రైతు బీమాకు టోల్‌ఫ్రీ నంబర్‌  | Tollfree number for Rythu Bheema | Sakshi
Sakshi News home page

రైతు బీమాకు టోల్‌ఫ్రీ నంబర్‌ 

Published Tue, Jun 19 2018 1:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Tollfree number for Rythu Bheema - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతు బీమాపై అనుమానాల నివృత్తికి ఎల్‌ఐసీ టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కోరారు. ముంబై నుంచి ఎల్‌ఐసీ అధిపతి రఘుపాల్‌సింగ్‌ నేతృత్వంలోని బృందం సోమవారం నగరానికి వచ్చింది.

ఈ సందర్భం గా జరిగిన సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ, రైతు నామినీ మైనరైతే మరెవరినైనా నియమించుకోవాల్సి ఉం టుందన్నారు. ఆగస్టు 15 తర్వాత జారీ అయ్యే కొత్త పాసు పుస్తకాలు పొందే రైతుల బీమాను నమోదు చేసేటప్పుడు వయసుకు సంబంధించి ఆ నెల ఒకటోతేదీని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పథకం సక్రమ అమలుకు రాష్ట్ర స్థాయి నోడల్‌ అధికారిని నియమించాలని సూచించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement