ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 341వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గం.. కవిటి మండలంలోని కొత్త కొజ్జీరియా నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఇచ్ఛాపురం మండలం అయ్యవారి పేట, లొద్దపుట్టి మీదుగా, పేటూరు, ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు. మధ్యాహ్నం ఇచ్ఛాపురం వద్ద జననేత ప్రజాసంకల్పయాత్ర పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఇచ్ఛాపురం పాతబస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.