విత్తనోత్పత్తితో రైతుకు మేలు | Export of Seeds from State | Sakshi
Sakshi News home page

విత్తనోత్పత్తితో రైతుకు మేలు

Published Thu, May 25 2017 5:19 AM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM

Export of Seeds from State

- దేశంలోనే తొలిసారి  రాష్ట్రం నుంచి విత్తనాల ఎగుమతి
- జొన్న విత్తనాల ఎగుమతిని ప్రారంభించిన వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ పార్థసారథి
 
మేడ్చల్‌ రూరల్‌: అంతర్జాతీయ ప్రమాణా లతో ఉత్పత్తి చేసిన విత్తనాలను దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నుంచి విదేశాలకు ఎగుమతి చేయడం గర్వించదగ్గ విషయమని వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ పార్థసారథి అన్నారు. మేడ్చల్‌ మండలం ఎల్లంపేట్‌లోని హైటెక్‌ సీడ్స్‌ ఇండియా సంస్థ నుంచి సుడాన్‌కు తెలంగాణ విత్తన సంస్థ ధ్రువీకరించిన జొన్న విత్తనాలను ఎగుమతి చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిం చారు.  ఆయన మాట్లాడుతూ..విత్తనోత్పత్తి వల్ల రైతులకు మేలు కలుగుతుందన్నారు.

రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా మార్చే దిశగా వ్యవసాయశాఖ, విత్తన సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. విత్తన ఎగుమతి వల్ల ఆహార పంటలకు వచ్చే ధర కంటే రెట్టింపు లాభాలు గడించవచ్చన్నారు.  విత్తనోత్పత్తి వల్ల దేశానికి, రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విత్తన, సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ కేశవులు, డిప్యూటీ డైరెక్టర్‌ సుదర్శన్, అసోసి యేట్‌ డైరెక్టర్‌ కిషన్‌రావు, మండల వ్యవసా యాధికారి శైలజ, రాష్ట్ర సీడ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏఎస్‌ఎన్‌ రెడ్డి, కార్యదర్శి నిరంజన్, హైటెక్‌ సీడ్స్‌ కంపెనీ ఎండీ మెహినుద్దిన్‌ హసన్‌ హరూన్, రీసెర్చ్‌ విభాగం డైరెక్టర్లు ఎస్‌కే గుప్తా, మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement