ట్రినిటీ పార్థసారథి, సువిశాల్‌ శర్మకు బెయిల్‌ | Bail to Trinity Parthasarathy, Suvishal Sharma | Sakshi
Sakshi News home page

ట్రినిటీ పార్థసారథి, సువిశాల్‌ శర్మకు బెయిల్‌

Published Sat, Jun 17 2017 1:59 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Bail to Trinity Parthasarathy, Suvishal Sharma

సాక్షి, న్యూఢిల్లీ: మియాపూర్‌ భూ కుంభకోణం కేసులో ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ పార్థసారథికి, సువిశాల్‌ పవర్‌ జెన్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ పీవీఎస్‌ శర్మకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది.  హైకోర్టు బెయిల్‌ నిరాకరించ డంతో నిందితులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్‌ ఆర్‌కె అగర్వాల్, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారిం చింది.  పిటిషనర్ల తరఫు న్యాయవాదులు జంధ్యాల రవిశంకర్, కేటీఎస్‌ తులసి వాదనలు వినిపిస్తూ.. సివిల్‌ లిటిగేషన్‌ కేసును క్రిమినల్‌ లిటిగేషన్‌ కేసుగా మార్చడం తగదని చెబుతూ.. గతంలో పలు కేసుల్లో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను చదివి వినిపించారు.

ఈ కేసులో ఫోర్జరీ జరగలేదని, ప్రభు త్వానికి నష్టం జరిగి ఉంటే సంబంధిత భూములను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని వివరించారు. అయితే ఈ భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని ముఖ్య మంత్రి కేసీఆర్‌ కూడా పలుమార్లు వివరణ ఇచ్చా రని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏమైనా ఉల్లంఘనలు జరిగి ఉంటే పెనాల్టీ విధింపునకు రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ కింద నిబంధనలు ఉన్నాయని వివరించారు. తమ వాదనలతో ఏకీభవించిన ధర్మా సనం నిందితులకు బెయిల్‌ మంజూరు చేస్తూ కింది కోర్టు షరతులు వర్తిస్తాయని పేర్కొన్నట్లు రవిశంకర్‌ మీడియాకు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement