రైలు కింద‌ప‌డి 8 మంది ప్రయాణికుల దుర్మరణం | 15 passengers killed in Train accident at Vizianagaram District | Sakshi
Sakshi News home page

రైలు కింద‌ప‌డి 8 మంది ప్రయాణికుల దుర్మరణం

Published Sun, Nov 3 2013 6:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 AM

15 passengers killed in Train accident at Vizianagaram District

విజ‌య‌న‌గ‌రం: గత రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు దుర్ఘటన మరవకముందే  మరో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలోని గొట్లాం స‌మీపంలో  శనివారం దీపావ‌ళి పండుగ‌పూట పెనువిషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో రైలు కింద‌ప‌డి 8 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.  సిగ్నల్ లేకపోవడంతో బొకారో రైలు అక్కడే ఆగిపోయింది. అప్పుడే బొకారొ ఎక్స్ ప్రెస్ -1, ఎస్‌-2 బోగీల్లో పొగ‌లు, మంటలు చెలరేగాయంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు భయపడి రైలులో నుంచి ఒక్కసారిగా పక్క ట్రాకుపై దూకారు. ప్ర‌య‌ణికులంతా చైన్‌లాగి హ‌డావుడిగా దూక‌డంతో, అదే స‌మ‌యంలో పక్క ట్రాక్ పైకి దూసుకొచ్చిన విజయవాడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో  ఇప్పటివరకూ 8 మంది మృతిచెందిన‌ట్టు స‌మాచారం. పలువురు గాయపడ్డారు.

ఈ ఘ‌ట‌న రాత్రి 7.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రైలు ఒక్క‌సారిగా ఢీకొట్ట‌డంతో ట్రాక్‌పై మృత‌దేహాలన్ని చిధ్ర‌మయ్యాయి. తెగిప‌డిన అవ‌య‌వాల‌తో ట్రాక్ భ‌యంక‌రంగా క‌నిపిస్తోంది. ఈ ఘోరప్రమాదంలో ఎంతమంది మృతిచెందారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. మృతుల్లో చిన్నారులు, మ‌హిళ‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. మృతుల్లో బెంగాల్ వాసులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశం ఉందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement