
ఆరోపణలు చేయడం కాదు,రుజువు చేసే దమ్ముందా!
మంత్రి దేవినేనికి వైఎస్సార్ కాంగ్రెస్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే సరిపోదు.. వాటిని నిరూపించే దమ్ముందా! అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారపార్టీకి సవాలు విసిరింది. పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దివీస్ ల్యాబొరేటరీ నెలకొల్పడాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాల్గొన్న సభ విజయవంతం కావడంతో జీర్ణించుకోలేక మంత్రి దేవినేని ఉమా పాచినోటితో నోటికొచ్చినట్లు అసత్య ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. నిజంగా అధికారపార్టీ నేతలకు దమ్ముంటే నిజారుుతీగల పోలీసు అధికారులతో ఇడుపులపాయలోని ప్రతి అంగుళం వెతుక్కోవచ్చని, అక్కడేమీ దొరక్కపోతే సీఎం చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమల స్థాపనకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అరుుతే దివీస్ ఫార్మాకోసం అమాయక రైతులనుంచి బలవంతంగా భూముల్ని లాక్కోవడాన్ని ప్రతిఘటిస్తున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాల్లో తలపెట్టిన మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని తొలుత అడ్డుకున్నది టీడీపీ ఎమ్మెల్యేలేనన్న సంగతి మర్చిపోతే ఎలాగన్నారు. ప్రజలంతా ఉద్యమిస్తుంటేనే వారికి మద్దతుగా జగన్ నిలిచారన్నారు. దివీస్ ఫార్మా బాధితులకు మద్దతివ్వడానికీ ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉండటమే కారణమన్నారు.సముద్రం సమీపంలో నిర్మించాల్సిన ఫ్యాక్టరీలను జనావాసాలమధ్య నిర్మిస్తే వారి బతుకులు ఏమైపోవాలన్నారు.
ఫార్మాసిటీలో భూముల ధరలు అధికంగా ఉండటంతో భయపడి.. తొండంగి మండలం దానవారుుపేటలోనైతే కారుచౌకగా రైతుల భూములను కొట్టేయవచ్చనే ఉద్దేశంతోనే బాబు దివీస్ స్థాపనకు మద్దతుగా నిలిచారన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా పక్కనపెట్టి రైతులనుంచి రౌడీరుుజంతో భూముల్ని లాక్కోవాలని చూస్తున్నారన్నారు. అక్కడ పరిశ్రమ ఏర్పాటైతే 250 హేచరీస్ పరిస్థితి ఆగమ్యగోచరమవుతుందని, వాటిపై ఆధారపడి జీవిస్తున్న 33 వేలమంది రోడ్డున పడతారన్నారు.