సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. రాధాకిషన్ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఐబిలో హార్డ్ డిస్క్‌ల ధ్వంసం కేసులో కుట్రదారులుగా రాధాకిషన్ ఉన్నారని, కొంతమంది ప్రముఖుల ప్రొఫైల్స్ అనధికారకంగా తయారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు.
‘‘ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ప్రొఫైల్స్‌ని తయారు చేశాడు. బెదిరింపులకు పాల్పడి ఒక పార్టీకి డబ్బులు చేరే విధంగా చేశాడు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయించాడు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసిన ప్రణీతరావుకి రాధాకృష్ణ సహకరించాడు. ప్రొఫైల్స్ సంబంధించిన వ్యవహారాలు బయటి రాకుండా ఉండేందుకే ఆధారాలను ధ్వంసం చేశాడు. కోర్టు అనుమతితో రాధాకృష్ణ రావు ని తిరిగి కస్టడీలోకి తీసుకున్నాం. పదో తేదీ వరకు టాస్క్ ఫోర్స్ రాధా కిషన్‌ను విచారిస్తామని డీసీపీ వెల్లడించారు.
కాగా, ట్యాపింగ్ కేసులో ఏ4గా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. 2018 ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలు, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి డబ్బులు తరలించినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు ఒప్పుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలు మేరకు ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు.
బీఆర్‌ఎస్ గెలుపు కోసం కొందరు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లోని సిబ్బందిని బెదిరించి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన డబ్బులను సరఫరా చేసినట్లు అంగీకరించారు. టాస్క్‌ఫోర్స్ బృందానికి వాహనాలు సమకూర్చినట్లు ఒప్పుకున్నారు. ఓ ఎమ్మెల్సీ చిన్ననాటి స్నేహితుడు కావడంతో అతడి డబ్బులు తరలించినట్లు పేర్కొన్నారు. 2023లో టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది డబ్బుల పట్టుకోవడంలో కీలక పాత్ర వహించినట్లు వెల్లడించారు. 8 సార్లు పట్టుకున్న డబ్బు మొత్తం ప్రతిపక్షాలకు చెందినదేనని చెప్పారు.
ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలులో ...
Comments
Please login to add a commentAdd a comment