ఈ రోజు సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తిచేసుకొని పార్వతీపురంలో అడుగుపెట్టాను. ఏ నియోజకవర్గంలో చూసినా అభివృద్ధి కాసింతైనా కనిపించకపోగా.. వివక్షకు మాత్రం కొదువే లేదనిపించింది. తూరుమామిడి గ్రామస్తులు వచ్చి నన్ను కలిశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ఊళ్లో 97 మందికి పింఛన్లు తీసేశారట. కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేసి మరీ పింఛన్లు తెచ్చుకోవాల్సి వచ్చిందని వారు చెబుతుంటే చాలా బాధనిపించింది. అన్ని అర్హతలున్నా సంక్షేమ ఫలాల కోసం ప్రజలు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడమేమిటి? ప్రభుత్వమే తమను వేధిస్తుందంటూ పేదలు కోర్టుకెక్కడం పాలకులకు సిగ్గుచేటు కాదా? నాన్నగారి హయాంలో పింఛన్లు ఆపేశారని, ఇళ్లు ఇవ్వడం లేదని, రేషన్ రావడం లేదని.. ఒక్కటంటే ఒక్క ఫిర్యాదైనా ఉండేదా?