సాక్షి, అమరావతి: ప్రస్తుత రబీలో ఈ–క్రాప్, ఈకేవైసీల నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ ఇన్‌చార్జి కమిషనర్ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు ఆదేశించారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. రబీలో ఎక్కువ సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము వంటి మెట్టపంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుందని, అందువలన సాధ్యమైనంత త్వరగా ఈ క్రాప్, ఈ కేవైసీల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
క్షేత్రస్థాయిలో నియమించిన సూపర్ చెక్ బృందాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ కేవైసీలో నూరుశాతం సాధించే దిశగా ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న క్యాంపెయిన్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఖరీఫ్ 2024లో అవసరమైన ఎరువులు, విత్తనాల కోసం జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఇంకా ఆధార్‌తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయని వారిని గుర్తించి సత్వరమే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment