సాక్షి, హైదరాబాద్: యాసంగి రైతుబంధు చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచే వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయాధికారులు గ్రామ సభల్లో చెక్కులను అందించనున్నా రు. ఇప్పటికే 11 లక్షల చెక్కులను బ్యాంకులు ము ద్రించగా వ్యవసాయశాఖ వాటిని పరిశీలించుకుని పంపింది. ఈనెల 5 నుంచే చెక్కులు పంపిణీ చేయా లని నిర్ణయించామన్నారు. శుక్రవారం కనీసం పది జిల్లాల్లో కార్యక్రమం ప్రారంభమయ్యేలా సన్నాహా లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ధరణి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం 52.15 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. మొత్తంగా రూ.5, 511 కోట్లు యాసంగి పెట్టుబడి కింద ఇవ్వనున్నారు. చీరల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేయడంతో చెక్కుల పంపిణీపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. రైతుబంధు ఇప్పటికే కొనసాగుతున్న పథకమని, అక్టోబర్‌లో చెక్కులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర ఎన్నికల సంఘానికి, సీఈవో రజత్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment