ఏపీలో రాక్షస పాలనకు నేడు నిరసనలు | ysr congress call protest | Sakshi
Sakshi News home page

Mar 2 2017 6:51 AM | Updated on Mar 21 2024 7:52 PM

ఏపీలో ప్రస్తుతం సాగుతున్న చంద్రబాబు రాక్షస, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 2వ తేదీన మండల కేంద్రాలన్నింటి లోనూ నిరసనలు, ధర్నాలు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పిలుపు నిచ్చింది. పార్టీ అధికార ప్రతినిధులు కొలుసు పార్థసారథి, ఎం.అరుణ్‌కుమార్‌ బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు పోగొట్టుకుంటే.. బాధితులను పరామర్శించడానికి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి దుర్ఘటన స్థలానికి వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం నిరంకుశత్వం, అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement