మంత్రి దేవినేని ఉమ వివాదాస్పద వ్యాఖ్యలు
కర్నూలు: ఉమ్మడి ఏపీలో అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన సుదర్శన్‌రెడ్డిని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ‘చెత్త’గా అభివర్ణించారు. రాష్ట్రానికి కృష్ణా నీటి వాటా తీసుకురావడంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించడంలో సుదర్శన్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా గురువారమిక్కడకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
సుదర్శన్‌రెడ్డిని కాకుండా.. నారిమన్ లాంటి వారిని నియమించమంటే అప్పటి సీఎం వైఎస్ వినిపించుకోలేదని ఆరోపించారు. ఫలితంగామన వాదనలు బలహీనమై కర్ణాటక, మహారాష్ట్రలకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. కాగా రాయలసీమకు నీళ్లు రావడం ప్రతిపక్ష నేత జగన్‌కు ఇష్టంలేనట్లుగా ఉందని ఉమ వ్యాఖ్యానించారు.