వరి సాగు చేసే రైతులు సోమరిపోతులు
మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
చిత్తూరు (అగ్రికల్చర్) : సోమరిపోతు రైతులే వరి పంటను సాగుచేస్తారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వరిసాగు చేసే రైతులను విమర్శించారు. బుధవారం చిత్తూరు కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బొజ్జల మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో వరిపంట సాగు చేయడం వల్ల అధికంగా నీరు వృథా అవుతోందని, దీంతో రైతులు ఇతర పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయలేక పోతున్నారని పేర్కొన్నారు. తక్కువ నీరు అవసరమయ్యే ఉద్యాన పంటల సాగు వైపు రైతులు మొగ్గుచూపి, లాభాలు సాధించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు ప్రోత్సహించాలని కోరారు. ఉద్యాన పంటలలో లాభాలు వస్తే మిగతా రైతులు కూడా అదే బాటలో పయనిస్తారన్నారు.