సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇప్పటికే ఈయనపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదుకాగా, తాజాగా రూ.350 కోట్ల స్కామ్‌కు సంబంధించి బెంగళూరులోని వివిధ ఠాణాల్లో నలుగురు బాధితులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన మదుపరుల డీమ్యాట్ ఖాతాల్లోని షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నగదును కార్వీ సంస్థ దుర్వినియోగం చేసిందంటూ వాటిలో పేర్కొన్నారు.
ఈ కేసులను అక్కడి క్రైమ్ వింగ్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్ చేరుకున్న అధికారులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులతో భేటీ అయ్యారు. ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను తెలుసుకున్నారు. మరోపక్క హరియాణా సహా ఇతర రాష్ట్రాల్లోనూ కార్వీపై కేసులు నమోదవుతున్నా యి. తక్కువ మొత్తాలతో ముడిపడి ఉన్న కేసులను పార్థసారథి సంబంధీకులు సెటిల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment