ఈరోజు కోటబొమ్మాళి మండలంలో పాదయాత్ర సాగింది. రోజంతా పెద్ద సంఖ్యలో జనం కలిశారు. సమస్యల బరువూ అంతే ఉంది. ఇది మంత్రి గారి సొంత మండలం. కానీ ఇక్కడ అభివృద్ధి కాసింతైనా కనబడలేదు. సమస్యల్లో అధిక భాగం మంత్రి గారి పుణ్యమేనని జనం చెప్పారు. మంత్రి పదవులనేవి సమస్యలు తీర్చడానికా? పెంచడానికా? అనిపించింది.
జర్జంగి గ్రామ అక్కచెల్లెమ్మలు కలిశారు. ఆ ఒక్క గ్రామంలోనే పదమూడు దాకా బెల్టుషాపులున్నాయన్నారు. ఆరోగ్యాలు పాడై ప్రాణాలు పోతున్నా.. కుటుంబాలు నాశనమవుతున్నా చెప్పుకునే దిక్కే లేకుండా పోయిందని వాపోయారు. మరోవైపు ఇక్కడంతా కల్తీ మద్యమేనని గ్రామస్తులు చెప్పారు. నాసిరకం మద్యాన్ని బ్రాండెడ్ కంపెనీల బాటిళ్లలో పోసి అధిక ధరలకు అమ్ముతున్నారట. జేబులకు చిల్లులు పెడుతూ ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారట. ఆ కల్తీ మద్యం వెనుక మంత్రి గారే ఉంటే ఇక అధికారులేం చేస్తారని బావురుమన్నారు. అడ్డదారుల్లో ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత దారుణం.
325వ రోజు పాదయాత్ర డైరీ
Published Thu, Dec 20 2018 7:11 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
Advertisement