జిల్లాలోని సూసపాటిరేగ మండలం పోరాం గ్రామంలో కిడ్నాప్‌నకు గురైన బాలుడు మాదేశ్ ఆచూకీ లభ్యమైంది.
విజయనగరం: జిల్లాలోని సూసపాటిరేగ మండలం పోరాం గ్రామంలో కిడ్నాప్‌నకు గురైన బాలుడు మాదేశ్ ఆచూకీ లభ్యమైంది. బాబును సొంతం చేసుకోవాలని తండ్రే అతన్ని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామానికి చెందిన సంతోష్ అలియాస్ చంద్రశేఖర్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో.. భార్య స్రవంతి కుమారుడితో కలిసి వేరుగా ఉంటోంది.
దీంతో కొడుకును ఎలాగైనా సొంతం చేసుకోవాలని గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్న చంద్రశేఖర్ బాబును కిడ్నాప్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం ఈ రోజు విశాఖ జిల్లా నక్కలపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నిందితుడిని అదుపులోకి తీసుకన్నారు. అతని వద్ద నుంచి బాబును తీసుకెళ్లి తల్లికి అప్పగిస్తామని తెలిపారు.