సాక్షి, హైదరాబాద్: కార్వి ఎండి పార్థసారధికి రెండు రోజుల కస్టడీ ముగిసింది. కస్టడీలో ఉండగా అతన్ని పలు అంశాల్లో సీసీఎస్ పోలీసులు విచారించారు. అందులో భాగంగా.. కార్వి సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారన్న దానిపై ప్రశ్నించారు. పలు బ్యాంక్ లాకార్ల పై కూపీ కూడా లాగారు.
కాగా ఆడిట్ రిపోర్ట్ అతని మందుంది విచారించినట్లు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం న్యాయమూర్తి ముందు పార్థసారథిని పోలీసులు హాజరుపరిచారు. అనంతరం అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై కార్వీ ఎండీ పార్ధసారథి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసుల విచారణలో పార్ధసారథి 6 బ్యాంక్‌ల నుంచి కార్వీ వేల కోట్లలో రుణాలు పొందినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment