
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడాబాబులకే అండగా ఉంటారని, ఆయనకు పేదలు కనిపించరని వైఎస్సార్‌సీపీ నేత పార్ధసారధి విమర్శించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని గురువారం ఉద్యోగులు చేపట్టిన ఆమరణ దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీలో ఉన్న వ్యవస్థలన్నింటిని నాశనం చేశారని మండిపడ్డారు. నమ్మినవారికి అన్యాయం చేయటమే చంద్రబాబు పని అని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు. జగన్‌మోహన్ రెడ్డి ఓట్ల కోసం పనిచేసే నాయకుడు కాదని, పేదలు, కష్టాల్లో ఉన్నవారి కోసం పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment