Minister BOJJALA
-
వరి సాగు చేసే రైతులు సోమరిపోతులు
మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు (అగ్రికల్చర్) : సోమరిపోతు రైతులే వరి పంటను సాగుచేస్తారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వరిసాగు చేసే రైతులను విమర్శించారు. బుధవారం చిత్తూరు కలెక్టరేట్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొజ్జల మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో వరిపంట సాగు చేయడం వల్ల అధికంగా నీరు వృథా అవుతోందని, దీంతో రైతులు ఇతర పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయలేక పోతున్నారని పేర్కొన్నారు. తక్కువ నీరు అవసరమయ్యే ఉద్యాన పంటల సాగు వైపు రైతులు మొగ్గుచూపి, లాభాలు సాధించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు ప్రోత్సహించాలని కోరారు. ఉద్యాన పంటలలో లాభాలు వస్తే మిగతా రైతులు కూడా అదే బాటలో పయనిస్తారన్నారు. -
అలిపిరి ఘటన కేసులో నేడు తుది తీర్పు
తిరుపతి లీగల్: సీఎం చంద్రబాబుపై 2003 అక్టోబర్1న తిరుపతి అలిపిరి సమీపంలో జరిగినపేలుడు ఘటన కేసులో తిరుపతి అదనపు సీనియర్ సివిల్‌జడ్జి సదానందమూర్తి మంగళవారం తుది తీర్పు వెలువరించనున్నారు. ప్రాసిక్యూషన్ తరపున 52 మంది సాక్షులు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. కేసులో సాక్షులుగా ఉన్న చంద్రబాబు, మంత్రి బొజ్జల సాక్ష్యమివ్వలేదు. దీంతో న్యాయమూర్తి వారి సాక్ష్యాలను క్లోజ్ చేస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇదేమి ‘కానుక’?..ఇదేమి వేదిక?
చంద్రన్న కానుక పేరుతో గడువుతీరిన సరుకులను ఇస్తున్నారని మంత్రి బొజ్జలను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, స్థానికులు నిలదీశారు. కలకడ మండలంలో నిర్వహించిన జన్మభూమి సభ వేదికపై స్థానిక శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి సీటు లేకపోవడంతో ఆయన ప్రజల మధ్యలోనే కూర్చున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అక్కడే నిల్చుని ప్రసంగించారు. -
కాళహస్తీశ్వరునికి పట్టువస్త్రాలు సమర్చించిన బొజ్జల
-
సీఎం జోక్యంతో తగ్గిన బొజ్జల..!
పైచేయి సాధించిన ముద్దుకృష్ణమ * డీఆర్వోగా విజయ్‌చందర్ ? * ఎన్నికల కమిషన్ వద్దకు ఫైల్ * 18న ప్రత్యేక జీవో ద్వారా డీఆర్వోగా బాధ్యతలు..? తిరుపతితుడా: జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో ) పోస్టింగ్ వ్యవహారం సీఎం చంద్రబాబునాయుడు వద్దకు చేరింది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు అభ్యర్థన మేరకు డీఆర్వోగా జిల్లాకు చెందిన అధికారి విజయ్‌చందర్ పేరు ఖరారు చేశారు. అనంతరం సీఎం సింగపూర్ పర్యటనకు వెళ్లిన తరువాత మంత్రి బొజ్జల చక్రం తిప్పారు. మంత్రిగా తనకు తెలియకుండా డీఆర్వోగా విజయ్‌చందర్ పేరు ఎలా ఖరారు చేస్తారని కన్నెర్ర చేశారు. డెప్యూటీ సీఎం, రెవె న్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి అండతో మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మరో అధికారి పేరు తెరపైకి తెచ్చా రు. ఎం. వెంకటేశ్వరరావును డీఆవ్వోగా నియమించాలని రెవెన్యూ మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిపాదనలు సిద ్ధం చేయించారు. ఈ వ్యవహారం మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మధ్య విభేదాలకు ఆజ్యం పోశాయి. విజయ్‌చందర్ జిల్లా వాసి కావడంతో టీడీపీ నేతలంగా మొగ్గుచూపారు. మంత్రి బొజ్జల, మాజీ మంత్రి ముద్దుకృష్ణమ పట్టుదలకు పోవడంతో ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. జరిగిన పరిణామాలు తెలుసుకున్న సీఎం ఒకింత సీరియస్‌గా తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తె లిసింది .దీనిపై బొజ్జలను మందలించినట్లు కూడా సమాచారం. డీఆర్వోగా విజయ్‌చందర్ నే నియమించాలని చెప్పడంతో మంత్రి బొజ్జల వెనక్కు తగ్గినట్టు తెలిసింది. ఎన్నికల కమిషన్ నిబంధనలు అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో విజయచందర్ పోస్టింగ్ వ్యవహారానికి సబంధించిన ఫైల్ కమిషన్ వద్దకు చేరినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాగానే రెండు,మూడు రోజుల్లో డీఆర్వో నియామకం ఖరారయ్యే పరిస్థితి ఉన్నట్లు సమాచారం.