ నాతోపాటు అడుగులేసింది. కేవలం ఐదో తరగతి చదివిన ఆ 70 ఏళ్ల అవ్వ.. ఈ పాలనలోని సంక్షేమ పథకాల డొల్లతనాన్ని అనర్గళంగా వివరించడం ఆశ్చర్యం కలిగించింది. అదే గ్రామంలో కలిసిన అక్కచెల్లెమ్మలు.. ఆ ఊళ్లో మద్యం రేపిన చిచ్చుకు పార్వతమ్మ కుటుంబం ఛిద్రమైపోయిందని చెప్పారు. ఆమె భర్త, కుమారుడు మద్యం మహమ్మారికి బలైపోయారని తెలిపారు. అది భరించలేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుందన్నారు. ‘అన్నా.. ఇకపై ఏ కుటుంబం ఇలా బలికాకుండా మద్యం లేకుండా చేయండి’అంటూ విన్నవించారు. ఇసుక తవ్వకాల వల్ల నదీ ప్రవాహ దిశ మారిపోయి.. పంటపొలాలు కోతకు గురవుతున్నాయని రేగిడి గ్రామస్తులు చెప్పారు. ముంపు కూడా ఎక్కువైందన్నారు. నాగావళి నదిలో ఉండే ఇన్‌ఫిల్టర్ బావులే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల దాహార్తి తీరుస్తున్నాయి. ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో వాటి మనుగడకే ప్రమాదమేర్పడిందన్నారు. ఆ గ్రామానికే చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి కుటుంబ సభ్యులే ఇసుక తవ్వకాలు చేస్తుంటే.. ఇక ఆపేవారెవరని ఆవేదన వ్యక్తం చేశారు. సులభంగా వచ్చే దోపిడీ సొమ్ముకు అలవాటుపడ్డ ఈ నాయకులకు.. ప్రజల గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచన ఎందుకుంటుంది? అయినా ప్రభుత్వ పెద్దలే ఇసుక మాఫియాను నడిపిస్తుంటే.. వారి అనుచరులను అనుకుని ఏం లాభం? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? కంచరాం నుంచి దోసరి గ్రామానికి మధ్య ఉన్న రోడ్డు పరిస్థితి అతి దారుణంగా ఉందని రాజాం మండల యువకులు చెప్పారు. ఏడు గ్రామాలకు ఆధారమైన ఆ రోడ్డు గురించి నాలుగేళ్లుగా మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. ఇసుక కోసం రాత్రికి రాత్రే నదుల్లోకి రోడ్లేసుకుంటున్న నాయకులు.. రోడ్డులేక ఏళ్లకొద్దీ యాతనపడుతున్న ప్రజల గురించి కాస్తయినా పట్టించుకోకపోవడం శోచనీయం. మధ్యాహ్నం సంకిలి వద్ద ఉన్న చక్కెర ఫ్యాక్టరీ పక్క నుంచి పాదయాత్ర సాగింది. రైతులు ట్రాక్టర్లలో చెరకును తరలిస్తుండటం కనిపించింది. ఇలాంటి వెనుకబడిన జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమల అవసరం ఎంతైనా ఉందనిపించింది. అక్కడ కలిసిన చెరకు రైతులు.. ప్రభుత్వ మద్దతు ధర ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. కూలి ఖర్చులు కూడా గిట్టుబాటు కావడంలేదన్నారు. గతంలో ఈ జిల్లాలో రెండు చక్కెర ఫ్యాక్టరీలుండేవని చెప్పారు. చంద్రబాబు పుణ్యమాని సహకార చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందన్నారు. ఇప్పుడు ప్రయివేటు ఫ్యాక్టరీ మాత్రమే ఉండటంతో వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని వాపోయారు. మరోవైపు వెబ్‌ల్యాండ్‌లోని అవకతవకలు తమ తలరాతల్ని మార్చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి శిబిరానికి ముందున్న ఉంగరాడమెట్ట.. అప్పడాలకు చాలా ప్రసిద్ధి. ఆ ఊళ్లోని దాదాపు 200 కుటుంబాల అక్కచెల్లెమ్మలకు అదే ఆధారమట. ఈ అప్పడాలు ఇతర రాష్ట్రాలకు సైతం సరఫరా అవుతాయట. ప్రభుత్వ ప్రోత్సాహం ఏమాత్రం లేదని ఆ అక్కచెల్లెమ్మలు చెప్పారు. కాస్త చేయూతనిస్తే.. ఆ కుటీర పరిశ్రమ బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు ప్రవేశపెట్టిన వెబ్‌ల్యాండ్ విధానం ప్రజలకేమాత్రం ఉపయోగపడకపోగా.. రైతన్నలకు మరింత అభద్రత కలిగిస్తుండటం వాస్తవం కాదా? ఈ విధానం మీ, మీ అనుయాయుల భూదోపిడీకి సాధనంగా మారిందంటున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? -వైఎస్ జగన్ -
308వ రోజు పాదయాత్ర డైరీ
(ఇప్పటి వరకు నడిచిన దూరం 3,343.2 కిలోమీటర్లు) 28–11–2018, బుధవారం పాలకొండ, శ్రీకాకుళం జిల్లా మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా బాబూ? బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడిన సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావ్‌పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించాను. పల్లె ప్రజల పాటలు, సంప్రదాయ నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. వెన్నెలా వెన్నెలా.. అంటూ రైతు కూలీ అక్కచెల్లెమ్మలు పాడిన పాట ఆహ్లాదాన్నిచ్చింది. 80 ఏళ్ల అవ్వ పోలమ్మ నాతో పాటు నడుస్తూ నృత్యం చేయడం హుషారు కలిగించింది. గిరిజన గ్రామాల నుంచి వచ్చిన జనం ప్రసిద్ధిచెందిన సీతంపేట పైనాపిల్‌లను పట్టుకొచ్చారు. తమకు పరిహారమే ఇవ్వడం లేదని, కాస్తోకూస్తో ఇస్తున్న చోట.. పార్టీ వివక్ష చూపుతున్నారని తిత్లీ బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయకుండా సంస్థ ఆస్తులను కొట్టేయాలని చూస్తున్నారని అగ్రిగోల్డ్ బాధితులు బావురుమన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకొచ్చాక మోసం చేశారని గిరిజన ఆశ్రమ ఉపాధ్యాయులు, రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. మాట తప్పారని వెలుగు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 108 సర్వీసుల దుస్థితి, పాలకొండ పెద్దాస్పత్రి పరిస్థితి చూస్తుంటే.. సర్కారీ వైద్యం మీద రోజురోజుకు ప్రజలెందుకు విశ్వాసం కోల్పోతున్నారో అర్థమైంది. 108 అంటేనే వైఎస్సార్ గుర్తుకొస్తారన్న దుగ్ధతో ఆ పథకాన్ని మసకబార్చడమే కాకుండా.. అంబులెన్స్ సేవలను సైతం ప్రయివేటువారికి అప్పజెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాలన ఇలా కొనసాగితే.. ప్రజారోగ్య వ్యవస్థే ప్రయివేటుపరమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకొండ పెద్దాస్పత్రి నరకానికి నకలుగా నిలిచిందని అక్కచెల్లెమ్మలు వాపోయారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవమైతే పారితోషికం ఇవ్వాలి.. కానీ, పాలకొండ పెద్దాస్పత్రికి ప్రసవానికి వెళితే.. ఎదురు లంచం ఇవ్వాల్సివస్తోందని బాధపడ్డారు. ఆ ఆస్పత్రిలో వైద్యసేవలు అందవు.. మందులూ ఉండవు. సౌకర్యాలూ శూన్యమే. ఏ కేసైనా రిఫరలే. 13 మండలాలకు చెందిన గిరిజనులకు, నిరుపేదలకు ప్రధానాధారమైన ఆస్పత్రే ఇంత అధ్వానంగా ఉంటే ఎలా? అత్యవసరమైనప్పుడు ఆస్పత్రికి రావాలన్నా.. ఆస్పత్రి నుంచి రిఫరల్‌పై మరో ఆస్పత్రికి వెళ్లాలన్నా.. అంబులెన్స్ సౌకర్యమే లేకపోతే ప్రజలు ఏమైపోవాలి? ఈ రోజు మధ్యాహ్నం పాదయాత్రలో వైఎస్సార్ కూడలి వద్ద.. తాగునీటి పైపుల నుంచి నీరు ఫౌంటేన్‌లా ఎగజిమ్మడం చూశాను. ఇలా అనేక చోట్ల ఎన్నో రోజులుగా నీరు లీకవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు మొరపెట్టుకున్నారు. రంగుమారి.. కలుషితమైన నీటిని గతిలేక తాగి రోగాలబారిన పడుతున్నామన్నారు. గతంలో ఇలాగే కలుషిత నీరు తాగి.. నగర పంచాయతీలోని ఎన్కే రాజపురంలో నీలాపు గిరిదేవి, చంద్రకళ అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారట. పాలకొండ నగర పంచాయతీ నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తోంది. కనీస సౌకర్యాలకు గతిలేకున్నా పన్నుల పేరిట ప్రజలను పిండేస్తున్నారట. మరి ఆ ప్రజాధనమంతా ఏమైపోతోంది? ఎవరి జేబుల్లోకి వెళ్లిపోతోంది? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. 108 అంటే వైఎస్సార్ గుర్తుకొస్తారు. ఆరోగ్యశ్రీ అన్నా వైఎస్సారే గుర్తొస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ అన్నా ఆయనే గుర్తొస్తారు. ఇలా తరాలు మారినా మరువలేని పథకాలు ఎన్నెన్నో ఉన్నాయి. మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా? -వైఎస్ జగన్ -
307వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,333.9 కి.మీ 27–11–2018, మంగళవారం, అట్టలి, శ్రీకాకుళం జిల్లా. మీ పాపాల్ని అధికారులపై నెట్టేయడం న్యాయమా బాబూ? విజయనగరం జిల్లాలో పాదయాత్ర సాగుతున్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా సీతంపేటకు చెందిన శ్రావణ సంధ్య, ప్రసాద్ దంపతులు తమ మూడు నెలల బిడ్డతో వచ్చి కలిశారు. ఆ చిన్నారికి పుట్టుకతోనే మెదడుకు సంబంధించిన జబ్బు. వెంటనే వైద్యమందకపోతే ప్రాణహాని ఉందని వైద్యులు చెప్పారట. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.12 లక్షలు ఖర్చు అవుతుందని అన్నారట. ఆరోగ్యశ్రీ వర్తించలేదట. చేయించుకునే స్తోమత లేదు. చూస్తూ చూస్తూ కన్నబిడ్డను వదులుకోలేరు. వారి కష్టం కదిలించింది. వైద్యసాయం పొందిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గానికి వచ్చి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు. మనసుకు చాలా సంతోషమనిపించింది. మధ్యాహ్నం శిబిరం దగ్గర కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. 86 ఏళ్ల పింగళి విఠలేశ్వరరావు అనే పెద్దాయన వచ్చి కలిశారు. ఆయనకు 2007లో గుండెజబ్బు వచ్చిందట. ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదు. ఆ సమయంలో నాన్నగారి చలవతో కార్పొరేట్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ ఉచితంగా జరిగిందని, ఛార్జీలు, మందుల భారం కూడా మీద పడనీయలేదని నాన్నగారిని పదేపదే గుర్తు చేసుకున్నారు. ఆ పెద్దాయన వీఏవోగా పనిచేసి రిటైర్ అయ్యారట. ఈరోజు తనకు వస్తున్న పెన్షన్ కూడా నాన్నగారి పుణ్యమేనని చెప్పారు. నన్ను కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చానన్నారు. ఇలాంటి అనుభవాలే జీవితంలో అంతులేని తృప్తినిస్తాయి. తన మనవరాళ్లిద్దరికీ బాలికా సంరక్షణ పథకం కింద ఇచ్చిన బాండ్లు ఇప్పుడు పనికి రావంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. శీరాపు సత్యం అనే పెద్దాయన. తన బిడ్డకు బంగారు తల్లి పథకం కింద డబ్బు జమ అవ్వడం లేదని పాపంపేటకు చెందిన ధనలక్ష్మి వాపోయింది. బాలికల సంరక్షణ కోసం ఉద్దేశించిన ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఈ పాలనలో లేకపోవడం దారుణమైన విషయం. చట్టబద్ధమైన పాత పథకాలను సైతం తీసివేసి.. కొత్త పథకాలేవీ వర్తింపజేయకపోవడం ద్రోహం కాక మరేమిటి? ఈ రోజు మధ్యాహ్నం శిబిరానికి 13 జిల్లాల నుంచి వచ్చిన ముస్లిం మైనార్టీలు కలిశారు. పాదయాత్ర విజయవంతం కావాలని, నేను క్షేమంగా ఉండాలని కోరుతూ దువా చేశారు. మక్కా నుంచి తెచ్చిన పవిత్ర ‘ఆబే జంజం’జలాలను తాగించారు. నా పట్ల, నా కుటుంబం పట్ల ఆ సోదరులు చూపిన ప్రేమ మరువలేనిది. వండవ గ్రామంలో తమలపాకు రైతులు కలిశారు. ఆ పంటను దేవతల పంట అంటారట. ఎంతో నిష్టతో సాగు చేస్తారట. కానీ ఆ దేవతల పంట గిట్టుబాటు ధరకు మాత్రం దేవుడే దిక్కని వాపోయే పరిస్థితి ఎదురైందని ఆవేదన చెందారు. చెరువులు, కొండలే కాదు.. ఆఖరుకు ప్రభుత్వ పాఠశాలలు కూడా కబ్జాకు గురవుతుండటం బాధాకరం. ఎనిమిదో తరగతి చదువుతున్న తెట్టంగి పాఠశాల విద్యార్థినులు కలిశారు. తమ పాఠశాలకు చెందిన ఐదు ఎకరాల్లో నాలుగు ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని వాపోయారు. ఆట స్థలమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది సెప్టెంబర్ 11న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఈ తెట్టంగి నుంచే ప్రారంభించారట బాబుగారు. పాఠశాలను కబ్జాకోరల నుంచి వెలికితీస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారట. అంతేకాకుండా తెట్టంగిని ఆదర్శ గ్రామంగా ప్రకటించి ఇంటింటికీ కుళాయిలు, రోడ్లు, ఆస్పత్రి, ఇళ్లు, డ్రైనేజీలు అంటూ అర చేతిలో స్వర్గం చూపారట. ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గ్రామస్తులు చెబుతుంటే పెద్దగా ఆశ్చర్యమనిపించలేదు. ఎందుకంటే అది బాబుగారి సహజ లక్షణమే కదా. ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి, అన్నీ చేసేశాను.. అండగా ఉండండి అని ప్రజలను కోరడం విడ్డూరం కాదా? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అధికారులు చేసే తప్పులతో.. ప్రభుత్వంపై అసంతృప్తి పెంచుకోవద్దు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాకు అండగా ఉండండి అని ప్రజలను కోరుతున్నారు. పాపాలన్నీ మీరు చేసి నెపాన్ని అధికారులపై నెట్టివేయడం న్యాయమేనా? గొప్పలు మీవి.. తప్పులు అధికారులు, ప్రజలవా? -వైఎస్ జగన్ -
306వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,322.9 కి.మీ 26–11–2018, సోమవారం యు.వెంకమ్మపేట, శ్రీకాకుళం జిల్లా ఎన్నికలకు ముందు శిలాఫలకాలేయడం.. తర్వాత గాలికొదిలేయడం బాబుగారికి అలవాటే ఈ రోజు పాదయాత్ర దారంతా వేలాదిమంది ఆత్మీయజనంతో కిక్కిరిసి పోయింది. ఎంతోమంది గిరిజన సోదరులు, అక్కచెల్లెమ్మలు అడుగులో అడుగులేశారు. సంప్రదాయ థింసా నృత్యంతో స్వాగతం పలికారు. స్వచ్ఛమైన వారి ప్రేమకు మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఉదయం కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాల్లో పూజలుచేసి వచ్చిన ఎంతోమంది అక్కచెల్లెమ్మలు కలిశారు. ఎన్నికల ముందొక మాట.. తర్వాత ఒక మాట. ఆంధ్రాలో ఒక మాట.. తెలంగాణలో ఒక మాట.. ఇదీ బాబుగారి రెండు నాల్కల ధోరణి అన్నారు.. సీపీఎస్ రద్దు చేయాలని కోరేందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాలవారు. తెలంగాణ అసెంబ్లీలోనేమో తన పార్టీ ఎమ్మెల్యేతో సీపీఎస్‌ను ఎందుకు రద్దు చేయరంటూ అడిగిస్తారు. ఆంధ్రాలో అడిగితేనేమో రాష్ట్ర పరిధిలో లేని అంశమంటూ తప్పించుకుంటారు. తెలంగాణలోనేమో.. అధికారంలోకి వస్తూనే సీపీఎస్ రద్దుచేసి తీరుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అధికారంలో ఉన్న ఆంధ్రాలో మాత్రం ఎన్ని ఆందోళనలు చేసినా రద్దు చేయరు. ఇది మోసం కాదా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తోటపల్లి ఎడమ కాలువ ఆధునికీకరణ చేయకపోవడంతో నీళ్లందడం లేదన్నారు.. నడుకూరు వద్ద కలిసిన రైతన్నలు. ఆ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన మాత్రం చేసి చేతులు దులుపుకొన్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు శిలాఫలకాలేయడం.. తర్వాత గాలికొదిలేయడం బాబుగారికి అలవాటే. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు.. వేసిన శిలాఫలకాలు.. ప్రకటనలు, ప్రచారానికైన ఖర్చుతో ప్రాజెక్టుల పిల్లకాలువ పనులను పూర్తిచేయొచ్చు. డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ప్రసన్న అనే సోదరి.. పాదయాత్ర మొదలైనప్పటి నుంచి నేటి దాకా పత్రికల్లో వచ్చిన ఫొటోలను అతికించిన పుస్తకాలను తెచ్చి చూపింది. పాదయాత్ర పూర్తయిన 12 జిల్లాలకు ప్రతీకగా 12 పుస్తకాలను పూర్తిచేసింది. అంకిత అనే గిరిజన బాలిక.. పార్టీ గుర్తయిన ఫ్యాన్‌తో కూడిన ఒక అందమైన చెక్కబొమ్మను బహూకరించింది. దానిపై నాన్నగారి ఫొటో, నా ఫొటో అతికించింది. వారి ఆప్యాయత ఎంతగానో ఆకట్టుకుంది. వీరఘట్టంలోకి ప్రవేశించగానే.. ప్రముఖ మల్లయోధుడు, ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ్మూర్తినాయుడుగారు గుర్తొచ్చారు. కూరగాయలకు ఈ వీరఘట్టం చాలా ప్రసిద్ధి. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం రవాణా అవుతాయి. మమ్మల్ని బీసీలలో చేర్చి.. సబ్సిడీ కింద కిరోసిన్ మోటార్లిచ్చి.. మీ నాన్నగారు ఎంతగానో ఆదరించారని కూరాకుల కులస్తులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవులు, హిందువులు కులమతాలకతీతంగా ఆరాధించే మరియగిరి పుణ్యక్షేత్రం సమీపానే నేటి రాత్రి బస. ఇదే ప్రాంతంలో సోదరి షర్మిల సైతం పాదయాత్రలో బస చేయడం విశేషం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాటి తోటపల్లి, హంద్రీ–నీవా మొదలుకుని.. నేటి గోదావరి–పెన్నా అనుసంధానం వరకు ప్రతిదీ కేవలం ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టడానికే కాదా? ప్రాజెక్టులకన్నా మీరు వేసిన శిలాఫలకాలే ఎక్కువగా ఉన్నది నిజం కాదా? నాలుగున్నరేళ్లు ఏ మాత్రం పట్టించుకోకుండా.. ఎన్నికలకు ముందు హడావుడిగా సాగునీటి ప్రాజెక్టులను ప్రకటించడం.. కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సులను మీ బినామీ కాంట్రాక్టర్లకిచ్చి.. కమీషన్లు దండుకోడానికే కాదా? -వైఎస్ జగన్ -
305వ రోజు పాదయాత్ర డైరీ
25–11–2018, ఆదివారం నడిమికెల్ల, శ్రీకాకుళం జిల్లా మీ సహచరుడు బ్యాంకుల్లో రూ.6 వేల కోట్లు లూఠీ చేయడంపై ఏం సమాధానం చెబుతారు బాబూ? విజయనగరం జిల్లాలో పాదయాత్ర ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర 12 జిల్లాల్లో పూర్తయింది. విజయనగరం పాదయాత్ర ఎన్నో అనుభవాలు, అనుభూతులను మిగిల్చింది. పాదయాత్ర 3,000 కిలోమీటర్లకు చేరుకుంది.. 300వ రోజు జరుపుకొందీ ఇక్కడే. గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయలో వేసిన తొలి అడుగుకు.. ఈ నవంబర్ 6తో ఏడాదికాలం పూర్తయిందీ ఈ జిల్లాలోనే. అధికారం కోసం ఎంతకైనా దిగజారి.. ఆఖరికి ప్రతిపక్ష నేతను భౌతికంగా తుదముట్టించడానికి సైతం సిద్ధపడ్డ కుటిల రాజకీయాలు బహిర్గతమైందీ ఈ జిల్లా పాదయాత్ర సందర్భంగానే. ఇవన్నీ ఒక ఎత్తయితే.. అత్యంత వెనుకబడ్డ ఈ జిల్లాలో ప్రజలు చూపిన ప్రేమాభిమానాలు జీవితాంతం మరువలేనివి. నాన్నగారి మీద కృతజ్ఞతాభావం అడుగడుగునా అగుపించింది. సహకార చక్కెర ఫ్యాక్టరీని ఆదుకున్నందుకు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినందుకు, సంక్షేమాన్ని అందరికీ పంచినందుకు.. నాన్నగారిని పదే పదే తలుచుకున్నారు ఈ జిల్లా ప్రజలు. మళ్లీ ఇప్పుడు 2003 నాటి దుర్భర పరిస్థితులు దాపురించాయి. ఒకప్పుడు జిల్లాకు వెన్నెముకగా నిలిచిన జూటు మిల్లులు, చక్కెర ఫ్యాక్టరీలు, ఫెర్రోఅల్లాయ్ పరిశ్రమలు దీనావస్థలో ఉన్నాయి. వీటిపై ఆధారపడ్డవారి బతుకులు బిక్కుబిక్కుమంటున్నాయి. మిగిలిపోయిన కాస్త పనులూ పూర్తికాని ప్రాజెక్టులు.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నాయి. అడుగడుగునా కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు.. జిల్లాను వణికించేసిన విషజ్వరాల పీడితులు.. పాలక పెద్దల స్వార్థ ప్రయోజనాలను, ప్రభుత్వ వైఫల్యాన్ని పట్టిచూపారు. 15 ఏళ్ల నాటి వలస దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. గిరిశిఖర గ్రామమైన జరడ గ్రామస్తులు కలిశారు. తిత్లీ తుపాను దెబ్బకు ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయని, మూతపడ్డ గిరిజన ఆశ్రమ పాఠశాలలోనే తలదాచుకుంటున్నామని చెప్పారు. ఆ పాఠశాలను మూసేసిన ఘనత కూడా బాబుగారిదేనట. గరుగుబిల్లి మండలంలోని వివిధ గ్రామాల యువత కలిసింది. ఏ గ్రామంలోనూ గ్రంథాలయం లేకున్నా.. ఇంటి పన్నుతో పాటు గ్రంథాలయ పన్నునూ వసూలు చేస్తున్నారని చెప్పారు. తులసివలసకు చెందిన ఉషారాణిది దయనీయ గాథ.. మరొకరి సాయం లేకుండా అడుగు కూడా వేయలేని దివ్యాంగురాలు ఆ సోదరి. మద్యానికి బానిసైన ఆమె తండ్రి.. రోగగ్రస్తుడై ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాడు. తల్లి కూలి పనులకుపోతూ ఐదుగురు కుటుంబ సభ్యులను సాకుతోంది. అమ్మ కష్టాలు చూడలేక చేయూతగా ఉండాలనుకుంది. ఎస్సీ కార్పొరేషన్ లోనైనా తెచ్చుకుని కిరాణా కొట్టు పెట్టుకోవాలనుకుంది. గత నాలుగేళ్లుగా లోనుకు దరఖాస్తు చేస్తూ అధికారులు, నేతల చుట్టూ తిరుగుతున్నా.. కనికరించడం లేదని కన్నీరు పెట్టుకుంది. ఓ వైపు, నిజాయితీగా జీవనోపాధి కోసం లక్ష రూపాయల లోను ఇవ్వాలని వేడుకుంటున్నా.. అన్ని అర్హతలున్నా.. దివ్యాంగురాలైన దళిత సోదరికి మొండిచెయ్యే ఎదురవుతోంది. మరోవైపు, ఎగ్గొట్టి దోచుకోవడం కోసమే రుణాలడిగే అధికార పార్టీ అగ్రనేతలకు ఏ అర్హతా లేకున్నా.. వేల కోట్ల బ్యాంకు రుణాలు మంజూరవుతున్నాయి.. ఇది విస్తుగొలిపే విషయం. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టాను. 15 సంవత్సరాల కిందట నాన్నగారు.. ఐదేళ్ల కిందట సోదరి షర్మిల.. తమ పాదయాత్రల్లో భాగంగా తొలి అడుగు వేసిన వీరఘట్టం మండలం నుంచే నా సిక్కోలు యాత్ర మొదలైంది. శతాబ్దాల ఘనచరిత్ర ఉన్న ఉద్యమ ఖిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా ప్రజలు.. అంతులేని అభిమానాన్ని చూపుతూ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు చేసిన మోసానికి బలైన డ్వాక్రా అక్కచెల్లెమ్మలను.. ఏ పాపం చెయ్యకపోయినా నిర్దాక్షిణ్యంగా కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారే.. మరి మీ అత్యంత సన్నిహిత సహచరుడు.. మీ బినామీగా ప్రజలందరూ భావిస్తున్న వ్యక్తి.. మీరు పట్టుబట్టి మరీ కేంద్రమంత్రిని చేసిన ప్రబుద్ధుడు.. బ్యాంకుల్లో దాదాపు రూ.6 వేల కోట్లు లూఠీ చేయడంపై ఏం సమాధానం చెబుతారు? -వైఎస్ జగన్ -
304వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,302.6 కి.మీ 24–11–2018, శనివారం తురకనాయుడువలస, విజయనగరం జిల్లా నిజంగా మంచి చేసి ఉంటే.. అంత భయమెందుకు బాబూ? ఈ రోజు పాదయాత్రలో గ్రామగ్రామానా నాన్నగారిని స్మరించుకున్నారు. ఆయన లేని లోటును గుర్తుచేసుకున్నారు. దారిపొడవునా పచ్చటి పొలాలు కనిపించాయి. ఆ పచ్చదనం.. నాన్నగారి తోటపల్లి ప్రాజెక్టు పుణ్యమేనన్నారు. ఈ ప్రాంత బీడు భూముల దాహార్తి తీర్చిన దార్శనికత నాన్నగారిదని చెప్పారు. సంక్షేమ పథకాలు అందడం లేదని దాదాపు ప్రతి గ్రామంలోనూ గోడు వెళ్లబుచ్చారు. బీజేపురంలో మండగి కుమారికి చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఏ ఆధారమూ లేని ఆ సోదరికి ఇల్లు ఇవ్వలేదు.. వితంతు పింఛనూ రావడం లేదు. గంగంపేటకు చెందిన రామమ్మకు 13 ఏళ్లుగా వితంతు పింఛన్ వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక.. అంగన్వాడీలో హెల్పర్‌గా పనిచేస్తోందని పింఛన్ తీసేశారు. ఆ తర్వాత కొద్ది నెలలకే వయోపరిమితి పేరిట ఉద్యోగమూ పోయింది. ఇప్పుడామెకు పింఛన్ రాదు.. ఉద్యోగమూ లేదు. ఐదుగురు బిడ్డల్ని ఎలా సాకాలని ఆ తల్లి గోడు వెళ్లబోసుకుంది. శిఖరం గ్రామంలో పన్నమ్మ అనే 85 ఏళ్ల అవ్వకు, మానసిక దివ్యాంగురాలు అరుణకుమారికి, పుట్టు మూగవాడైన వెంకటరమణకు పింఛన్లు ఇవ్వడం లేదు. మరుగుదొడ్లకు బిల్లులు ఇవ్వడం లేదని చినకుదమ వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎక్కడ చూసినా ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. ముఖ్యమంత్రిగారు మాత్రం సంక్షేమ పథకాలన్నీ సంతృప్త స్థాయిలో అమలుచేశానని.. నిన్న జరిగిన అనంతపురం సభలో చెప్పారు. అనుకూల మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లుంది ఆయన వ్యవహార శైలి. తన కుమారుడు గణేశ్.. బీఈడీ చేసి ఏళ్లు గడుస్తున్నా డీఎస్సీ లేక నిరుద్యోగిగానే మిగిలాడని బొద్దాన గౌరమ్మ వాపోయింది. తురకనాయుడువలసలో ఆవణ్య అనే దళిత సోదరి డీఈడీ పూర్తిచేసి ఆరేళ్లయింది. డీఎస్సీపై కొండంత ఆశలు పెట్టుకుంది. ఇప్పుడేమో ఎన్నికల తాయిలంగా ప్రకటించిన డీఎస్సీలో పోస్టులను కుదించేసి.. మినీ డీఎస్సీగా మార్చేసి మోసం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. పరీక్షకు నెల రోజుల ముందు సిలబస్ పెంచేస్తే ఎలా.. అని బావురుమంది. అన్ని గ్రామాల్లో అగ్రిగోల్డ్ బాధితులు కలుస్తూనే ఉన్నారు. శిఖబడి గ్రామంలో దాసరి శివకుమార్, సంతోష్‌కుమారి అనే అన్నాచెల్లెళ్లు చిన్నప్పుడే అమ్మానాన్నను కోల్పోయారు. ఆ చెల్లెమ్మ పెళ్లికి ఉపయోగపడతాయని ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి అగ్రిగోల్డ్‌లో కట్టారట. ఇప్పుడా అనాథ బిడ్డల బతుకులు ఏం కావాలని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తురకనాయుడువలసలో 400 ఇళ్లుంటే.. 300కి పైగా అగ్రిగోల్డ్ డిపాజిట్లు ఉన్నాయట. ఆ చిన్నగ్రామంలోనే రూ.రెండున్నర కోట్లకు పైగా డిపాజిట్లు కట్టారట. ఆ గ్రామంలో చాలామంది బాధితులు కలిశారు. హాయ్‌ల్యాండ్‌ను మింగేయాలని బాబుగారు ప్రయత్నిస్తుండటం.. తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ ఊళ్లో కొర్రాడ ఈశ్వరరావు అనే బాధితుడు 45 ఏళ్ల వయసులోనే తీవ్ర మానసిక వేదనకు గురై గుండెపోటుతో చనిపోయాడట. నిన్న వినుకొండలో ధనరాజ్బాలాజీ అనే ఏజెంటు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం, శ్రీకాకుళం జిల్లా నందిగామ్‌లో 44 ఏళ్లకే వసంతరావు అనే సోదరుడు గుండె ఆగి మరణించడం కలచివేశాయి. పరిస్థితులిలా ఉంటే.. అనంతపురంలో మరో బాధితుడు సిద్ధేశ్వర్.. అక్కడికెళ్లిన ముఖ్యమంత్రిని కలిసి తన గోడు చెప్పుకుంటే, ఆయనగారేమో ఆ బాధితుడితో వెటకారంగా మాట్లాడటం, మండిపడి చెయ్యెత్తడం అమానుషం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ‘ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి వేశాను. అండంగా ఉండండి నాకు ధైర్యంగా ఉంటుంది’ అని బతిమాలుకుంటున్నారు.. నిజంగా ప్రజలందరికీ మంచిచేసి ఉంటే.. కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడాల్సిన అవసరం వచ్చి ఉండేదా? మీకు రక్షణ వలయంగా ఉండి రక్షించాలని ప్రజల్ని కోరారు.. పాపాలన్నీ మీరు చేసి.. ‘కాపాడండి..’ అంటూ ప్రజల్ని వేడుకోవడం సిగ్గుగా అనిపించడం లేదా? -వైఎస్ జగన్ -
303వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,290.9 కి.మీ 21–11–2018, బుధవారం శిఖబడి, విజయనగరం జిల్లా నాలుగున్నరేళ్లలో ఒక్కవృద్ధాశ్రమమైనా కట్టారా బాబూ? విశ్వమానవ ప్రేమ, దాతృత్వం, దయాగుణాలను పెంచే మహ్మద్ ప్రవక్త బోధనలు నిత్య అనుసరణీయాలు. ఆయన జన్మదినం సందర్భంగా.. మైనార్టీ సోదరుల కుటుంబాల్లో సుఖసంతోషాల వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు పాదయాత్ర మొదలుపెట్టాను. మిలాద్ ఉన్ నబీ రోజున శిబిరం నుంచి బయటకు రాగానే చినమేరంగికి చెందిన షేక్ రేష్మా, దిల్షాద్, నూరి, నూర్జహాన్‌లు కలిశారు. ఆ పేద ముస్లిం కుటుంబం.. బాబుగారి షాదీముబారక్ పథకాన్ని నమ్ముకుని ఆ ఇంటి ఆడపడుచుకు జనవరిలో పెళ్లిచేసింది. ఆయనగారు చెప్పినట్టు రూ.75 వేలు వస్తాయనుకున్నారు. పెళ్లయిన నెలలోపే అన్ని ధ్రువీకరణ పత్రాలిచ్చి, దరఖాస్తు చేసుకున్నప్పటికీ షాదీముబారక్ పథకం చేయూత అందలేదు. అప్పుచేసి తెచ్చిన డబ్బుకు వడ్డీలు కట్టుకోలేక అల్లాడిపోతున్నామని బాధపడ్డారు. బాబుగారి హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమని వాపోయారు. నాలుగున్నరేళ్ల పాటు మైనార్టీలను దారుణంగా విస్మరించి.. తీరా ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడేప్పటికి మూడు నెలల మంత్రి పదవి ఇచ్చి.. మైనార్టీలను మరోమారు మభ్యపెట్టాలనుకుంటున్న బాబుగారి నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం?! అల్లువాడ వద్ద సింహాద్రి, నారాయణమ్మ అనే వృద్ధ దంపతులు కలిశారు. స్వాతంత్ర సమరయోధుడైన ఆ తాతకు 110 ఏళ్లట. కంటిచూపు సరిగా లేదు.. వినికిడి అంతంత మాత్రమే.. నడవడమూ కష్టమే. ‘తాతా.. బావున్నావా..’అని పలకరించగానే కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ‘కన్నబిడ్డల్లేరు.. అయినవారెవరూ లేరు.. పలకరించేవారూ కరువే. ఎంతకాలమయ్యా ఈ ఒంటరి బతుకులు’.. అంటూ నిర్వేదంగా మాట్లాడాడు. గుండె బరువెక్కింది. అంతబాధలోనూ ‘బాబూ.. మీ నాన్నలా మంచిపేరు తెచ్చుకోవాలి’అంటూ దీవించాడు. ఎవరూ లేని ఇలాంటి అవ్వాతాతల ఆలనాపాలనా చూసుకునేందుకు వృద్ధాశ్రమాలుంటే ఎంత బావుండేది అనిపించింది. గుమ్మలక్ష్మీపురానికి చెందిన గిరిజనులు వాళ్ల సంప్రదాయ పంటలు, అటవీ ఉత్పత్తులతో ఏర్పాటుచేసిన స్టాల్‌ను చూపించారు. దాదాపు 36 రకాల అటవీ ఉత్పత్తులు పండుతాయట. గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేస్తోంది మాత్రం పసుపు, చింతపండే.. అది కూడా అరకొరగానే. మార్కెటింగ్ సదుపాయాల్లేక, గిరిశిఖర గ్రామాల నుంచి రవాణా సౌకర్యాల్లేక, కోల్డ్ స్టోరేజీల్లేక.. విధిలేని పరిస్థితుల్లో దళారీలకు బలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంప్రదాయ పంటలు ఆరోగ్యానికి చాలా మంచివని.. బయట మార్కెట్లో అత్యధిక ధరలకు అమ్ముతున్నారు. అవి పండించిన గిరిజన రైతన్న మాత్రం దోపిడీకి గురవుతున్నాడు. గోదావరి జిల్లాలకు చెందిన శెట్టిబలిజ నేతలు వచ్చి పార్టీలో చేరారు. ఇన్నాళ్లూ బలహీనవర్గాలను ఓటు బ్యాంకులుగానే చూస్తున్న బాబుగారిపై భ్రమలు పోయాయని చెప్పారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ మేనిఫెస్టోలోని ఏడో పేజీలో ముఖ్యాంశాలంటూ.. ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం కట్టిస్తానని గొప్పగా హామీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వృద్ధాశ్రమమైనా కట్టించారా? గిరిజనుల వద్ద కిలో చింతపండు కేవలం రూ.20కే కొంటున్నారు.. మీ హెరిటేజ్‌లో మాత్రం కిలో రూ.326కు అమ్ముతున్నారు.. మరి దీనికేం సమాధానం చెబుతారు? -వైఎస్ జగన్ -
302వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,280.4 కి.మీ 20–11–2018, మంగళవారం, కురుపాం, విజయనగరం జిల్లా. గిరిజన వర్గాలకు మూడు నెలల మంత్రి పదవి ఎన్నికల తాయిలం కాక మరేమిటి బాబూ? ఈ రోజు పాదయాత్ర ఆసాంతం ఎంతోమంది గిరిపుత్రులు కలిశారు. దూర ప్రాంతాల నుంచి, రహదారులే లేని గిరిశిఖర గ్రామాల నుంచి తరలివచ్చామని తెలిపారు. సంక్షేమమంటే ఏమిటో, అభివృద్ధి అంటే ఏమిటో చవిచూపించిన నాన్నగారిని గుండెల్లో పెట్టుకున్నారు. ఆయనను నాలో చూసుకుంటున్నామని చెప్పారు. కల్మషం లేని వారి అభిమానం కట్టిపడేసింది. ఈ సర్కారు తీరుతో వారు పడుతున్న కష్టాలు వింటుంటే గుండె బరువెక్కింది. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నేతలు, అధికారులు, దళారులు అన్యాయానికి గురిచేస్తుండటం బాధనిపించింది. ఎగువ ఆవిరి, పొడి గ్రామాలకు చెందిన జగన్నాథం, సోమయ్య తదితరులు కలిశారు. జీడిమామిడి, అటవీ ఉత్పత్తులే ఆ గ్రామస్తులకు ఆధారమట. ఈ ప్రభుత్వం వచ్చాక దళారుల దెబ్బకు గిట్టుబాటు కాక నష్టపోతున్నామన్నారు. ఆదుకోవాల్సిన గిరిజన సహకార సంస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని చెప్పారు. ‘ఉపాధి పనులైనా చేసుకుందామంటే పనులు ఇవ్వరు.. ఇచ్చినా కూలి డబ్బులు చెల్లించరు. విధి లేక యువత వలసల బాట పడుతోంది’అని చెబుతుంటే గుండె బరువెక్కింది. రహదారులే లేని కొండపై గ్రామం.. ఓడ్రుబంగి. ఆ ఊరి నుంచి తోయిక రొంపి, నిమ్మల చిన్నమ్మి తదితరులు వచ్చారు. ఆ గ్రామ ప్రజలు రేషన్ తీసుకోవాలన్నా, పింఛన్ కావాలన్నా కొండ దిగిరావాల్సిందేనట. వృద్ధులు, వికలాంగులు ఎలా రాగలరు? డోలీల్లో వచ్చి వేలిముద్రలు వేసి రేషన్ పట్టుకుపోవడం సాధ్యమేనా? అంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారికి ఆ కష్టం తొలగించాలంటే ప్రభుత్వానికి పెద్ద పనేమీ కాదు. కానీ.. చేయకూడదు అనుకునేవారికి కారణాలకు కొదవే ఉండదు. ఇక్కడి గిరిజన గ్రామాల్లో వైద్య సౌకర్యాల గురించి ఆలోచించాల్సిన పనే లేదట. ‘వైద్యులు రారు.. 108లు కానరావు’అంటూ వాపోయారు. ఈ ప్రభుత్వం అమాయక గిరిజనంపై సైతం కనీస మానవత్వం చూపకపోవడం బాధాకరం. జెరడ, గెడ్డగూడ గ్రామస్తులు కలిశారు. రెండూ గిరిశిఖర గ్రామాలే. తిత్లీ తుపాను దెబ్బకు సగానికి సగం ఇళ్లు నేలమట్టమయ్యాయట. అందిన సాయం అంతంత మాత్రమేనన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వ తీరు మాత్రం ‘పరిహారం గోరంత.. ప్రచారం కొండంత’అన్నట్టుగా ఉందన్నారు. ఈ ప్రభుత్వానికి గిరిజనులంటే ఎందుకింత చిన్నచూపు? ఎందుకింత వివక్ష? నాలుగున్నరేళ్లకుపైగా గిరిజన ప్రాతినిధ్యమే లేని మంత్రివర్గం చరిత్రలోనే లేదేమో! ఆ ఘనత కేవలం బాబుగారికే దక్కడం విశేషం. గిరిజన వర్గాలకు మూడు నెలల మంత్రి పదవి ఎన్నికల తాయిలం కాక మరేమిటి? కురుపాం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల ప్రజలు కలిశారు. వారి చిరకాల వాంఛ అయిన గుమ్మడిగెడ్డ మినీ రిజర్వాయర్‌ను నిర్మించాలని కోరారు. ఆ మినీ రిజర్వాయర్ ఏర్పాటయితే పది వేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. ఇటువంటి చిన్నచిన్న పథకాలను కూడా చేపట్టని సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు అధికారం చేపట్టాక ఏజెన్సీ ప్రాంతాల్లో మాతాశిశు మరణాలు గణనీయంగా పెరిగిన మాట వాస్తవం కాదా? అందుకు కారణాలైన పోషకాహార లోపం, రక్తహీనత, వైద్య సౌకర్యాల లేమికి బాధ్యత మీది కాదా? -వైఎస్ జగన్ -
301వ రోజు పాదయాత్ర డైరీ
-
301వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,271.5 కి.మీ 19–11–2018, సోమవారం సీమనాయుడువలస, విజయనగరం జిల్లా ఏ ప్రాజెక్టయినా, పథకమైనా పాలకులకు కాసులు కురిపించేందుకే పరిమితమవడం శోచనీయం రాత్రి బసచేసిన తోటపల్లి ప్రాజెక్టు శిబిరం నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభించాను. పునరావాసం కల్పించకుండా మాయమాటలు చెబుతోందీ ప్రభుత్వం అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు నందివానివలస గ్రామస్తులు. నాన్నగారి హయాంలోనే దాదాపుగా పూర్తయిన ప్రాజెక్టుకు మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తిచేయకుండానే హడావుడిగా ప్రారంభోత్సవం చేసి ప్రచారం చేసుకోవడంలో ఉన్న తపన.. బాధితులకు పునరావాసం కల్పించడంలో లేకపోవడం దారుణమనిపించింది. ఈ రోజు పాదయాత్రలో పలుచోట్ల.. తిత్లీ తుపానుకు పూర్తిగా దెబ్బతిన్న అరటితోటలు కనిపించాయి. గిజబ దగ్గర అలా నేలమట్టమైన ఓ అరటితోట వద్దకు వెళ్లి చూశాను. పంటకు అయ్యే ఖర్చులో మూడోవంతు కూడా పరిహారం ఇవ్వలేదని బాధపడ్డారు అక్కడి రైతన్నలు. సంవత్సరాల తరబడి హుద్‌హుద్ తుపాను పరిహారాన్నే ఇవ్వని నేతలు.. మీరు ఈ ప్రాంతానికి వస్తున్నారని తెలిసి హడావుడిగా తిత్లీ తుపాను పరిహారాన్ని ప్రకటించారని చెప్పారు. ఇచ్చిన ఆ అరకొర పరిహారమైనా.. పాదయాత్ర పుణ్యమేనన్నారు. ప్రచారం, రాజకీయ ప్రయోజనాలు, సమీపంలో ఎన్నికలుంటే తప్ప బాధితులను ఆదుకోవాలనే తపన ఈ సర్కారుకు లేకపోవడమన్నది విచారకరం. తోటపల్లి ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన గ్రామాలకు మాత్రం ఆ ప్రాజెక్టు నీరు అందడం లేదని గిజబ గ్రామం వద్ద రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసంగి వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేస్తే.. 16 పంచాయతీలకు నీరందేది. ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన కూడా చేయడంలేదంటూ అన్నదాతలు గోడు వెళ్లబోసుకున్నారు. మరి ఇది రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం హాస్యాస్పదం కాదా? దారిలో తులసివలస గ్రామ గిరిజనులు కలిశారు. పాలకుల నిర్లక్ష్యం, అవినీతి, వివక్ష.. వెరసి నాగావళిపై పూర్ణపాడు–లాబేసు వంతెన పథకం నత్తనడకన సాగుతోందని చెప్పారు. ఆ వంతెన పూర్తికాకపోవడంతో కేవలం ఐదు కిలో మీటర్ల దూరం ఉండే మండల కేంద్రానికి వెళ్లడానికి.. 50 కిలోమీటర్లకు పైగా చుట్టుకుని వెళ్లాల్సి వస్తోందన్నారు. నదిలో నాటుపడవ ప్రయాణం ప్రమాదకరంగా పరిణమించిందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రానికి వెళ్లాలన్నా, ఒడిశాకు రాకపోకలు సాగించాలన్నా ఈ వంతెన అత్యంత సౌకర్యవంతమని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా నిధులు ఆవిరవుతున్నాయే తప్ప పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఏ ప్రాజెక్టయినా, పథకం అయినా.. పాలక నేతలకు కాసుల వర్షం కురిపించడానికే పరిమితమవడం శోచనీయం. వెనుకబడిన కులాలు, చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉండే ఈ కరువు జిల్లాలోనే ఉచిత విద్యుత్ అటకెక్కితే.. మిగతా ప్రాంతాల్లో ఎలా ఆశించగలం! వెంకటరాజపురానికి చెందిన ఎకరా పొలం ఉన్న కన్నమనాయుడుకు.. రామానాయుడువలసకు చెందిన రెండెకరాల రాజ్యలక్ష్మికి.. వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయట. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు లేదా అన్నా.. అంటూ అమాయకంగా అడుగుతూ ఆ బిల్లులను చూపించారు. నాన్నగారి హయాంలో ఒక్క వ్యవసాయ మోటారుకైనా రూపాయి బిల్లయినా వచ్చిందా? మనసుంటే మార్గం ఉంటుంది.. మనసులోనే మోసం చేయాలనుంటే ఫలితం ఇలానే ఉంటుంది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామంటూ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి.. నానాసాకులతో తూట్లు పొడవడం న్యాయమేనా? వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు.. పరిశ్రమలకు, ఆక్వా రంగానికి విద్యుత్ రాయితీలంటూ ఓ వైపు ప్రచారం చేసుకుంటూ.. మరోవైపు పలు రకాల అదనపు చార్జీల పేరుతో.. రకరకాల సాకులతో.. నడ్డివిరిచి దొడ్డి దారిన అధిక డబ్బు వసూలు చేయడం ధర్మమేనా? -వైఎస్ జగన్ -
300వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,261.6 కి.మీ 18–11–2018, ఆదివారం తోటపల్లి రిజర్వాయర్ ప్రాంతం, విజయనగరం జిల్లా బాబుగారు కేవలం శిలాఫలకాలకు చిరునామాగా మిగిలిపోయారు.. నేటితో ప్రజా సంకల్ప యాత్ర 300వ రోజుకు చేరింది. ఈ రోజు కూడా ఎందరో కాంట్రాక్టు ఉద్యోగులు, మరెందరో నిరుద్యోగులు కలిశారు. అందరిలోనూ ఒకటే ఆందోళన. ఈ పాలనలో ఉద్యోగ భద్రత కొరవడిందని కాంట్రాక్టు ఉద్యోగులు, ఉద్యోగావకాశాలే కరువయ్యాయని నిరుద్యోగులు వాపోయారు. పార్వతీపురానికి చెందిన విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు, హెల్త్ అసిస్టెంట్లు, కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు కలిశారు. ఐదేళ్ల కిందట ఎన్నికలకు ముందు తమనందర్నీ రెగ్యులరైజ్ చేస్తానని బాబుగారు హమీ ఇచ్చి.. మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. ఓట్లేయించుకుని మాట తప్పారని చెప్పారు. ఆందోళన చేసిన ప్రతిసారీ.. న్యాయం చేసేస్తామంటూ మాయమాటలు చెప్పి.. సమ్మె విరమింపజేసి మోసం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికే రెండుసార్లు టెట్లు రాసి మంచి మార్కులు తెచ్చుకున్నా.. మళ్లీ రాయాల్సి రావడం ఏం న్యాయమంటూ బాధపడింది బంటువానివలసకు చెందిన అరుంధతి అనే చెల్లెమ్మ. తీరా డీఎస్సీకి నెల ముందు సిలబస్ పెంచేసి, కొత్త సిలబస్ కూడా కలిపితే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యాహ్న శిబిరం వద్ద బాబూరావు అనే అన్న కలిశాడు. పదో తరగతి దాకా చదువుకుని చిన్న చిన్న మెకానిక్ పనులు చేసుకునేవాడు. ఉన్నత చదువులు చదవకపోయినా.. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. కొత్త ఆవిష్కరణలు చేయడంలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వ్యవసాయం మీద మక్కువ.. రైతులకు ఏదన్నా చేయాలన్న తపన.. ఓ పరిశోధకునిగా మార్చాయి. రైతులకు బహుళార్థకంగా ఉపయోగపడే డ్రమ్‌సీడర్‌ను తయారుచేసి ప్రముఖుల ప్రశంసలు పొందాడు. 2017లో విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్‌లో బంగారు పతకం సాధించాడు. 30 దేశాలు పాల్గొన్న ఆ సదస్సులో ముఖ్యమంత్రిగారే పతకాన్నిచ్చి.. అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత తన సహజ లక్షణం ప్రకారం మర్చిపోయారు. ప్రచారార్భాటాలకు, ఉత్తుత్తి మాటలకే పరిమితమని మరోసారి నిరూపించుకున్నారు. ఇలాంటి ఆవిష్కర్తల కోసం ఏర్పాటు చేస్తానన్న రూ.వంద కోట్ల నిధి ఏమైపోయిందో! సాయంత్రం పార్వతీపురం నియోజకవర్గం దాటి కురుపాంలోకి ప్రవేశించాను. నాన్నగారి సంకల్పఫలమైన తోటపల్లి ప్రాజెక్టు గట్టు మీద నుంచి నడుస్తుంటే.. మనసంతా ఉప్పొంగింది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న నా సంకల్పం మరింత బలపడింది. ఈ ప్రాజెక్టు ద్వారా నాన్నగారు ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. బాబుగారు కేవలం శిలాఫలకాలకు చిరునామాగా మిగిలిపోయారు. 2004 ఎన్నికలకు ముందు బాబుగారు శంకుస్థాపన చేసి చేతులు దులిపేసుకున్నారు. నాన్నగారు అధికారంలోకి వచ్చాక 95శాతం పనులు పూర్తిచేశారు. మళ్లీ బాబుగారొచ్చాక.. మిగిలిపోయిన ఆ పిల్లకాలువ పనులు కూడా పూర్తిచేయకపోగా.. హడావుడిగా ప్రాజెక్టుకు రంగులేసి ప్రారంభోత్సవం చేసినట్టుగా మరో శిలాఫలకం వేసుకున్నారు. కేవలం ఎన్నికల ప్రచారం కోసం పునాదిరాళ్లు వేయడం.. మరొకరు చేసిన పనులకు రిబ్బన్లు కత్తిరించి ప్రచారం చేసుకోవడం నామోషీగా అనిపించదేమో! పేర్లు శిలాఫలకాలపై కాదు.. ప్రజల మనోఫలకాలపై ఉన్నప్పుడే కదా సార్థకత. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అంచనా వ్యయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేసి కమీషన్లు నొక్కేసిన మీరు.. మిగిలిపోయిన పిల్లకాలువ పనులను కూడా పూర్తిచేయకపోవడం వాస్తవం కాదా? పైగా తోటపల్లి ప్రాజెక్టు నాగావళి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ కోసమంటూ.. ఎన్నికలకు మూడు నెలల ముందు హడావుడిగా రూ.195 కోట్లకు టెండర్లు పిలిచింది.. కేవలం కమీషన్ల కోసమే కాదా? -వైఎస్ జగన్ -
299వ రోజు పాదయాత్ర డైరీ
-
299వ రోజు పాదయాత్ర డైరీ
17–11–2018, శనివారం పార్వతీపురం పాతబస్టాండ్ సెంటర్, విజయనగరం జిల్లా ఏ స్వతంత్ర సంస్థతోనైనా దర్యాప్తునకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ‘ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అన్నట్లు.. తాము రాయాల్సిన పరీక్షలు సంవత్సరం పాటు ఆలస్యమవుతున్నాయని ఉదయం శిబిరం వద్ద కలిసిన డైట్ కాలేజీ విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. మొదటి సంవత్సరం పూర్తయినా పరీక్షలు పెట్టక.. రెండో సంవత్సరం తర్వాత రెండు పరీక్షలూ దాదాపు ఒకేసారి పెడితే.. మేమెట్లా చదవగలం.. ఏం రాయగలం.. అన్నది వారి బాధ. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల విలువైన విద్యాసంవత్సరాన్ని, ఉద్యోగావకాశాల్ని కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్నాథపురం కాలనీ ప్రజలు కలిశారు. పార్వతీపురం పట్టణంలో తాగునీటి సమస్య అత్యధికంగా ఉందన్నారు. మూడ్రోజులకోసారి తాగునీరు రావడమూ కష్టమేనన్నారు. తాగునీరు అడిగిన ప్రజలపై నేతలు దౌర్జన్యాలు కూడా చేశారని చెబుతుంటే.. బాధేసింది. పట్టణ సుందరీకరణ ముసుగులో అధికార పార్టీ నేతలు డివైడర్ల ఏర్పాటుపేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేశారన్నారు. వారెంతగా బరితెగించారంటే.. పట్టణంలో ప్రవహించే వరహాలగెడ్డను కబ్జాచేసి ఓ నాయకుడు ఇల్లు కట్టుకుంటే, మరో ప్రబుద్ధుడు దాని దిశను మార్చి విలువైన స్థలాన్ని స్వాహా చేశాడట. మొత్తానికి ఈ పట్టణంలో పచ్చ నేతల నిధుల దాహం తీరుతోందే తప్ప.. ప్రజల నీటి దాహం తీరడం లేదు. వివేకానంద కాలనీవాసులు కలిశారు. ఒకప్పుడు తాగునీటిని అందించే గోపసాగరం చెరువును డంపింగ్‌యార్డుగా మార్చేశారని చెప్పారు. దాంతో కాలుష్యం పెరిగి దుర్గంథంతో అల్లాడిపోతున్నట్టు వివరించారు. వేలాదిమంది ప్రజలు, దగ్గర్లోని అనాథాశ్రమ బాలురు రోగాలబారిన పడుతున్నా పట్టించుకునే నాథుడేలేడన్నారు. చెరువు, నదులమీద అపార ప్రేమ ఉన్న పచ్చ నేతలకు ప్రజా సమస్యలపై పట్టింపు ఎందుకుంటుంది?! చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లుంది.. అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి. నర్సిపురంలో వారు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టార్జితమంతా పాలక నేతలకు ఫలహారమవుతోందంటూ వాపోయారు. ఇక్కడి కొత్తవలస అనే కుగ్రామంలో 160 ఇళ్లుంటే.. 280 అగ్రిగోల్డ్ పాలసీలున్నాయంటే.. ఈ ప్రాంతవాసులు ఎంతలా మునిగిపోయారో తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోనే ఆరుగురు అగ్రిగోల్డ్ బాధితులు మానసిక క్షోభతో మరణించారని తెలిసి చాలా బాధేసింది. బాబుగారు చెప్పుచేతల్లో ఉండి ఆడమన్నట్టు ఆడిన దర్యాప్తు సంస్థ.. అగ్రిగోల్డ్ సంస్థల్లో అత్యంత విలువైనది, కీలకమైనది అయిన హాయ్‌ల్యాండ్ ఎండీని అరెస్ట్ చేయకపోవడం దారుణం. అగ్రిగోల్డ్‌కు హాయ్‌ల్యాండ్ అనే ఆస్తే లేదని చెప్పడం విస్మయం కలిగిస్తోంది. సీఐడీ వారికి బాబుగారిపై ఉన్న అపారమైన స్వామి భక్తిని ఇది తెలియజేస్తోంది. ఆ సంస్థ ఆస్తులను దోచుకునే పథకంలోని కుట్రను బహిర్గతం చేస్తోంది. ‘ఇలాంటి దర్యాప్తు సంస్థలతో మా లాంటి బాధితులకు న్యాయమెలా జరుగుతుంది’ అంటూ అగ్రిగోల్డ్ బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. నిజంగా చాలా బాధేసింది. అగ్రిగోల్డ్ నుంచి పోలవరం దాకా, ఓటుకు కోట్లు నుంచి నాపై జరిగిన హత్యాయత్నం వరకూ జరిగిన కుంభకోణాలు, కుట్రలు.. ఆటవిక పాలనకు అద్దంపడుతున్నాయి. రాజ్యాంగాన్ని అపహాస్యంచేసి ఎమ్మెల్యేలను పశువుల్లా కొని.. అనర్హత వేటు పడకుండా కాపాడి.. మంత్రులుగా ప్రమాణస్వీకారాలు చేయించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలిచాయి. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీపై వచ్చిన ఏ ఆరోపణలపైనైనా మీ ఆధీనంలో లేని ఏ స్వతంత్ర సంస్థతోనైనా నిష్పాక్షిక దర్యాప్తు జరిపించడానికి వెనకడుగు వేస్తున్నారెందుకు? మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మీపై న్యాయ విచారణ జరగకుండా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడం.. మీపై విచారణ జరగకుండా దర్యాప్తు సంస్థలను నిషేధించడం వంటి చర్యలతో మీకు మీరే దోషులుగా తేటతెల్లం చేసుకోవడం వాస్తవం కాదా? -వైఎస్ జగన్ -
298వ రోజు పాదయాత్ర డైరీ
-
298వ రోజు పాదయాత్ర డైరీ
15–11–2018, గురువారం సూరంపేట క్రాస్, విజయనగరం జిల్లా లంచాలు పాలకులకైతే.. శిక్ష రైతన్నలకా? అసలే వెనుకబడిన జిల్లా విజయనగరం. ఓ వైపు వర్షాల్లేక, సాగునీరందక, గిట్టుబాటు ధరల్లేక అన్నదాతలు అల్లాడిపోతుంటే.. మరోవైపు కల్తీ విత్తనాలు కాటేస్తున్నాయి.ఈ రోజు సీతానగరం మండల రైతన్నలు కలిశారు. ప్రభుత్వంవారు కల్తీ విత్తనాలు పంపిణీ చేయడంతో నట్టేట మునిగిపోయామని వాపోయారు. ‘పంట పూర్తిగా నష్టపోయి అప్పుల పాలైపోయాం.. విత్తనాలు కల్తీ అని నిర్ధారణ అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా దారుణమనిపించింది.. గోరుచుట్టుపై రోకలిపోటు బాధవారిది. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వమే.. కంచే చేను మేసినట్లు కల్తీ విత్తనాలు సరఫరా చేసి రైతన్నల నడ్డి విరుస్తుంటే.. ఆ గోడు ఎవరికి చెప్పుకోవాలి? ఆ రైతన్నలు కల్తీ విత్తనాల కారణంగా పంట నష్టపోయి, అప్పులపాలవ్వడానికి ఈ ప్రభుత్వమే కారణం కాదా? రైతన్నలను ఆదుకునే బాధ్యత ఈ పాలకులకు లేదా? ఈ పాలక పెద్దలకు.. తమ బినామీ విత్తన సంస్థలపై ఉన్న ప్రేమ.. లక్షలాది పేద రైతులపై లేకపోవడం బాధాకరం. లంచాలు పాలకులకైతే.. శిక్ష రైతన్నలకా? చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా చెరకు రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ రోజు కలిసిన సీతానగరం చెరకు రైతులు ఇదే విషయం చెప్పారు. మూడేళ్లుగా ఇక్కడి చక్కెర ఫ్యాక్టరీ చెరకు రైతులకు డబ్బులు సరిగా చెల్లించక ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గతేడాది బకాయిలే రూ.13 కోట్లు ఉన్నాయని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తీర్చడానికే పార్టీ ఫిరాయిస్తున్నానని సాకులు చెప్పి, మంత్రి పదవులు పొందాక మాటమార్చిన అమాత్యుల వారు.. ఈ రైతన్నలకు ఏం సమాధానం చెబుతారు? మీ కోసమే గోడ దూకుతున్నానని చెప్పి.. దూకేశాక దాక్కున్నట్లుంది ఆయన వ్యవహార శైలి. ఈ రోజు పాదయాత్ర ముగిసే సమయంలో జనహిత డీఎడ్ కాలేజీ విద్యార్థినులు కలిశారు. వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కోర్సు పూర్తవుతున్నా పరీక్షలు నిర్వహించడం లేదట. స్కాలర్షిప్లు అసలే రావడం లేదు. వస్తున్న అరకొర ఫీజురీయింబర్స్‌మెంట్ కూడా సంవత్సరాల తరబడి రాకపోవడంతో చదువు పూర్తయినా సర్టిఫికెట్లు చేతికందడం లేదు. తీరా అన్ని కష్టాలూపడి గట్టెక్కితే.. ఉద్యోగావకాశాలు ఉండటం లేదు. ‘ప్రభుత్వమేమో టెట్లు మీద టెట్లు పెడుతోంది.. డీఎస్సీ మాత్రం నిర్వహించనే లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు.. నిర్వహిస్తామంటున్న డీఎస్సీలో పోస్టులను మూడో వంతుకు కుదించివేసింది’ అంటూ ఆ విద్యార్థినులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగంలేక.. ఉపాధీ దొరక్కపోతే.. యువత భవిత ఏం కావాలి? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. వ్యవసాయానికి కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తామని, ప్రత్యేక విత్తన చట్టాన్ని తెస్తామని మీ మేనిఫెస్టోలో గొప్పగా పేర్కొన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులను అరికడతామని, సరఫరా చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ హామీలిచ్చారు.. మరి మీ ప్రభుత్వమే నకిలీ విత్తనాలను సరఫరా చేసినట్లు నిర్ధారణ అయింది. ఎవరిని శిక్షిస్తారు? మీ వల్ల నష్టపోయిన రైతన్నలకు కనీసం పరిహారమైనా ఇవ్వకపోవడం ధర్మమేనా? -
297వ రోజు పాదయాత్ర డైరీ
-
297వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకు నడిచిన దూరం: 3,238.2 కి.మీ 14–11–2018, బుధవారం, చిన్నారాయుడుపేట, విజయనగరం జిల్లా వ్యవసాయం దండగగా భావించే పాలకులకు రైతన్నల కష్టాలెలా కనిపిస్తాయి?! ఉదయం శిబిరం నుంచి బయటకు రాగానే చేతుల్లో పూలు పట్టుకుని చిన్నారి చిట్టెమ్మలు స్వాగతం పలికారు. బాలల దినోత్సవం రోజు ఎదురైన ఆ బంగారు తల్లులను చూడగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ రోజు పాదయాత్ర అంతా సీతానగరం మండలంలోనే సాగింది. గెడ్డలుప్పి గ్రామానికి చెందిన అక్కచెల్లెమ్మలు.. ఆ ఊరిలో జన్మభూమి కమిటీల దాష్టీకాల గురించి చెప్పారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఇళ్లుగానీ, పింఛన్లుగానీ అడపాదడపా అరకొరగానే ఇచ్చారట. ఇస్తున్న ఆ మూడునాలుగింటిలోనూ ఇంటికి రూ.25 వేలు, పింఛన్‌కు రూ.5 వేలు లంచాలుగా తీసుకుంటున్నారని ఆ అక్కచెల్లెమ్మలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డోకిశీల గ్రామానికి చెందిన శాంతకుమార్ అనే దళిత సోదరుడూ జన్మభూమి కమిటీ బాధితుడే. ఆ ఊరి పీహెచ్సీలో అవుట్ సోర్సింగ్ కింద అటెండర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడట. లంచమిస్తేనే ఉద్యోగమని.. జన్మభూమి కమిటీ సభ్యుడు చెబితే అధిక వడ్డీకి అప్పు తెచ్చిమరీ ఒకటిన్నర లక్ష అప్పజెప్పాడు. కానీ ఎక్కువ లంచం ఇచ్చారని ఆ ఉద్యోగాన్ని మరొకరికి కట్టబెట్టేశారట. డబ్బు పోయే.. ఉద్యోగమూ రాకపోయే.. అంటూ ఆ సోదరుడు కన్నీటిపర్యంతమయ్యాడు. దోచుకోడానికే జన్మభూమి కమిటీలు.. అంటున్న జనం మాటలు ముమ్మాటికీ వాస్తవమనిపించింది. చిన్నభోగిలి దాటాక సువర్ణముఖి నదిమీద ఉన్న వంతెనపై పాదయాత్ర సాగింది. దాదాపు 90 ఏళ్ల నాటి ఆ పురాతన బ్రిడ్జి శిథిలావస్థలో ఉంది. సువర్ణముఖి నది.. ఇసుక మాఫియా దురాగతాలకు నిదర్శనంగా కనిపించింది. పూర్తిగా గోతులమయమైపోయింది. ఇసుక కోసం మీటర్ల కొద్దీలోతుకు తవ్వేశారు. బ్రిడ్జి పిల్లర్ల దగ్గర కూడా ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో.. వంతెన మనుగడకే ప్రమాదం ఏర్పడిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుకాసురుల ధనదాహానికి నది ఒడ్డున ఉన్న శ్మశానవాటికలు సైతం మాయమైపోయాయట. చిన్నభోగిలి, సీతానగరాలకు శ్మశానమే లేదని చెబుతుంటే విస్మయం కలిగింది. సంబంధితశాఖా మంత్రి ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఇసుక దోపిడీకి అడ్డూఅదుపూ లేకపోవడం దారుణమనిపించింది. అప్పయ్యపేట వద్ద మహిళా రైతులు కలిశారు. ఎండిన వరి పంటను చూపించి గోడు వెళ్లబోసుకున్నారు. ‘బాబొచ్చాడు.. కరువు తెచ్చాడు. వర్షాల్లేవు.. ఆయనగారు చెప్పినట్లు జంఝావతి నీరూ అందివ్వలేదు. పంట పూర్తిగా ఎండిపోయింది’అంటూ ఆ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగగా భావించే పాలకులకు రైతన్నల కష్టాలెలా కనిపిస్తాయి?! మధ్యాహ్న శిబిరం వద్ద మెట్టవలసకు చెందిన సింహాచలం అనే సోదరుడు కలిశాడు. నాన్నగారి పాదయాత్ర ప్రారంభం నుంచి తుదిశ్వాస విడిచే వరకు పత్రికలలో వచ్చిన ఫొటోలతో చేసిన ఆల్బమ్‌ను తెచ్చి చూపించాడు. ఆ అభిమానానికి చాలా సంతోషమేసింది. సాయంత్రం పెదపెంకి గ్రామం నుంచి చాలామంది బోదకాలు వ్యాధిగ్రస్తులు వచ్చి కలిశారు. ఆ ఒక్క ఊరిలోనే దాదాపు 300పైగా బోదకాలు బాధితులున్నారట. ఆ ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ శూన్యం. పారిశుద్ధ్యం పడకేసింది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే వారి జీవితాలకు శాపమైంది. దోమలు విజృంభించి బోదకాలుబారిన పడేస్తున్నాయంటూ ఆ గ్రామస్తులు ఆవేదన చెందారు. ఓ వైపు వారు రోగాలబారిన పడి తల్లడిల్లుతుంటే.. వైద్య సదుపాయాల మాట దేవుడెరుగు, బెల్టుషాపులకు మాత్రం కొదవే లేదట. ఆ ఒక్క ఊరిలోనే 22 బెల్టుషాపులున్నాయని అక్కచెల్లెమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. దోమల ద్వారా సంక్రమించే డెంగీ, మలేరియా, బోదకాలు తదితర విషజ్వరాలు రాష్ట్రంలో విజృంభిస్తున్నాయి. ఏమైంది మీ దోమలపై దండయాత్ర? -
296వ రోజు పాదయాత్ర డైరీ
-
296వ రోజు పాదయాత్ర డైరీ
13–11–2018, మంగళవారం తామరఖండి, విజయనగరం జిల్లా అన్యాయానికి గురైన వారిని కోర్టుకీడుస్తామనడమేమిటి బాబూ? ఈ రోజు సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తిచేసుకొని పార్వతీపురంలో అడుగుపెట్టాను. ఏ నియోజకవర్గంలో చూసినా అభివృద్ధి కాసింతైనా కనిపించకపోగా.. వివక్షకు మాత్రం కొదువే లేదనిపించింది. తూరుమామిడి గ్రామస్తులు వచ్చి నన్ను కలిశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఊళ్లో 97 మందికి పింఛన్లు తీసేశారట. కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేసి మరీ పింఛన్లు తెచ్చుకోవాల్సి వచ్చిందని వారు చెబుతుంటే చాలా బాధనిపించింది. అన్ని అర్హతలున్నా సంక్షేమ ఫలాల కోసం ప్రజలు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడమేమిటి? ప్రభుత్వమే తమను వేధిస్తుందంటూ పేదలు కోర్టుకెక్కడం పాలకులకు సిగ్గుచేటు కాదా? నాన్నగారి హయాంలో పింఛన్లు ఆపేశారని, ఇళ్లు ఇవ్వడం లేదని, రేషన్ రావడం లేదని.. ఒక్కటంటే ఒక్క ఫిర్యాదైనా ఉండేదా? అదే గ్రామానికి చెందిన పోలమాంబ డ్వాక్రా గ్రూప్ అక్కచెల్లమ్మలదీ అదే ఆవేదన. బాబు గారి రుణమాఫీ మాటలు నమ్మి మోసపోయామన్నారు. వడ్డీల మీద వడ్డీలతో అప్పు కాస్త తడిసి మోపెడైందని వాపోయారు. కట్టకపోతే కోర్టుకీడుస్తామని ప్రభుత్వం బెదిరిస్తోందని బావురుమన్నారు. అన్యాయానికి గురైన వారిని కోర్టుకు ఈడుస్తామనడమేమిటి? మోసపోయిన వారికా శిక్ష? వెంకటభైరిపురం ఒక్క గ్రామంలోనే తొమ్మిది మంది హిందీ పండిట్లు ఉన్నారట. వారంతా నాలుగేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న వారే. టెట్ల కోసం, డీఎస్సీల కోసం కోచింగ్‌ల పేరిట రూ.వేలకు వేలు ఖర్చు చేసుకున్నవారే. నాలుగేళ్లుగా ఊరించిన డీఎస్సీ తీరా అరకొర పోస్టులతో ఉసూరుమనిపించిందని వారంతా నిరాశ వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఏటా డీఎస్సీ నిర్వహించి ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్న బాబు గారు నాలుగున్నరేళ్లు పట్టించుకోకపోగా.. తీరా ఎన్నికల ముందు కంటితుడుపుగా డీఎస్సీ నిర్వహిస్తుండటం, కేవలం కొద్దిపాటి ఖాళీలకే నోటిఫికేషన్లు ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సువర్ణముఖి మీద వంతెన లేకపోవడంతో 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు డి.సిర్లాం గ్రామస్తులు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం వెళ్లాలన్నా.. పిల్లల చదువులకైనా కష్టంగా ఉందని వాపోయారు. బగ్గందొర వలస, గెడ్డలుప్పి గ్రామస్తులదీ ఇదే ఆవేదన. అధికారంలోకి రాగానే గెడ్డలుప్పి వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చిన బాబు గారు.. తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారు. నాలుగున్నరేళ్లుగా అక్కడ ఏ మాత్రం పురోగతి లేకుండా పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా నేను పాదయాత్రగా వస్తున్నానని తెలిసి హడావుడిగా జేసీబీ తెచ్చి పనులు చేస్తున్నట్లు భ్రమింపజేస్తున్నారని వారు వాపోయారు. సాయంత్రం ఆ నది వద్దకు నన్ను తీసుకెళ్లి మరీ ఆ తతంగాన్ని చూపించారు. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల ఖాళీలుండగా.. అందులో మూడో వంతు పోస్టులకు కూడా డీఎస్సీ నిర్వహించకపోవడం అన్యాయం కాదా? ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి మీ బినామీ ప్రైవేటు విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే కాదా? -వైఎస్ జగన్ -
295వ రోజు పాదయాత్ర డైరీ
-
295వ రోజు పాదయాత్ర డైరీ
12–11–2018, సోమవారం కొయ్యానపేట, విజయనగరం జిల్లా నన్ను చూడగానే ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకోవడం మనసును కదిలించింది.. పదిహేడు రోజుల విరామం తర్వాత ప్రజాక్షేత్రంలోకి మళ్లీ అడుగులేశాను. ఈ విరామానికి కారణమేమన్నది ప్రజలందరికీ తెలిసిందే. గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో నాపై జరిగిన హత్యాయత్నం నుంచి దేవుని దయ, ప్రజల ఆశీస్సులే నన్ను రక్షించాయి. ఆ ఘటన వెనకున్న కుట్ర, ఘటనానంతర పరిణామాలు, వాస్తవాలను సమాధి చేయాలన్న సర్కారు కుయత్నాలు, పాలకనేతల వ్యవహార శైలి.. దిగజారిపోయిన, విలువల్లేని రాజకీయాలకు నిదర్శనంగా నిలిచాయి. వైద్యుల సూచనల మేరకు గాయం కాస్త నయం అయ్యేదాకా విశ్రాంతినిచ్చి.. నేడు తిరిగి పాదయాత్రను ప్రారంభించాను. ఈ రోజంతా చాలా ఉద్విగ్నభరితంగా సాగింది. ఏడాదిగా సాగుతున్న పాదయాత్రలో ప్రజల యోగక్షేమాల గురించి నేను అడిగేవాడిని.. వారి కష్టాలు వినేవాడిని.. భరోసాగా ఉంటానంటూ ధైర్యాన్నిచ్చేవాడిని. అలాంటిది.. ఈ రోజు నన్ను కలిసిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, ఆత్మబంధువులంతా ‘అన్నా.. ఎలా ఉన్నావ్? బాబూ.. దెబ్బ మానిందా? ఆరోగ్యం బాగుందా? మేమున్నాం నీకు’ అంటూ నన్ను పరామర్శించడం కొత్తగా అనిపించింది. నన్ను చూడగానే ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకోవడం మనసును కదిలించింది. ఈ రోజు క్రైస్తవ సోదరులు, ముస్లిం పెద్దలు నా కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతేకాకుండా నేడు కార్తీక సోమవారం సందర్భంగా ములక్కాయవలసలోని పురాతన కాశీవిశ్వేశ్వరాలయంలో ఎంతోమంది అక్కచెల్లెమ్మలు నా కోసం శివార్చనలు చేసి.. ప్రసాదాలు తీసుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలు నాపట్ల చూపుతున్న తపన, తాపత్రయం కదిలించి వేసింది. మరికొంతమంది నా చేతికి రక్షలు కట్టారు. ఈ ప్రజల ప్రేమ, ఆప్యాయతలు చూస్తుంటే.. ప్రతిక్షణం ప్రజల కోసమే జీవించాలన్న నా సంకల్పం మరింత బలపడింది. ఈ ప్రపంచంలో ఏ శక్తీ నన్ను ప్రజల నుంచి విడదీయలేదన్న నమ్మకం మరింత దృఢపడింది. మధ్యాహ్న శిబిరం వద్ద రాజమండ్రికి చెందిన బలహీనవర్గాల నేతలు, తంబళ్లపల్లికి చెందిన కాపు నాయకులు పార్టీలో చేరారు. సాయంత్రం పాపయ్యవలస వద్ద చిట్టెమ్మ అనే మహిళా రైతు కలిసింది. రెండెకరాల పత్తి వేస్తే.. వర్షాల్లేక పంట దిగుబడి తగ్గిపోయిందని.. పండిన ఆ కాస్త దానికీ గిట్టుబాటు ధరలేక నష్టాలపాలయ్యామని వాపోయింది. అదే గ్రామంలో మరికొందరు రైతన్నలు కలిశారు. వెంగళరాయసాగర్ నుంచి వచ్చే కాల్వలకు పూడికలు తీయక, మరమ్మతులు చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రకృతి.. మరోవైపు పాలకుల నిర్లక్ష్యం.. అన్నదాతల పాలిట శాపంగా మారడం బాధనిపించింది. మడవలసకు చెందిన రుష్మి, రత్నాలు, దీప్తి తదితర గిరిజన బాలికలు కలిశారు. చదువుకోవాల్సిన వయసులో వంద రూపాయల కూలి పనులకు వెళుతున్నామని చెబుతుంటే.. బాధనిపించింది. మరోవైపు.. స్థోమతలేక ఆ బిడ్డల్ని చదివించడం లేదని వారి పెద్దలు వాపోయారు. కేవలం ఎన్నికలప్పుడే గిరిజన సంక్షేమం గుర్తుకొచ్చే పాలకులకు ఈ కష్టాలెలా కనిపిస్తాయి?! ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. కేవలం ఎన్నికలకు మూడు నెలల ముందు.. మూణ్ణాళ్ల ముచ్చటగా గిరిజనులకు, మైనార్టీలకు మంత్రి పదవులివ్వడం.. ఆ వర్గాలను మరోమారు మోసపుచ్చడానికే కాదా? -వైఎస్ జగన్ -
294వ రోజు పాదయాత్ర డైరీ
-
294వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,211.5 కి.మీ 25–10–2018, గురువారం పాయకపాడు, విజయనగరం జిల్లా దాడి ఘటన నా సంకల్పాన్ని మరింత బలోపేతం చేసింది ఎత్తయిన కొండలపై ఉన్న గిరిజన గ్రామాలు.. పగులుచెన్నేరు, పట్టుచెన్నేరు. ఎలాంటి రోడ్డు సౌకర్యమూ లేని ఆ మారుమూల గ్రామాల నుంచి వచ్చిన చోడుపల్లి బీసు, కోనేటి బేత్ర, తాడంగి ముసిరి తదితర గిరిజన సోదరులు పాదయాత్రలో నన్ను కలిశారు. నాన్నగారి హయాంలో ఆ ఊళ్లకు జరిగిన మేళ్లను గుర్తుచేసుకున్నారు. అసలా గ్రామాలకు మొట్టమొదటిసారి కరెంటు అనేది వచ్చింది.. శుద్ధి చేసిన తాగునీటిని అందించింది.. సంక్షేమ పథకాలంటే ఏంటో చూపించిందీ నాన్నగారే. ‘మాకు వరి అన్నం అంటే ఏంటో తెలిసింది మీ నాన్నగారి హయాంలోనే. ఆయనకన్నా ముందు మా పగులుచెన్నేరు గ్రామానికి నాలుగంటే నాలుగు పింఛన్లే వచ్చేవి. మీ నాన్నగారి హయాంలో ఏకంగా 150 పింఛన్లు మంజూరయ్యాయి. మళ్లీ బాబుగారొచ్చాక వాటిని 60కి తగ్గించారు. వాటిలో కూడా బయోమెట్రిక్ అని వేలిముద్రలు పడలేదని సగానికి సగం కోతపడేలా చేస్తున్నారు’అంటూ ఆ గిరిజన సోదరులు వాపోయారు. అత్యంత వెనుకబడ్డ గిరిజనులపై సైతం నిర్దయగా వ్యవహరిస్తుండటాన్ని చూసి చాలా బాధేసింది. సంక్షేమమంటే ఏంటో చూపించిన నాన్నగారిని ఆ గిరిజన గ్రామాలు మరువలేకున్నాయి.. ఆ మంచి రోజులు మళ్లీ రావాలని ఆశగా ఎదురుచూస్తున్నాయి. మక్కువ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు కలిశారు. ఆ ఊళ్లోనే బీసీ హాస్టల్‌ను ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మూసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పాఠశాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని వాపోయారు. శిథిలమైపోయి పెచ్చులూడుతున్న తరగతి గదులు.. దీంతో ఆరుబయటే పాఠాలు. వర్షం వస్తే బడికి సెలవే. మధ్యాహ్న భోజనంలో కుళ్లిపోయిన కోడిగుడ్లు.. నిలిచిపోయిన స్కాలర్షిప్లు.. ఇంతవరకూ అందని పాఠ్యపుస్తకాలు.. చాలీచాలని కొలతలతో, నాసిరకం గుడ్డతో కుట్టిన యూనిఫాం.. ఇదీ ఆ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దుస్థితి. బినామీ కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్న ఈ పాలకులకు ప్రభుత్వ పాఠశాలలపై శ్రద్ధేముంటుంది? ఈ రోజు వైజాగ్ ఎయిర్‌పోర్టులో అనూహ్యంగా నాపై దాడి జరిగింది. దేవుడి దయ, రాష్ట్ర ప్రజల ప్రేమాభిమానాలు ఎప్పుడూ నన్ను కాపాడతాయన్న నా నమ్మకం వమ్ముకాలేదు. గాయంతోనే బయటపడ్డాను. ఇలాంటి పిరికిచర్యలతో నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రజలకోసం ఎంతైనా కష్టపడాలన్న నా సంకల్పాన్ని ఈ సంఘటన మరింత బలోపేతం చేసింది. చివరిగా ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గిరిజనుల సంక్షేమం కోసం మీ మేనిఫెస్టోలో 20 హామీలిచ్చారు. ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా? బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, హాస్టల్ సదుపాయాలు, కొత్త రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైంది? వారికి వస్తున్న స్కాలర్షిప్లను ఆపేయడం.. ఉన్న హాస్టళ్లను మూసేయడం వాస్తవం కాదా? కొత్త రెసిడెన్షియల్ విద్యాసంస్థను ఒక్కటైనా ఏర్పాటు చేశారా? -వైఎస్ జగన్ -
293వ రోజు పాదయాత్ర డైరీ
-
293వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,209.4 కి.మీ 24–10–2018, బుధవారం చప్పబుచ్చమ్మపేట, విజయనగరం జిల్లా అమాయక గిరిజనుల కడుపుకొట్టి దోచుకోవడమన్నది ఆటవికం కాక మరేంటి? ఈ రోజు మహర్షి వాల్మీకి జయంతి. ఆ తేజోమూర్తికి నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించాను. బాగువలస వద్ద 3,200 కి.మీ మైలురాయిని చేరుకున్నందుకు గుర్తుగా ఓ మొక్క నాటాను. అందమైన ప్రకృతి చెంతనే ఉన్నా.. అమాయక గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొండ ప్రాంతాల్లోని వారి గ్రామాలకు రహదారులే లేవు. కిందికి దిగివచ్చి నిత్యావసరాలు తెచ్చుకోవాలనుకుంటే.. ఒళ్లు హూనమైపోతోందంటూ మారేపాడు అక్కచెల్లెమ్మలు మొరపెట్టుకున్నారు. చేసిన ఉపాధి పనులకు డబ్బులే ఇవ్వడం లేదని, సంక్షేమ పథకాలేవీ అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ క్రెషి వర్కర్లు కలిశారు. మూడేళ్లపాటు కొండల్లోని గిరిజన గ్రామాల్లో గొడ్డుచాకిరీ చేయించుకుని ఉద్యోగాల్లోంచి తీసేసిందీ ప్రభుత్వం.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇవ్వాల్సిన 20 నెలల జీతం కోసం తీవ్ర ఆందోళన చేయాల్సి వచ్చిందని వాపోయారు. అంగన్వాడీలకు సహాయకులుగా పనిచేసే లింకు వర్కర్లదీ ఇదే పరిస్థితి. సాక్షర భారత్ కోఆర్డినేటర్లకూ అదే జరిగింది.. జూన్ వరకూ పనిచేయించుకుని, మార్చి నుంచే తీసేసినట్లు నోటీసులిచ్చారట. పది నెలల జీతమూ ఎగ్గొట్టారట. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్య మిత్రలు, ఆదర్శ రైతులు ఇలా ఎవర్ని తీసుకున్నా.. ఉద్యోగాలు ఊడుతున్నాయన్న ఆవేదనలే. ఉద్యోగం వచ్చిందన్నవారు ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కరంటే ఒక్కరూ కానరాకపోవడం విస్మయం కలిగించే విషయం. కాళ్లరిగేలా తిరిగినా పింఛన్ ఇవ్వడం లేదన్నా.. అంటూ నక్కడవలస అక్కచెల్లెమ్మలు కన్నీటిపర్యంతమయ్యారు. ఆ విధివంచిత, వితంతు అక్కచెల్లెమ్మలకు పింఛన్లు కూడా ఇవ్వకపోవడం చాలా దారుణమనిపించింది. సన్యాసిరాజుపేట, రామస్వామివలస, బర్నికవలస గిరిజన గ్రామాల యువకులు కలిశారు. అక్కడున్న తామరకొండే.. ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ జీవమట. దానిమీద పోడు వ్యవసాయం చేసుకుంటారు. ఆ కొండమీది అటవీ ఉత్పత్తులే వారికి జీవనాధారం. అప్పట్లో నాన్నగారు అటవీ పట్టాలు కూడా ఇచ్చారట. ఆ కొండ మీద నుంచి వచ్చే పావురాయిగెడ్డ నీరే.. చుట్టుపక్కల ఉండే 35 చెరువులకు ఆధారం. దాదాపు 12 గ్రామాలకు సాగు నీరు అందించే జీవ జలమది. ఆ పావురాయిగెడ్డను మినీ రిజర్వాయర్‌గా మార్చాలని నాన్నగారు సంకల్పించారు. అట్లాంటి తామరకొండ మీద పచ్చరాబందుల కళ్లు పడ్డాయిప్పుడు. కొండలోని విలువైన గ్రానైట్ నిక్షేపాలను దోచుకోవాలని పన్నాగం పన్నారు. వడ్డించేవాడు మనోడైతే ఇక తిరుగేముంటుంది.. రాత్రికి రాత్రే అన్ని అనుమతులూ తెచ్చేసుకున్నారట. సంవత్సరాల తరబడి రహదారి సౌకర్యం కల్పించాలని ప్రజలు నెత్తీనోరు కొట్టుకున్నా పట్టించుకోని వారు.. వారం రోజుల్లో కొండకు రోడ్డు వేయించుకున్నారు. కేవలం పంచాయతీ తీర్మానం చేయించుకోవడం కోసం వైఎస్సార్సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ను ప్రలోభాలకు గురిచేసి పార్టీ మార్పించేశారు.. పంచాయతీ తీర్మానం చేయించుకున్నారు. ప్రజలందరూ ముకుమ్మడిగా అడ్డుకున్నా పచ్చనేతల దౌర్జన్యాలముందు ఏమీ చేయలేక నిస్సహాయులైపోయారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు.. ప్రజల మీద అక్రమ కేసులు బనాయించారట. పాలకపార్టీ నేతల దాష్టీకాలు వింటుంటే.. చాలా బాధేసింది. అన్నెంపున్నెం ఎరుగని అమాయక గిరిజనుల కడుపుకొట్టి మరీ బరితెగించి దోచుకోవడమన్నది ఆటవికం కాక మరేంటి? -వైఎస్ జగన్ -
292వ రోజు పాదయాత్ర డైరీ
-
292వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,199.6 కి.మీ 23–10–2018, మంగళవారం సన్యాసిరాజుపేట, విజయనగరం జిల్లా సాధారణ జ్వరాలతో ప్రజలు చనిపోతుంటే మీకు అవమానంగా అనిపించడం లేదా బాబూ? ఈరోజు ఉదయం పాదయాత్ర మొదలవగా నే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉపాధ్యాయులు కలిశారు. వారంద రూ గిరిజనులే. గిరిజన గ్రామాల్లో సరైన వసతు ల్లేకున్నా, చాలీచాలని జీతాలతో పదహారేళ్లుగా సేవలందిస్తున్నామని చెప్పారు. ఏడాదిలో సెలవు లు పోనూ వారికి జీతాలిచ్చేది 10 నెలలేనట. ‘రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నాం. ఎప్పటికై నా మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ కాకపోతాయా అన్న ఆశతో ఉన్నాం. ఈ ప్రభుత్వం త్వరలో పెడతామంటున్న డీఎస్సీలో మా పోస్టులను ఖాళీ లు గా చూపిస్తూ మా ఉద్యోగాలకే ఎసరు పెడుతోంది. ఇన్నేళ్లుగా గిరిజన గ్రామాల్లో సేవలందించినందుకు ప్రతిఫలం ఇదేనా? ఈ వయసులో ఉన్నట్టుండి ఉద్యోగాల నుంచి తీసేస్తే మా గతేం కావాలి? మా కుటుంబాలు ఏమైపోవాలి?’అంటూ ఆ టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్పుడు తమను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఉద్యోగాల్లోంచి పీకేయాలనుకుం టున్న బాబుగారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రను ఇటీవల విషజ్వరాలు కుదిపేశాయి. విజయనగరంలో అయితే అత్యధికం. కరాసవలస గ్రామంలో ఇటీవల విష జ్వరాలతో మరణించినవారి కుటుంబసభ్యులు వచ్చి నన్ను కలిశారు. వారి కష్టాలు వింటుంటే గుండె తరుక్కుపోయింది. తండ్రి లేక తల్లే దిక్కనుకుంటే.. ఆ తల్లి విషజ్వరం బారినపడి మరణించడంతో అనాధగా మిగిలిన కొత్తమ్మ అనే బాలిక, అదే రీతిలో ఒంటరైన నవీన్, ఎదిగొచ్చిన బిడ్డను కోల్పోయిన వెంకమ్మ అనే అక్క, భర్తను కోల్పోయి ఒంటరైపోయిన గౌరమ్మ, కూతురు చనిపోవడంతో ఆమె పిల్లల భారం మీద పడ్డ చిన్నయ్య అనే తాత.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో విషాదం. పడకేసిన పారిశుధ్యం, కలుషితమైపోయిన తాగునీరు, విజృంభించే దోమలు, జాడేలేని వైద్య సిబ్బంది, కరువైన 104 సేవలు.. ఇలా కమ్ముకున్న ప్రభుత్వ నిర్లక్ష్యమే 250 గడపలున్న ఆ ఊరిలో 200 మందికిపైగా విషజ్వరాలను అంటగట్టింది. ఎమ్మె ల్యే రాజీనామా చేస్తానని బెదిరించే దాకా ఆవైపే రాని వైద్యులు, కన్నెత్తి చూడని అధికార యం త్రాంగం, నెల వ్యవధిలో 11 మంది చనిపోయినా కళ్లు తెరవని ప్రభుత్వం, కుటుంబాలకు కుటుంబాలు జ్వర మరణాలతో అతలాకుతలమైపోయి నా పట్టించుకోని ముఖ్యమంత్రి.. ఇదీ కరాసవల స గ్రామ దయనీయ పరిస్థితి. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే ఆ బాధిత కుటుంబాల్లో విషాదానికి కారణమైనప్పటికీ.. వారందరికీ చంద్రన్న బీమా లేదు. ప్రభుత్వ పరిహారమూ రాలేదు. ఇప్పుడు వాళ్లంతా ఏమైపోవాలి? ఎలా బతకాలి? ఈరోజు ఎంతోమంది ఆరోగ్య సంబంధ సమస్యలతో నా వద్దకు వచ్చారు. బిడ్డ కాళ్లకు ఆపరేషన్ చేయించే ఆర్థిక స్థోమత లేదంటూ రత్నాలు అనే అక్క, మెదడుకు శస్త్రచికిత్స చేయించుకుందామంటే ఆరోగ్య శ్రీ వర్తించదంటున్నారని తరుణ్ అనే సోదరుడు, హెచ్ఐవీతో బాధపడుతున్నా పెన్షన్ ఇవ్వడం లేదంటూ తల్లిదండ్రులు లేని ఓ అనాధ బాలిక, వచ్చే కాస్త సంపాదన కూడా బిడ్డ తలసీమియా చికిత్సకే ఖర్చయిపోతోందంటూ పద్మ అనే సోదరి, వెన్నెముక ఆపరేషన్ చేయించాలంటే రూ.లక్షలు ఖర్చవుతుందని, అంత స్థోమత లేక బిడ్డను అలానే వదిలేసిన కనక అనే అక్క, 2 కిడ్నీలు పాడైపోవడంతో వైద్యం కోసం అప్పుల పాలయిపోతున్నానని వెంకటేశ్ అనే సోదరుడు.. ఇలా ఒక్కొక్కరూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈరోజు పాదయాత్ర రాష్ట్రంలో నెలకొన్న అనా రోగ్య దుస్థితికి అద్దం పట్టింది. వైద్య, ఆరోగ్య శాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారు వీటన్నిటికీ ఏమని సమాధానం చెబుతారు? ఈరోజు నేను బస చేసిన సన్యాసిరాజుపేట గ్రామస్తులు వచ్చి కలిశారు. ఆ ఊరంతా గిరిజనులేనట. విశేషమేమంటే ఆ చిన్నపాటి గ్రామం లో 40కి పైగా కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగులుండటం. ఆ ఉద్యోగాలన్నీ గత ప్రభుత్వాల హయాంలో వచ్చినవేనట. కానీ ఈ నాలుగున్నరేళ్ల బాబు గారి పాలనలో ఒక్కటంటే ఒక్క కొత్త ఉద్యోగమూ రాకపోవడం మరో విశేషం. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడిమాంబతల్లి సిరిమానోత్సవం సందర్భంగా మధ్యాహ్నం నుంచి పాదయాత్రకు విరామం ప్రకటించాను. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. సము ద్రాన్ని కంట్రోల్ చేశానని, తుపాన్లను అదుపులో పెట్టానని, కరువులను జయించానని, ప్రకృతిని నియంత్రించగలుగుతున్నానని గొప్పలు చెప్పుకుంటున్న మీకు సాధారణ జ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుండటం అవమానకరంగా అనిపించడం లేదా? -వైఎస్ జగన్ -
291వ రోజు పాదయాత్ర డైరీ
-
291వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,193.6 కి.మీ 22–10–2018, సోమవారం సాలూరు, విజయనగరం జిల్లా నిత్యావసరాల ధరలు పెరిగింది మీ చర్యల వల్లే కదా బాబూ? ఈరోజు బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ప్రజాస్వామిక వ్యవస్థనే భ్రష్టుపట్టించిన చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి.. బొబ్బిలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అమ్ముడుపోయారు. సాలూరులో గెలిచిన గిరిజన బిడ్డ మాత్రం విలువలనే విశ్వసించాడు. ఉదయం బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం రైతులు నన్ను కలిశారు. ఈ ప్రభుత్వం పెద్దగెడ్డ కాలువను నిర్లక్ష్యం చేయడంతో సాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నామన్నారు. పిల్ల కాలువలను అసలు పట్టించుకోవడం లేదన్నారు. ఉన్న కాలువ నిర్వహణను కూడా గాలికి వదిలేయడంతో నాలుగేళ్లుగా వేసిన పంటలు వేసినట్టుగా ఎండిపోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నీరు–చెట్టు పథకం పేరుతో చేయని పనులకు సైతం బిల్లులు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న అధికారపక్ష నాయకులు.. ఉన్న కాలువల నిర్వహణకు కాసిన్ని నిధులు కూడా మంజూరు చేయకపోవడం దారుణం. ఇది రైతన్నల పాలిట శాపం. మిర్తివలస దగ్గర చిట్టిచెల్లెమ్మలు ‘జగనన్నా..’ అంటూ హుషారుగా పాటలు పాడుతూ కోలాటం ఆడారు. జెన్నివలసకు చెందిన హేమా వతి అనే చెల్లెమ్మ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆ కుటుంబం కిందామీదా పడి రూ.లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించినా కుడి చెయ్యి మాత్రం ఇంకా చచ్చుబడిపోయే ఉంది. అయినా తనకొచ్చిన సమస్యకు తల్లడిల్లకుండా ఆ చెల్లెమ్మ ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. పారా ఒలింపిక్స్ పరుగు పందెంలో జాతీయ స్థాయిలో రాణించింది. ఆమె ఆత్మవిశ్వాసం స్ఫూర్తిదాయకం. ‘ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి.. నాకు వచ్చిన కష్టం మరొకరికి రాకుండా చూడ న్నా’ అంటూ ఆ చెల్లెమ్మ పెద్ద మనసుతో కోరింది. అభిమానానికి దూరాభారాలుండవు. లేకపోతే ఎక్కడి బొబ్బిలిలోని జెన్నివలస. ఎక్కడి ఇడుపులపాయ. జెన్నివలసకు చెందిన 90 ఏళ్ల సత్యవతమ్మకు నాన్నగారంటే అభిమానం. ఇడుపులపాయకు వెళ్లి.. నాన్నగారు శాశ్వత విశ్రాంతి పొందిన చోట మొక్కలకు నీళ్లు పోసుకుంటూ నెల పాటు ఉందట. ఆ అవ్వ స్వచ్ఛమైన అభిమానానికి నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. మధ్యాహ్నం శిబిరం వద్ద కొండకెంగువ గ్రామ యువకులు కలిశారు. తమ ఊరికున్న ఆరు కిలోమీటర్ల రోడ్డు పరిస్థితి దారుణాతిదారుణమని చెప్పారు. ఆ ఊరికి న్యూస్‌పేపర్లు రావు. అంబులెన్స్‌లు అడుగుపెట్టవు. విద్యార్థుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆరు నెలల క్రితం దండాసి మేరి అనే గర్భిణి.. 108 వాహనం రాకపోవడంతో ఆటోలోనే ఆస్పత్రికి బయలుదేరిందట. దారిలో కుదుపులకు పరిస్థితి విషమించి రక్తస్రావమై.. ప్రసవం కూడా జరిగిపోయిందట. పుట్టిన బిడ్డ పురిటిలోనే కన్నుమూసింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ.. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నప్పటికీ పాలక నేతలు ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై ఆ యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడీకి, అక్రమ మైనింగ్‌ల కోసం రాత్రికిరాత్రే రోడ్లేసుకునే పచ్చ నేతలు.. సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నా ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడమన్నది అమానుషం. మధ్యాహ్నం సాలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించాను. ఆ పేరు వినగానే ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు గుర్తొస్తారు. మల్లె తోటలకూ సాలూరు ప్రసిద్ధి. నాన్నగారు తలపెట్టిన జలయజ్ఞపు తొలి ఫలం పెద్దగెడ్డ రిజర్వాయర్ ఈ నియోజకవర్గంలోనే ఉంది. విజయవాడతో పోటీపడుతూ.. లారీ పరిశ్రమకు సంబంధించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది సాలూరు. ఈ పరిశ్రమను ఆదుకుంటానని బాబుగారు హామీ ఇచ్చి మరిచారు. గతంలోనే పనులు మొదలుపెట్టిన ఆటోనగర్ ఆగిపోవడం ఆయనగారికున్న శ్రద్ధకు నిదర్శనం. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే సామాన్య ప్రజలు వాడే పెట్రోల్, డీజిల్‌పై అదనపు పన్నులు విధించి మొన్నటిదాకా దేశంలోనే అత్యధిక ధరలు వసూలు చేశారు. ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను అధికంగా వసూలు చేస్తున్న అగ్ర రాష్ట్రాల జాబితాలో మీరూ ఉన్నారు. అదే సమయంలో ధనవంతులు ప్రయాణించే విమాన ఇంధనంపై మాత్రం అతి తక్కువ పన్ను విధించింది వాస్తవం కాదా? రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి.. పేద ప్రజలపై అధిక భారం పడటానికి మీ చర్యలు కారణం కాదా? -వైఎస్ జగన్ -
290వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,182.1 కి.మీ 21–10–2018, ఆదివారం రామభద్రపురం, విజయనగరం జిల్లా ఈ దళారీల రాజ్యంలో రైతన్నలకు శోకమే మిగులుతోంది.. క్రీడల విషయంలో కోటలు దాటే మాటలు చెబుతోందీ ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో చేతలు మాత్రం శూన్యం. వెనుకబడ్డ ఈ విజయనగరం జిల్లా ఎందరో మేటి సాఫ్ట్‌బాల్ క్రీడాకారులను అందిస్తోంది. ఈ రోజు ఉదయం చాలామంది అట్టి క్రీడాకారులు కలిశారు. అందరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారే. జాతీయ, అంత ర్జాతీయ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహిం చినవారే. దురదృష్టకర విషయ మేంటంటే.. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే సందర్భాల్లో సైతం ప్రయాణ ఖర్చులకు, యూనిఫాంలకు, క్రీడా సామగ్రికి దాతలను వెతుక్కోవాల్సి రావడం.. ప్రభుత్వ ప్రోత్సాహం ఇసుమంతైనా లేకపోవడం. ఈ రోజు పాదయాత్ర సాగిన రామభద్రపురం మండలంలో ఎటుచూసినా కూరగాయల తోటలే. ఇక్కడి కూరగాయల మార్కెట్టు చాలా ప్రసిద్ధి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లకు రోజూ కూరగాయలు ఎగుమతి అవుతుంటాయి. కానీ.. వాటిని పండించే రైతన్నల పరిస్థితి మాత్రం దయనీయంగానే ఉంది. సోంపురానికి చెందిన మార్పిన లక్ష్మి.. రెండెకరాల సొంత భూమి ఉన్నా సాగునీరందక కూలీగా మారానని చెప్పింది. రోజూ రూ.120 కూలి డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తు న్నానంది. కూరగాయల్ని నిల్వచేసుకునే సదుపాయంలేక.. గత్యంతరంలేని పరిస్థితుల్లో ఏరోజుకారోజు దళారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.. చుక్కా సత్యవతి అనే మరో రైతు. ఈ దళారీల రాజ్యంలో అన్ని ప్రాంతాల రైతన్నలకు శోకమే మిగులుతోంది. యిట్లామామిడిపల్లి, బంకుడువలస గ్రామాల ప్రజలు కలిశారు. ఈ గనుల శాఖామంత్రి ఇలాకాలో జరుగుతున్న మాంగనీసు దోపిడీని వివరించారు. ఇక్కడ అధికారపార్టీ నేతలు అక్రమ మైనింగ్ చేయడమే కాకుండా.. ఆగనుల నుంచి వచ్చిన నాసిరకం రాయిని, మట్టిని సైతం రోడ్డు పనులకు వేసినట్టు చూపి బిల్లులు కొల్లగొడుతున్నారట. అందివచ్చిన మంత్రి పదవులు.. అభివృద్ధికి కాకుండా దోచుకోవడానికే పనికొస్తున్నాయని గ్రామస్తులు వాపోయారు. సాయంత్రం ఖమ్మం జిల్లా చిన్నబీరపల్లి నుంచి వచ్చిన కందుకూరు గంగరాజు అనే తాత కలిశాడు. చెక్కపై బొమ్మలు చెక్కడంలో దిట్ట ఆ విశ్వబ్రాహ్మణుడు. నాన్నగారి పాదయాత్రలోను, సోదరి షర్మిల పాదయాత్రలోను, నేడు నన్నూ కలిసి.. తాను చెక్కిన కళాకృతులను బహూకరించాడు. 95 ఏళ్ల వయసులో కళ కోసం ఆయన పడుతున్న తపన, చేస్తున్న శ్రమ స్ఫూర్తిదాయకం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి మండలంలో గోడౌన్లు, కోల్డ్‌సోరేజీ వసతులు కల్పించి.. రైతుకు లాభసాటి ధర కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్లలో కనీసం ఒక్క మండలంలోనైనా నిర్మించారా? -వైఎస్ జగన్ -
289వ రోజు పాదయాత్ర డైరీ
-
289వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటివరకు నడచిన దూరం: 3,175.5 కి.మీ. 20–10–2018, శనివారం పారాది, విజయనగరం జిల్లా ఆడపిల్లల ఆత్మగౌరవం పట్ల ఈ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం క్షమార్హం కాదు ఈ రోజంతా బొబ్బిలి పట్టణం, మండల పరిధిలో పాదయాత్ర సాగింది. ఎక్కడా ఇసుమంతైనా అభివృద్ధి కనిపించలేదు. అడుగడుగునా సమస్యల తోరణాలే.. ఈ రోజు కూడా జూట్‌మిల్లు కష్టాలు వినిపించాయి. భవానీ అనే సోదరి.. పక్షవాతంతో బాధపడుతున్న తన తల్లిని తీసుకొచ్చి కలిసింది. జూట్‌మిల్లు మూతపడటంతో అందులో కార్మికుడిగా పనిచేసిన తన భర్త దినసరి కూలీగా మారాడని చెప్పింది. కుటుంబ పోషణ భారమైందని వాపోయింది. పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించిన తన పిల్లల్ని పైచదువులు చదివించడం కష్టంగా ఉందని కన్నీరుపెట్టుకుంది. తల్లికి వైద్యమూ భారమేనంది. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌కు భూములిచ్చిన రైతన్నలు కలిశారు. భూములిచ్చిన రైతులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న నేతల మాటలు నమ్మి.. పిల్లల్ని వృత్తి విద్యాకోర్సులు చదివిస్తే ఆశ నిరాశ అయిందని వాపోయారు. ఓ వైపు భూములు త్యాగం చేసి.. మరో వైపు ఆ పరిశ్రమల కాలుష్యపు బాధలు తాము అనుభవిస్తుంటే.. వచ్చిన కొద్దో గొప్పో ఉద్యోగాలను సైతం స్థానికేతరులకే ఇచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవానివలస గిరిజన కాలనీ అక్కచెల్లెమ్మలు కలిశారు. రోడ్లు లేవు.. కొళాయిల్లేవు.. కరెంటు లేదు.. మురుగు కాల్వలు లేవంటూ కష్టాలు చెప్పుకొన్నారు. గున్నతోటవలస ఎస్సీ కాలనీదీ అదే పరిస్థితట. బొబ్బిలి పట్టణానికి ఆనుకునే ఉన్నా.. మా కాలనీల కష్టాలు ఈ పాలకులకు కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొండకెంగువ గ్రామస్తులు కలిసి ఆ ఊరి రహదారి కష్టాలు చెప్పుకొన్నారు. అధ్వానమైన ఆ రోడ్డుపై 108 వెళ్లాలన్నా కష్టమేనన్నారు. ఆటోలలోనే ప్రసవాలు జరిగిన ఘటనలూ ఉన్నాయన్నారు. ఆ రహదారి మరమ్మతులకు నోచుకోక ఇరవై గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారట. రోడ్డు వేయిస్తామని పదే పదే మాటిచ్చి.. మోసం చేసిన పాలక నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు మండిన ప్రజలు మంత్రిని సైతం ఊళ్లోకి రాకుండా అడ్డుకున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పల్రాజుపేట రహదారిదీ ఇదే పరిస్థితి. పారాది ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థినులు కలిశారు. 350 మంది చదువుకుంటున్న ఆ పాఠశాలలో పిల్లలకు ఒక్కటంటే ఒక్క మరుగుదొడ్డీ లేదంట. అత్యవసరమైనప్పుడు మరుగు కోసం వెతుక్కోలేక.. సిగ్గుతో చచ్చిపోతున్నామని ఆ చెల్లెమ్మలు చెబుతుంటే.. చాలా బాధేసింది. ఆడపిల్లల ఆత్మగౌరవం పట్ల ఈ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం ఎంతమాత్రం క్షమార్హం కాదు ఇలా ఈ రోజంతా దారి పొడవునా.. రోడ్లు లేవని, మంచినీరు లేదని, మరుగుదొడ్లు లేవని, మౌలిక సదుపాయాలు కరువయ్యాయని.. రకరకాల సమస్యలు వెల్లువెత్తాయి. ఈ ప్రజల ఓట్లతో గెలిచిన నేతలేమో.. అభివృద్ధి సాకుతో పార్టీ ఫిరాయించి, మంత్రి పదవులు అనుభవిస్తూ ప్రజలకు ముఖంచాటేస్తున్నారు. అవినీతి నల్లడబ్బుతో వారిని కొన్న ప్రభుత్వ పెద్దలేమో.. ఈ ప్రజలతో అవసరమేమని.. నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రోజు పాదయాత్ర ముగిశాక.. తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడానికి పార్టీ వేసిన కమిటీ సభ్యులు కలిశారు. తుపాను నష్టం, ప్రభుత్వ వైఫల్యం.. సిక్కోలు ప్రజలకు చేసిన తీవ్ర గాయాన్ని వివరించారు. పార్టీ బృందాలు చేపడుతున్న సహాయక చర్యలు సంతృప్తినిచ్చాయి. మరింత ముమ్మరం చేసి అండగా నిలవాలని సూచించాను. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రతి గ్రామానికీ తారు రోడ్డు, ప్రతి వీధికీ సిమెంటు రోడ్డు అంటూ.. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైంది? రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రహరీలు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం రెండేళ్లలో కల్పిస్తామని మేనిఫెస్టోలోని 35వ పేజీలో హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్లయింది.. కనీసం గుర్తయినా ఉందా? -వైఎస్ జగన్ -
288వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటిదాకా నడిచిన దూరం 3,168.9 కిలోమీటర్లు 17–10–2018, బుధవారం బొబ్బిలి, విజయనగరం జిల్లా బాబుగారి హయాంలోనే పరిశ్రమలు మూతబడుతుండటం యాదృచ్ఛికం కాదేమో! వ్యవసాయాధారిత పరిశ్రమలు బాగున్నంతకాలం కార్మిక, కర్షక జీవితాల్లో వెలుగులు నిండుతాయి. అవి ఇబ్బందుల్లో పడితే.. వారి జీవితాలు తలకిందులవుతాయి. ఈ రోజు కలిసిన పంచదార, జూట్ మిల్లుల కార్మికుల కష్టాలు వింటుంటే.. మనసంతా బరువెక్కింది. ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు నన్ను కలిశారు. బకాయిలు అందక రైతన్నలు, వేతనాలు అందక కార్మికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ‘గతంలో ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో నడిచే చక్కెర ఫ్యాక్టరీని బాబుగారు కారుచౌకగా ప్రైవేటు వారికి కట్టబెట్టేశారు. కార్మికుల జీవితాలను పణంగా పెట్టేశారు. దాని ఫలితమే ఈ రోజు మా ఈ దుస్థితి. నేతల స్వార్థ ప్రయోజనాలు మా పాలిట శాపాలయ్యాయి’ అని ఆ కార్మిక సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాబుగారి హయాంలోనే మూడున్నరేళ్ల కిందట మూతబడ్డ ఎస్ఎల్ఎస్ జూట్ మిల్లు కార్మికులదీ అదే వ్యథ. దశాబ్దాలుగా నమ్ముకున్న ఫ్యాక్టరీ.. ఒక్కసారిగా మూతపడేసరికి వారి జీవితాలు ఎంతగా ఛిద్రమైపోయాయో చెప్పారు. దాదాపు 35 మంది కార్మికులు మనోవేదనతో అనారోగ్యంపాలై మరణించారట. ఎంతోమంది కార్మికులు కూలీలుగా మారారు.. వలసెళ్లిపోయారు. రామకృష్ణ అనే కార్మికుడిది మరింత విషాదం. ఇంజనీరింగ్ చదువుతున్న ఆయన ఒక్కగానొక్క కొడుకు కాలేజీ ఫీజులు కట్టలేక.. చదువు ఆగిపోతుందన్న వ్యథతో ఆత్మహత్య చేసుకున్నాడట. ఇలా ఒక్కొక్కరి ఆవేదన వింటుంటే గుండె బరువెక్కింది. రాష్ట్రంలోని సహకారరంగ పరిశ్రమలైనా, ప్రభుత్వరంగ సంస్థలైనా.. కేవలం బాబుగారి హయాంలోనే మూతబడుతుండటం యాదృచ్ఛికం కాదేమో! పాతపెంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులందరూ ఒక్కసారిగా వచ్చి నన్ను కలిశారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి పాఠశాలకు వెళ్లే రోడ్డంతా పూర్తిగా మట్టిరోడ్డు, గుంతలమయం. వర్షం వస్తే అడుగుతీసి అడుగుపెట్టలేని పరిస్థితి. చుట్టూ తిరిగి 5 కిలోమీటర్లు నడిచి వెళ్లే కష్టం. ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందన్న నమ్మకమే లేదు.. మీరొచ్చాకైనా ఈ రోడ్డును బాగుచేయించాలని ఆ చిన్నారులు కోరారు. చదువుల దారిని చక్కబెట్టే ప్రయత్నమే చేయలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? బొబ్బిలి మున్సిపాల్టీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కలిశారు. తనది చాలీచాలని వేతనమైనా నాన్నగారి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో తన ముగ్గురు బిడ్డలు ఇంజనీరింగ్ పట్టభద్రులయ్యారని గర్వంగా చెప్పాడు.. చిన్నకృష్ణ అనే కార్మిక సోదరుడు. నాన్నగారి హయాంలోనే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు కూడా మాఫీ అయ్యాయని ఆనందంగా చెప్పారు. కానీ నేడు పారిశుద్ధ్య పనులను ప్రైవేటువారికి అప్పగిస్తున్న బాబుగారి నిర్వాకం వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదమేర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎంతమంది చిరుద్యోగుల జీవితాలు బలైపోయినా ఫర్వాలేదు.. తన కమీషన్లే ముఖ్యం అని భావించే పాలనలో ఈ కష్టాలు తప్పవేమో. సాయంత్రం బొబ్బిలిలో జరిగిన భారీ బహిరంగ సభతో ఈ రోజు పాదయాత్ర ముగిసింది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఒక్క చక్కెర ఫ్యాక్టరీ సంక్షోభంలో పడితేనే వేలాది మంది రైతులు, కార్మికుల జీవితాలు తలకిందులవుతున్నాయి. మరి.. కేవలం మీ ఒక్కరి స్వార్థం వల్ల రాష్ట్రంలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలు, సహకార డెయిరీలు మొదలుకుని.. జూట్ మిల్లులు తదితర ఫ్యాక్టరీలు కోకొల్లలుగా మూతబడుతున్నాయే.. వాటిపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాల కన్నీటికి కారణం మీరు కాదా? -వైఎస్ జగన్ -
287వ రోజు పాదయాత్ర డైరీ
-
287వ రోజు పాదయాత్ర డైరీ
16–10–2018, మంగళవారం పెద భీమవరం, విజయనగరం జిల్లా క్రీడాకారులకు సాయం చేయరుగానీ.. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తారట! ఈ పాలనలో సంక్షేమ పథకాల అమలు అంతంత మాత్రమే. అరకొరగా అమలయ్యే ఆ కొన్నింటిలోనూ రాజకీయ వివక్షే. ఇక అర్హులైన పేదలకు న్యాయం జరిగేదెలా? గజరాయునివలసకు చెందిన కృష్ణ అనే సోదరుడికి రెండు కళ్లూ లేవు. అంధుడైన అతనికి దివ్యాంగుల కోటాలో ఎస్సీ కార్పొరేషన్ లోను మంజూరైంది. కానీ పార్టీ వివక్షతో జన్మభూమి కమిటీలు లోన్ రానీయకుండా చేస్తున్నాయట. లోచర్లకు చెందిన శంకరరావుదీ అదే పరిస్థితి. వృత్తిరీత్యా బైక్ మెకానిక్. బీసీ కార్పొరేషన్ లోన్ తీసుకుని చిన్న మెకానిక్ షాపు పెట్టుకోవాలని ఆశించాడు. ఆ లోను కోసం నాలుగేళ్లుగా చేయని ప్రయత్నమే లేదు. ప్రతిసారీ జన్మభూమి కమిటీలు సైంధవుల్లా అడ్డుపడుతూనే ఉన్నాయి. అర్హులైన పేదవారిని ఆదుకోని ఆ కార్పొరేషన్లు ఉండి ఏం లాభం? ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వోద్యోగాల భర్తీయే లేదు. ఏవో కొన్ని అరకొరగా చేసినవి కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలే. వాటికి కూడా లంచాలిచ్చుకోవాలి.. లేదంటే అధికార నేతల అండదండలైనా ఉండాలి. లక్ష్మీపురానికి చెందిన అనూరాధ కాంట్రాక్టు ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకుందట. ‘అన్నా.. ఎస్సీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారందరిలోనూ నేనే టాపర్. ఏ రకంగా చూసినా పక్కాగా ఆ పోస్టు నాకే రావాలి.. కానీ సెలక్షన్ లిస్టులో నా పేరే లేదు. పోస్టులన్నింటినీ అధికార పార్టీ నేతలు కావాల్సిన వారికి అమ్మేసుకున్నారు’ అంటూ కన్నీటిపర్యంతమైంది. ఆ దళిత సోదరి అనూరాధ కష్టం అలాఉంటే.. బలహీనవర్గానికి చెందిన ఈశ్వరమ్మది మరోరకం కష్టం.. ఆమె పుట్టుకతోనే పోలియో బాధితురాలు. నడవలేని దివ్యాంగురాలు. అయినా కష్టపడి చదువుకుంది. సొంతకాళ్లపై నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తోంది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లేమో రజక వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. డిగ్రీ చదివి.. డైట్ కంప్లీట్ చేసి.. టెట్‌లో క్వాలిఫైఅయి.. డీఎస్సీ కోసం ఎదురుచూపులు చూస్తోంది. రేపు, మాపు అంటూ ఎండమావిలా ఊరిస్తూ ఉంది.. ఎప్పటికీ రాని డీఎస్సీ నోటిఫికేషన్. అటు ఉద్యోగమూ రాకపోయే.. ఇటు నిరుద్యోగ భృతీ లేకపోయే.. ఇలాంటి వారు ఏమైపోవాలి? ఈ పాలనలో అర్హులైన ఒక్కరికైనా న్యాయం జరుగుతుందా? రైఫిల్ షూటింగ్లో జాతీయ స్థాయిలో చాంపియన్ అయిన అభిరామ్.. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందలేదని బాధపడ్డాడు. తనతోపాటు టీంలో ఉన్న పొరుగు రాష్ట్రాల సభ్యులకు రైఫిల్ కొనుగోలు దగ్గర్నుంచి.. అక్కడి ప్రభుత్వాలు అన్ని విధాలా సాయం చేస్తున్నాయట. మన రాష్ట్రంలో ఉండటమే నేను చేసుకున్న పాపమా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతిభావంతులకు చిన్నపాటి సాయం కూడా చేయరుగానీ.. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తారట.. పతక విజేతలకు నోబెల్ బహుమతి ఇస్తారట! తెలంగాణలో పనిచేస్తున్న నాన్‌లోకల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. రాష్ట్ర విభజన తర్వాత వారందరూ తెలంగాణలోనే ఉండిపోయారు. తమను సొంత రాష్ట్రం ఏపీకి బదిలీ చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. ఎమ్మెల్యే నుంచి.. ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి వరకు.. ఎన్ని వినతిపత్రాలిచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరిలో ఎక్కువమంది ఉత్తరాంధ్రకు చెందినవారే. ఇక్కడ బీసీ కులస్తులైనా తెలంగాణలో మాత్రం ఓసీలుగా గుర్తిస్తున్నారట. హెల్త్ కార్డుల విషయంలో, పిల్లల స్థానికత విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. వీరి సమస్య పట్ల మానవత్వంతో, చిత్తశుద్ధితో కృషిచేయని ఈ ప్రభుత్వ వైఖరి శోచనీయం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. బీసీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ల లబ్ధిదారులను అర్హతలను బట్టి అధికారులు ఎంపిక చేయాల్సి ఉండగా.. జన్మభూమి కమిటీలకు అప్పగించడంలో ఆంతర్యమేంటి? కేవలం రాజకీయ వివక్ష చూపడానికి.. లంచాలతో పచ్చనేతల జేబులు నింపడానికే కదా? -వైఎస్ జగన్ -
286వ రోజు పాదయాత్ర డైరీ
-
286వ రోజు పాదయాత్ర డైరీ
ఇప్పటిదాకా నడిచిన దూరం: 3,149.6 కిలోమీటర్లు 15–10–2018, సోమవారం లక్ష్మీపురం క్రాస్, విజయనగరం జిల్లా తుపాను చేసిన గాయం మాసిపోతున్నా.. పాలకుల మోసం వారిని దహిస్తూనే ఉంది భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాంగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ పాదయాత్ర ప్రారంభించాను. నేడు గజపతినగరం పూర్తిచేసుకుని బొబ్బిలి నియోజకవర్గంలోకి ప్రవేశించాను. బొబ్బిలి ఘన చరిత్ర ఎవరికీ తెలియందికాదు.. కళలకు, కళాకారులకు, కోలాటానికి, భామాకలాపానికి ప్రసిద్ధి. బొబ్బిలి వీణ దేశవిదేశాల్లో ప్రఖ్యాతి గాంచింది. అమెరికా అధ్యక్షుడి మన్ననలను సైతం పొందింది. ఆ ప్రాభవం నేడు మసకబారుతోంది. పుట్టుకతోనే మూగ, చెవుడైన ఆడబిడ్డను చూసి తల్లడిల్లిపోయారు.. కళ్యాణి, సూర్యనాగేశ్వరరావు దంపతులు. దిక్కుతోచని స్థితిలో 2008లో నాన్నగారిని కలిశారు. అదే రోజు సాయంత్రానికే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6 లక్షలు మంజూరయ్యాయి. ఆపరేషన్ జరిగి ఆ బిడ్డ గలగలా మాట్లాడుతోంది. అదీ.. మనసున్న ముఖ్యమంత్రి సహాయనిధి. కానీ నేటి పాలనలోముఖ్యమంత్రి సహాయనిధి ఎండమావిగా మారింది. అరకొరగా అప్పుడప్పుడు కొద్దిమందికి మాత్రమే అందుతోంది. వారిలో.. ముఖ్యమంత్రిగారు ఇచ్చిన చెక్కులు చెల్లక సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నవారెందరెందరో. బాడంగికి చెందిన పెద్దింటి రమేష్ తదితర అగ్రిగోల్డ్ బాధితులు కలిశారు. 2015లో పార్వతీపురానికి వచ్చిన ముఖ్యమంత్రి గారిని కలిస్తే.. రెండు నెలల్లో పూర్తి న్యాయం చేస్తానని ప్రకటించారట. రెండేళ్లు దాటినా ఆ ఊసే ఎత్తకపోవడంతో చీపురుపల్లికి వచ్చిన బాబుగారిని మారోమారు కలవబోయారట. కలవడం సంగతి దేవుడెరుగు.. ముందస్తు అరెస్ట్‌లు చేసి వేధించారని బావురుమన్నారు. హుద్‌హుద్ తుపాను దెబ్బకు ఉపాధి కోల్పోయిన గీత కార్మికులకు ఒక్కొక్కరికి పరిహారం కింద తక్షణం రూ.పదివేలు ఇస్తానని బాబుగారు హామీ ఇచ్చారట. నాలుగేళ్లు దాటినా ఒక్క పైసా ఇవ్వకపోగా.. పరిహారం కోసం ధర్నా చేసినందుకు అరెస్ట్‌చేసి జైల్లో పెట్టించారట. గతంలో మాకు ఇచ్చినట్టుగానే.. ఇప్పుడు తిత్లీ తుపాను బాధితులపై వరాల వర్షం కురిపిస్తున్నాడని వాపోయారు.. యర్ర బాబురావు తదితర గీత కార్మికులు. తుపాను చేసిన గాయం మాసిపోతున్నా.. పాలకులు చేసిన మోసం వారిని దహించి వేస్తూనే ఉంది. లక్ష్మీపురం వద్ద సొంగలి సుమలత, సావిత్రమ్మ, జయలక్ష్మి, పార్వతి తదితర మహిళా రైతులు కలిశారు. ఈ సర్కారు నిర్లక్ష్యంతో సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. రుణ మాఫీ కాక, గిట్టుబాటు ధరలేక వ్యవసాయం భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మహిళా రైతు దినోత్సవం రోజునే.. వారి సాగు కష్టాలు వినాల్సి రావడం మనసుకు బాధనిపించింది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నాలుగేళ్లయినా హుద్‌హుద్ తుపాను బాధితులకు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చకపోవడం నిజం కాదా? రైతులు, మత్స్యకారులు, చేనేతలు, యాదవులు, గీతకార్మికులు తదితర తుపాను బాధిత వర్గాలకు మీరు ప్రకటించిన పరిహారం ఏమైంది? కట్టిస్తానన్న ఇళ్లు ఏమయ్యాయి? -వైఎస్ జగన్ -
285వ రోజు పాదయాత్ర డైరీ
-
285వ రోజు పాదయాత్ర డైరీ
14–10–2018, ఆదివారం ఎస్.బూర్జవలస, విజయనగరం జిల్లా టీచర్ పోస్టుల్లో కోత.. నిరుద్యోగులకు ద్రోహం కాదా బాబూ? ‘అభిమానం చాటుకోవడానికి మాటలే రానక్కర్లేదు. మనసుంటే చాలు’ అని డొంకాడ శ్రీనివాసరావు చూపించిన ఆల్బమ్ చూస్తే అర్థమవుతోంది. ఆ సోదరుడు పుట్టుకతోనే మూగ, చెవుడు. ఉద్యోగులకు వేతనాల్లా ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్ ఇచ్చి తనలాంటి లక్షలాది మంది నిస్సహాయులకు ఆశ్రయంగా నిలిచిన నాన్నగారంటే అతనికి వల్లమాలిన అభిమానం. ఆ మహానేత మరణించినప్పటి నుంచి నేటి దాకా అన్ని పత్రికల్లో వచ్చిన నాన్న గారి ఫొటోలను భద్రంగా ఆల్బమ్‌లో దాచుకున్నాడు. నాడు ఇదే దారిలో సోదరి షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఈ ఆల్బమ్ చూపించాడట. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ల ద్వారా ఎందరో చిన్నారులకు నాన్నగారు పునర్జన్మనిచ్చారు. ఆ వార్తల క్లిప్పింగ్‌లను సైతం పదిలపరుచుకున్నాడు. కుటుంబసమేతంగా నా వద్దకు వచ్చి ఆనందం పంచుకున్న ఆ సోదరుడిని చూసి సంతోషమేసింది. ఇటువంటి స్వచ్ఛమైన ప్రేమను పొందడం కన్నా అదృష్టమేముంటుంది? ఈరోజు తాడెందొరవలస, కుంటినవలస, మర్రివలస, కొత్తవలస, బూర్జవలస తదితర గ్రామాల ప్రజలు నన్ను కలిశారు. ఆ ఊళ్లన్నిటికీ ‘వలస’ అనేది ఎలా వచ్చిందో గానీ.. ఆ పేరు మాత్రం సార్థకమవుతోంది. ఈ గ్రామాల్లో అత్యధికులు నిరుపేదలే. వారికి ఇళ్లులేవు, భూముల్లేవు. పొలం పనులు దొరకవు. కరువు పనులూ కరువే. ఒకవేళ కరువు పనులు చేసినా శ్రమ దోపిడీ తప్ప.. ఏడాది గడిచినా కూలి డబ్బులివ్వరు. మరెలా బతకాలి? వలసలు తప్ప మరో మార్గమేముంది? పుట్టి పెరిగిన ఊళ్లపై మమకారం చంపుకొని.. తప్పనిసరి పరిస్థితుల్లో దూర రాష్ట్రాలకు వలసెళ్లిపోయి దుర్భరంగా బతుకున్న వారెందరెందరో. నాలుగేళ్ల క్రితం ఇక్కడి కె.కృష్ణాపురానికి చెందిన వలస కూలీలు ఏడుగురు చెన్నైలో భవనం కూలి మరణించారు. అప్పుడు నేను ఈ గ్రామానికి వచ్చి బాధితుల తరఫున గళం వినిపించాను. ఆ గ్రామస్తులు నేడు నన్ను కలిశారు. నేటికీ ఈ ఊళ్ల పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదన్నారు. బతకడానికి చిన్నపాటి కూలిపనులు కూడా దొరకకపోవడం చాలా బాధనిపించింది. ఈ పరిస్థితి మారాలి. వలసలు నివారించాలన్న నా సంకల్పం మరింత దృఢపడింది. మెంటాడ, దత్తిరాజేరు మండలాల రైతులు నన్ను కలిశారు. పిల్లకాలువలను పూర్తి చేయకపోగా.. ఉన్న వాటికి చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఈ పాలకుల వైఖరితో సాగునీరు అందక భూములు బీళ్లుగా మారాయని వాపోయారు. ఈ పరిస్థితుల్లో ఎందరో కౌలు రైతులు కూలీలుగా మారారని చెప్పారు. ఇలా అనేక మంది సొంత ఊళ్లలో బతకలేక వలసబాట పట్టడం బాధాకరం. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువకులు కలిశారు. డీఎస్సీ నిర్వహణ కూడా నిరుద్యోగ భృతిలా మరో బూటకమేనని వాపోయారు. డీఎస్సీ అంటూ ఊరించి ఊరించి.. లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లుజల్లుతోందన్నారు. కోచింగ్ సెంటర్లకు లబ్ధి చేకూర్చడం తప్ప నిరుద్యోగులకు మంచి చేయాలన్న తపన ఏమాత్రం కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. టెట్ల మీద టెట్లు నిర్వహించడం, డీఎస్సీ అంటూ పలుమార్లు ప్రకటనలు చేసి వాయిదా వేయడం.. కోచింగ్ సెంటర్లకు లబ్ధి చేకూర్చడానికి కాదా? రాష్ట్రంలో 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా.. ఒకసారి 22,000 పోస్టులకు డీఎస్సీ నిర్వహిస్తామని.. తర్వాత 14,300 అని.. ఆ తర్వాత 12,370.. మరోసారి 10,351 అని.. చివరకు 6,100 మాత్రమే అంటూ క్రమంగా పోస్టుల్లో కోత విధించడం వంచన కాదా? ఇది కూడా ‘యువనేస్తం’లా నిరుద్యోగులకు మీరు చేస్తున్న మరో ద్రోహం కాదా? -వైఎస్ జగన్ -
284వ రోజు పాదయాత్ర డైరీ
-
284వ రోజు పాదయాత్ర డైరీ
13–10–2018, శనివారం కోమటిపల్లి, విజయనగరం జిల్లా నిరుద్యోగ భృతి మొక్కుబడి కార్యక్రమం కాక మరేంటి బాబూ? ప్రజలకు మనస్ఫూర్తిగా మంచి చేయాలన్న ఆలోచన ఏ కోశానా లేని ప్రభుత్వమిది. గోరంతను కొండంతగా ప్రచారం చేసుకోవడమే ఈ పాలనలో కనిపించే నిజం. పథకం ఏదైతేనేం.. అది ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలల కోసమే. ప్రజలను మభ్యపెట్టడం బాబుగారికి వెన్నతో పెట్టిన విద్య. కేవలం ప్రచారం కోసం తీసుకొచ్చే ఈ మొక్కుబడి పథకాల చుట్టూ సవాలక్ష ఆంక్షలు. ఎగ్గొట్టడానికి సవాలక్ష సాకులు. ఈ అక్టోబర్ 2వ తేదీన ఎమ్మెల్యే చేతుల మీదుగా యువనేస్తం ధ్రువపత్రం అందుకుంది.. దాలెమ్మ అనే నిరుద్యోగ చెల్లెమ్మ. ఆ రోజే బ్యాంకులో నిరుద్యోగ భృతి డబ్బులేస్తామని అధికారులు చెప్పారట. ఇప్పటి వరకూ ఒక్కపైసా పడలేదు. అధికారుల చుట్టూ, బ్యాంకు చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇంటికో ఉద్యోగం.. లేదా నిరుద్యోగ భృతి కింద రూ.2,000 ఇస్తామని ఎన్నికలకు ముందు బాబుగారు ఆశపెట్టారు. నాలుగున్నరేళ్లు పట్టించుకోకుండా కాలయాపన చేశారు. తీరా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇస్తానన్నది అతి కొద్దిమందికి మాత్రమే. అది కూడా వెయ్యి రూపాయలే. ఇస్తానన్న ఆ కొద్ది మందిలో కూడా కోత విధించడం నిరుద్యోగులకు ద్రోహం కాక మరేంటి? మరుపల్లికి చెందిన పైడిమాంబ, శివశంకర్, వరలక్ష్మి తదితర డ్వాక్రా గ్రూపుల అక్కచెల్లెమ్మలు కలిశారు. రుణమాఫీ పేరుతో బాబుగారు చేసిన మోసంపై నిప్పులు చెరిగారు. ఆయన్ను నమ్మితే నట్టేట ముంచాడని మండిపడ్డారు. ఆయన చెప్పే పసుపు–కుంకుమ పథకమూ దగానే అన్నారు. మూడు విడతలుగా అప్పుగా ఇచ్చే ఆ డబ్బు.. మొదటి విడత కూడా దక్కలేదని వాపోయారు. డ్వాక్రా రుణాలను ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదని.. చేసే ఉద్దేశమూ లేదని అసెంబ్లీ సాక్షిగా మంత్రిగారు లిఖిత పూర్వకంగా ప్రకటించారు. తాము ప్రజలను మోసం చేసిన విషయాన్ని అసెంబ్లీలోనే ఒప్పుకోవాల్సి రావడం ఈ సర్కారుకు సిగ్గుగా అనిపించడం లేదా? పెదకాడ గ్రామ మహిళలు కలిశారు. ఆ ఊరికొచ్చిన తాగునీటి కష్టం చెప్పుకొన్నారు. నాలుగున్నరేళ్ల కిందట గత ప్రభుత్వం కట్టిన వాటర్ ట్యాంకు ఇప్పటికీ ఉత్సవ విగ్రహంలాగే ఉందన్నారు. పైపులైన్లు, మోటార్లు బిగించకపోవడంతో నిరుపయోగమైందంటూ ఈ అధికార నేతల నిర్లక్ష్యాన్ని పట్టిచూపారు. గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడే ఆ తల్లుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఆ ఊరి ఏట్లో చెలమలు తవ్వుకుని దాహార్తి తీర్చుకుంటున్న దయనీయ స్థితి వారిది. అధికార పార్టీ నేతలు అడ్డదిడ్డంగా ఇసుకను కూడా తవ్వేయడంతో ఆ చెలమల్లో సైతం నీరెండిపోతున్న దుస్థితికి పచ్చ నేతలు ఏం సమాధానం చెబుతారు? వ్యవసాయమే గిట్టని చంద్రబాబు పాలనలో కష్టాల కన్నీటి సాగు గురించి చెప్పేందుకు మధుపాడ గ్రామ రైతులు నన్ను ఈ రోజు కలిశారు. సాగునీరందించే ఆండ్ర కాల్వ పూడికతీతకు సైతం నోచుకోలేదన్నారు. మరమ్మతుల మాటే పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గ రైతు సంఘం నేతలు కలిశారు. గజపతినగరం బ్రాంచి కెనాల్ పనులు పూర్తిచేయకపోవడం వల్ల 15 వేల ఎకరాలకు నీళ్లందని దయనీయ పరిస్థితిని నా ముందుంచారు. పెద్ద ప్రాజెక్టులను ఎలాగూ పట్టించుకోరన్నా.. చిన్న చిన్న కాల్వలను సైతం ఇలా వదిలేస్తే ఎలా.. అని ప్రశ్నించారు. నిజమే.. ఆ ఆవేదనకు అర్థముంది. రైతన్న ఆగ్రహానికి కారణముంది. పెద్ద ప్రాజెక్టులను కేవలం కమీషన్ల కోసం మాత్రమే వాడుకునే ఈ పాలకులు.. కమీషన్లు తక్కువ వస్తాయని చిన్న చిన్న కాల్వల పనులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య 1.70 కోట్లు.. వాటిలో మీ ప్రజాసాధికార సర్వే ప్రకారం కేవలం 65 లక్షల నిరుద్యోగులున్నట్టు గుర్తించారు. సవాలక్ష ఆంక్షలతో యువనేస్తం పథకానికి 12.22 లక్షల మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. మీ అడ్డగోలు నిబంధలను దాటుకుని కేవలం 7.8 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగలిగారు. వాటిలో నానా సాకులూ పెట్టి 2.15 లక్షల మందిని మాత్రమే ఎంపిక చేశారు. తర్వాత 10 రోజులకే.. ఆ సంఖ్యను 1.64 లక్షలకు కుదించారు. మరి ఇది మొక్కుబడి కార్యక్రమం కాక మరేంటి? మీ మొక్కుబడి పథకం మొత్తం ఖర్చే 16.4 కోట్లు.. అందులోనూ కోత విధిస్తున్నారు. కానీ దాని ప్రచారానికి చేస్తున్న ప్రకటనల ఖర్చు మాత్రం 6.4 కోట్లు. మరి దీన్నేమనాలి? -వైఎస్ జగన్ -
283వ రోజు పాదయాత్ర డైరీ
10–10–2018, బుధవారం గజపతినగరం, విజయనగరం జిల్లా అవార్డులు ఇప్పించుకుని ప్రచారం చేసుకోవడంలో ముఖ్యమంత్రిగారు ముందుంటారు నిన్నటి దాకా ఉన్న ఎండ తీవ్రత, ఉక్కపోత.. ఈ రోజు కనిపించకుండా పోయాయి. అల్పపీడన ప్రభావంతో వాతావరణం చల్లబడింది. కానీ జనం గుండెలు మండుతూనే ఉన్నాయి. కష్టాలు, కన్నీళ్ల ఉక్కపోత.. వారికి ఊపిరాడనీయకుండా చేస్తూనే ఉంది. ఈ రోజు ఎంతోమంది పండు ముసలివారు కలిశారు. తగ్గిన కంటిచూపు, ఒంగిన నడుములతో నడిచే శక్తి లేకున్నా.. నిలబడలేకున్నా.. నా కోసం కదలి వచ్చి తమ బతుకు వ్యథల్ని చెప్పుకొన్నారు. ‘పిల్లలు చూడటం లేదు.. పింఛనూ రావడం లేదు’అని లచ్చమ్మ అనే 80 ఏళ్ల అవ్వ కంటతడి పెట్టడంతో గుండె తరుక్కుపోయింది. పెద్ద వయసులో ఏ ఆదరణా లేక.. చూసుకునే వారూ లేక.. భారంగా బతుకులీడుస్తున్న వారెందరో! అలాంటి వారికి కనీసం పింఛన్లు, రేషన్ బియ్యం లాంటివైనా సక్రమంగా అందితే కాస్తయినా ఊరటగా ఉంటుంది కదా. లింగాలవలస వద్ద కొద్ది మంది రైతన్నలు కలిశారు. తోటపల్లి కాలువ పనులు పూర్తికాకపోవడంతో సాగు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిపోయిన కాస్త పనులనూ పూర్తిచేయని ఈ సర్కారు నిర్లక్ష్యమే.. ఈ ప్రాంత రైతన్నలకు శాపమైంది. గత ఎన్నికలకు ముందు రూ.53 వేల పంట రుణం తీసుకుంటే.. అది మాఫీ కాలేదని బంగారు నాయుడన్న బాధపడ్డాడు. బాబుగారిని నమ్ముకున్నందుకు వడ్డీ భారం తడిసి మోపెడైందని వాపోయాడు. అది చాలదన్నట్టు.. గోరుచుట్టుపై రోకలి పోటులా ఎన్నికల తర్వాత హుద్‌హుద్ తుపాను ముంచేసింది. ఆయన ఆశ పెట్టుకున్న ఐదెకరాల మొక్క జొన్న పంట పూర్తిగా దెబ్బతింది. దానికీ నష్టపరిహారం రాలేదు. ఇది రైతు వ్యతిరేక పాలనగాక మరేంటి? క్షేత్ర స్థాయి వాస్తవాలు ఇంత దారుణంగా ఉంటే.. అవార్డులు ఇప్పించుకుని ప్రచారం చేసుకోవడంలో ముఖ్యమంత్రిగారు ముందుంటారు. దారిలో ఏడొంపులగెడ్డ నదిని చూసి చాలా బాధేసింది. ఇసుకనేదే కనిపించడం లేదు. నది మొత్తం గుంతలమయం.. రాళ్లు తేలిపోయింది. రాత్రీపగలన్న తేడా లేకుండా ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా అడ్డదిడ్డంగా తవ్వేస్తుంటే.. భూగర్భ జలాలు ఇంకిపోవా? ఏరులు ఎడారులను తలపించవా? ఉపాధి అవకాశాల్లేక వేలాది మంది విలవిల్లాడుతున్నామని ఫార్మసిస్టులు గోడు వెళ్లబోసుకున్నారు. కేవలం వైఎస్సార్‌గారి హయాంలో నియామకాలు పొందామన్న ఏకైక కారణంతో కక్షగట్టిమరీ ఉద్యోగాల్లోంచి తొలగించాలని చూస్తోందీ ప్రభుత్వం.. అని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు. గజపతినగరంలో ఇరుకైన, గతుకుల రోడ్ల గురించి.. దుర్భరమైన డ్రైనేజీ గురించి.. దారుణమైన పారిశుద్ధ్యం గురించి.. అనేక ఫిర్యాదులందాయి. ఈ రోజు సాయంత్రం ఆ దుస్థితిని ప్రత్యక్షంగా చూశాను. వర్షాలొస్తే మురుగునీరు పొంగిపొర్లుతుందని.. రోగాలు వణికిస్తాయని ఇక్కడి ప్రజలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బైపాస్ రోడ్డు వేస్తామని, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికలప్పుడు పచ్చనేతలు గొప్పగా హామీలిచ్చారు. ఇప్పటిదాకా పట్టించుకున్న పాపాన పోలేదు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయి.. మరోసారి అవే హామీలిచ్చి మోసపుచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు అధికారంలోకి వచ్చే నాటికి తోటపల్లి ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయింది వాస్తవం కాదా? మిగిలిన పదిశాతం పనులను కూడా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పూర్తిచేయలేకపోవడానికి కారణమేంటి? ఈ ప్రాజెక్టు కింద లక్షా 35 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా.. 80 వేల ఎకరాలకు ఇప్పటికీ నీళ్లు అందడం లేదంటే.. ఆ పాపం మీది కాదా? -వైఎస్ జగన్ -
282వ రోజు పాదయాత్ర డైరీ
-
282వ రోజు పాదయాత్ర డైరీ
09–10–2018, మంగళవారం జిన్నాం, విజయనగరం జిల్లా మీ వల్ల మోసపోని ఒక్క కులమైనా, వర్గమైనా ఉందా బాబూ? ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గం దాటి గజపతినగరంలోకి ప్రవేశించాను. చిన్నచిన్న ఇరుకైన రోడ్ల మీద పాదయాత్ర సాగింది. ఈ గ్రామాలకు బస్సు సౌకర్యమే లేదు. ఆస్పత్రులకు వెళ్లాలన్నా, పిల్లలు బడులకెళ్లాలన్నా నానా అవస్థలు పడాల్సిందే. లోగిశ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు కలిసి తమ స్కూల్ సమస్యలు చెప్పారు. నాసిరకం బియ్యం, చెడిపోయిన గుడ్లతో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంటోందని అన్నారు. ‘స్కూల్లో ఫ్యాన్లు లేనే లేవు.. బెంచీలు అంతంత మాత్రమే.. మరుగుదొడ్లకు పోయే పరిస్థితే లేదు’ అంటూ వాపోయారు. ఈ ప్రభుత్వానికి కార్పొరేట్ స్కూళ్లపై ఉన్న ప్రేమలో కాస్తంతయినా ప్రభుత్వ పాఠశాలలపై ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదేమో. ముచ్చర్ల గ్రామంలో వడ్రంగుల కష్టనష్టాలు విచారించాను. ఆ వృత్తిని కొనసాగించడం వారికి భారమైపోతోంది. కలప రేట్లు పెరిగిపోయాయి. కరెంటు చార్జీలు భారమయ్యాయి. నాన్నగారి హయాంలో రూ.300 దాటని కరెంటు బిల్లులు ఇప్పుడు ఏకంగా రూ.1000 దాటుతున్నాయి. పనిముట్లు కొందామంటే పెట్టుబడి కష్టమైపోతోంది. ఎలాంటి లోన్లు అందడం లేదు. కులవృత్తి మాని కూలికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆ వడ్రంగి సోదరులు వాపోయారు. మధ్యాహ్నం వినిత, నవిత అనే అక్కాచెల్లెలు కలిశారు. వారిద్దరికీ పుట్టుకతోనే మూగ, చెవుడు. పేదింట్లో ఆడబిడ్డలు వైకల్యంతో పుట్టడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వారి భవిష్యత్‌ను తలుచుకుని కుమిలిపోయారు. అలాంటి సమయంలో నాన్నగారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. దాదాపు రూ.18 లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. ఇప్పుడు వారిద్దరూ చక్కగా మాట్లాడుతున్నారు.. బడికెళ్తున్నారు. వారిని చూసి చాలా ఆనందమేసింది. కానీ ఆ పిల్లల వినికిడి పరికరాల నిర్వహణకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.30 వేలు ఖర్చవుతుందట. అంతటి భారాన్ని ఆ పేద తల్లిదండ్రులు ఎలా మోయగలరు? అందుకే ఆ నిర్వహణ ఖర్చును సైతం ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవాలన్న తలంపు మరింత బలపడింది. లోగిశ, జిన్నాం గ్రామాల్లో ఎంతోమంది తమకు అన్ని అర్హతలున్నా పింఛన్లు ఇవ్వడంలేదని మొరపెట్టుకున్నారు. ఆఖరుకు తమకు న్యాయంగా రావాల్సిన పెన్షన్ల కోసం పేదలు కోర్టులకెళ్తున్నారంటే ఈ ప్రభుత్వానికి అంతకన్నా సిగ్గుచేటైనా విషయం ఏముంటుంది? రాములమ్మ అనే దళిత మహిళకు భర్త చనిపోయి రెండేళ్లు దాటింది. చూసుకునేవారు ఎవరూ లేక ఒంటరిగా బతుకుతోంది. వితంతు పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదట. పొట్టకూటి కోసం ఉపాధి పనులు చేస్తే ఆ డబ్బులూ ఇవ్వలేదట. గత్యంతరం లేక గోదావరి జిల్లాలకు కూలి పనుల కోసం వలస పోతున్నానని చెబుతుంటే చాలా బాధేసింది. ఇలాంటి వారిని ఆదుకోని పథకాలెందుకు? ప్రభుత్వాలెందుకు? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అన్ని చేతివృత్తులు, కులవృత్తుల వారిని ఆదరణ పథకంతో ఆదుకుంటానని మేనిఫెస్టోలో మీరిచ్చిన హామీ ఏమైంది? మీ ఓటు బ్యాంకు రాజకీయాలతో బలహీనవర్గాల ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం నిజం కాదా? మీవల్ల మోసపోని ఒక్క కులమైనా, వర్గమైనా ఉందా? -వైఎస్ జగన్ -
281వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
281వ రోజు పాదయాత్ర డైరీ
08–10–2018, సోమవారం, గరికివలస, విజయనగరం జిల్లా హామీలు గుర్తు చేస్తే బెదిరించడం సబబేనా బాబూ? సాలెల మగ్గం, కుమ్మరి చక్రం, కమ్మరి కొలిమి.. ఇలా సమస్త చేతివృత్తులకు గ్రహణం పట్టిన దుస్థితికి అద్దంపట్టింది.. ఈ రోజు పాదయాత్ర. చేతివృత్తులు చితికిపోతుంటే, కులవృత్తులు కనుమరుగవుతుంటే.. వాటి మీదే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇవ్వాళ నన్ను కలిసిన ఒక్కో కులవృత్తి వారిది ఒక్కో వ్యథ. కష్టపడి నేసిన వస్త్రానికి కూలీ మేరకైనా ధర గిట్టుబాటు కాక చేనేత బతుకులు చితికిపోతున్నాయి. మట్టిపాత్రల వాడకం తగ్గిపోవడంతో కుమ్మరి వృత్తి మసకబారిపోతోంది. ఆపై అధికార పార్టీ నేతలు చెరువులను, కుంటలను అడ్డదిడ్డంగా తవ్వుకుని అమ్ముకోవడంతో కుండలకు మట్టి కూడా దొరకని దుస్థితి. గొర్రెలను కొనాలంటే రుణాలివ్వడం లేదు. గతంలో మాదిరిగా ఇన్సూరెన్స్‌లూ రావడం లేదు. పశువైద్యం, టీకాలు, మందులు అందడమే లేదు. మరి యాదవ సోదరుడు ఏం చేయాలి? నన్ను కలిసిన ఈ ప్రాంత రెల్లి కులానికి చెందిన మహిళలు పండ్లు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తారు. దానికి పెట్టుబడి కోసమని రోజువారీ వడ్డీలకు అప్పులు చేస్తారు. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ము వడ్డీలకే సరిపోతుంటే వారెలా బతకాలి? అధికార పార్టీ కాంట్రాక్టర్లు, దళారులకే చెరువులన్నీ ధారాదత్తం అవుతుంటే పేద మత్స్యకారుల పరిస్థితేమిటి? అధిక కరెంటు చార్జీల భారంతో సెలూన్ల నిర్వహణ కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. నాయీబ్రాహ్మణ సోదరులు. దశాబ్దాలుగా దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులు.. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగాలు కల్పించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని కోరడం తప్పెలా అవుతుంది? అడిగిన పాపానికి ‘తోక కత్తిరిస్తాను.. గుడి మెట్లు కూడా ఎక్కనివ్వను’అంటూ ముఖ్యమంత్రిగారే బెదిరిస్తుంటే వారెవరికి మొరపెట్టుకోవాలి? వీధివీధిన వేళ్లూనుకున్న బెల్టు షాపులు తమ కుల వృత్తిని కబళించేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. కల్లుగీత కార్మికులు. కల్లుగీత సొసైటీలో సభ్యుడైన ముంత శంకర్ అనే సోదరుడు ప్రమాదవశాత్తూ చెట్టు మీద నుంచి పడి కాళ్లు విరిగితే ఎలాంటి సాయం అందలేదట. మరి ఇలాంటివారికి కూడా ధీమా ఇవ్వని చంద్రన్న బీమా ఎందుకు? సొసైటీలు ఉండి ఏం లాభం? సొసైటీల ద్వారా వేలకు వేలు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. కార్మికుల సంక్షేమంపై కాస్తంతయినా దృష్టి పెట్టకపోవడం అన్యాయమన్నారు.. గీత కార్మికులు. ఓ వైపు ఈ పేదల మనుగడే కష్టసాధ్యమవుతుంటే, మరోవైపు ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలు సక్రమంగా అమలు కాకపోవడంతో అప్పులపాలవుతున్నారు. గత నాలుగేళ్లుగా ఈ జిల్లా మామిడి రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. సరైన ధర లేక, కోత కూలీ కూడా రాక చెట్లపైనే కాయలను వదిలేస్తున్నారు. కిలో మామిడికి రెండున్నర రూపాయలు సాయం అందించి ఆదుకుంటానన్న ప్రభుత్వం మాటతప్పి మోసం చేసిందని మామిడి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతన్నలు మరో విషయం చెప్పారు.. గరుగుబిల్లిలో ఒక మహిళా రైతు 24 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసిందట. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ రైతుగా రాష్ట్ర అవార్డు కూడా పొందిందట. కానీ ఆ వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులపాలై ఉన్న 24 ఎకరాలు అమ్మేసుకుందట. వాస్తవ పరిస్థితులిలా ఉంటే ముఖ్యమంత్రిగారేమో మన రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అద్భుతంగా ఉందని, రూపాయి పెట్టుబడికి రూ.13 లాభం వస్తోందని, సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం ఉద్యోగాలు మాని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని అంతర్జాతీయ వేదికలపై అవాస్తవాలు చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వ్యవసాయ సంక్షోభం నుంచి దృష్టి మరల్చడానికే ముఖ్యమంత్రిగారు ఈ అసత్య ప్రచారం చేస్తున్నారని రైతన్నలు వాపోయారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. చేతివృత్తులు, కులవృత్తుల వారి కోసం మీ మేనిఫెస్టోలోని 20, 21 పేజీల్లో పదికిపైగా హామీలిచ్చారు. ఒక్కటైనా నెరవేర్చారా? హామీలను గుర్తు చేసిన వివిధ బలహీనవర్గాల ప్రజలను స్వయంగా మీరే బెదిరించడం ధర్మమేనా? -వైఎస్ జగన్ -
280వ రోజు పాదయాత్ర డైరీ
-
280వ రోజు పాదయాత్ర డైరీ
07–10–2018, ఆదివారం కలవచర్ల, విజయనగరం జిల్లా ఏ ఆశయంతో 108, ఆరోగ్యశ్రీ అవతరించాయో.. అదికాస్తా అంతరించిపోతుండటం విచారకరం ఈ రోజు చీపురుపల్లి నియోజకవర్గంలోని కెల్ల, రెల్లిపేట, గుర్ల గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. కెల్ల గ్రామంలో అంబళ్ల సీతమ్మ దయనీయగాథ మనసును కలచివేసింది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. ఏడేళ్ల కిందట మేడ మీద నుంచి పడటంతో వెన్నెముక దెబ్బతింది. మంచానికే పరిమితమయ్యాడు. భర్త తెచ్చే కూలి డబ్బులతోనే ఇంటిని నడుపుతూ.. కొడుకుకు సపర్యలు చేసుకుంటూ గడుపుతోందా తల్లి. ఏడు నెలల కిందట ఆమె భర్తకూ యాక్సిడెంట్ అయింది. మూత్రాశయం దెబ్బతింది. ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. వైద్యానికి వేలకు వేలు ఖర్చుపెట్టలేని దుస్థితి. ఓ వైపు.. భర్తకు, బిడ్డకు పసిబిడ్డలకు వలే సపర్యలు చేసుకోవాలి. మరోవైపు.. కూలి పనులకెళ్లి కుటుంబాన్ని పోషించాలి. ఆ సీతమ్మ కష్టాలు గుండెను బరువెక్కించాయి. కోడూరుకు చెందిన భవానీ అనే చెల్లెమ్మ.. 108కి పట్టిన దుర్గతిని వివరించింది. పక్కింట్లో ఉండే గౌరికి పురిటి నొప్పులొస్తే 108కి ఫోన్ చేసిందట. టైర్ పంక్చరైందని, స్టాఫ్ కూడా లేరని సమాధానం వచ్చింది. చేసేదిలేక స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే ఆటోలో ఆస్పత్రికి తరలించారట. ఆ సమయంలోఆ తల్లిపడ్డ నరకయాతన అంతా ఇంతా కాదు. నాన్నగారు ప్రారంభించిన 108 వ్యవస్థ దేశంలోని 16 రాష్ట్రాల్లో, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో సైతం అమలవుతుండటం గర్వకారణం. ఆ పథకం ప్రారంభమైన మన రాష్ట్రంలో మాత్రం నిర్వీర్యమవుతుండటం బాధాకరం. ఏ మహదాశయంతో 108, ఆరోగ్యశ్రీ అవతరించాయో.. అదికాస్తా అంతరించిపోతుండటం అత్యంత విచారకరం. బుదరాయవలసకు చెందిన విశ్వబ్రాహ్మణులు కలిశారు. ఆ గ్రామం ఇత్తడి వస్తువుల తయారీకి చాలా ప్రసిద్ధి. ఒకప్పుడు వందలాది కుటుం బాలవారు ఇత్తడి సామగ్రిని తయారుచేసి.. ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసేవారు. అలాంటి వృత్తి నైపుణ్యానికి ప్రోత్సాహం కరువై.. ఆదరణ తరిగిపోయి.. కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్లిపోయే దుస్థితి దాపురించింది. ఒకప్పుడు ఆ సంప్రదాయ కళను నమ్ముకుని గౌరవంగా బతికిన తాము.. నేడు కూలీలుగా మారాల్సి వచ్చిందని ఆ సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. పెనుబర్తి, గోషాడ గ్రామ రైతన్నలు కలిశారు. సమీపంలోనే తోటపల్లి కుడి ప్రధాన కాలువ కనిపిస్తున్నా.. వారి పొలాలకు నీరందని దౌర్భాగ్యాన్ని వివరించారు. మిగిలిపోయిన పిల్ల కాలువ పనుల విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే దానికి మూలకారణమన్నారు. నాన్నగారు తన పాదయాత్రలో ఈ జిల్లా రైతన్నల హృదయ ఘోష విన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇచ్చిన మాట ప్రకారం తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించారు. శరవేగంతో పనులు జరిగాయి. బాబుగారు అధికారంలోకి వచ్చేప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అయిదు శాతం పనులు కూడా చేయకపోవడం.. నేటి పాలకుల సంకుచితత్వానికి నిదర్శనం. రైతాంగం పట్ల బాబుగారికి ఉన్న కపట ప్రేమకు తార్కాణం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్రంలో వందకు పైగా 108 వాహనాలు మూలన పడి ఉండగా.. మీ డ్యాష్ బోర్డులో మాత్రం 95 శాతం వాహనాలు సక్రమంగా సేవలందిస్తున్నట్లు చూపించడం ఎవర్ని మోసం చేయడానికి? వాటికి చెల్లిస్తున్న బిల్లులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నట్టు? 108 వాహనాల కొనుగోళ్లు, నిర్వహణలో సైతం భారీ అవినీతి జరిగిందనేది వాస్తవం కాదా? దీనిపై హైకోర్టు నోటీసులివ్వడం నిజం కాదా? -వైఎస్ జగన్ -
279వ రోజు పాదయాత్ర డైరీ
-
279వ రోజు పాదయాత్ర డైరీ
06–10–2018, శనివారం వల్లాపురం క్రాస్, విజయనగరం జిల్లా వేలాది మందికి బతుకుదెరువు లేకుండా చేయడం చాలా బాధనిపించింది ఈ రోజు పాదయాత్ర మూలస్టేషన్ వద్ద ప్రారంభమై.. ఎస్ఎస్ఆర్పేట, మన్యపురిపేట, బెల్లానపేట మీదుగా సాగింది. రాత్రి బస చేసిన శిబిరానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలోనే నాన్నగారు, సోదరి షర్మిల వారి పాదయాత్రల్లో విరామం తీసుకోవడం విశేషం. ఈ రోజంతా ఇరుకైన రహదారిలో కిక్కిరిసిన జన సందోహం మధ్య నడిచాను. చుట్టూ పంట పొలాల్లో పనిచేసుకుంటున్న అక్కచెల్లెమ్మలు నాపై పొలం పాటలు కట్టి పాడటం.. ఉత్సాహాన్నిచ్చింది. ప్రభుత్వ విధానాలు, పాలకుల తీరు సానుకూలంగా ఉన్నప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలొస్తాయి. ఈ జిల్లాలో వేలాది మంది కార్మికులకు ఉపాధినిస్తున్నాయి ఫెర్రోఅల్లాయ్ పరిశ్రమలు. రాష్ట్రం మొత్తంమీద 35 పరిశ్రమలుంటే.. విజయనగరం జిల్లాలోనే 16 ఉన్నాయి. ఒక్క చీపురుపల్లి నియోజకవర్గంలోనే 6 ఉండటం విశేషం. ఇవి పూర్తిగా విద్యుత్ ఆధారిత పరిశ్రమలు. కరెంటు మీదే వాటి మనుగడ ఆధారపడి ఉంటుంది. నాన్నగారి హయాంలో సరైన ప్రోత్సాహం కల్పించడం.. నాణ్యమైన కరెంటును తక్కువ ధరకే అందించడం.. కరెంటు చార్జీలు పెరగకుండా స్థిరంగా ఉంచడంతో కొత్తగా 29 ఫెర్రోఅల్లాయ్ పరిశ్రమలు ఏర్పడ్డాయి. వేలాది మందికి ఉపాధీ దొరికింది. నాన్నగారి తదనంతరం కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. ప్రోత్సాహం కరువైన ఈ పాలనలో ఆ పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. కార్మికులు, ఉద్యోగులు. పరిశ్రమల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా.. కేవలం ప్రచారం కోసం, కమీషన్ల కోసం పాకులాడేవారు ఎంత ఆర్భాటం చేసినా.. ఎన్ని దేశాలు తిరిగినా.. ఫలితం మాత్రం శూన్యమే. వయోజన విద్యను అందించడం మా డ్యూటీ.. అది చాలదన్నట్టు ప్రతి అడ్డమైన పనీ మాతో చేయించుకున్న ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఉన్నఫళంగా ఉద్యోగాలు ఊడబెరికిందని బాధపడ్డారు.. సాక్షరభారత్ సమన్వయకర్తలు. అదేం లొసుగో కానీ.. జూన్‌లో జరిగిన నవనిర్మాణ దీక్షలో సైతం వీరితో సేవలు చేయించుకుని.. మార్చి నుంచే ఉద్యోగాల్లోంచి తొలగించినట్టు ఉత్తర్వులిచ్చారట. ప్రభుత్వ పథకంలో ఉన్నారన్న నెపంతో వారికి ఉపాధి పనులూ ఇవ్వడం లేదట. ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేస్తుంటే వారికిక దిక్కెవరు? ఉన్నఫళంగా వేలాది మందికి బతుకుదెరువు లేకుండా చేయడం చాలా బాధనిపించింది. ఈ పాలనలో రాజకీయ వివక్ష సర్వసాధారణమైపోయింది. ఈ రోజు కూడా కొన్ని నా దృష్టికొచ్చాయి. వెంకట్రావు అనే అన్నను రేషన్ డీలర్‌గా తొలగించారట. వందశాతం వైకల్యం ఉన్న ఆదిలక్ష్మి అనే అంధురాలికి పింఛన్ ఇవ్వడం లేదట. వెంకటలక్ష్మి అనే అంగన్వాడీ అక్క ఉద్యోగాన్ని తీసేశారట. ఇవన్నీ ఓ ఎత్తయితే.. బురదయ్యవలసకు చెందిన ఓ హెచ్ఐవీ బాధిత సోదరుడికి పింఛన్ ఇవ్వకపోవడం.. ప్రభుత్వ వివక్షకు పరాకాష్ట. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ హయాంలో పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలన్నీ బకాయిలుగా మిగిల్చారు. ఇస్తానన్న ప్రోత్సాహకాలకు కూడా డబ్బులివ్వడం లేదు. అత్యధికంగా కరెంటు చార్జీల భారం మోపారు. రాయల్టీ రేట్లు విపరీతంగా పెంచేశారు.. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో పరిశ్రమలు ఎలా మనుగడ సాగిస్తాయి.. కొత్త పరిశ్రమలెలా వస్తాయి? -వైఎస్ జగన్ -
278వ రోజు పాదయాత్ర డైరీ
-
278వ రోజు పాదయాత్ర డైరీ
04–10–2018, గురువారం మూల స్టేషన్, విజయనగరం జిల్లా సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు రామతీర్థ సాగర్ ప్రాజెక్టు ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల. ఏ నాయకుడూ చేపట్టని ఆ బృహత్కార్యాన్ని నాన్నగారు తలపెట్టారు. ఆయన హయాంలో పనులు శరవేగంగా దూసుకుపోయాయి. ఆయన లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా తయారైంది. నేటి ప్రభుత్వమే ఆ ప్రాజెక్టు పాలిట శాపమైంది. ఈ రోజు పూసపాటిరేగ మండల రైతన్నలు కలిశారు. గతంలో వారి గ్రామాలకు కుమిలి పెద్దచెరువు నుంచి సాగునీరు అందేది. ఆ చెరువు రామతీర్థ సాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక రైతన్నల ఆశలు ఆవిరయ్యాయి. ఓ వైపు.. ప్రాజెక్టు పూర్తికాక సాగునీరు అందడం లేదు. మరోవైపు.. అంతకు మునుపులా చెరువు నీరూ లేదు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సాగునీరు అందించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న పాలకులు.. ఆ మాటే మర్చిపోయారు. ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని ఆ రైతన్నలు వాపోయారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసినవారు.. చరిత్రహీనులుగా మిగిలిపోతారు.. అంటూ నాన్నగారు తరచూ చెప్పే మాటలు గుర్తొచ్చాయి. దారిలో చంపావతి నదిని చూసి చాలా బాధేసింది. వర్షాకాలంలో నిండు ప్రవాహంతోకళకళలాడాల్సిన ఆ నది ఏ ప్రవాహమూ లేక వెలవెలబోతోంది. వర్షాభావం ఓ కారణమైతే.. అడ్డదిడ్డంగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు మరో కారణం. ఇసుకాసురులు ఆ నది మొత్తాన్ని చెరబట్టేశారు. డెంకాడ వద్ద ఇసుక తవ్వకాల కోసం నది మధ్యలో రోడ్డు వేశారంటే.. దోపిడీ ఎంతలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రమంతటా ఇదే దుస్థితి. ఇష్టారాజ్యంగా, అడ్డదిడ్డంగా ఇసుకను తవ్వేయడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఏరులు ఎడారులను తలపిస్తున్నాయి. వందేళ్ల చరిత్ర కలిగిన నెల్లిమర్ల జూట్ మిల్లు పక్క నుంచి పాదయాత్ర సాగింది. ఉత్తరాంధ్ర మొత్తం జూట్ మిల్లులకు ప్రసిద్ధి. వేలాది మందికి ఉపాధినిచ్చే ఈ మిల్లులు.. ప్రభుత్వ ప్రోత్సాహంలేక.. కరెంటు చార్జీల భారం ఎక్కువై ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. మిల్లులు మూతబడుతుంటే.. దానిమీద ఆధారపడి బతుకుతున్న కార్మికుల జీవితాలు తలకిందులవుతున్నాయి. కుటుంబాల్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక వలసెల్లి పోవాల్సిన అధ్వాన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇక్కడ ఉన్న పరిశ్రమలే మూతపడుతుంటే.. కొత్తవాటికోసమంటూ ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు ఊరేగుతున్నారు మన పాలకులు. ఆ మిల్లు సమీపంలోనే మిరియాల లక్ష్మి అనే సోదరి కలిసింది. భర్త ఐస్‌క్రీంలు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈమేమో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి కూడా ఉద్యోగం లేక ఖాళీగా ఉంది. వారికి ఇద్దరు అమ్మాయిలు. ‘ముఖ్యమంత్రి చెప్పిన మా ఇంటి మహాలక్ష్మి పథకం నా పిల్లలకు రాదా అన్నా..’ అంటూ అమాయకంగా అడిగింది. బహుశా ఆ చెల్లెమ్మకు తెలియదేమో.. బాబుగారు అలాంటి పథకాలన్నింటినీ ఎప్పుడో అటకెక్కించేశాడని. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఆడపిల్లల కోసం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బంగారుతల్లి లాంటి పథకాలను ఆపి వేయడం వాస్తవం కాదా? ఆ పథకాలలో గతంలోనే నమోదైన పిల్లల తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారు? పోనీ.. మీరు పెడతానన్న మా ఇంటి మహాలక్ష్మి పథకంలో కనీసం ఒక్కరంటే ఒక్క ఆడబిడ్డ పేరైనా నమోదుచేశారా? ఇది ఆడపిల్లలను దారుణంగా వంచించడం కాదా? -వైఎస్ జగన్ -
277వ రోజు పాదయాత్ర డైరీ
-
277వ రోజు పాదయాత్ర డైరీ
03–10–2018, బుధవారం నెల్లిమర్ల మొయిద జంక్షన్, విజయనగరం జిల్లా ప్రజల ప్రాణాలకన్నా మోసపు లెక్కల ప్రచారమే మీకు ముఖ్యమా బాబూ? నా పాదయాత్ర ఈ రోజంతా నెల్లిమర్ల నియోజకవర్గంలోనే సాగింది. విమానాశ్రయం పేరుతో భూదోపిడీకి పథకం వేసిన భోగాపురం ఇక్కడే ఉంది. ఇదే జిల్లాకు చెందిన నాటి విమానయాన మంత్రినే ప్రధానాస్త్రంగా వాడుకున్నాడు ప్రభుత్వ పెద్ద. పక్కనే ఉన్న తమ బినామీలు, ఎంపీలు, మంత్రుల పేరిట ఉన్న భూముల జోలికి పోకుండా.. అమాయక రైతుల భూములపై పడ్డారు. ఆ రైతన్నలు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. విజయనగరం జిల్లాలోనే సముద్రతీర ప్రాంతం ఉన్న ఏకైక నియోజకవర్గం నెల్లిమర్ల. ఇక్కడి మత్స్యకార సోదరుల కష్టాలు వింటుంటే మనసెంతో బరువెక్కింది. తీర ప్రాంతంలో ఉన్న రసాయన పరిశ్రమలు.. వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి అలాగే వదిలేయడం వల్ల మత్స్య సంపద అంతరించిపోతోంది. దాన్నే నమ్ముకున్న మత్స్యకార సోదరులకు ఉపాధి లేకుండా పోతోంది. చేపల వేట తప్ప మరోటి తెలియని ఆ సోదరులు దూర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి ఏర్పడుతోంది. పరిశ్రమలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? ప్రజలను పరిరక్షించాల్సిన పాలకులు ఏమైపోయారు? వారి అలసత్వం, లాలూచీ వ్యవహారాలే ఈ దుస్థితికి కారణం. హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న ఆ మత్స్యకార గ్రామాలను పునరుద్ధరిస్తానని, తుపాన్లకు తట్టుకుని నిలబడే ఇళ్లను నిర్మిస్తానని.. సాక్షాత్తు ముఖ్యమంత్రిగారే హామీలిచ్చారట. కానీ ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు. తన సాంకేతిక పరిజ్ఞానంతో హుద్‌హుద్ తుపానును సైతం కట్టడి చేశానని గొప్పలు చెప్పుకొన్న ముఖ్యమంత్రికి.. తానిచ్చిన హామీలు నెరవేరక తుపానుకు చేదు గుర్తులుగా మిగిలిన ఈ గ్రామాలు, ఇక్కడి ప్రజలు కనపడలేదేమో! పాదయాత్రలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందిని చూసి బాధేసింది. వారికి 365 రోజుల్లో ఒక్క పూటా సెలవుండదట. వారికీ కుటుంబాలు ఉంటాయి కదా.. వారానికి ఒక్క రోజైనా విరామం లేకపోతే ఎలా? జరజాపుపేట గ్రామంలో ఉదయం తండోపతండాలుగా జనం కలిశారు. మా గ్రామాన్ని పంచాయతీగానే ఉంచండి.. నగర పంచాయతీలో కలపకండి.. అంటూ మొరపెట్టుకున్నారు. ఆ గ్రామంలో అత్యధికులు జూట్ మిల్లు కార్మికులు, దినసరి కూలీలు, నిరుపేదలు. అలాంటి గ్రామాన్ని నగర పంచాయతీలో కలపడం వల్ల వారికి వచ్చిన ప్రయోజనం ఏమీ లేకపోగా.. వారి జీవన వ్యయం మాత్రం బాగా పెరిగిపోయింది. ఇంటి పన్నులు, నీటి పన్నులు.. ఆఖరుకు ఖాళీ స్థలాలకు కూడా పన్నులు భారీగా వేస్తున్నారట. నిరుపేదలు చిన్న ఇల్లు కట్టించుకోవాలన్నా.. ఫీజుల కింద భారీ మొత్తంలో కట్టాల్సి వస్తోంది. మున్సిపాల్టీగా చేయడం వల్ల ఉపాధి పనులు కూడా లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో కొనసాగుతున్న మున్సిపాల్టీలో సమస్యలపై నిర్లక్ష్యం, అలసత్వమే తప్ప.. ఏ కోశానా అభివృద్ధి ఛాయలే కనపడటం లేదని వాపోయారు. నెల్లిమర్లలో సభ జరుగుతుండగా ప్రసవ వేదనపడుతున్న గర్భిణిని తీసుకెళుతున్న ఆటో జనం మధ్యలో ఇరుక్కుపోయింది. 108లో ఎంతో క్షేమంగా వెళ్లాల్సిన ఆ తల్లి కష్టం కదిలించింది. ఉపన్యాసాన్ని ఆపి.. ఆటోకు దారివ్వండని ప్రజల్ని కోరగానే.. నా మాటను మన్నించి మానవత్వాన్ని చాటారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్రంలోని 108 వాహనాల్లో మూడో వంతు మూలన పడటం వాస్తవం కాదా? ముక్కుతూ మూల్గుతూ తిరుగుతున్న మిగతా వాటిలో ఆక్సిజన్, అత్యవసర మందులూ కొరవడటం నిజం కాదా? వాస్తవాలిలా ఉండగా.. 95శాతం వాహనాలు సక్రమంగా సేవలందిస్తున్నట్టు మీ డ్యాష్ బోర్డులో చూపడం ఎవర్ని మోసం చేయడానికి? మీకు ప్రజల ప్రాణాలకన్నా మీ మోసపు లెక్కల ప్రచారమే ముఖ్యమా? -వైఎస్ జగన్ -
276వ రోజు పాదయాత్ర డైరీ
-
276వ రోజు పాదయాత్ర డైరీ
02–10–2018, మంగళవారం కొండవెలగాడ, విజయనగరం జిల్లా మీ కమీషన్ల కక్కుర్తితో వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతుండటం వాస్తవం కాదా? ఇవాళ ఇద్దరు మహనీయులు.. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించాను. వారి స్ఫూర్తి తరతరాలకు వెలుగుబాటే. విజయనగరం మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కలిశారు. తమ బతుకుల్ని రోడ్డున పడేసే కుయుక్తులు పన్నుతోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కుటుంబాలు ఆధారపడ్డ పారిశుద్ధ్య సేవలను ప్రైవేటుపరం చేసి, బినామీ కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ లంచాల కోసం తమ కడుపు కొడుతున్నారని కంటతడిపెట్టారు. ఆ వృత్తిలో అత్యధికులు దళితులే. ‘ఓ వైపు మా జీవితాలను చీకటిమయం చేస్తూ, మరోవైపు దళిత తేజం అనడం వంచన కాదా’అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న అక్కచెల్లెమ్మలది అదే గడ్డు పరిస్థితి. వారికిస్తుందే నెలకు రూ.1,000. నాలుగు నెలలుగా వేతనాలు లేవు.. బిల్లులూ రావు. అప్పులు చేసి సరుకులు తెచ్చుకుంటున్న దుస్థితి. ఓ వైపు ప్రభుత్వమే తక్కువ మొత్తాలు కేటాయిస్తూ.. నాసిరకం బియ్యాన్ని, కుళ్లిపోయి పురుగులు పట్టిన గుడ్లను సరఫరా చేస్తోంది. మరోవైపు నాణ్యత లేని భోజనం అనే నెపాన్ని వేసి కమీషన్ల కోసం ప్రైవేటువారికి ఈ పథకాన్ని కట్టబెడుతోంది. మరి ఏళ్ల తరబడి దీన్నే నమ్ముకున్న వేలాది కుటుంబాలు ఏమైపోవాలి? జేఎన్టీయూలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఆచార్యులు కలిశారు. అందరూ బీటెక్, ఎంటెక్ ఐఐటీల్లో చదివినవారే. పదేళ్లుగా పనిచేస్తున్నా జీతం రూ.17 వేలే. తాము చదువుకున్న చదువుకు, తమ అనుభవానికి ఈ సర్కారు కట్టే విలువ ఇదేనా అని నిస్పృహ వెలిబుచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఆపద్బంధువులా ఆదుకునే 108 వ్యవస్థకు జబ్బు చేసింది. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ‘చాలీచాలని, నెలల తరబడి రాని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా, వేధింపులు ఎదుర్కొంటూ.. ఎన్నాళ్లిలా’అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.. 108 సిబ్బంది. ‘వేతనాలు ఇవ్వరు.. వెట్టి చాకిరీ చేయించుకుంటారు.. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఎదుగూబొదుగూ లేని జీవితాలు’అంటూ వాపోయారు.. సెకండ్ ఏఎన్ఎంల రాష్ట్ర సంఘం ప్రతినిధులు. ఉపాధి పోతోందని, ఉద్యోగ భద్రత లేదని, వేతనాలు ఇవ్వడం లేదని, చాలీచాలని జీతాలని, వేధింపులు ఎక్కువయ్యాయని, వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని.. ఇలా నన్ను కలిసిన ఒక్కో ఉద్యోగిది ఒక్కో ఆవేదన. ఆసక్తికర విషయమేమిటంటే.. బాబుగారి ఏదో ఒక బూటకపు హామీకి బలికాని ఉద్యోగి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం. రాజకీయ వివక్ష లేని ప్రాంతమంటూ లేదు. వైఎస్సార్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఆ కాలనీకి వైఎస్సార్ అని పేరుపెట్టుకున్నందుకు అంటరానివారిగా చూస్తున్నారు. నీళ్లు ట్యాంకర్లతో కొనాల్సిన పరిస్థితి. రోడ్లు, లైట్లు లేనే లేవు. డ్రైనేజీ మరీ దారుణం. చినుకు పడితే చెరువును తలపిస్తోంది. 25వ వార్డుది ఇలాంటి పరిస్థితే. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ గెలిచారని కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. అసలే అభివృద్ధి పనులు ఎక్కడా జరగడం లేదు. ఆపై ఇస్తున్న అరకొరా సంక్షేమ పథకాల నిధులకు కోతపెడితే పేదలెలా బతకాలి? స్థానిక సంస్థల దుస్థితిని కళ్లకు కట్టారు నన్ను కలిసిన సర్పంచ్ల సంఘం ప్రతినిధులు.. మామిడి అప్పలనాయుడు, రంగారావు, రోషిరెడ్డి. జన్మభూమి కమిటీలతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ‘ఇదేనా మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు బస చేసిన కొండవెలగాడ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ సదుపాయాలు లేకున్నా ఎందరో అంతర్జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులను అందించిన ఘనత ఈ గ్రామానిది. ఇక్కడ వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని ఏరా>్పటు చేస్తానని బాబుగారు హామీఇచ్చి మూడేళ్లయింది. ఆయనగారి అన్ని హామీలలానే ఇదీ అటకెక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఇంటికో ఉద్యోగం, ఉపాధి లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా కేవలం మీ కమీషన్ల కక్కుర్తి వల్లే మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్య విభాగం.. ఇలా అనేక రంగాలకు చెందిన వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతుండటం వాస్తవం కాదా? -
275వ రోజు పాదయాత్ర డైరీ
-
275వ రోజు పాదయాత్ర డైరీ
01–10–2018, సోమవారం కొత్తపేట, విజయనగరం జిల్లా జూట్ మిల్లులు, సహకార చక్కెర కర్మాగారాలు మీ పాలనలోనే మూతబడటం వాస్తవం కాదా బాబూ? ఈ రోజు ఉదయం వై.జంక్షన్ వద్ద సున్నంబట్టీ వీధి ప్రజలు కలిశారు. వారంతా బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు. ఎక్కువమంది జూట్‌మిల్లు కార్మికులే. ఓ వైపు.. మిల్లులు మూతబడి ఉపాధి కోల్పోయారు. మరోవైపు.. హుద్‌హుద్ తుపాను దెబ్బకు ఇళ్లూ పోయాయి. మూడేళ్లు దాటినా తుపాను బాధితులకు ఒక్కటంటే ఒక్క ఇల్లూ ఇచ్చింది లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్‌నగర్ వద్ద అక్కచెల్లెమ్మలు కలిశారు. ఆ కాలనీలో తాగునీటి కొళాయిలే లేవట. నిరంతరం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే రహదారి దాటి నీరు తెచ్చుకోవడం ప్రమాదకరంగా పరిణమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు, అధికార పార్టీ నేతలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. ఫలితం లేదన్నారు. వారెవ్వరికీ మరుగుదొడ్లు కూడా లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఆత్మగౌరవాన్ని చంపుకుని.. అవసరం తీర్చుకోవడానికి బహిరంగ ప్రదేశాల్లో మరుగును వెతుక్కోవాల్సి వస్తోందని చెబుతుంటే.. మనసంతా కలచివేసినట్లయింది. దారిపొడవునా జూట్ మిల్లు కార్మికులు కలుస్తూనే ఉన్నారు. ఉపాధి లేక.. కూలి పనులు దొరక్క.. వారు పడుతున్న వేదన వర్ణనాతీతం. జూట్ మిల్లులకు చేయూతనిస్తానని.. కార్మికుల జీతభత్యాలు పెరిగేట్లు ఒప్పందం చేయిస్తానని.. ఎన్నికలకు ముందు బాబుగారు హామీ ఇచ్చారు. జీతం పెరగడం మాట దేవుడెరుగు.. మిల్లులు మూతబడి ఉన్న ఉద్యోగాలు పోయాయని బావురుమన్నారు. అశోక్‌గజపతిరాజుగారి దత్తత గ్రామం ద్వారపూడిలో జరిగిన బహిరంగ సభలో.. జూట్ మిల్లులన్నీ తెరిపిస్తానని ముఖ్యమంత్రిగారు ప్రకటించారు. ఆయన హామీకే దిక్కు లేకుండా పోయింది. కేంద్రమంత్రిగా చేసిన వ్యక్తి.. ఆ మిల్లుల గురించి పెద్దగా తెలియదంటాడు. ఉత్తరాంధ్రకే చెందిన అప్పటి కార్మిక మంత్రికి కనికరమే ఉండదు. ప్రజాసేవ సాకుతో పార్టీ మారిన మరో మంత్రి ఉలకడు పలకడు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువై.. కరెంటు చార్జీలు భారమై.. మిల్లులు మూతబడ్డాయి. జూట్ మిల్లు కార్మికుల ఈతి బాధలకు పాలక నేతలే ప్రధాన కారణం. పట్టణాల్లోని పేదల కోసం ఏర్పాటుచేసిన అర్బన్ హెల్త్ సెంటర్లను ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా పేరు మార్చారు. వాటికి ఇస్తున్న బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచి.. కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారు. సిబ్బంది వేతనాల్లో మార్పు లేదు.. ఆస్పత్రుల్లో అందుతున్న సేవలూ పెరగలేదు.. మరి పెంచిన బడ్జెట్ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతున్నట్టు!.. నన్ను కలిసిన వైద్య సిబ్బంది ఆవేదన ఇది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, జూట్ మిల్లులు మొదలుకుని.. సహకార చక్కెర కర్మాగారాల వరకూ మీ పాలనలోనే మూతబడటం వాస్తవం కాదా? ఉన్నవాటిని ఆదుకోవడం మాని.. కొత్తవాటి కోసం అంటూ విదేశీ పర్యటనలు చేయడం.. ఎవర్ని మోసం చేయడానికి? -వైఎస్ జగన్ -
274వ రోజు పాదయాత్ర డైరీ
-
274వ రోజు పాదయాత్ర డైరీ
30–09–2018, ఆదివారం జొన్నవలస క్రాస్, విజయనగరం జిల్లా అగ్రిగోల్డ్ ఆస్తులను తగ్గించి చూపడం వెనుక మతలబేంటి బాబూ? ఈ రోజు గజపతినగరం నియోజకవర్గం జామిలో ప్రారంభమైన పాదయాత్ర.. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోంచి విజయనగరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జిల్లాలు వేరైనా.. నియోజకవర్గాలు వేరైనా.. ప్రజల సమస్యల్లో పెద్ద తేడా లేదనిపించింది. ఉదయం కలిసిన నారాయణరావన్న చిన్నపాటి సైకిల్ షాపు నడుపుకొనేవాడట. పదేళ్ల కిందట గుండె జబ్బు వస్తే.. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందిందట. నాన్నగారే తనకు ఆయుçష్షు పోశారని కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఆయన కొడుకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో బీటెక్ చదివి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడట. తమ జీవితాల్లో వెలుగులు నింపిన నాన్నగారిని గుర్తుచేసుకోని రోజంటూ ఉండదని చెబుతుంటే.. మనసంతా సంతోషంతో నిండిపోయింది. బాబుగారికి, సహకార చక్కెర కర్మాగారాలకు అవినాభావ సంబంధం ఉంది. ఆయన అధికారంలోకి రావడం.. అవి మూతపడటం.. అతి తక్కువ ధరకే బినామీలకు అమ్మేయాలనుకోవడం షరా మామూలే. భీమసింగి చక్కెర ఫ్యాక్టరీ వద్ద కలిసిన కార్మికులు ఇదే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. 15 ఏళ్ల కిందట బాబుగారి పాలనలోనే ఈ ఫ్యాక్టరీ మూతబడింది. అప్పుడు పాదయాత్రగా వచ్చిన నాన్నగారిని కలిసి కార్మికులు తమ గోడు చెప్పుకొన్నారు. నాన్నగారు అధికారంలోకి రాగానే ఆ ఫ్యాక్టరీని తెరిపించారు. ఈ రోజు మళ్లీ ఆ ఫ్యాక్టరీ అంపశయ్యపై ఉంది. ఆదుకోవాలని కార్మికులు నాకు వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వ నిరాదరణ, పోలీసుల వేధింపులతో తమ మనుగడే కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు స్వర్ణకారులు. ప్రభుత్వ నిర్వాకం, కార్పొరేట్ సంస్థల ప్రాభవం మాటున మసకబారిపోతున్న ఆ పేద విశ్వబ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న నా సంకల్పం మరింత దృఢపడింది. విజయనగరాన్ని సాంస్కృతిక రాజధాని అంటారు. ఎంతో మంది గొప్ప గాయకులను, కళాకారులను, కవులను అందించిన నేల ఇది. ఇక్కడి కోరుకొండ సైనిక్ స్కూల్ మహా ప్రసిద్ధి. ఈ స్కూలు విద్యార్థులు దేశ త్రివిధ దళాల్లోనే కాకుండా.. వివిధ రంగాల్లో గొప్ప గొప్ప స్థానాలను అధిరోహించారు. వెనుకబడ్డ ఉత్తరాంధ్రలోనే అగ్రిగోల్డ్ బాధితులు అత్యధికం. రాష్ట్రంలో దాదాపు మూడో వంతు మంది ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు. విజయనగరం జిల్లా వారు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ పెద్దల మాటలకు, చేతలకు పొంతనే లేదన్నారు. వారి వ్యవహారం చూస్తుంటే.. సమస్య తీరుతుందన్న నమ్మకం పోయి, మోసం జరుగుతుందన్న భయం కలుగుతోందన్నారు. మాకు న్యాయం చేయాలన్న తపన కన్నా.. సంస్థ ఆస్తులను కాజేయాలన్న తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చి నాలుగేళ్లయినా ఆ దిశగా ఒక్క ముందడుగైనా వేశారా? అది చేయకపోగా.. సంస్థ ఆస్తుల విలువను పథకం ప్రకారం తగ్గించి చూపడం.. కొన్ని ఆస్తులను ఇప్పటికే బినామీల ద్వారా కొనుగోలు చేయించడం.. మరికొన్ని విలువైన ఆస్తులను వేలం నుంచి మినహాయించడం వాస్తవం కాదా? మిగిలిన ఆస్తులను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన సంస్థతో అర్ధరాత్రి వేళ తెరచాటు మంతనాలు జరపడం వెనుక మతలబు ఏంటి? -వైఎస్ జగన్ -
273వ రోజు పాదయాత్ర డైరీ
-
273వ రోజు పాదయాత్ర డైరీ
29–09–2018, శనివారం పాత భీమసింగి, విజయనగరం జిల్లా యాదవ సోదరులు, గీత కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా బాబూ? ఈ రోజంతా జామి మండలంలోనే పాదయాత్ర సాగింది. ఒకే మండలం రెండు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. ఎస్.కోటలో సగం, గజపతినగరంలో సగం పంచాయతీలున్నాయి. ఇక్కడి అనేక గ్రామాల చరిత్ర.. మహాభారత ఘట్టాలతో ముడిపడి ఉంది. ఉదయం నడిచిన గ్రామాల్లో అత్యధికంగా యాదవ సోదరులే ఉన్నారు. వారంతా తమ కష్టనష్టాలు చెప్పుకొన్నారు. ఈ కాలంలో కులవృత్తి కష్టమైపోయిందన్నారు. గతంలోలా గొర్రెలకు, పెంపకందార్లకు బీమా సౌకర్యం లేదని.. వైద్యం, మందులు అందడం లేదని.. రుణాలసలే ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలమండ గ్రామం పశువుల సంతకు మహాప్రసిద్ధి. మహాభారతంలో విరాటరాజు వద్ద విశేష సంఖ్యలో పశు సంపద ఉండేదట. అలనాటి ఆ ఆలమందల వల్లనే ఈ గ్రామానికి ఆలమండ అని పేరొచ్చిందని చెబుతుంటారు. అటువంటి ఆలమండ.. నేడు పశువిక్రయాలకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. వ్యవసాయం భారమై.. పశుగ్రాసం కరువై.. పాలకు గిట్టుబాటు ధరలేక.. గత్యంతరం లేని పరిస్థితుల్లో పశువులు కబేళాలకు తరలిపోతుండటం కలచివేసింది. గొడికొమ్ము గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రాజేశ్వరి అనే చెల్లెమ్మ కలిసింది. ఏళ్ల కిందటే తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోతే.. అమ్మ కూలికెళ్లి బిడ్డలను సాకుతోంది. ఆ చెల్లెమ్మకేమో ఒక కన్ను పూర్తిగా కనిపించదు.. మరో కన్నూ మసక మసకగా కనిపిస్తుంది. ఆ కంటికి ఆపరేషన్ చేయించుకుందామంటే.. వేలకు వేలు ఖర్చుచేయలేని దుస్థితి. ఆరోగ్యశ్రీ వర్తించని దయనీయ పరిస్థితి. అయినా సరే.. జీవన పోరాటంలో పట్టుదలే ఆయుధమనుకుంది. చదువుతో పాటు వెయిట్ లిఫ్టింగ్, షాట్‌పుట్‌లలో ప్రతిభ కనబరిచి మెమోంటోలు గెలిచింది. అంతే పట్టుదలగా డైట్ కోర్సు పూర్తి చేసింది. డీఎస్సీ వస్తే ఉద్యోగం తెచ్చుకుని.. వచ్చే డబ్బుతో కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని ఆశపడింది. కానీ ఏళ్లు గడుస్తున్నా డీఎస్సీ రాకపోయే. ఉద్యోగమూ లేకపోయే. ఆపరేషనూ కాకపోయే. మరి వైకల్యమెవరికి? తండ్రి ఆదరణ లేకపోయినా.. పేదరికం పట్టి పీడిస్తున్నా.. రెండు కళ్లూ కనిపించకపోయినా.. అంతులేని ఆత్మవిశ్వాసంతో బతుకు పోరాటం చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ చెల్లెమ్మకా? ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి.. మాట తప్పి లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసగించిన సర్కారుకా? ఉదయం కలిసిన మామిడి తాండ్ర తయారీదారుల కష్టాలు వింటుంటే.. చాలా బాధనిపించింది. నాన్నగారి హయాంలో పన్నులు తగ్గించి, పంచదారను సబ్సిడీకి సరఫరా చేసి వారిని ఆదుకున్నారు. ఈ పాలనలో ఏ సబ్సిడీలూ లేకపోగా.. పన్నుల బాదుడు పెరిగిపోయింది. ప్రభుత్వ నిరాదరణ ఇలాగే కొనసాగితే ప్రసిద్ధిగాంచిన భీమాళి మామిడి తాండ్ర.. గత చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఎంతో దూరం లేదనిపించింది. సాయంత్రం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు కలిశారు. అన్ని నిబంధనలనూ పాటిస్తూ ఉద్యోగాల్లో చేరిన తమను.. తప్పక క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చి దగా చేశారని వాపోయారు. తమను కన్సాలిడేటెడ్ వేతనాల జాబితాలో చేర్చడంతో క్రమబద్ధీకరణ ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగాలు వద్దు.. ప్రయివేటు సేవలే ముద్దు’ అని మనసులో మాటగా రాసుకున్న వ్యక్తి న్యాయం చేస్తారనుకోవడం భ్రమే. యాతపాలెం, కొత్త భీమసింగి గ్రామాల్లో గీత కార్మికులు అధికంగా ఉన్నారు. హుద్ హుద్ తుపానుతో జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్న తమకు.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. తుపాను చేసిన నష్టం కన్నా.. సర్కారు చేసిన మోసమే ఎక్కువగా కుంగదీస్తోందన్నారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి గొర్రెలకు బీమా.. గొర్రెల కాపరులకు రూ.2 లక్షల ఉచిత బీమా.. గొర్రెల మేత కోసం భూముల కేటాయింపు.. గీత కార్మికుల కోసం బెల్టు షాపుల రద్దు.. చెట్టు పన్నును ప్రభుత్వం చెల్లించడం.. తాటిచెట్ల పెంపకం కోసం భూముల కేటాయింపు.. ఇవన్నీ ఎక్కడైనా విన్నట్టుగా అనిపిస్తోందా? ఇవి మీ మేనిఫెస్టోలోని 22వ పేజీలోని అంశాలే. యాదవ సోదరులు, గీత కార్మికుల కోసం మేనిఫెస్టోలో మీరిచ్చిన 14 హామీలలో ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా? -వైఎస్ జగన్ -
272వ రోజు పాదయాత్ర డైరీ
-
272వ రోజు పాదయాత్ర డైరీ
27–09–2018, గురువారం కిర్ల, విజయనగరం జిల్లా వ్యవసాయంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి బాబూ? ఈ రోజు దారికి ఇరువైపులా ఎటుచూసినా మామిడి తోటలే. ఆనందంగా అనిపించింది. కానీ ఆర్పీపురం వద్ద కలిసిన మామిడి రైతుల కష్టాలు వినగానే ఆ ఆనందం కాస్తా ఆవిరైపోయింది. దేశంలోని గొప్ప గొప్ప నగరాలన్నింటికీ ఈ ప్రాంత మామిడి ఎగుమతి అవుతోంది. కానీ ఇక్కడ రైతన్నల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటంతా దళారుల పాల్జేయాల్సి వస్తోంది. ధరలు నిర్ణయించకుండానే దళారులు రైతుల దగ్గర సరుకు సేకరిస్తారు. ఆ తర్వాత వారికి తోచినప్పుడు డబ్బులిస్తారు. ఇచ్చిన కాడికి తీసుకోవాల్సిందే. కష్టపడి పంట పండించి.. ఆపై నష్టాల పాలవడం ఇక్కడి రైతుల్ని బాగా కుంగదీస్తోంది. వ్యాపారులంతా సిండికేట్ అయి రైతన్నల ఉసురు పోసుకుంటున్నారట. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే దళారులకు కొమ్ముకాస్తోందంటూ బావురుమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతన్నల మనుగడ ఎంత కష్టం?! ఇక్కడి భీమాళి గ్రామం మామిడి తాండ్రకు మహా ప్రసిద్ధి. దేశ విదేశాల్లోనూ పేరుంది. ఈ రోజు కలిసిన మామిడి తాండ్ర తయారీదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగు వందలకు పైగా కుటుంబాల వారు తరతరాలుగా ఆ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిరాదరణకు గురవుతున్నామన్నారు. గిట్టుబాటు ధర లేదు. మంచి ధర పలికే వరకూ నిల్వ చేసుకుందామంటే.. కోల్డు స్టోరేజీ సౌకర్యాలు అసలే లేవు. గత్యంతరం లేక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా బాధేసింది. ఇలాంటి వ్యవసాయాధారిత ఉత్పత్తుల తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించి ప్రోత్సహిస్తే.. వారు బాగుపడతారు. రైతన్నలకూ లబ్ధి చేకూరుతుంది. ఆ మాత్రం ఆలోచన కూడా లేకపోవడమన్నది.. రైతన్నలపై ఈ పాలకులకు ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇక్కడ వాస్తవంగా వ్యవసాయం ఇంత దుర్భరంగా ఉంటే.. తమ ఏలుబడిలో అద్భుతంగా ఉందని బూటకపు ప్రచారం చేసుకునే వారిని ఏమనుకోవాలి? వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన వ్యక్తే.. అమెరికాకు పోయి ఇక్కడంతా గొప్పగా ఉందని ఉపన్యాసాలివ్వడం.. ఎంతటి హాస్యాస్పదం!భీమాళికి చెందిన అచ్చెన్నాయుడు.. ఎన్నికలకు ముందు రూ.30 వేల బ్యాంకు రుణం తీసుకున్నాడు. బాబుగారి రుణమాఫీ హామీని నమ్మి మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. తీరా మాఫీ కాకపోగా.. వడ్డీతో అప్పు తడిసి మోపెడైంది. ఈ ప్రాంత రైతన్నలందరిదీ ఇదే బాధ. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మనదేశంలోని 29 రాష్ట్రాల్లో రైతన్నల నెలవారీ ఆదాయంలో మన రాష్ట్రం చివరి 28వ స్థానంలో ఉందనేది నిజం కాదా? వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. వ్యవసాయంలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా ఉందని ఉపన్యాసాలివ్వడం ఎవర్ని మోసం చేయడానికి? -వైఎస్ జగన్ -
271వ రోజు పాదయాత్ర డైరీ
-
271వ రోజు పాదయాత్ర డైరీ
26–09–2018, బుధవారం కొట్యాడ, విజయనగరం జిల్లా నారా వారి నోటి మాటకు ఉన్న విలువ అంతేనేమో! ఈ రోజంతా లక్కవరపుకోట మండలంలో పాదయాత్ర సాగింది. ఉదయం అరకు దారిలో నడిచాను. దారంతా ఇరుకుగా.. గతుకులమయంగా ఉంది. ఆ రోడ్డును నాలుగులేన్ల రహదారిగా మారుస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దాంతోపాటే అరకును దత్తత తీసుకుని టూరిజం హబ్‌గా మారుస్తానని వాగ్దానం చేశారు. అలా చెప్పి రెండేళ్లు గడిచిపోయినా.. ఆ మాటలకు అతీ గతీ లేదు. మెడికల్ హబ్, టూరిజమ్ హబ్, ఎడ్యుకేషన్ హబ్.. ఇలా ఎక్కడికెళితే అక్కడ ఏదో ఒకటి చెప్పేస్తూ ‘ఆ విధంగా ముందుకు’పోతూనే ఉన్నారు బాబుగారు. ఆ మాటలన్నీ గాలి మాటలుగానే తేలిపోయాయి. దారిలో జమ్మాదేవిపేట గ్రామస్తులు కలిశారు. ఆ గ్రామాన్ని ఎనిమిది నెలల వ్యవధిలో చంద్రబాబు, లోకేశ్‌లు సందర్శించారట. ఇంటింటికీ కొళాయి ఇస్తామని తండ్రీకొడుకులిద్దరు హామీ ఇచ్చారు. తండ్రిగారైతే అక్కడికక్కడే కోటి రూపాయలకు పైగా అభివృద్ధి పనులను ప్రకటించేశారు. కానీ ఇప్పటివరకు కొళాయి వచ్చిందీ లేదు. అభివృద్ధి జాడే లేదు. ఆ మాటలన్నీ నీటి మూటలే అయ్యాయి. ‘హుద్‌హుద్ తుపాను మా బతుకుల్లో కల్లోలం సృష్టించింది. నమ్ముకున్న తాటిచెట్లు కూలిపోయి బతుకుదెరువు కోల్పోయాం. అప్పుడు బాబుగారు ఒక్కొక్కరికి రూ.10,000 పరిహారం, రూ.2,00,000 లోను ఇస్తానన్నారు.. ద్విచక్రవాహనాలన్నారు. అన్నీ చెప్పడమే తప్ప చేసింది లేదు.. ఇచ్చింది లేదు’అంటూ నన్ను కలిసిన గీత కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. ఆ సోదరులంతా ఆందోళన బాట పట్టారిప్పుడు. ఇచ్చిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చరు బాబుగారు. నారా వారి నోటి మాటకు ఉన్న విలువ అంతేనేమో! అదే జమ్మాదేవిపేటలో జూన్ నాలుగున గ్రామదర్శిని సభ జరిగింది. ముఖ్యమంత్రిగారే దానికి ముఖ్య అతిథి. టీడీపీకే చెందిన దళితుడైన సర్పంచ్‌ను జెండాలు కట్టడానికే పరిమితం చేశారు. స్టేజీ మీదకు కూడా ఎక్కనివ్వలేదట. ఇది దురహంకారం కాదా? సభకు అధ్యక్షత వహించాల్సిన సర్పంచ్.. దళితుడైనంత మాత్రాన ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టరా? అయినా.. ‘దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’అని సెలవిచ్చిన బాబుగారి నుంచి అంతకన్నా ఏం ఆశించగలం? గ్రామదర్శిని కార్యక్రమంలో ఆ ఊరంతా తిరిగిన బాబుగారు.. దళితవాడలో మాత్రం అడుగు కూడా పెట్టలేదట. బాబుగారి ‘దళిత తేజం’అంటే ఇదేనేమో! గుండెనిండా అభిమానాన్ని నింపుకొని వచ్చింది పార్వతక్క. లక్కవరపుకోట దగ్గర కలిసిన ఆమె ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చింది. ‘మీరు ఆరోగ్యంగా ఉండాలి. పాదయాత్ర బాగా జరగాలి. మీ నాన్నగారిలాగే అందరికీ ఉపా«ధి కల్పించాలి’అని చెప్పింది. గతంలో ఆమె కుటుంబం చాలా దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడేదట. 12 మంది ఉన్న ఆ కుటుంబంలో ఎవరికీ ఎలాంటి ఉపాధి ఆసరా లేక.. రోజు గడవటమే కష్టంగా ఉండేదట. పైగా ఆ ఇంట్లో ఇద్దరు దీర్ఘకాలిక రోగులున్నారు. వాళ్లకు మందూమాకులూ కొనడానికి కూడా లేని దీనస్థితి. అలాంటి సమయంలో కేవలం ఒకే ఒక అప్లికేషన్‌తో ఆమెకు ఏఎన్ఎం పోస్టు వచ్చిందట. ఏ సిఫార్సులు లేకుండా, లంచాలు లేకుండా వచ్చిన ఆ ఉద్యోగమే.. ఆ ఇంటిని అప్పట్నుంచీ నడిపిస్తోంది. అందుకే ఆమెకు నాన్నగారంటే వల్లమాలిన అభిమానం. ఆ అభిమానాన్నే నా మీదా చూపింది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికలకు ముందు డప్పు కొట్టారు.. చెప్పు కుట్టారు. నేనే పెద్ద మాదిగనంటూ.. ఫోజులిచ్చారు. అధికారంలోకి వచ్చాక.. దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అంటూ వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. గ్రామ దర్శిని సభలో దళిత సర్పంచ్‌ను కనీసం స్టేజ్‌పైకి పిలవను కూడా లేదు. ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’అంటే ఇదే కాదా? -వైఎస్ జగన్ -
270వ రోజు పాదయాత్ర డైరీ
-
270వ రోజు పాదయాత్ర డైరీ
25–09–2018, మంగళవారం రంగరాయపురం, విజయనగరం జిల్లా నవరత్నాలు జనంలోకి వెళ్లడం ఆనందాన్నిచ్చింది ఈరోజు కొత్తవలస మండలం తుమ్మికాపాలెం నుంచి ఎల్.కోట మండలం రంగరాయపురం వరకు పాదయాత్ర సాగింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ కాసింది. మండు వేసవిని తలపించింది. అంత వేడిలోనూ ఉక్కపోతలోనూ జనం బారులుతీరి నిల్చున్నారు. యాత్ర ముగింపు సమయంలో మాత్రం వర్షంతో వాతావరణం కాస్త చల్లబడింది. కొత్తవలస నుంచి వచ్చిన పేదలు నన్ను కలిశారు. వారంతా టీలు, పండ్లు, తినుబండారాలు లాంటివి అమ్ముకుని బతికే బడుగుజీవులు. కొత్తవలస జంక్షన్ వద్ద 30 ఏళ్లుగా చిన్నచిన్న దుకాణాలు నడుపుకుంటున్నారు. క్రమం తప్పకుండా పంచాయతీ వారికి, రైల్వే వారికి రుసుం చెల్లిస్తూనే ఉన్నారు. కానీ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం నెపంతో గత నెలలో రాత్రికిరాత్రే బలవంతంగా వారి దుకాణాలన్నీ తొలగించేశారట. ఉన్నపళంగా ఉపాధి కోల్పోయామని వారు బావురుమన్నారు. బడాబాబులు వందల ఎకరాల ప్రభుత్వ భూములను మింగేస్తున్నా కన్నెత్తి చూడని పాలకులు.. ఏళ్ల తరబడి సక్రమంగా పన్నులు కడుతూ చాలీచాలని ఆదాయంతో బతుకులీడుస్తున్న తమపై మాత్రం కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తవలస జూట్‌మిల్ కార్మికులదీ ఉపాధి గండమే. జూట్ మిల్లులన్నీ ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. వేలాది మందికి ఉపాధినిచ్చే పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రభుత్వ ప్రోత్సాహం పూర్తిగా కరువైంది. కరెంట్ చార్జీల బాధలు నానాటికీ ఎక్కువయ్యాయి. ఒక్కొక్క మిల్లు మూతపడుతోంది. వేలాది కార్మికులు వలసబాట పడుతున్నారు. ఒకప్పుడు 35 మిల్లులతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఉత్తరాంధ్రలో నేడు 18 మిల్లులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కష్టనష్టాలతో కునారిల్లుతున్నాయి. కొత్త పరిశ్రమలు ఎలాగూ రావడం లేదు. కనీసం ఉన్నవాటినైనా రక్షించుకోలేకపోతే ఎలా? వేలాది జీవితాలతో ముడిపడ్డ వాటినైనా కాస్త మానవత్వంతో చూడాలి కదా? ప్రతి దానిలోనూ వ్యాపార దృష్టి, స్వార్థ చింతనేనా? జిందాల్ ఫ్యాక్టరీ కార్మికులు తామెంత దుర్భరంగా బతుకుతున్నామో చెప్పారు. కనీస వేతనాలు, కార్మిక చట్టాలు వర్తించడం లేదన్నారు. నాన్నగారి హయాంలో రెండేళ్లకొకసారి వేజ్‌బోర్డు ద్వారా వేతన సవరణ జరిగేదట. నేడు ఆరున్నరేళ్లయినా జరగకపోవడం బాబు గారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. 30 ఏళ్లుగా కర్మాగారంలో పనిచేస్తున్నా మూడు పూటలా తినలేని దుస్థితి తమదన్నారు. ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే ఆరోగ్య శ్రీ వర్తించకపోయే. పిల్లల చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోయే. అన్ని ధరలు, చార్జీలు పెరిగిపోయే. వాటికి అనుగుణంగా జీతాలు పెరగపోతే ఏం తినాలి? ఎలా బతకాలి? గంగుబూడి జంక్షన్ వద్ద నవరత్నాల శిబిరం ఆకట్టుకుంది. లబ్ధిదారుల వేషధారణలోని చిన్నారులు ఒక్కొక్క పథకాన్ని వివరిస్తుంటే ముచ్చటేసింది. ఇన్ని రోజుల పాదయాత్రలో ఎంతో మందికి నేను నవరత్నాల గురించి వివరించాను. అటువంటిది ఈరోజు చిన్నపిల్లలు వాటి గురించి చెబుతుంటే.. వింటుండటం గమ్మత్తుగా అనిపించింది. ప్రజల స్థితిగతులను మార్చే నవరత్నాలు విస్తృతంగా జనంలోకి వెళ్లడం ఆనందాన్నిచ్చింది. ముఖ్యమంత్రిగారికి నాదొక ప్రశ్న.. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరిస్తామన్నారు. మీ పాలన పూర్తవ్వడానికి ఇంకో నాలుగు నెలలే మిగిలుంది. ఆ పారిశ్రామిక విధానం ఏమైంది? పరిశ్రమల స్థాపన ద్వారా ప్రతి ఇంటికి ఉపాధి–ఉద్యోగం కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్లలో వచ్చిన పరిశ్రమలకన్నా మూతబడ్డవే ఎక్కువున్నాయన్నది వాస్తవం కాదా? ఉపాధి కోల్పోయి వలస బాట పట్టిన లక్షలాది కార్మికుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు? -వైఎస్ జగన్ -
269వ రోజు పాదయాత్ర డైరీ
-
269వ రోజు పాదయాత్ర డైరీ
24–09–2018, సోమవారం తుమ్మికాపాలెం, విజయనగరం జిల్లా దేవుని దయ, ఆత్మీయ జనాభిమానమే.. నా సంకల్పానికి బలాన్నిస్తున్నాయి.. పాదయాత్ర ఓ చారిత్రక ఘట్టానికి చేరుకుంది. దేశపాత్రునిపాలెంలో 3,000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. దేవుని దయ, ఆత్మీయ జనాభిమానమే.. నా సంకల్పానికి బలాన్నిస్తున్నాయి. 11 జిల్లాల్లో పూర్తయిన యాత్ర ఎన్నో గొప్ప అనుభూతులను, అనుభవాలను ఇచ్చింది. నేను చేస్తున్నదల్లా.. ప్రజాభీష్టాన్ని ప్రతిబింబిస్తూ ప్రజా సంకల్పాన్ని ముందుకు తీసుకెళుతుండటమే. ఈ సుదీర్ఘ యాత్రలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేసింది లేదు. ప్రజలతో మమేకమవడంతో వచ్చే ఆనందమే అలసటను దూరం చేస్తోంది. ఇక రెండు జిల్లాలే మిగిలి ఉన్నాయి. యాత్ర దూరం క్రమంగా తగ్గుతున్నా.. సమస్యలు, ప్రజల ఫిర్యాదులు మాత్రం తగ్గింది లేదు. విజయనగరం జిల్లాలో అందిన ఆహ్వానం మరపురానిది. అలనాటి తాండ్ర పాపారాయుడు మొదలు.. నిన్నటి గురజాడ అప్పారావు వరకూ ఎందరో గొప్పవారు నడయాడిన నేల ఇది. ఇప్పుడు పాదయాత్ర సాగుతున్న శృంగవరపుకోటకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. పాండవుల అజ్ఞాతవాసం ఇక్కడే గడిచినట్టు చెబుతారు. అందుకే ఇక్కడి శృంగవరపుకోట, లక్కవరపుకోట, జామి, భీమాళి, అలమంద, పుణ్యగిరి గ్రామాల పేర్లన్నీ మహాభారత ఘట్టాలతో ముడిపడి ఉన్నాయి. ఎక్కడా కానరాని పాండవుల గుడి ఎస్.కోటలో ఉంది. ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన ఖ్యాతి ఈ నియోజకవర్గానిదే. టంగుటూరి ప్రకాశం పంతులుగారు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి భీమాళి.. మామిడి తాండ్రకు బహు ప్రసిద్ధి. ఇక్కడి భీమ్‌సింగి చక్కెర కర్మాగారం.. సహకార రంగంపై చంద్రబాబు కుట్రలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ జిల్లా చరిత్రను తెలియజేసే విధంగా మహాకవి గురజాడ అప్పారావు, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు వేషధారణలో ఇద్దరు యువకులు స్వాగతం పలికారు. కన్యాశుల్కం పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో 30 ఏళ్లుగా టీడీపీని అందలమెక్కిస్తే.. గుర్తుపెట్టుకునేలా కనీసం మూడు మంచి పనులైనా చేయలేదని ప్రజలు చెప్పుకొచ్చారు. ఎంతో గొప్ప చారిత్రక నేపథ్యం, సాహిత్య, కళా వారసత్వ సంపద కలిగినప్పటికీ.. దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఈ జిల్లా ఒకటిగా ఉండటం కలచివేస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో ఉపాధి కోసం వలసలు పెరిగిపోవడం బాధేస్తోంది. 3,000 కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరణ, కొత్తవలస భారీ బహిరంగ సభ కలకాలం గుర్తుండిపోతాయి. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఈ జిల్లాకు సంబంధించి గోస్తని – చంపావతి, వేదావతి – నాగావళి నదుల అనుసంధానం.. తదితర 15 హామీలిచ్చారు.. కనీసం గుర్తున్నాయా? మీరు ఈ జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ఈ జిల్లా ప్రజలు అమాయకులని మీ ప్రసంగంలో పదే పదే చెబుతూ ఉంటారు. మీరు హామీలిచ్చి సులభంగా మోసం చేశారనే కదా? -వైఎస్ జగన్ -
268వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ
-
268వ రోజు పాదయాత్ర డైరీ
23–09–2018, ఆదివారం సరిపల్లి కాలనీ, విశాఖపట్నం జిల్లా భాగస్వామ్య సదస్సుల ప్రయోజనం ఏదీ? నేటితో విశాఖ జిల్లాలో పాదయాత్ర ముగిసింది. ఈ జిల్లావాసుల ప్రేమాభిమానాలను మూటగట్టుకుని విజయనగరంలో అడుగులేయబోతున్నాను. నర్సీపట్నం మొదలుకుని భీమిలి దాకా.. 12 నియోజకవర్గాల్లో ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిది. కంచరపాలెం సభ కలకాలం గుర్తుండిపోతుంది. ఈ జిల్లా అంతటా అల్లుకుపోయిన భూకుంభకోణాలు, అవినీతి, అక్రమాలు.. కడలి కల్లోలాలను తలపించాయి. ప్రజల కన్నీటి కష్టాలు కలచివేశాయి. నాన్నగారి హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప.. ఈ నాలుగున్నరేళ్లలో ఇసుమంతైనా లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఏటికొప్పాక, తాండవ, తుమ్మపాల, గోవాడ సహకార చక్కెర కర్మాగారాలను కష్టాల ఊబిలోంచి గట్టెక్కించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. హెరిటేజ్, విశాఖ తదితర ప్రయివేటు డెయిరీల దోపిడీ నుంచి పాడి రైతులను కాపాడాల్సిన అవసరం అనివార్యమైనది. భూరాబందుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుంటే.. పేదలకు సెంటు భూమి కూడా మిగిలేట్టు లేదు. మొత్తానికి హుద్ హుద్ తుపాను లాంటి ప్రకృతి వైపరీత్యాల కన్నా.. ఈ పాలనలోని దాష్టీకాలే ఇక్కడి ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్నాయి. ఆర్థిక రాజధాని విశాఖను పీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్య నిరుద్యోగం. కొత్త కంపెనీలు రాకపోగా ఉన్నవి మూతబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. కోట్లు ఖర్చు చేసి ఆర్భాటంగా జరిపిన భాగస్వామ్య సదస్సుల ప్రయోజనం ఏదీ? నేతలు గొప్పగా చెప్పిన పెట్టుబడుల ఉప్పెన కనిపించడంలేదే! వారు పదే పదే ఊదరగొడుతున్నట్టు లక్షలాది ఉద్యోగాలే వచ్చి ఉంటే.. యువతకు నిరుద్యోగ దుస్థితి ఉండేదా? ఈ రోజు ఆనందపురం, పెందుర్తి మండలాల్లో పాదయాత్ర సాగింది. అక్కిరెడ్డిపాలెం వద్ద మహేశ్, సూర్యనారాయణ తదితర నిరుద్యోగ యువకులు కలిశారు. ఇక్కడి ఆటోనగర్ పారిశ్రామిక ప్రాంతంలో స్థానికేతరులకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఉపాధి అవకాశాల్లేక స్థానిక యువత వలసబాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బొడ్డపూడివానిపాలెం, బంధంవానిపాలెం గ్రామాల అక్కచెల్లెమ్మలు కలిశారు. ఆ గ్రామాల్లో మొత్తం ఉప్పు నీరేనట. తాగునీరు కొనాలి.. లేదా పక్క గ్రామాలకెళ్లి తెచ్చుకోవాలి. పేదలకెంత కష్టం? పాలకుల తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే ఈ దుస్థితికి కారణం కాదా? సాయంత్రం పెందుర్తి మండల మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే అక్కచెల్లెమ్మలు కలిశారు. సంవత్సరాలుగా పిల్లలకు వండిపెడుతున్నా.. చాలీచాలని వేతనాలే. నెలల తరబడి జీతాల్లేవు.. బిల్లులూ రావు. మరి పిల్లలకెలా వండిపెట్టాలి? సమయానికి సరుకుల బిల్లులు చెల్లించరు.. కుళ్లిపోయిన, నాసిరకం గుడ్లను వారే సరఫరా చేస్తారు.. ఆపై నాణ్యత లేని భోజనం పెడుతున్నారని అభాండం వేసి.. కమీషన్లు తీసుకుని ప్రయివేటు వాళ్లకు అప్పజెపుతున్నారు. ఇందులో మా తప్పేంటి.. అనేది ఆ అక్కచెల్లెమ్మల ఆవేదన. మధ్యాహ్న భోజనం లాంటి పేద పిల్లల పథకాలు సైతం.. పాలకుల కమీషన్ల కక్కుర్తికి బలయిపోవడం దౌర్భాగ్యం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇంటింటికీ మినరల్ వాటర్ సదుపాయాన్ని కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.. ఏమైందా పథకం? మినరల్ వాటర్ సంగతి దేవుడెరుగు.. కనీసం తాగడానికి కూడా నీరందని గ్రామాల మాటేంటి? -వైఎస్ జగన్ -
267వ రోజు పాదయాత్ర డైరీ
-
267వ రోజు పాదయాత్ర డైరీ
22–09–2018, శనివారం గండిగుండం క్రాస్, విశాఖపట్నం జిల్లా అక్కచెల్లెమ్మలు మీకెందుకు కృతజ్ఞతలు చెప్పాలి బాబూ? విశాఖ జిల్లాలో యాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ జిల్లాలో భూసమస్య గురించి వినని రోజు ఒక్కటంటే ఒక్కటీ లేదు. ఈ రోజు కూడా భూబాగోతాలపై వినతులు వెల్లువెత్తాయి. మా భూముల్ని, చెరువును ఆఖరుకు శ్మశానాన్ని కూడా.. తప్పుడు రికార్డులు సృష్టించి మంత్రిగారి బినామీలు కాజేశారని చందక గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిలదీసినందుకు అక్రమ కేసులతో వేధిస్తున్నారని చెప్పారు. భీమన్నదొరపాలెంలో ఏళ్ల తరబడి దళితులు సాగు చేసుకుంటున్న డీ పట్టా భూముల్ని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌సత్యనారాయణ, ఆయన కుటుంబీకులు కబ్జా చేశారట. సిట్‌కు ఫిర్యాదు చేసినా, కేసు నమోదైనా.. చర్యలు మాత్రం శూన్యమట. ఆ రైతుల్ని వారి భూముల్లోకి కూడా పోనివ్వడం లేదట. భూముల్ని చెరపట్టడంలో అభినవ దుశ్శాసనులైపోయారు అధికార పార్టీ నేతలు. ఈ రోజు పాదయాత్ర జరిగిన ప్రాంతంలో ఎటువంటి సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేవు. ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పింఛన్, రేషన్.. ఆఖరుకు ఉపాధి పనుల కోసం వేలిముద్రలు వేయడానికి దూర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి. వృద్ధులకు, మహిళలకు ఎంత కష్టం! అత్యవసరమైనప్పుడు పోలీసులకో.. అగ్నిమాపక దళానికో.. అంబులెన్స్‌కో ఫోన్ చేయలేని దుస్థితి. అయిదు కిలోమీటర్ల దూరం వెళ్లి 108కి ఫోన్ చేయాల్సి రావడం.. అష్టకష్టాలూపడి చివరికి ఫోన్ చేసినా.. అది సమయానికి రాకపోవడంతో అక్కిరెడ్డి తాత అనే పెద్దాయన గుండెపోటుతో మరణించాడు. పురిటి నొప్పులతో తీవ్ర ఇబ్బందులుపడ్డ హేమశ్రీ రోడ్డుమీదే ప్రసవించిందట. సత్వర వైద్యం అందక మరో సోదరుడు పక్షవాతం బారినపడి కన్నుమూశాడట.. చాలా బాధనిపించింది. విశాఖ మహానగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ గ్రామాలకు కనీసం సమాచార వ్యవస్థ లేకపోవడం విస్మయం కలిగించింది. భారతదేశ సమాచార సాంకేతిక విప్లవానికి మూలపురుషుడు తానేనని.. ఈ దేశానికి సెల్ఫోన్లను పరిచయం చేసిన ఘనత తనదేనని.. ప్రగల్బాలు పలికే నేతలకు ఈ దుస్థితి కనిపించదా? కనువిప్పు కలగదా? అతిథిని ఇంటికి భోజనానికి పిలిచి.. భోజనం పెట్టకుండానే.. పెట్టినట్టు సంతకం పెట్టమంటే ఎలా ఉంటుంది? అక్కచెల్లెమ్మలను పండుగలకు, పబ్బాలకు ఇంటికి రమ్మని చీరా సారే పెట్టకుండానే.. పెట్టినట్టు సంతకం పెట్టించుకుంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంది పొదుపు సంఘాల మహిళల విషయంలో బాబుగారి వైఖరి. ఒక్క హామీ కూడా నెరవేర్చకున్నా.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ డ్వాక్రా అక్కచెల్లెమ్మలతో బలవంతపు సంతకాలు చేయించుకోవాలనుకోవడం దగుల్బాజీతనమే. సాయంత్రం రామవరం గ్రామంలో సరోజిని గ్రూపు, సాయిరాం గ్రూపు, మేరీమాత గ్రూపులకు చెందిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు కలిశారు. బాబుగారి రుణమాఫీ మోసాన్ని మొరపెట్టుకున్నారు. ఆయనగారి పుణ్యమాని.. ఆ ఊళ్లోని 18 గ్రూపుల వారు బ్యాంకుల ఎదుట దోషులుగా నిలబడ్డారట. మరి ముఖ్యమంత్రిగారికి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి? ఏమని చెప్పాలి? ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గత ఎన్నికలకు ముందు.. డ్వాక్రా రుణాలేవీ కట్టొద్దని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా ముఖ్యాంశాలంటూ పొందుపర్చారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయలేదని, చేసే ఉద్దేశమే లేదని.. ఈ మధ్యనే అసెంబ్లీ సాక్షిగా మీ మంత్రిగారే రాతపూర్వకంగా సెలవిచ్చారు. ఇంతకన్నా దారుణ మోసం ఉంటుందా? అబద్ధాలు చెప్పి ఆడబిడ్డల్ని వంచించడం ధర్మమేనా? మీ మేనిఫెస్టోకి ఉన్న విలువ ఇదేనా? మీ చేత దారుణంగా మోసపోయిన అక్కచెల్లెమ్మలతోనే బలవంతంగా కృతజ్ఞతలు చెప్పించుకోవాలనుకుంటున్నారే.. మనసులో ఏ మూలైనా.. కాస్తంతైనా సిగ్గుగా అనిపించదా? -వైఎస్ జగన్ -
266వ రోజు పాదయాత్ర డైరీ
-
266వ రోజు పాదయాత్ర డైరీ
19–09–2018, బుధవారం పప్పలవానిపాలెం క్రాస్, విశాఖ జిల్లా యువత బలిదానాలకు బాధ్యత మీది కాదా బాబూ? ఉదయం బస చేసిన ప్రాంతానికి దగ్గర్లోనే ముచ్చర్ల గ్రామం ఉంది. ఆ గ్రామస్తులు నన్ను కలిశారు. అది ఈనాం గ్రామం. దాదాపు 1,100 ఎకరాలను దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ శిస్తు కడుతుండేవారు. కానీ వారికి ఆ భూముల మీద ఏ హక్కులూ ఉండేవి కావు. అలాం టిది.. నాన్నగారు వచ్చాక వాళ్లందరికీ సాగు హక్కులు కల్పించి పంట రుణాలు ఇప్పించారట. జన్మలో మర్చిపోలేని గొప్ప మేలు చేశారు మీ నాన్నగారని వారు చెబుతుంటే.. చాలా సం తోషమేసింది. ఉదయం సెంచూరియన్, సాయిగణపతి ఇంజనీరింగ్ కళాశాలల మీదుగా పాదయాత్ర సాగింది. ఆ కాలేజీల సిబ్బంది కలిశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నాలుగున్నరేళ్లుగా ఎదురు చూసి మోసపోయామన్నారు. తీరా ఇప్పుడు కంటి తుడుపుగా కొన్ని ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తామంటూ మరో మోసా నికి సిద్ధపడ్డ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ్రోతు రాజు అనే పూర్వ విద్యార్థి కలిశాడు. చదువు పూర్తయి ఏడాది దాటినా ఫీజు రీయింబర్స్ కాక సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ వా పోయాడు. ఆ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు వందలాదిగా వచ్చి నన్ను కలిశారు. ఈ మధ్య కాలంలో క్యాంపస్ ప్లేస్మెంట్సే ఉండటం లేదన్నారు. తమకన్నా ముందు బీటెక్, ఎంటెక్ పూర్తిచేసిన సీనియర్లూ ఉద్యోగాల్లేక ఇళ్ల వద్దే ఖాళీగా ఉన్నారని చెప్పారు. ఏ చిన్నపాటి అటెండర్ ఉద్యోగం వచ్చినా చేరి పోదామని ఎదురు చూస్తున్నారట. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ స మస్యే ఉండేది కాదన్నది వారి ఆవేదన. విద్యావకాశాలు కల్పిం చడం ఎంతముఖ్యమో.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపించడమూ అంతే ముఖ్యం. ఆ రెండూ లేని పాలనలో యువత అసహనం చెందక ఏమవుతుంది? ఆత్మన్యూనత పాలవడంలో ఆశ్చర్యమేముంది? వేమగొట్టిపాలెంలో కలిసిన గొలగాని అప్పలస్వామి అనే తాతకు వందేళ్లు. నాన్నగారంటే వల్లమాలిన అభిమానం. నన్ను చూడాలని రెండు రోజులుగా తపిస్తున్నారట. నన్ను కలవగానే ఆనందంతో రెండు కళ్లూ చెమర్చాయి. ‘మీ నానలాగా సెయ్యా ల.. సేత్తావ్’ అంటూ ఆప్యాయంగా దీవించాడు. ఈ ప్రేమలు, నమ్మకాలే నన్ను నడిపిస్తున్నాయి. నాకు కొత్త శక్తి నిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం నన్ను ఓ గొప్ప అభిమాని కలిశాడు. పదేళ్ల శ్రీరామ్ పుట్టుకతోనే రెండు కళ్లూ లేని దివ్యాంగుడు. వెలుగు, చీకట్లు తెలియని పాపం పసివాడు. తన మనోనేత్రంతో నన్ను చూస్తూనే ఉన్నాడు. నేను బహిరంగ సభలలో మాట్లాడే మాటల్ని పొల్లుపోకుండా చెప్పాడు. నా హావభావాల్ని అ ద్భుతంగా ప్రదర్శించాడు. అంతులేని అభిమానం ఉంటే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. ఆ చిన్నారి ప్రేమకు బందీనయ్యాను. అలసటను మర్చిపోయాను. సీఎంగారికి నాదో ప్రశ్న.. కమలనాథన్ కమిటీకి ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం మీరు అధికారంలోకి వచ్చే సమయానికి ఉన్న ఉద్యోగ ఖాళీలు 1.42 లక్షలు. ఇప్పుడవి 1.8 లక్షలు దాటిపోయాయి. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ఉద్యోగా న్నయినా భర్తీ చేశారా? 1.8 లక్షలకుపైనే ఖాళీలుంటే.. ఎన్నికలకు నాలుగు నెలల ముందు కేవలం 18 వేలతో నోటిఫి కేషన్ ఇస్తాననడం నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేయడం కాదా? ప్రభుత్వోద్యోగాల్లేక, ప్రయివేటు కొలువులూ రాక నిరాశలో మునిగి.. ప్రత్యేక హోదా రాలేదన్న తీవ్ర మానసిక క్షోభతో జరుగుతున్న యువత బలిదానాలకు బాధ్యత మీది కాదా? -వైఎస్ జగన్ -
265వ రోజు పాదయాత్ర డైరీ
-
265వ రోజు పాదయాత్ర డైరీ
18–09–2018, మంగళవారం ముచ్చెర్ల క్రాస్, విశాఖపట్నం జిల్లా బాబు పాలనలో విద్యా వ్యాపారులకు ఎర్ర తివాచి మంచి చేసినవారు కలకాలం గుండెల్లో నిలిచిపోతారంటారు. ఈరోజు ఎంతోమంది నాన్నగారి వల్ల తమకు జరిగిన మేలు చెప్పుకొని నాకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం ఓ అక్క కలిసింది. కులాంతర వివాహం చేసుకోవడంతో అటుఇటు రెండు కుటుంబాలూ దూరం పెట్టాయట. కట్టుబట్టలతో గడప దాటిన పరిస్థితి. ఆ కష్టకాలంలో నాన్నగారి దయ వల్ల ఆ అక్క ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందట. రాజీవ్ యువశక్తి ద్వారా అందిన లోన్‌తో చిన్నగా చీరల వ్యాపారమూ మొదలెట్టిందట. ఆపై ఏఎన్ఎంగా ఉద్యోగం వచ్చి జీవితంలో కాస్త స్థిరపడటంతో.. మళ్లీ రెండు కుటుంబాలు చేరువయ్యాయట. ఒకానొక సమయంలో ఆరోగ్య శ్రీ పుణ్యమా అని ఉచితంగా ఆపరేషన్ కూడా జరిగిందట. నేడు నేను పాదయాత్రగా వస్తున్నానని తెలిసి.. తమ రెండు కుటుంబాల వారంతా పక్కా తెలుగుదేశం వారైనా, ఎవరేమనుకున్నా ఫరవాలేదనుకొని వచ్చి నన్ను కలిసింది. తన గుండెల్లో దాచుకున్న అభిమానాన్ని కృతజ్ఞతగా తెలియజేసింది. ఆనందపురం బీసీ కాలనీకి చెందిన భవానీ అనే అక్క కలిసింది. కూలి పని చేసుకునే ఆమె భర్తకు ప్రమాదవశాత్తు కాలు విరిగితే కుటుంబపోషణే కష్టమైంది. దిక్కుతోచని ఆ సమయంలోనే ఆమె కొడుక్కి పోలీస్ ఉద్యోగమొచ్చింది. నాన్న గారి హయాంలో వచ్చిన ఆ ఉద్యోగమే ఆ కుటుంబానికి బాసటగా నిలిచిందని ఆ అక్క ఆనందం వ్యక్తం చేసింది. తుర్లవాడలో నాగేంద్ర, తనూజ అనే అన్నాచెల్లెలు కలిశారు. ఆ చెల్లికి పుట్టుకతోనే గుండెజబ్బు. నాన్నగారు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇచ్చిన డబ్బుతో ఉచితంగా ఆపరేషన్ జరిగిందంటూ ఆ చెల్లి ఆనందంగా కృతజ్ఞతలు తెలిపింది. గతంలో నాగేంద్ర కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల బీటెక్ పూర్తి చేశాడట. నాన్నగారి హయాంలో ఎవరిచుట్టూ తిరిగే అవసరమే రాలేదన్నాడు. కానీ ఇప్పుడు ఎంటెక్‌లో చేరగా.. అరకొరగా ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ సైతం రాక అధికారుల చుట్టూ, బీసీ వెల్ఫేర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నానని బాధపడ్డాడు. పాలవలస దాటాక గొర్రెలు మేపుకుంటున్న కొందరు యాదవులు కలిశారు. వారు ఎస్.కోటకు చెందిన వారు. నాన్నగారి హయాంలో గొర్రెలు కొనడానికి లోన్లు, ఇన్సూరెన్సు, వ్యాక్సిన్లు, మందులు, వైద్యమూ ఇలా అన్నీ అందేవని ఆ మంచి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అవేవీ లేవని నిట్టూర్చారు. సీతంపాలెం వద్ద వరి నాట్లు వేస్తున్న వలస కూలీలు కలిశారు. వారంతా విజయనగరం జిల్లాకు చెందిన వారు. అక్కడ పనుల్లేక కూలి కోసం ఆటోలో రోజూ 40 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారట. రోజంతా కష్టపడితే వచ్చే కూలిలో రూ.50 ఆటోకు పోతే.. ఇక మిగిలేది రూ.రెండు వందలే. దాంతోనే వారి ఇల్లు గడవాలి. పిల్లల్ని చదివించుకోవాలి. రెక్కాడితే గానీ డొక్కాడని వారి కష్టాన్ని చూసి చాలా బాధేసింది. సాయంత్రం గీతం కాలేజీ ఇంజనీరింగ్ విద్యార్థులు కలిశారు. కాలేజీవారు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు. సంవత్సరానికి రూ.2.75 లక్షలు కడుతున్నారట. ప్రతి కొత్త బ్యాచ్‌కు రూ.25 వేలు పెంచుతూనే ఉన్నారని చెప్పారు. ఇక హాస్టల్ ఫీజులు మరో లక్షా పదివేల రూపాయలు. ప్రతి ఏడాదీ మరో రూ.పది వేలు పెరుగుతూనే ఉంది. మెరిట్ స్కాలర్షిప్లు, కాషన్ డిపాజిట్లను మింగేస్తున్నారట. పైపెచ్చు కాలేజీ మొత్తం కులవివక్ష. క్యాంపస్‌లో అధికార పార్టీ జెండాలకే అనుమతి. ఇదంతా వింటుంటే చాలా అన్యాయమనిపించింది. ఇంజనీరింగ్ చదవడానికి సంవత్సరానికి రూ.నాలుగు లక్షల పైచిలుకు ఖర్చవుతున్న పరిస్థితుల్లో.. ఈ ప్రైవేటు కాలేజీల వల్ల విద్యార్థులకు ఏం మేలు జరుగుతుంది? ఈ పాలకులు దగ్గరుండి మరీ ప్రభుత్వ విద్యాసంస్థలను, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ.. విద్యార్థులను తప్పనిసరై ప్రైవేటు బాట పట్టేలా చేస్తున్నారు. అధిక ఫీజులతో దోపిడీ చేస్తున్నారు. అయినా ఈ పాలనలో విద్యా వ్యాపారులకే ఎర్ర తివాచి. ఇక ‘విద్యాలయం’ అన్న పదానికి అర్థమెక్కడుంది? ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న... 108, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా కలకాలం గుర్తుండిపోయే పథకాలెన్నింటినో నాన్నగారు ప్రవేశపెట్టారు. వాటన్నిటినీ నిర్వీర్యం చేయడం వాస్తవం కాదా? మిమ్మల్ని గుర్తుంచుకునేలా పేదలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క కొత్త పథకమైనా ఉందా? -వైఎస్ జగన్ -
264వ రోజు పాదయాత్ర డైరీ
-
264వ రోజు పాదయాత్ర డైరీ
17–09–2018, సోమవారం ఆనందపురం, విశాఖ జిల్లా బరితెగించిన నేతలను నియంత్రించకపోతే..ఆటవిక పాలన కాక ఇంకేముంటుంది?! విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం, దైవశిల్పి భగవాన్ విశ్వకర్మ జయంతి నేడు. ఆయనకు మనసారా నమస్కరించాను. విశాఖ విశ్వబ్రాహ్మణ సోదరులు కలిశారు. వారి పంచవృత్తులకు ప్రభుత్వ ఆదరణ కరువవుతోందన్నారు. స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రబోధానంద ఆశ్రమ భక్తులు కలిసి తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై భయాందోళనలు వ్యక్తం చేశారు. అక్కడి ప్రజాప్రతినిధి సారథ్యంలో జరిగిన దాడులను వివరించారు. ప్రజాప్రతినిధులే దగ్గరుండి విధ్వంసం సృష్టించడం, పోలీసులనూ అసభ్య పదజాలంతో దూషించడాన్ని చూస్తుంటే.. ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా.. అనిపించింది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో అధికార పార్టీ నేతల దాష్టీకాలు వీడియోలతో సహా బహిర్గతమైనా.. చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. బరితెగించిన నేతలను నియంత్రించకపోతే.. ఆటవిక పాలన కాక ఇంకేముంటుంది?! పట్టుమని పదిహేనేళ్లు నిండకుండానే రోలర్స్ స్కేటింగ్‌లో ఖండాంతర ఖ్యాతి సాధించిన సోదరుడు పృథ్వీ కలిశాడు. ఆసియా స్థాయి పోటీల్లో పతకాన్ని సాధించినందుకు అభినందించాను. అతనితో పాటు గతేడాది పతకం విజేతలూ కలిశారు. వారితో పాటు పతకాలు సాధించిన ఇతర రాష్ట్రాల క్రీడాకారులకు అక్కడి ప్రభుత్వాలు నగదు నజరానాలతో ప్రభుత్వోద్యోగాలూ ఇచ్చాయట. ఏ ప్రోత్సాహమూ అందని దౌర్భా గ్యం ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని బాధపడ్డారు. ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబుల్ బహుమతి ఇస్తానంటూ.. అవగాహన లేని హాస్యాస్పద ప్రకటనలు చేస్తూ.. నోటికొచ్చినట్టు చిత్తశుద్ధిలేని మాటలు మాట్లాడే పాలకుడి నుంచి ప్రోత్సాహాన్ని ఆశించడమంటే.. ఎండమావిలో నీటిని వెతుక్కోవడమే. వ్యవసాయాధారిత జనపనార మిల్లులు ఉత్తరాంధ్రలోనే అత్యధికం. వేలాదిమందికి ఉపాధినిచ్చే ఈ మిల్లులు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జనపనార ఉత్పత్తులను ప్రోత్సహిస్తే.. పరిశ్రమ బతుకుతుందన్నారు జూట్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. సబ్సిడీపై విద్యుత్‌ను సరఫరా చేసి పరిశ్రమను రక్షించాలని కోరారు. ప్లాస్టిక్‌ను తగ్గించి ఈ పరిశ్రమను ఆదుకోగలిగితే.. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించవచ్చు.. పర్యావరణానికీ మంచి చేయవచ్చు. గంభీరం పంచాయతీలో ఐఐఎం కోసం వందల ఎకరాలు సేకరించారు. అందులో క్వారీ కొండలూ ఉన్నాయి. ఆ క్వారీలపై ఆధారపడి ఏళ్ల తరబడి బతుకుతున్న కార్మికులకు పరిహారం ఇవ్వలేదు.. ప్రత్యామ్నాయమూ చూపలేదు. పోనీ ఐఐఎం అయినా వచ్చిందా అంటే.. అదీ లేదు. మరి ఈ ప్రభుత్వం సాధించిందేంటంటే.. ఎన్నో పేద కుటుంబాలకు ఉపాధి లేకుండా చేయడం.. రోడ్డున పడేయడం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ మహిళా తహసీల్దార్‌ను కిందపడేసి కొట్టడం, తణుకులో ఓ ఎస్ఐని నిర్బంధించి అవమానించడం, విజయ వాడలో ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌నే దుర్భాషలాడి.. దౌరన్యం చేయడం, సూర్యలంక బీచ్‌లో టూరి జం సిబ్బందిపై దాడి చేసి కొట్టడం.. వంటివి మీ ప్రజాప్రతినిధుల దాష్టీకాలలో కొన్ని మచ్చుతునకలు మాత్రమే. ఏ ఒక్కరినైనా కనీసం మందలించారా? ఏ చర్యలూ తీసుకోకుండా వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే.. తాడిపత్రిలాంటి ఆటవిక ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయా? -వైఎస్ జగన్ -
263వ రోజు పాదయాత్ర డైరీ
-
263వ రోజు పాదయాత్ర డైరీ
16–09–2018, ఆదివారం గుమ్మడివానిపాలెం, విశాఖ జిల్లా భూదోపిడీ వెనుక అసలైన సూత్రధారులు,ప్రధాన లబ్ధిదారులు ప్రభుత్వ పెద్దలే.. ఈ రోజు పాదయాత్ర జరిగిన నియోజకవర్గాలు పెందుర్తి, భీమిలి.. రెండూ రెండే. విచ్చలవిడి భూకబ్జాలకు, భారీ భూకుంభకోణాలకు నిలయాలు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూముల కబ్జా కోసం ఎస్సీ మహిళపై జరిగిన దుశ్శాసనపర్వంతో పెందుర్తి నియోజకవర్గం జాతీయ స్థాయిలో సంచలనం కలిగిస్తే.. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూముల్ని వందల కోట్లకు బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా భీమిలి నియోజకవర్గం రాష్ట్ర ప్రజల్ని నోరెళ్లబెట్టేలా చేసింది. నాన్నగారి హయాంలో పారిశ్రామిక సెజ్, ఐటీ సెజ్, ఫార్మా సిటీలతో ఈ రెండు నియోజకవర్గాలలో వేలాది మందికి ఉపాధి లభిస్తే.. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన భూదోపిడీ మూలంగా వేలాది కుటుంబాలకు ఉపాధే లేకుండా పోయింది. ప్రజల ఆస్తుల్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలే ఈ భూదోపిడీ వెనుక అసలైన సూత్రధారులు.. ప్రధాన లబ్ధిదారులు. కంచే చేను మేస్తుంటే.. ఇక కాపాడేదెవరు? నిన్నటిలానే నేడు కూడా ఉదయమంతా భానుడి భగభగలు.. సాయంత్రం జోరు వాన. ఆ ఎండలో, వానలో సైతం దారుల వెంబడి బారులు తీరారు ఆత్మీయజనం. వ్యవసాయ కుటుంబానికి చెందిన బగ్గు మౌనిక ఇంటర్ చదువుతోంది. బాక్సింగ్‌లో తన ప్రతిభను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై చాటి అనేక పతకాలను గెలుచుకుంది. ఆమె ప్రతిభ దూరతీరాలను తాకినా.. ఇక్కడి పాలకుల్ని కదిలించలేకపోయింది. మొక్కుబడిగా ఓ శాలువా కప్పి సన్మానించారే తప్ప.. ఎలాంటి ప్రోత్సాహమూ అందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మాటలు కోటలు దాటినా.. చేతలు గడప దాటవన్నట్టు.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలకు చేయూతనివ్వరుగానీ.. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తారట! బలహీనవర్గానికి చెందిన హేమలత అనే చెల్లెమ్మ డిప్లమో పూర్తిచేసింది. ఫీజురీయింబర్స్‌మెంట్ కాకపోవడంతో చదువు పూర్తయినా సర్టిఫికెట్లు ఇచ్చేదిలేదన్నారు కాలేజీవారు. అప్పుచేసి ఫీజుకట్టి.. సర్టిఫికెట్లు తెచ్చుకుని బీటెక్‌లో చేరాల్సి వచ్చిందని బావురుమంది. కురుస్తున్న జోరు వానలోనే కాపు సోదరులు ప్లకార్డులు, బ్యానర్లు చేతబట్టి నాతో పాటు అడుగులేశారు. కాపుల సంక్షేమానికి కట్టుబడినందుకు కృతజ్ఞతలు తెలిపి సంఘీభావం ప్రకటించారు. సాయంత్రం తుంపాలకు చెందిన సంతోషి అనే చెల్లెమ్మ తన ఏడేళ్ల బిడ్డను ఎత్తుకుని వచ్చిం ది. పుట్టుకతోనే మెదడు ఎదుగుదలే లేని ఆ బిడ్డకు మానసిక వైకల్యం ఉంది. తరచూ ఫిట్స్ కూడా వస్తుంటాయి. భర్తేమో దినసరి కూలీ. ఇల్లు గడవడమే కష్టమైతే.. ఇక బిడ్డకు మందులెలా కొనాలి? పింఛన్ వచ్చినా ఆసరాగా ఉంటుందని ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరిగింది. ఫలితం కానరాలేదు. ఆఖరికి తీవ్ర నిరాశతో, విరక్తితో జన్మభూమి సభలోనే.. ఎమ్మెల్యే ఎదుటే ఆ బిడ్డను వదిలేసి ఏమైనా చేసుకోండని దండం పెట్టేసింది. ఎన్నికలొస్తున్నాయని భయపడ్డారో ఏమో.. పచ్చబాబులు కాస్త దిగొచ్చారు. ఈ మధ్యనే పింఛన్ ఇవ్వడం మొదలెట్టారు. న్యాయంగా రావాల్సిన పింఛన్ కోసం ఏళ్లుగా పడ్డ క్షోభను, నరకయాతనను చెప్పుకొని కన్నీటిపర్యంతమైంది ఆ సోదరి. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలుచేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇస్తున్నదే అరకొర.. అది కూడా ఏళ్ల తరబడి ఇవ్వడమే లేదు. కుంటి సాకులతో ఎంతోమందికి ఎగ్గొడుతున్నారు. దీనివల్ల ఎంతోమంది విద్యా సంవత్స రం కోల్పోతున్నారు.. ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు.. ఉద్యోగావకాశాలు కోల్పోతున్నది.. ఎన్నో కుటుంబాలు అప్పులపాలవుతున్నది.. వాస్తవం కాదా? దీనికి బాధ్యులు మీరు కాదా? పటిష్టంగా అమలు చేయడమంటే ఇదేనా? -వైఎస్ జగన్ -
262వ రోజు పాదయాత్ర డైరీ
-
262వ రోజు పాదయాత్ర డైరీ
15–09–2018, శనివారం దువ్వపాలెం క్రాస్, విశాఖపట్నం జిల్లా మనదేశ ఇంజనీర్లు కొరగారని ముఖ్యమంత్రే వ్యాఖ్యానించడం అవమానకరం ఈ రోజు భారతరత్న, ప్రపంచం గర్వించదగ్గ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి జయంతి. ఆయనకు విశాఖతో గొప్ప అనుబంధం ఉంది. ఒకానొకప్పుడు పెను అలల తాకిడితో డాల్ఫిన్‌కొండ క్రమక్షయానికి గురవుతూ.. విశాఖ ఓడరేవుకు తీవ్రమైన ముప్పు పొంచి ఉండేది. అప్పటి పాలకులు పాశ్చాత్య దేశాలకు చెందిన ఎందరో ఇంజనీర్లతో సంప్రదింపులు జరిపారట. వారెవరి మేథకు అందని అద్భుత పరిష్కారాన్ని విశ్వేశ్వరయ్యగారు సూచించారు. ఓ నౌకను డాల్ఫిన్‌కొండ ఎదురుగా సముద్రంలో ముంచడం ద్వారా అలల తాకిడిని తగ్గించి.. విశాఖ ఓడరేవును కాపాడిన ఘనత విశ్వేశ్వరయ్యగారిది. ఈ రోజు ఇంజనీర్స్ డే సందర్భంగా వందలాది మంది ఇంజనీర్లు ఏర్పాటుచేసిన సంఘీభావ కార్యక్రమంలో ఆ మహనీయునికి నివాళి అర్పించాను. ‘మోక్షగుండం’గారు వంటి ఎందరో మేధావుల్ని ప్రపంచానికి అందించిన గొప్పతనం మన దేశానిది. అంతటి ఘనమైన ప్రతిభా వారసత్వాన్ని కాదని.. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు విదేశీ గ్రాఫిక్స్ కంపెనీల చుట్టూ తిరగడం దేశ ప్రతిష్టను దిగజార్చడమే. దాని వెనుక స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనడం ముమ్మాటికీ నిజమే. రాజధాని స్థాయి నిర్మాణాలకు మనదేశ ఇంజనీర్లు కొరగారని ముఖ్యమంత్రే వ్యాఖ్యానించడం అవమానకరం. మన పాలకులే మన ప్రతిభావంతుల్ని నిరాదరణకు గురిచేస్తూ చులకన చేస్తుంటే.. మేథో వలస జరగక ఏమవుతుంది?! శ్రీకృష్ణాపురం దగ్గర నాగవయ్య అనే తాత కలిశాడు. వయసుతో పాటు వచ్చిన జబ్బులు అతన్ని వేధిస్తున్నాయి. బీపీ, షుగర్లతో సతమతమవుతున్నాడు. ‘ఇంతకుముందయితే ఊళ్లోకి 104 వచ్చేది. ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులూ ఇచ్చేది. ఇప్పడా జాడే లేదు.. మరి మా లాంటి పేదలు వేలకు వేలు పెట్టి మందులెలా కొనగలం?’అని ఆయన అడుగుతుంటే చాలా బాధేసింది. మధ్యాహ్నం విశాఖ నగరం పూర్తయి భీమిలిలో అడుగుపెట్టాను. అల్లూరి సీతారామరాజు పుట్టిన పాండురంగి ఈ నియోజకవర్గంలోనే ఉంది. భీమిలి.. భీమునిపట్నం అని కూడా ప్రసిద్ధి. ఒకప్పుడు విశాఖతో పోటీపడుతూ సాగిన భీమిలి ప్రతిష్ట.. నేడు మసకబారింది. అలనాటి బకాసురుని తలపించే రీతిలో భూబకాసురులు తయారయ్యారిక్కడ. అడవివరం గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకుని వచ్చి కలిశారు. భూసమస్యను పరిష్కరించాలని కోరారు. సింహాచలం దేవస్థానానికి, పంచగ్రామాల ప్రజలకు మధ్య దశాబ్దాలుగా భూవివాదం రగులుతూనే ఉంది. వంద రోజుల్లో పరిష్కరిస్తానని కేబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చెప్పిన మాటలు.. నీటి మూటలే అయ్యాయి. ఇటువంటి సున్నితమైన సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నమే జరగకపోవడం బాధాకరం. ఈ రోజు ఉదయం నుంచి బాగా ఉక్కపోత.. సాయంత్రం ఒక్కసారిగా కుండపోత. ఆ వర్షపు చినుకుల్లోనే విశాఖ న్యాయవాదులు కలిశారు. మొన్నటికి మొన్న జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికలప్పుడు బాబుగారు లాయర్లకు పలు వరాలు గుప్పించారు. ఆ ఎన్నికలు పూర్తవగానే వాటి గురించే పట్టించుకోవడం లేదట. సాధారణ ప్రజలను మోసగించినట్లుగానే మమ్మల్ని కూడా వంచించారంటూ ఆవేదన వ్యక్తం చేశారా న్యాయవాద సోదరులు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ మేనిఫెస్టోలోని 32వ పేజీలో న్యాయవాదులకు డెత్ బెనిఫిట్ రూ.6 లక్షలు, మెడికల్ బెనిఫిట్ రూ.2 లక్షలు, ఇళ్ల స్థలాలు, లోన్లు, గ్రూప్ ఇన్సూరెన్స్‌లు, నామినేటెడ్ పోస్టులు.. అంటూ 18 హామీలను గుప్పించారు. ఒక్కటైనా నెరవేర్చారా? ఎన్నికలప్పుడు చెప్పినట్టుగా డెత్ బెనిఫిట్‌ను రూ.6 లక్షలు కూడా చేయని మీరు.. బార్ కౌన్సిల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ.8 లక్షలు చేస్తాననడం మరోసారి మోసం చేయడం కాదా? -వైఎస్ జగన్ -
261వ రోజు పాదయాత్ర డైరీ
-
261వ రోజు పాదయాత్ర డైరీ
12–09–2018, బుధవారం చినగదిలి క్యూ–1 ఆస్పత్రి సమీపం, విశాఖపట్నం జిల్లా బాబూ.. ప్రశ్నిస్తే దేశ ద్రోహమా? డబ్బు లేని కారణంగా ఏ పేదవానికి వైద్యమందని దుస్థితి రానీయకూడదన్న నాన్నగారి తపన నుంచి పుట్టుకొచ్చిన అద్భుత పథకమే ఆరోగ్య శ్రీ. లక్షలాది మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన సంజీవని అది. ఆదర్శనగర్ వద్ద కలిసిన సునీత అనే చెల్లెమ్మకు చిన్నప్పుడు ప్రమాదవశాత్తు మెడ, ఛాతీ, చేతులు కాలిపోయాయి. గడ్డం కింద భాగం ఛాతీకి పూర్తిగా అతుక్కుపోయింది. తల కాస్తంతైనా పైకెత్త లేని పరిస్థితి. ఆమెకు ఖరీదైన వైద్యం అవసరమైంది. కానీ తండ్రి రిక్షా కార్మికుడు. మందుల కోసం వంద రూపాయలు ఖర్చు పెట్టడమే కష్టం. ఇక రూ.లక్షలు ఖర్చయ్యే వైద్యం చేయించే పరిస్థితి ఎక్కడ? బతికినంత కాలం ఇలానే ఉండాలేమో అనే నిరాశలో కూరుకుపోయింది. పదిహేను సంవత్సరాలు నరకయాతన అనుభవించింది. 2008లో నాన్నగారి ఆరోగ్యశ్రీ పుణ్యమా అని రూ.రెండు లక్షల ఖరీదైన వైద్యం ఉచితంగా అందింది. ఇప్పుడు ఆ చెల్లెమ్మ డిగ్రీ పూర్తి చేసి సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తోంది. నాకు పునర్జన్మనిచ్చిన దేవుడు మీ నాన్న గారంటూ చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు చెప్పింది. ఆ మాటలతో నా మనసంతా చెప్పలేని గొప్ప అనుభూతి. మన తదనంతరం కూడా మనల్ని ప్రజలు గుండెల్లో పెట్టుకోవడం కన్నా సార్థకత జీవితానికి ఇంకేముంటుంది? ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబడిన ప్రాంతం. అభివృద్ధికి ఆమడ దూరం. నిరుపేదలైన బలహీన వర్గాల ప్రజలు, ఏజెన్సీ ప్రాంత గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతం. అక్కడ అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా అందించేందుకు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు నాన్నగారు. కానీ అటువంటి ప్రతిష్టాత్మక ఆస్పత్రిని.. ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు నుంచి కాపాడాలని కోరారు హనుమంతవాక ప్రజలు. 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీలతో సేవలందించాల్సిన ఆస్పత్రి.. కేవలం 250 పడకలకే కుదించబడటం, ఇప్పటివరకు ఒక్క సూపర్ స్పెషాలిటీ సేవ కూడా అందుబాటులోకి రాకపోవడం, రెగ్యులర్ వైద్యులు, ఉద్యోగులను నియమించకపోవడం, దశలవారీ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తుండటం బాధేసింది. ప్రైవేటు పరం చేయాలని చూస్తున్న ముఖ్యమంత్రి నుంచే ఆ ఆస్పత్రిని కాపాడాలని ప్రజలు కోరాల్సి రావడం దురదృష్టకరం. సాయంత్రం అరిలోవాలో ముస్లిం సోదరులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ‘ఏరు దాటే దాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందమైన బాబు గారి పాలనపై ముస్లిం సోదరుల నుంచి ఆవేదన వ్యక్తమైంది. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసినప్పుడు మైనార్టీలను పూర్తిగా విస్మరించి నేడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక.. ఎన్నికల వేళ కపట ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. నారా హమారా సభలో న్యాయం కోసం అర్థించిన అమాయక ముస్లిం సోదరులపై అక్రమ కేసులు బనాయించి దేశ ద్రోహులుగా చిత్రీకరించారు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను గుర్తు చేస్తే దేశ ద్రోహమా? ముస్లింలకు ఒక్కమంత్రి పదవీ ఇవ్వలేదని ప్రశ్నించడమే వారు చేసిన నేరమా? మరి ఏ తప్పు చేయని ఆ మైనార్టీ సోదరులది దేశ ద్రోహమైతే.. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచించిన మిమ్మల్ని ఏమనాలి? -వైఎస్ జగన్ -
260వ రోజు పాదయాత్ర డైరీ
-
260వ రోజు పాదయాత్ర డైరీ
11–09–2018, మంగళవారం బీచ్ రోడ్‌లోని కామత్ హోటల్ సమీపం,విశాఖ జిల్లా ఎన్నికల యుద్ధానికి నా సహచరులను కార్యోన్ముఖులను చేశాను ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలోని చిన వాల్తేరు, పెద వాల్తేరు, బీచ్ రోడ్లలో పాదయాత్ర సాగింది. ఆసియాలోనే అత్యంత వేగవంతంగా పెరుగుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. వనరులకు కొదువ లేదు. రాష్ట్ర ఆర్థిక రాజధానికి ఉండాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయి. అటువంటి విశాఖలో ఈ నాలుగున్నరేళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి మైలురాయీ కనిపించదే. ఒక్క పెద్ద కంపెనీ కూడా వచ్చింది లేదే. ఉన్న కంపెనీలూ మూతపడుతున్నాయే. తను పని చేస్తున్న న్యూ నెట్ కంపెనీ మూతపడటంతో ఉపాధి వెతుక్కుంటూ పొరుగు రాష్ట్రానికి వలస పోయారట సత్యనారాయణ అనే యువ ఇంజనీరు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న వాటిలో ఒక్క శాతం కంపెనీలు వచ్చినా మా లాంటి వారికి ఈ ఖర్మ పట్టేదా అన్నది ఆ సోదరుని ఆవేదన. అయినా ఈ ప్రభుత్వానికి బీచ్ ఫెస్టివల్స్, లవ్ ఫెస్టివల్స్ మీద ఉన్న ప్రేమ విశాఖ అభివృద్ధిపై ఉంటే కదా! కూలి చేసుకొని కడుపు నింపుకునే సరోజిని అనే సోదరికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. వైద్యానికి నెలకు రూ.వేలల్లో ఖర్చవుతోంది. పింఛన్ అయినా వస్తే కాస్తయినా ఆసరాగా ఉంటుందనేది ఆమె ఆశ. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఆమెకు నిరాశే మిగులుతోంది. ఒక్కరికో, ఇద్దరికో పింఛన్లు ఇచ్చి కిడ్నీ బాధితులందరికీ ఇస్తున్నామంటూ గొప్పగా ప్రకటించుకుంటున్న పెద్దలకు ఇలాంటి వారిని చూశాక.. కాస్తయినా అపరాధ భావన కలగదా? ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల సమరానికి దిశానిర్దేశం చేసే ఈ సమావేశం అత్యంత కీలకమైనది. నవరత్నాలను ఇంటింటికీ విస్తృతంగా ప్రచారం చేయాల్సిన ఆవశ్యకతను వివరించాను. చంద్రబాబు ధనబలాన్ని ఎదుర్కొనే ఆయుధం అదే అని చెప్పాను. ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించారు. వేలాదిగా దొంగ ఓట్లను చేర్పించారు. ఆ విషయాలను ఆధారాలతో సహా నా సహచరులు వివరించారు. ప్రజల విశ్వాసాలను కోల్పోబట్టే చంద్రబాబు ఇటువంటి అక్రమాలకు ఒడిగడుతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసైనా.. అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. అప్రమత్తంగా ఉండాలని నా సహచరులకు సూచించాను. ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజాభిమానమే గెలుస్తుందని వెన్ను తట్టాను. ఎన్నికల యుద్ధానికి కార్యోన్ముఖులను చేశాను. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేశాను. తొంభై శాతం మంది ప్రజలు సంతృప్తిగా, సంతోషంగా ఉన్నా రని పదేపదే ప్రకటిస్తున్నారు కదా. అదే నిజమైతే ఒక్కో నియోజకవర్గం లో వేల సంఖ్యలో మా పార్టీ వారి ఓట్లను తొలగించడం, వేలాది దొంగ ఓట్లను చేర్పిం చడం లాంటి నీతిమాలిన పనులకు పాల్పడాల్సిన అవసరమేముంది? -వైఎస్ జగన్ -
259వ రోజు పాదయాత్ర డైరీ
-
259వ రోజు పాదయాత్ర డైరీ
10–09–2018, సోమవారం చిన వాల్తేరు కనకమ్మగుడి సమీపం, విశాఖ జిల్లా పెట్రోల్, డీజిల్‌పై అదనపు చార్జీలు వసూలు చేసింది నిజం కాదా బాబూ? విశాఖ మహానగరంలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఈరోజు ఉత్తర, దక్షిణ, తూర్పు నియోజకవర్గాల్లో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. అడుగుతీసి అడుగేయడమే కష్టమనిపించింది. అంత కిక్కిరిసిన జనం మధ్యలో కూడా ఎన్నో వినతులు వచ్చాయి. బాధలు, కష్టాల వ్య«థలు వినిపించాయి. నిరుద్యోగులు ఓవైపు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మరోవైపు దారి వెంబడి కలుస్తూ తమ సమస్యలు చెప్పుకున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి చదివిన ఆరేళ్ల చదువు ఎందుకూ పనికి రాకుండా ఉందని ఫార్మా–డి విద్యార్థులు వాపోయారు. రాష్ట్రంలోని 58 కళాశాలల నుంచి ఏటా వేలాది మంది ఆ చదువులు పూర్తి చేసి బయటకు వస్తున్నారు. వారికి ఉద్యోగాల్లేవు. ఉపాధి అవకాశాల్లేవు. మరి ఆ కోర్సు ఉండి ప్రయోజనమేమిటి? అందుకే తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళనకు సిద్ధమవుతున్నామన్నారు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు. నాలుగున్నరేళ్లలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా మోసం చేస్తుంటే వారు మాత్రం ఆందోళన చేయక ఏం చేస్తారు? ‘రెగ్యులరైజ్ చేస్తానన్న బాబు గారు మాట తప్పారు. వేతనాలు సరిగా ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు’అని స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ వారు నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఈఎన్టీ ఆస్పత్రి ఔట్సోర్సింగ్ సిబ్బందిదీ ఇదే బాధ. ఈ పాలనలో శ్రమ దోపిడీకి గురవుతున్నామన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గళాన్ని గతంలో నేను అసెంబ్లీలో వినిపించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. నెలల తరబడి జీతాలే ఇవ్వడం లేదని ట్రామా కేర్ ఉద్యోగులు, జీవీఎంసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సేవల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని పారిశుధ్య పనివారు ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు అవకాశాలు లేక నిరుద్యోగులు ఆందోళన చెందుతుంటే, మరోవైపు ఉద్యోగస్తులు భద్రతే లేదంటున్నారు. మరి బాబు గారి ఆనంద ఆంధ్రప్రదేశ్‌లో ఆనందంగా ఉన్నవారెవరో? ఈరోజు ఆసిల్‌మెట్ట వద్ద బంద్ నిర్వహిస్తున్న ఆందోళనకారులు కనిపించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో పేదల బాధలు వర్ణనాతీతం. ఈ పాపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భాగస్వాములే. పుండు మీద కారం జల్లినట్లు ఓవైపు కేంద్ర పెద్దలు ముక్కు పిండుతుంటే.. మరోవైపు దేశంలో ఎక్కడా లేని అత్యధిక పన్నులు, అదనపు చార్జీలతో బాబుగారు నడ్డి విరుస్తున్నారు. మరి ఢిల్లీ బాబులతో పాటు చంద్రబాబునూ నిలదీయాల్సిందే కదా? మధ్యాహ్నం బ్రాహ్మణ సోదరులతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆలయాల ఆస్తులను, పవిత్రతను కాపాడాల్సిన ఆవశ్యకతను వారు తెలియజెప్పారు. తమకు జరుగుతున్న అన్యాయాలను, అవమానాలను వివరించారు. అయినా దైవభక్తి, పాపభీతి లేని పాలకులకు అర్చకత్వాన్ని నమ్ముకున్న బ్రాహ్మణ వర్గాల మీద ప్రేమ ఎందుకుంటుంది? ఆంధ్ర యూనివర్సిటీ ముందుగా వెళ్తున్నప్పుడు ఆ విశ్వవిద్యాలయ ఘన చరిత్ర గుర్తుకొచ్చింది. మహామహులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గార్ల విద్యా సేవలందుకున్న ఆ చదువుల తల్లి ఘనకీర్తుల కథనాలెన్నో. ఆ యూనివర్సిటీలో ఉద్యోగ నియామకాలు జరిగింది నాన్నగారి హ యాంలోనేనట. ఆ తర్వాత ఆ ఊసే లేదు. దినస రి కార్మికులకు ఎన్‌ఎంఆర్‌లుగా గుర్తింపు వచ్చిం దీ అప్పుడేనంటూ నాన్నగారిని గుర్తు చేసుకున్నా రు నన్ను కలిసిన ఆ విశ్వవిద్యాలయ సిబ్బంది. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. దేశం మొత్తం మీద పెట్రోల్, డీజిల్ ధరలు మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉండటానికి కారణం మీరు కాదా? మీ నాలుగేళ్ల సంసారంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఒక్కసారైనా కేంద్రాన్ని నిలదీశారా? నిలదీయకపోగా దేశంలో ఎక్కడా లేనంతగా పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నులు విధించడంతో పాటు అదనపు చార్జీలు వసూలు చేసింది వాస్తవం కాదా? -వైఎస్ జగన్ -
258వ రోజు పాదయాత్ర డైరీ
09–09–2018, ఆదివారం, తాటిచెట్లపాలెం, విశాఖ జిల్లా విశాఖ భూదోపిడీలో అధికార పెద్దల జిమ్మిక్కులు..విఠలాచార్య సినిమాను మరిపిస్తున్నాయి.. ఈరోజు విశాఖ నగరంలో గోపాలపట్నం నుంచి కంచరపాలెం వరకు.. నాన్నగారి హయాంలో ఏర్పాటైన విశాలమైన బీఆర్టీఎస్ రహదారిలో యాత్ర సాగింది. నాన్నగారి పాలనలో విశాఖపట్నం మహా విశాఖగా రూపుదిద్దుకుంది. మౌలిక వసతుల కల్పన మొదలుకుని.. ఐటీ కారిడార్లు, సెజ్‌లు, ఫార్మాసిటీలతో అభివృద్ధిలో దూసుకెళ్లింది. కానీ ఈ నాలుగున్నరేళ్లలో భూదోపిడీలు, అరాచకాలతో రెక్కలు తెగిన పక్షిలా మారింది. విశాఖలో అసలు భూములకన్నా.. అన్యాక్రాంతమైనవే ఎక్కువేమో అనిపిస్తోంది. 100 గజాల నిరుపేదల స్థలాలు మొదలుకుని.. వేల ఎకరాల ప్రభుత్వ భూముల వరకు.. అక్రమార్కుల కన్నుపడనివి లేవంటే అతిశయోక్తి కాదేమో! ఎక్కడో బర్మా నుంచి వచ్చి ఇక్కడ కాందిశీకులుగా స్థిరపడ్డవారికి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన స్థలంపై కన్ను పడిందట ఈ పచ్చ నేతలకు. ఆ పునరావాస కేంద్రంలో ఉన్న కాందిశీకులు నా దగ్గరకొచ్చి ఆ విషయాన్ని మొరపెట్టుకున్నారు. తమకిచ్చిన భూమిని.. తప్పుడు రికార్డులు చూపించి కబ్జా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో జరుగుతున్న భూమాయ వింటుంటే.. దిగ్భ్రాంతి కలుగుతోంది. ఈ దోపిడీలో అధికార పెద్దల జిమ్మిక్కులు విఠలాచార్య సినిమా మాయాజాలాన్ని మరిపిస్తున్నాయి. లేని స్వాతంత్య్ర సమరయోధుల పేర.. తప్పుడు రికార్డులు సృష్టించి భూములు కొల్లగొడుతున్నారంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హుద్‌హుద్ తుపానుకు కోలుకోలేని విధంగా విశాఖ నష్టపోతే.. ఈ ప్రభుత్వ పెద్దలు, వారి బినామీలు మాత్రం ఊహకందని రీతిలో భారీగా లబ్ధి పొందారు. దాదాపు లక్ష ఎకరాల భూరికార్డులు హుద్‌హుద్‌లో కొట్టుకుపోయాయని ప్రభుత్వం మాయ మాటలు చెబుతోంది. అదే సమయంలో.. తప్పుడు రికార్డులతో భూములన్నీ పచ్చ రాబందులకు పలహారమయ్యాయి. ‘ఎంతటి సంక్షోభంలోనైనా నేను అవకాశాలు వెతుక్కుంటాను’అని బాబుగారు పదే పదే చెబుతుంటారు.. అది ఇదేనేమో! ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన.. నిజంగా ‘కల్పనే’. సరళాదేవి బలహీనవర్గానికి చెందిన పేద మహిళ. తను దుస్తులు కుడుతూ.. భర్త నైట్‌వాచ్‌మన్‌గా పనిచేస్తూ.. బిడ్డల్ని చదివించుకున్నారు. ఇద్దరు కొడుకులూ రెండున్నరేళ్ల కిందట మంచి మార్కులతో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. కూతురు మెడిసిన్ చదువుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగానే కావడంతో ఉన్న కాస్త బంగారాన్నీ తాకట్టు పెట్టారు.. అప్పుల పాలయ్యారు. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగానికైనా నోటిఫికేషన్ పడకపోదా.. అని బిడ్డలు ఎదురుచూస్తున్నారు. ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం వచ్చినా కుటుంబానికి ఆసరాగా ఉంటుందని ఆ తల్లి ఆశపడుతోంది. ఎంసీఏ చేసిన సత్యాపతిదీ అదే బాధ. ఎస్సీ కోటాలోనైనా చిన్నపాటి ఉద్యోగం రాకపోదా.. అని ఎదురుచూశాడు. బాబుగారి భృతి అయినా వస్తుందేమోనని ఆశపడ్డాడు. చివరికి ప్రభుత్వం చిన్న అటెండర్ ఉద్యోగం ఇచ్చినా చేరిపోవాలనుకున్నాడు. ఆశలన్నీ అడియాసలయ్యాయి. కనీసం రేషన్ కార్డుకూ గతి లేదు. భార్యాపిల్లల్ని ఎలా పోషించుకోవాలంటూ దిగులుపడ్డాడు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఈ విశాఖలోనే కోట్లాది రూపాయలు ఖర్చుచేసి.. ఆర్భాటంగా మూడు భాగస్వామ్య సదస్సులు నిర్వహించారు. కనీసం వాటికి పెట్టిన ఖర్చుమేరకైనా రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరిందా? ఈ నాలుగున్నరేళ్లలో కొత్తగా వచ్చిన ఐటీ కంపెనీల కన్నా మూతపడ్డవే ఎక్కువ.. అన్నది వాస్తవం కాదా? -వైఎస్ జగన్ -
257వ రోజు పాదయాత్ర డైరీ
-
257వ రోజు పాదయాత్ర డైరీ
08–09–2018, శనివారం గోపాలపట్నం హైస్కూల్ ప్రాంతం, విశాఖపట్నం జిల్లా రైతుల మీద ప్రేమ అనేది.. పాలకుడి గుండె లోతుల్లో ఉండాలి గ్రామీణ విశాఖలో పాదయాత్ర ముగిసింది. గ్రేటర్ పరిధిలోకి అడుగుపెట్టాను. నగర పరిధిలోకి వచ్చేప్పటికి భూముల విలువ పెరిగే కొద్దీ.. పచ్చ చొక్కాల భూదందాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ పెద్దల భూకుంభకోణాలూ అధికమే. భూదోపిడీల్లో అమరావతికి ఏమాత్రం తీసిపోవడం లేదు. పేదలకు ఇచ్చిన డి–పట్టా భూములను అధికార పార్టీ వారు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని మొరపెట్టుకున్నారు జెర్రిపోతులపాలెం గ్రామస్తులు. దళితుల భూముల్లో అక్రమంగా, దౌర్జన్యంగా క్వారీ తవ్వకాలు చేపడుతున్నారట. కోర్టు స్టే ఇచ్చినా.. తమను ఆ భూముల్లోకి రానివ్వడం లేదంటూ వాపోయారు. పెదనరవలో కొందరు అక్కచెల్లెమ్మలు కలిశారు. ఐదు దశాబ్దాలుగా వారు అనుభవిస్తున్న భూములపై అధికార పార్టీ వాళ్ల కన్ను పడిందట. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటూ.. జీడి మొక్కలు పెంచుకున్న వారి భూముల్లో.. దౌర్జన్యంగా మట్టిని తవ్వేసి అమ్ముకున్నారట. ఆ భూముల్నీ లాగేసుకుంటున్నారట. సాగు చేసుకుని బతకమని గతంలో ప్రభుత్వాలు పేదలకు భూములిస్తే.. ఈ ప్రభుత్వం వారి నోటికాడ కూటిని తన్నుకుపోతోంది. విశ్రాంత వ్యవసాయాధికారి నూకేశ్వరరావుతో పాటు గవరపాలెం మహిళా రైతులు కలిశారు. పదమూడేళ్ల కిందట నాన్నగారు ఇచ్చిన ట్రోఫీని చూపించారు. అప్పట్లో పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులకు చేయూతనిచ్చారట నాన్నగారు. ఆ ఆసరాతో తక్కువ పెట్టుబడితో అత్యధిక దిగుబడి సాధించి.. రికార్డులు సృష్టించారు ఈ ప్రాంత మహిళా రైతులు. ఉగాది పర్వదినాన కవులు, కళాకారులతో పాటు రైతులనూ సత్కరించిన ఏకైక నాయకుడు నాన్నగారేనని చెప్పారు. ఆయన పేర రైతులకు ఓ అవార్డు ఉంటే బాగుంటుందని సూచించారు. చాలా గర్వంగా అనిపించింది. రైతుల మీద ప్రేమ అనేది ప్రకటనలకు, ఎన్నికల హామీలకే పరిమితం కాకూడదు.. పాలకుడి గుండె లోతుల్లో ఉండాలి. చిత్తశుద్ధితో తోడ్పాటునివ్వాలేగానీ.. అన్నదాత అద్భుతాలు సృష్టించగలడు. విశాఖ డెయిరీకి చెందిన కాంట్రాక్టు కార్మికులు, పాడి రైతులు కలిశారు. అందులోని అక్రమాలను, తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రైతన్నల భాగస్వామ్యంతో.. వారికోసం నడవాల్సిన సహకార డెయిరీ కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే.. కుటుంబ ఆస్తిగా మారిపోతే.. కార్మికులు, కర్షకులు ఏం బాగుపడతారు? రైతన్నల స్వేదంతో.. వారి త్యాగాల పునాదులపై ఏర్పాటైన సహకార డెయిరీలు, చక్కెర ఫ్యాక్టరీలు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే.. వాటిపైనే ఆధారపడ్డ పేద బతుకులు ఏం కావాలి? ‘చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనయట్లు..’ అంటే ఇదేనేమో! నరవ గ్రామానికి చెందిన గోవర్థన్ అనే విద్యుత్ ఉద్యోగి కలిశాడు. ఒకప్పుడు రూ.2,000 వేతనంతో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడట. జీతం చాలక ఖాళీ సమయంలో పశువులనూ మేపుకొనేవాడు. నాన్నగారు ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయడంతో జీవితమే మారిపోయిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. పూజ గదిలో ఉంచుకున్న నాన్నగారి విగ్రహాన్ని తెచ్చి చూపించాడు. పాలించేవారికి మనసుంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. వెన్నంటి నిలిచిన ప్రజల్ని నాయకులు మర్చిపోవచ్చేమోగానీ.. మంచి చేసిన నేతను ప్రజలు కలకాలం గుండెల్లో దాచుకుంటారు. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎన్నికలప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక అన్ని సేవల్నీ అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్నీ భర్తీ చేయకపోగా లంచాల కోసం సేవలను ప్రయివేటీకరిస్తూ.. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. మరోవైపు, లక్షలాది ఉద్యోగాలిచ్చేశానని.. ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేశానని ప్రకటిస్తున్నారు.. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం అంటే ఇదే కదా? ఇంతకన్నా మోసం ఉంటుందా? తప్పు చేస్తున్నానన్న భావన మనసులో ఏ మూలయినా అనిపించదా? -వైఎస్ జగన్ -
256వ రోజు పాదయాత్ర డైరీ
-
256వ రోజు పాదయాత్ర డైరీ
06–09–2018, గురువారం జెర్రిపోతులపాలెం, విశాఖపట్నం జిల్లా ప్రజాస్వామిక విలువలే లేని సభలో ప్రజావాణికి విలువేముంటుంది? అభిమానానికి హద్దులుండవు.. హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చిన సాయిగణేశ్ ఐటీఐ చదువుతున్నాడట. రాత్రంతా రెండు రైళ్లు మారి.. ఐదు కిలోమీటర్లు నడిచిమరీ నన్ను చూడటానికి వచ్చాడట. వారంలో సెలవు రోజు పూలంగడిలో పనిచేయగా వచ్చిన కాస్త డబ్బుతో పాదయాత్రకు వచ్చి నన్ను కలిశానని చెబుతుంటే.. ఆ అభిమానానికి ముచ్చటేసింది. ‘బాగా చదువుకుని, అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి’ అని చెప్పాను. పట్టరాని సంతోషంతో తలూపాడు. ఈ రోజు కూడా అధికార పార్టీ భూదోపిడీపైనే అధికంగా ఫిర్యాదులొచ్చాయి. సబ్బవరం, పరవాడ మండల రైతన్నలు కలిశారు. శాటిలైట్ టౌన్షిప్ నిర్మాణం పేరుతో.. ట్రైజంక్షన్ పరిధిలో బలవంతపు భూసేకరణకు పూనుకున్నారని వాపోయారు. పేద రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ బలవంతపు భూసేకరణలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక అధికారుల ఎదుటనే లంకా తాతారావు అనే రైతన్న గుండె ఆగి మరణించాడట. పేదల పొట్టకొట్టి, అధికార పెద్దలకు కట్టబెట్టే కార్యక్రమం కొనసాగుతున్నంత కాలం.. ఇలాంటి విషాద ఘటనలు ఆగవేమో.. జెర్రిపోతులపాలెం, చింతగట్ల గ్రామస్తులూ భూదోపిడీ బాధితులే. ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంటు భూముల్లో ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో చేస్తున్న అక్రమాల్ని వివరించారు. పేదల భూముల్లో రోడ్లేసుకుని చేస్తున్న అక్రమ క్వారీయింగ్ గురించి చెప్పారు. ఐవోసీ పైప్‌లైన్ కోసం.. టీడీపీ నేతల భూముల్ని తప్పించి.. పేదల భూముల్ని సేకరించాలన్న కుయత్నాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలకు అధికారుల అండతో తప్పుడు రికార్డులు సృష్టించి టీడీపీవారు అమ్మేసుకుంటున్నారని వాపోయారు. పేదల ఆధార్ కార్డుల్లోనూ, రేషన్ కార్డుల్లోనూ చిన్న పొరపాటు ఉన్నా ఏళ్ల తరబడి సరిచేయరు. దాన్ని సాకుగా చూపి పింఛన్, రేషన్ ఎగ్గొడతారు. పచ్చనేతలు మాత్రం క్షణాల్లో తప్పుడు రికార్డులు సృష్టించుకుని.. పేదల భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకుంటారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ నేతలు దళిత మహిళను వివస్త్రను చేసి, దౌర్జన్యం చేసిన ఘటన ఈ జెర్రిపోతులపాలెంలోనే జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఘోర సంఘటనకు బలైన బాధిత మహిళలు కలిశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపారు. భూదందాలు, కబ్జాలలోనే టీడీపీ నేతలు, అధికార యంత్రాంగం తలమునకలైంది. పాలనను గాలికొదిలేశారు. ఉత్తరాంధ్ర విషజ్వరాలతో వణికిపోతున్నా.. వందలాది మంది పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా.. పట్టించుకోవడం లేదు. తన ఏడేళ్ల పాప విషజ్వరంతో కన్ను మూసిందని నందవరపువానిపాలెం అప్పలరాజు కన్నీటి పర్యంతమయ్యాడు. ముదపాకలో చిత్తాడ శ్రీను అనే సోదరుడూ జ్వరంతోనే ప్రాణాలు కోల్పోయాడట. చాలా బాధేసింది. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే, మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఉన్నా.. ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ప్రజా సమస్యల్ని చర్చించాల్సిన అసెంబ్లీని సైతం.. ప్రతిపక్షంపై బురద జల్లడానికి, గొంతు నొక్కడానికి వాడుకుంటున్నారు. ఆత్మస్తుతి, పరనిందకే పరిమితం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 22 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకుని, శాసనసభని అప్రజాస్వామిక వ్యవస్థగా మార్చేశారు. చట్టాలు చేసే సభలోనే చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామిక విలువలే లేని సభలో ప్రజావాణికి విలువేముంటుంది? ముఖ్యమంత్రిగారూ.. మీకు, స్పీకర్ గారికి సూటి ప్రశ్న.. మీరు ప్రలోభపర్చుకుని పదవులిచ్చిన ఆ నలుగురు మంత్రులు ఏ పార్టీకి చెందినవారు? టీడీపీనా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనా? అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా చెప్పగలిగే ధైర్యం, నిజాయితీ మీకున్నాయా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘనకు వ్యతిరేకంగా.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన మమ్మల్ని ప్రశ్నించడం.. దొంగే.. దొంగా.. దొంగా.. అన్నట్లుగా లేదా? -వైఎస్ జగన్ -
255వ రోజు పాదయాత్ర డైరీ
-
255వ రోజు పాదయాత్ర డైరీ
05–09–2018, బుధవారం, చిన్నగొల్లలపాలెం క్రాస్, విశాఖ జిల్లా రాజధాని భూముల కుంభకోణం ఫార్ములాను విశాఖలోనూ వర్తింపజేస్తున్నారనిపించింది.. ఈరోజు నా పెద్ద కూతురు హర్ష పుట్టిన రోజు. లండన్‌లో చదువుకుంటున్న తను.. సెలవు లు కావడంతో హైదరాబాద్‌కు వచ్చింది. పాద యా త్రలో ఉండటం వల్ల నేను వెళ్లలేకపోయాను. నా మనసు తెలిసిన నా బిడ్డ నా పరిస్థితిని అర్థం చేసుకోగలదన్న నమ్మకం నాకుంది. గురువుని దేవునిగా పూజించే సంస్కృతి భారతీయతకు చిహ్నం. నాన్నగారికి విద్యాబుద్ధులు నేర్పి.. తీర్చిదిద్దిన వెంకటప్పయ్య మాస్టారు ఎందరికో ఆదర్శం. వారి పేరుతో స్కూల్ పెట్టి.. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తుండటం నాకెంతో తృప్తినిస్తోం ది. అటువంటి గురువులందరినీ స్మరించుకుం టూ.. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి, దేశ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పించాను. ఈ రోజు గురుపూజోత్సవం సందర్భంగా వివిధ విశ్వవి ద్యాలయాల ఆచార్యులను సన్మానించే అవకాశం రావడం ఆనందం కలిగించింది. బకాసురుడిని మించిపోయిన పచ్చనేతల భూ దాహం ఆందోళన కలిగించింది. మభ్యపెట్టో.. మోసపుచ్చో.. బెదిరించో.. పేదల భూముల్ని అప్పనంగా లాక్కుని బినామీలకు దోచిపెట్టడం ఈ పాలనలో ఆనవాయితీగా మారింది. భూము లివ్వని పేదలపై దౌర్జన్యాలు చేయడం, అక్రమ కేసులు బనాయించడం పరిపాటి అయిపోయిం ది. ముదపాక రైతుల పరిస్థితే దీనికి నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు దశాబ్దాలుగా సాగు చేసు కుంటున్న భూములపై ప్రభుత్వ పెద్దల కళ్లు పడ్డా యి. వారి బినామీలు రాబందుల్లా వచ్చి వాలిపో యారు. వారి దోపిడీతో తమకు జరుగుతున్న అన్యాయాన్ని మొరపెట్టుకున్నారు ముదపాక రైతన్నలు. తమ బినామీల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదల జీవితాల్ని బలిపెట్టడం అత్యంత దుర్మార్గం. అమరావతిలోని రాజధాని భూముల కుంభకోణం ఫార్ములాను విశాఖలోనూ వర్తింపజేస్తున్నారనిపించింది. సింహాచలం దేవస్థాన భూముల వివాదం ఇంకా వీడలేదు. అధికారంలోకి వచ్చాక విశాఖ వచ్చి.. కేబినెట్ మీటింగ్ పెట్టి.. వంద రోజుల్లోపు పరిష్కరించేస్తానని తీర్మానం చేశారు బాబుగారు. ఇంతవరకూ అతీగతీ లేదు. వివాదాలు పుట్టించి.. సమస్యలు సృష్టించి భూముల్ని లాక్కోవడంలో ఉండే శ్రద్ధ.. పరిష్కరించి న్యాయం చేయడంలో లేదీ పాలకులకు. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛ లేదా? మేనిఫెస్టోలోని హామీలను గుర్తుచేస్తే.. అక్రమంగా నిర్బంధిస్తారా? ముస్లింలకు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. దేశద్రోహులుగా చిత్రిస్తారా? నరకయాతనకు గురిచేస్తారా? చావే మేలనేంతగా అవమానిస్తారా?.. ఇదీ ‘నారా హమారా’ సభలో బాబుగారి దాష్టీకానికి బలైన ముస్లిం సోదరుల మనోవ్యథ. పోలీసుల చేతిలో వారు అనుభవించిన చిత్రహింసలు, అవమానాలూ వింటుంటే.. ఇంత రాక్షసత్వమా అనిపించింది. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగినప్పుడు బాబుగారికి ముస్లింలు గుర్తుకురారు. తీరా ఎన్నికలు దగ్గరపడేప్పటికి దిగజారుడు రాజకీయాలకు ఒడిగడుతున్నారు. ఈ రోజు మా చిన్నబ్బ డాక్టర్ వైఎస్ పురుషోత్తం రెడ్డి మృతిచెందారన్న వార్త తెలియగానే.. మనసంతా బాధతో నిండిపోయింది. ఆ మానవతామూర్తి దూరం కావడం.. మా కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాను. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రికార్డుల కంప్యూటరీకరణ ముసుగులో గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఈ పాలనలోనే రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి పేదల భూముల్ని అక్రమంగా లాక్కున్నది వాస్తవం కాదా? -వైఎస్ జగన్ -
254వ రోజు పాదయాత్ర డైరీ