కండలేరు జలాలు అందించి పంటలు కాపాడుతాం
రాపూరు: జిల్లాలో వేసి ఉన్న వరి పంటను సెంటు కూడా ఎండనీయకుండా కండలేరు జాలలను అందించి కాపాడుతామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. రాపూరు మండలం కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆదివారం సాయంత్రం సత్యసారుుగంగ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఇక్కడి రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు, నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమ, జిల్లా మంత్రి నారాయణకు వివరించడంతో వారు స్పందించి రైతులకు నీరు అందిచేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అయితే రైతులు నీటి విడుదలను చూసి కొత్తగా వరి పంటలు వేయవద్దన్నారు.
ఇప్పుడు వేసి ఉన్న వరి పంట చివరి ఆయకట్టు దారునికీ పంట పండే విధంగా నీరు అందిస్తామన్నారు. మొదటగా 200 క్యూసెక్కులు నీటిని వదిలామని ఈ నీటి ద్వారా పంటలు కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ నా యుడు, డక్కిలి జెట్పీటీసీ సభ్యుడు రామచంద్రనాయుడు పాల్గొన్నారు.
అధికారులు లేకుండానే నీటి విడుదల
కండలేరు హెడ్‌రెగ్యులేటర్ నుంచి ఆదివారం నీటి విడుదల సమయం లో పెద్ద స్థాయి అధికారుల లేకపో వడం విశేషం. నీటి విడుదల చేసిన కొంత సేపటికి అధికారులు హడావుడిగా హెడ్‌రెగ్యులేటర్ వద్దకు పరుగులు తీశారు.