![phone tapping case: TS HC orders To Media over dont reveal judges numbers](/styles/webp/s3/article_images/2024/07/10/tg-hc.jpg.webp?itok=Du0dq1Zb)
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంయమనం పాటించాలని, ట్యాపింగ్‌కు గురైన జడ్జిల వివరాలను వెల్లడి చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్‌కు గురైన జడ్జీల పేర్లు ఎక్కడ వాడొద్దు. వారి ఫోన్ నెంబర్స్, కుటుంబ సభ్యుల పేర్లు, ఫోటోలు బహిర్గతం చేయొద్దు. వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు అని మీడియా సంస్థలను హైకోర్టు ఆదేశించింది. అనంతరం.. ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు జూలై 23కి వాయిదా వేసింది.
తెలంగాణ పలు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీల ఫోన్‌లు సైతం ట్యాపింగ్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వచ్చాయి. వాటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని విచారించిన అధికారులు కీలక విషయాలను రాబట్టారు. అందులో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని నిందితులు విచారణలో చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment