Minister DEVINENI
-
వరిపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
-
మంత్రి దేవినేని వివాదాస్పద వ్యాఖ్యలు
నందిగామ: ‘‘పశ్చిమ కృష్ణా ప్రాంతంలో రైతులు 45 వేల ఎకరాల్లో సుబాబుల్ పంట వేశారు. వరి ఎలాగైతే సోమరిపోతు పంటో సుబాబుల్ కూడా అలాంటిదే. మనకు గతి లేక, మరో పంట పండక, నీటి ఎద్దడి వల్ల సుబాబుల్ పంటకు అలవాటుపడ్డాం. రైతులు సుబా బుల్ నుంచి బయటకు వచ్చి వాణిజ్య పంటలపై దృష్టి పెట్టాలి’’ అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లా నందిగామలో నూతన పోలీసుస్టేషన్ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మంత్రి చినరాజప్ప, మంత్రి దేవినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి, సుబాబుల్ పంటల గురించి దేవినేని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది తక్కువగా ఉన్నప్పటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాంతి భద్రతలను అదుపులో ఉంచుతున్నామని చినరాజప్ప చెప్పారు. వ్యవసాయం, రైతులంటే టీడీపీకి చిన్నచూపే : ఎంవీఎస్ నాగిరెడ్డి సాక్షి, అమరావతి/విజయవాడ సిటీ: వరి, సుబాబుల్ పంటల రైతులపై రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఖండించారు. ‘‘రైతుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడూ చిన్నచూపే. వ్యవసాయం దండుగని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం మర్చిపోలేం. ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోని దేవినేనిఉమ వరి సాగుదారులను సోమరిపోతులు అనడం దారుణం. మొత్తం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీలో వరి ప్రధాన పంటగా ఉంది. కృష్ణా–గోదావరి కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాతో ఏపీని అన్నపూర్ణగా, దక్షిణభారత ధాన్యాగారంగా పిలుస్తారు. ఏపీలో 90శాతం మంది వరి అన్నం తింటారు. వ్యవసాయం, రైతుల గురించి మాట్లాడేటప్పడు ఎవరికైనా ఇంగితజ్ఞానం ఉండాలి. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ధనదోపిడీ కొనసాగించడం తప్ప రైతుల పట్ల గౌరవం, వ్యవసాయం రంగం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు’’ అని తీవ్రంగా విమర్శించారు. -
మంత్రి దేవినేని అనుచరుడి బెదిరింపులు
విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు, వారి అనుచరుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ప్రభుత్వం చేతిలో ఉందన్న పొగరు, ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. బెదిరింపులు, దందాలు చాలా మామూలుగా చేసేస్తున్నారు. తమ్ముళ్ల ఆగడాలు భరించలేక ఫిర్యాదు చేసిన వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారు. పట్టించుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండిపోతున్నారు. తాజాగా మరో తెలుగు తమ్ముడు, మంత్రి దేవినేని అనుచరుడు సీతారామయ్య బెదిరింపులకు పాల్పడుతున్నాడు. విజయవాడ, ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ వ్యాపారిని ఫోన్లో బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో సదరు వ్యాపారీ, సీతారామయ్యపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. పైగా తిరగి తనపైనే అక్రమ కేసులు బనాయించినట్లు బాధితుడు వాపోయాడు. -
వీనులవిందుగా ఇండియన్ నావెల్ బ్యాండ్
భవానీపురం (విజయవాడ పశ్చిమం) : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇండియన్ నావెల్ బ్యాండ్ వీనుల విందుగా సాగింది. మొత్తం 36 మంది వాయిద్య కళాకారులు ఉన్న ఈ బృందం శాక్సాఫోన్స్ వాయిద్య పరికరాలతోపాటు సంప్రదాయ మృదంగం, తబలా, ఫ్లూట్, సన్నాయి వంటి పరికరాలను వినియోగించి తమ ప్రతిభను చాటారు. ఈ నెల 2,3,4 తేదీలలో భవానీపురం పున్నమి ఘాట్‌లో నిర్వహించిన నేవీ విన్యాసాలు శనివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ఇక్కడ నావెల్ బ్యాండ్‌ను నిర్వహించారు. రోజా చిత్రంలోని ‘చిన్ని చిన్ని ఆశ’ గీతాన్ని మనోహరంగా వినిపించి ఆహూతుల హర్షధ్వానాలు అందుకున్నారు. వందేమాతరం, స్లమ్ డాగ్ చిత్రంలోని ‘జయహో’, పాత హిందీ చిత్రంలోని ‘కల్ హో న హో’, మహాత్మాగాంధికి ఇష్టమైన ‘వైష్ణవ జన తో’ భజన, వీర అమర జవాన్లకు నివాళులు అర్పించే ‘ఆయే మేరే వతన్ కె లాగాన్’ గీతాలను వినిపించి ఆకట్టుకున్నారు. బెస్ట్ ఆఫ్ ది బిగ్ బ్యాండ్‌ను వినిపిస్తున్నప్పుడు ఆడిటోరియంలోని ఆహూతులందరూ లేచి నిలబడి మ్యూజిక్కు అనుగుణంగా చప్పట్లు కొట్టారు. చివరిగా ట్రైసర్వీస్ మార్చింగ్ మెడ్లీ పేరుతో ’సారే జహాసే అచ్ఛా’ గీతానికి, జనగణమన పాటలను వినిపించారు. ఈ గీతాలన్నీ సతీష్ కె.ఛాంపియన్, ఎస్.జానకిరామన్, ఆంటోని రాజ్ సంగీత దర్శకత్వం వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే డి.నరేంద్ర విచ్చేసి ప్రభుత్వం తరఫు వారిని అభినందించి జ్ఞాపికలు బహూకరించారు. -
కండలేరు జలాలు అందించి పంటలు కాపాడుతాం
రాపూరు: జిల్లాలో వేసి ఉన్న వరి పంటను సెంటు కూడా ఎండనీయకుండా కండలేరు జాలలను అందించి కాపాడుతామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. రాపూరు మండలం కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆదివారం సాయంత్రం సత్యసారుుగంగ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఇక్కడి రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు, నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ, జిల్లా మంత్రి నారాయణకు వివరించడంతో వారు స్పందించి రైతులకు నీరు అందిచేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అయితే రైతులు నీటి విడుదలను చూసి కొత్తగా వరి పంటలు వేయవద్దన్నారు. ఇప్పుడు వేసి ఉన్న వరి పంట చివరి ఆయకట్టు దారునికీ పంట పండే విధంగా నీరు అందిస్తామన్నారు. మొదటగా 200 క్యూసెక్కులు నీటిని వదిలామని ఈ నీటి ద్వారా పంటలు కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ నా యుడు, డక్కిలి జెట్పీటీసీ సభ్యుడు రామచంద్రనాయుడు పాల్గొన్నారు. అధికారులు లేకుండానే నీటి విడుదల కండలేరు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ఆదివారం నీటి విడుదల సమయం లో పెద్ద స్థాయి అధికారుల లేకపో వడం విశేషం. నీటి విడుదల చేసిన కొంత సేపటికి అధికారులు హడావుడిగా హెడ్‌రెగ్యులేటర్ వద్దకు పరుగులు తీశారు. -
ఆరోపణలు చేయడం కాదు,రుజువు చేసే దమ్ముందా!
మంత్రి దేవినేనికి వైఎస్సార్ కాంగ్రెస్ సవాల్ సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే సరిపోదు.. వాటిని నిరూపించే దమ్ముందా! అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారపార్టీకి సవాలు విసిరింది. పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దివీస్ ల్యాబొరేటరీ నెలకొల్పడాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పాల్గొన్న సభ విజయవంతం కావడంతో జీర్ణించుకోలేక మంత్రి దేవినేని ఉమా పాచినోటితో నోటికొచ్చినట్లు అసత్య ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. నిజంగా అధికారపార్టీ నేతలకు దమ్ముంటే నిజారుుతీగల పోలీసు అధికారులతో ఇడుపులపాయలోని ప్రతి అంగుళం వెతుక్కోవచ్చని, అక్కడేమీ దొరక్కపోతే సీఎం చంద్రబాబుతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల స్థాపనకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అరుుతే దివీస్ ఫార్మాకోసం అమాయక రైతులనుంచి బలవంతంగా భూముల్ని లాక్కోవడాన్ని ప్రతిఘటిస్తున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాల్లో తలపెట్టిన మెగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని తొలుత అడ్డుకున్నది టీడీపీ ఎమ్మెల్యేలేనన్న సంగతి మర్చిపోతే ఎలాగన్నారు. ప్రజలంతా ఉద్యమిస్తుంటేనే వారికి మద్దతుగా జగన్ నిలిచారన్నారు. దివీస్ ఫార్మా బాధితులకు మద్దతివ్వడానికీ ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉండటమే కారణమన్నారు.సముద్రం సమీపంలో నిర్మించాల్సిన ఫ్యాక్టరీలను జనావాసాలమధ్య నిర్మిస్తే వారి బతుకులు ఏమైపోవాలన్నారు. ఫార్మాసిటీలో భూముల ధరలు అధికంగా ఉండటంతో భయపడి.. తొండంగి మండలం దానవారుుపేటలోనైతే కారుచౌకగా రైతుల భూములను కొట్టేయవచ్చనే ఉద్దేశంతోనే బాబు దివీస్ స్థాపనకు మద్దతుగా నిలిచారన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా పక్కనపెట్టి రైతులనుంచి రౌడీరుుజంతో భూముల్ని లాక్కోవాలని చూస్తున్నారన్నారు. అక్కడ పరిశ్రమ ఏర్పాటైతే 250 హేచరీస్ పరిస్థితి ఆగమ్యగోచరమవుతుందని, వాటిపై ఆధారపడి జీవిస్తున్న 33 వేలమంది రోడ్డున పడతారన్నారు. -
వరద కాలువ టెండర్లలో మంత్రి వాటా రూ.7 కోట్లు
– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపణ కడప కార్పొరేషన్: కుందూ–పెన్నా వరద కాలువ నిర్మాణంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుకు భాగస్వామ్యం ఉందని, రూ.7కోట్లు చెల్లించేలా ఒప్పందం కూడా కుదిరిందని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్బి అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ వైస్ ఛైర్మెన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో రూ.72 కోట్లతో చేపట్టిన వరద కాలువ నిర్మాణాన్ని మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. తద్వారా గత ఎన్నికల్లో తాను పోగొట్టుకున్న డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి, వచ్చే ఎన్నికలకు మళ్లీ సన్నద్ధం కావడానికి ఈ కాలువ పనులను వినియోగించుకుంటున్నారని విమర్శించారు. వరద కాలువ మొత్తం 23 కి.మీలు ఉండగా, కోర్టులో కేసులతో 6 కి.మీలు భూసేకరణ జరగలేదన్నారు. అయినా సరే ఇరిగేషన్ అధికారులు ఈ పనికి టెండర్లు పిలిచారన్నారు. మాజీ ఎమ్మెల్యే కోసమే ఇష్టానుసారంగా నిబంధనలు రూపొందించారన్నారు. చివరకు ఆ నిబంధనలతో తాము కూడా క్వాలిఫై కాలేమని లె లుసుకొని చివరి నిమిషంలో వాటిని రద్దు చేయించారని ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని అప్పనంగా దోచుకోవడానికే రూ.72కోట్ల పనిని రివైజ్ ఎస్టిమేషన్స్ పేరుతో రూ.112.63 కోట్లకు పెంచారని ఆరోపించారు. ఇందులో మంత్రి దేవినేని సంపూర్ణంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ టెండర్లు ఖరారు కాగానే రూ.7 కోట్లు మంత్రికి చెల్లించేలా రహస్య ఒప్పందం కుదిరిందన్నారు. ప్రొద్దుటూరుకు నీళ్లు తేకుండా ప్రజాధనాన్ని వాటాలుగా పంచుకొనే ఈ అడ్డగోలు పనులకు పుల్‌స్టాప్ పెట్టకపోతే తమ ఎమ్మెల్యేలందరితో కలిసి మంత్రి దేవినేని ఛాంబర్ ఎదుటే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. తద్వారా రాష్ట్రమంతా వీరి అవినీతి భాగోతాన్ని ఎలుగెత్తి చాటుతామని స్పష్టం చేశారు. -
ఆరోగ్యంతోనే అభ్యుదయ సమాజం
సమష్టి ప్రజా ఉద్యమంతోనే అది సాధ్యం ‘దోమలపై దండయాత్ర’లో మంత్రి దేవినేని కాకినాడ : ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతున్న దోమల నిర్మూలనకు ప్రజలంతా సమష్టిగా ఉద్యమించి ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములు కావాలని జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రేచర్లపేటలో కాకినాడ నగరపాలక సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమాల్లో మంత్రి దేవినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేచర్లపేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతులైన ప్రజలతో విలసిల్లే సమాజమే అన్ని రంగాల్లో పురోగమిస్తుందని అన్నారు. దోమకాటు వల్ల డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వంటి వ్యాధులు ప్రబలి ప్రజలను శారీరకంగా, ఆర్థికంగా కుంగదీస్తున్నాయన్నారు. దోమల నిర్మూలనకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ద్వారా ప్రభుత్వపరంగా చేపడుతున్న చర్యలను వివరించారు. శనివారం జిల్లాలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇంటింటి ప్రదర్శన ద్వారా 15 లక్షల కుటుంబాలను కలిసి దోమల నిర్మూలనకు చేపట్టవలసిన చర్యలపై అవగాహన కల్పించారన్నారు. దోమలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై ముద్రించిన కరపత్రాలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు పంపిణీ చేసి వారి ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, కాకినాడ నగరపాలక సంస్థ ప్రచురించిన ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ స్టిక్కర్లు, కరపత్రాలు, బుక్లెట్లు, పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు అందించిన దోమకాటు వల్ల కలిగే రోగాల నివారణకు హోమియో మందును ఆయన పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు, ఉద్యోగులు దోమలపై దండయాత్ర నినాదాలతో నగరవీధుల నుంచి నిర్వహించిన భారీ ర్యాలీని మంత్రి దేవినేని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డేగల శేషువెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ డేగల చంద్రశేఖర్ ఉచితంగా పంపిణీ చేయనున్న హోమియోపతి మందు పంపిణీని ప్రారంభించి మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కలెక్టర్ అరుణ్‌కుమార్, నగర కమిషనర్ ఆలీమ్‌బాషా, అదనపు కమిషనర్ గోవిందస్వామి, ఉప కమిషనర్ సన్యాసిరావు, ఈఈ విజయకుమార్, ఆర్డీవో బీఆర్ అంబేద్కర్, తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
వరదనీటితో ప్రాజెక్టులు నింపుతాం..
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అచ్చంపేట: రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడుతున్నాయని, ఇకపై తాగు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా వరద నీటితో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నింపుతామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం ఆయన పులిచింతల ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం ఏ ఆశయంతో నిర్మించారో ఆ ఆశయం నెరవేరబోతుందన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే తెలుగు రాష్ట్రాలలో కరువు లేకుండా చేయవచ్చన్నారు. కొండ ప్రాంతాలలో, అడవులలో పడిన వర్షపు ప్రవాహాన్ని నిల్వ ఉంచుకుంటే ఎటువంటి ఇబ్బందులుండవన్నారు. ప్రాజెక్టు వద్ద నిర్మించిన జలవిద్యుత్ ప్రాజెక్టును ట్రయల్‌రన్ వేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పుడు 870 అడుగుల మేర నీటిని నిల్వ ఉంచినట్లు చెప్పారు. ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే అవకాశాలు ఉన్నాయన్నారు. పునరావాస కేంద్రాలలో సమస్యలన్నింటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ముంపు గ్రామాల ప్రజలు తక్షణమే వారి గ్రామాలు వదిలి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. ఆయన వెంట జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య, సీఈ వైఎస్ సుధాకర్, ఎస్ఈ ఎం.వెంకటరమణ, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈలు రాఘనాధరావు, మునిరత్నం ఉన్నారు. -
బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టపరచండి
ఇరిగేషన్ సమీక్షలో మంత్రి దేవినేని ధవళేశ్వరం : జిల్లాలో బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టపరచాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ధవళేశ్వరం కాటన్ అతిథి గృహంలో ఇరిగేషన్ సర్కిల్, పోలవరం అధికారులతో ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరికి 35 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినా ఇబ్బందులు లేనివిధంగా ఏటిగట్లను పటిష్టపరచాలన్నారు. చివరి ఆయకట్టుకు కూడా నీరు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 2017 నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. పని చేయని ఏజెన్సీలను తొలగించాలన్నారు. తొర్రిగెడ్డ, వెంకటనగరం, పుష్కర ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్‌లపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సీఈ హరిబాబు, ఎస్ఈ రాంబాబు, ఈఈలు కృష్ణారావు, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
పరిపాలన అనుమతులివ్వలేదు
కొండవీటి వాగుపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సాక్షి, విజయవాడ: కొండవీటి వాగు వరద నీటి ఎత్తిపోతల పథకానికి ఇంకా పరిపాలన అనుమతులివ్వలేదని, అందువల్ల అవినీతి జరిగే అవకాశం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఆదివారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి ఎస్ఈ, సీఈలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాతే పరిపాలన అనుమతులిస్తామన్నారు. కొండవీటి వాగుకు వచ్చే వరదనీటిని కృష్ణానదికి లేదా బకింగ్‌హామ్ కాలువకు ఎలా పంపాలనే విషయంపై ఇంజనీర్లు ఒక ప్రతిపాదన తయారుచేసి ప్రభుత్వానికి పంపితే.. దీనిపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. -
టీడీపీలో వేరుకుంపట్లు
ఎంపీ నానికి దూరంగా నగర అధ్యక్షుడు మంత్రి దేవినేనితోనూ వైరం బెజవాడ నేతల మధ్య అగాధం ప్రత్యేకంగా నగర కార్యాలయం విజయవాడ : తెలుగుదేశం పార్టీ నగర ముఖ్య నేతల మధ్య నానాటికీ అంతరం పెరుగుతోంది. ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి పార్టీ నగర కార్యాలయాన్ని కేశినేని భవన్లో కాకుండా సొంతంగా ఏర్పాటుచేసుకునే ఆలోచనలో అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఉన్నారనేది విశ్వసనీయ సమాచారం. ఇందుకు రాజకీయ, ఆర్థిక, నేర వ్యవహారాలే కారణాలని తెలుస్తోంది. దీనికితోడు అధినేత చంద్రబాబునాయుడు నగరంలో ఉంటున్నందున ఆయన వద్ద ప్రాపకం పొందే ప్రయత్నాలు కూడా ముమ్మరమయ్యాయి. ముఖ్య నేతల అండతో పార్టీ నగర పగ్గాలు చేపట్టడానికి కొందరు వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఆదినుంచీ వర్గవిభేదాలే నగర టీడీపీ నేతల మధ్య మొదట్నుంచీ వర్గ విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాయకుల అవసరార్థం అవి ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. ఒకరిని ఓ సందర్భంలో ద్వేషించడం, మరోసారి వారినే అక్కున చేర్చుకోవడం ముఖ్య నేతల మధ్య పరిపాటిగా మారింది. ప్రత్యర్థులు విమర్శలు చేసినప్పుడో, మరేదైనా ప్రధాన సమస్య వచ్చినప్పుడో నాయకులు జట్లు కట్టడంలో తేడాలు వస్తున్నాయి. చిచ్చురేపిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ కాల్‌మనీ- సెక్స్‌రాకెట్ కేసులో కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి ప్రధాన అనుచరులు, బంధువుల వ్యవహారాలు వెలుగుచూడడంతో నాయకుల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. అధినేత వద్దకు వెళ్లి ఫలానా వారికి ఇందులో జోక్యం ఉందని కొందరు ఫిర్యాదులు చేయ డం, ఈ కేసులో తమకు, తమవారికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవడం నాయకులకు షరా మామూలు అయింది. పోలీసు నిఘా వర్గాలను ఆశ్రయించి ఇందులో తమకే పాపం తెలియదనే నివేదికలు అధినేతకు పంపాలనే విన్నపాలు కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలియవచ్చింది. దీంతో పాటు నిఘావర్గాలు నగరంలోని ముఖ్య నాయకుల ఫోన్‌కాల్ జాబితాలను కూడా అధినేత ఎదుట ఉంచినట్లు సమాచారం. కాల్‌మనీ- సెక్స్‌రాకెట్ బండారం బట్టబయలయ్యాక నగర, జిల్లా నేతల మధ్య తకరారు మరీ తీవ్రతరమైంది. తమను రాజకీయంగా దెబ్బతీసేందుకు కాల్‌మనీ- సెక్స్‌రాకెట్ అంశంలో దురుద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నాలు జరిగాయని కొందరు నాయకులు వాపోతుండగా, అసలు తప్పులేవీ చేయనప్పుడు ఆందోళనలు ఎందుకనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ఎంపీ కార్యాలయానికి వెళ్లని బుద్దా టీడీపీ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న కొంతకాలంగా ఎంపీ కేశినేని కార్యాలయానికి వెళ్లడం మానేశారు. టీడీపీ ముఖ్య నాయకులతో పాటు ఎంపీ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జుల ఫొటోలతో కూడిన బ్యానర్ కేశినేని భవన్లో ఉండేది. ఆ బ్యానర్లో నుంచి తన ఫొటోను ఉద్దేశపూర్వకంగా ఇటీవల తొలగించారన్న సమాచారం వెంకన్నకు చేరింది. అది నిజమేనని నిర్ధారించుకున్న ఆయన అక్కడికి వెళ్లడం మానేశారు. తనకు అత్యంత ఆప్తుడిగా భావించే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తాజా పరిణామాలన్నింటినీ తీసుకెళ్లి కింకర్తవ్యం ఏమిటని వెంకన్న చర్చించారని వినికిడి. సొంత కార్యాలయం ఏర్పాటుచేసుకోవాలని తాను ఎప్పటి నుంచో సూచిస్తున్నా అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని రామ్మోహన్.. వెంకన్నకు క్లాస్ పీకినట్లు సమాచారం. ఇక కాల్‌మనీ అంశంలో తనకు సంబంధం లేదని వెంకన్న పదేపదే వివరణ ఇచ్చుకోవడంతోపాటు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. మంత్రి దేవినేనికి దూరం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతోనూ నగర నాయకులు అంటీముట్టనట్లు ఉంటున్నారు. పైకి మాత్రం కలిసినట్లు కనిపిస్తున్నా మంత్రి, ఆయన కార్యాలయం నుంచి ఫోన్లు చేసినప్పుడు నగర నేతలు కొందరు స్పందించడం లేదు. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా, అంతకు ముందు భవానీదీక్షల సమయంలో గిరి ప్రదక్షిణకు మంత్రి స్వయంగా పిలిచినా ముఖ్య నాయకులు స్పందించలేదు.పార్టీ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఈ విషయంలో రాజీ పడడంలేదని తెలిసింది. పదవులపేరిట, అప్పుల రూపంలో వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని ఆ తరువాత వాటి ఊసెత్తడం లేదని ప్రజాప్రతినిధుల కార్యాలయాలు కోడై కూస్తున్నాయి. మధ్యవర్తులుగా వ్యవహరించిన వారు కూడా నేరుగా రుణగ్రస్తులనే సంప్రదించాలని సూచిస్తున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నగర ఎమ్మెల్యే ఒకరు మంత్రి తీరుపై బాహాటంగానే తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నట్లు పార్టీ వర్గాలు ప్రచా రం చేస్తున్నాయి. తన కోటరీ మినహా ఇతరుల అంశాలను మంత్రి ఏమాత్రం పట్టించుకోవడంలేదని, అందువల్లే అధినేతకు నేరుగా చెప్పుకోవాల్సి వస్తోందని ప్రజాప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. సాగునీటి విషయంలో రైతుల తరఫున మాట్లాడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా ఇష్టం: ఎంపీ నాని ఎంపీ నాని కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో పార్లమెంటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల ఫొటోలన్నీ ఉన్నాయి. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫొటో కనిపించలేదు. దీనిపై జనంలో జరుగుతున్న చర్చను ఎంపీ వద్ద సాక్షి ప్రస్తావించగా ‘నా ఇష్టం.. నాడబ్బులతో పెట్టుకునే ఫ్లెక్సీలో నాకు ఇష్టమైన వారి ఫొటోలు పెట్టుకుంటా..’ అని బదులిచ్చారు. -
మాజీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ‘చెత్త’
మంత్రి దేవినేని ఉమ వివాదాస్పద వ్యాఖ్యలు కర్నూలు: ఉమ్మడి ఏపీలో అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన సుదర్శన్‌రెడ్డిని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ‘చెత్త’గా అభివర్ణించారు. రాష్ట్రానికి కృష్ణా నీటి వాటా తీసుకురావడంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించడంలో సుదర్శన్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా గురువారమిక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డిని కాకుండా.. నారిమన్ లాంటి వారిని నియమించమంటే అప్పటి సీఎం వైఎస్ వినిపించుకోలేదని ఆరోపించారు. ఫలితంగామన వాదనలు బలహీనమై కర్ణాటక, మహారాష్ట్రలకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. కాగా రాయలసీమకు నీళ్లు రావడం ప్రతిపక్ష నేత జగన్‌కు ఇష్టంలేనట్లుగా ఉందని ఉమ వ్యాఖ్యానించారు.