( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథి పోలీసుల కస్టడీ ముగిసింది. రెండు రోజులు పాటు పార్థసారథిని విచారించిన సీసీఎస్ పోలీసులు అతని నుంచి కీలక సమాచారం సేకరించారు. కంపెనీ ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా విచారించిన పోలీసులు.. కార్వీ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించారు. వీటి ద్వారా 6 బ్యాంక్‌ల నుంచి కార్వీ వేల కోట్లలో రుణాలు పొందినట్లు గుర్తించారు.
కార్వీకి చెందిన 6 బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. అలాగే కార్వీ కుంభకోణంలో ఇతరుల పాత్రపై పార్ధసారథిని పోలీసులు ప్రశ్నించారు. ఇతర నిందితులపై త్వరలో చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో పార్థసారథిని వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి న్యాయమూర్తి ముందు హాజరు పర్చనున్నారు. కాగా రుణాల ఎగవేత కేసులో అరెస్ట్ అయిన పార్ధసారథిని రెండు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన్ను విచారించిన సీసీఎస్ పోలీసులు నేడు కోర్టులో హజరుపర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment