
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే భారత్‌కు వస్తానన్న ప్రభాకర్‌రావు.. గత నెలలోనే భారత్ రావాల్సి ఉన్నా వాయిదా వేసుకోక తప్పలేదని లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొన్నారు.
కాగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment