తిరుపతి లీగల్: సీఎం చంద్రబాబుపై 2003 అక్టోబర్1న తిరుపతి అలిపిరి సమీపంలో జరిగినపేలుడు ఘటన కేసులో తిరుపతి అదనపు సీనియర్ సివిల్‌జడ్జి సదానందమూర్తి మంగళవారం తుది తీర్పు వెలువరించనున్నారు.
ప్రాసిక్యూషన్ తరపున 52 మంది సాక్షులు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. కేసులో సాక్షులుగా ఉన్న చంద్రబాబు, మంత్రి బొజ్జల సాక్ష్యమివ్వలేదు. దీంతో న్యాయమూర్తి వారి సాక్ష్యాలను క్లోజ్ చేస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు.