విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం, దైవశిల్పి భగవాన్ విశ్వకర్మ జయంతి నేడు. ఆయనకు మనసారా నమస్కరించాను. విశాఖ విశ్వబ్రాహ్మణ సోదరులు కలిశారు. వారి పంచవృత్తులకు ప్రభుత్వ ఆదరణ కరువవుతోందన్నారు. స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రబోధానంద ఆశ్రమ భక్తులు కలిసి తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులపై భయాందోళనలు వ్యక్తం చేశారు. అక్కడి ప్రజాప్రతినిధి సారథ్యంలో జరిగిన దాడులను వివరించారు. ప్రజాప్రతినిధులే దగ్గరుండి విధ్వంసం సృష్టించడం, పోలీసులనూ అసభ్య పదజాలంతో దూషించడాన్ని చూస్తుంటే.. ప్రజాస్వామ్యమా.. నియంతృత్వమా.. అనిపించింది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో అధికార పార్టీ నేతల దాష్టీకాలు వీడియోలతో సహా బహిర్గతమైనా.. చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. బరితెగించిన నేతలను నియంత్రించకపోతే.. ఆటవిక పాలన కాక ఇంకేముంటుంది?!
264వ రోజు పాదయాత్ర డైరీ
Published Tue, Sep 18 2018 6:57 AM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM
Advertisement