
మంత్రి దేవినేని అనుచరుడి బెదిరింపులు
విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు, వారి అనుచరుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయి. ప్రభుత్వం చేతిలో ఉందన్న పొగరు, ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. బెదిరింపులు, దందాలు చాలా మామూలుగా చేసేస్తున్నారు. తమ్ముళ్ల ఆగడాలు భరించలేక ఫిర్యాదు చేసిన వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారు. పట్టించుకోవాల్సిన పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండిపోతున్నారు.
తాజాగా మరో తెలుగు తమ్ముడు, మంత్రి దేవినేని అనుచరుడు సీతారామయ్య బెదిరింపులకు పాల్పడుతున్నాడు. విజయవాడ, ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ వ్యాపారిని ఫోన్‌లో బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో సదరు వ్యాపారీ, సీతారామయ్యపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. పైగా తిరగి తనపైనే అక్రమ కేసులు బనాయించినట్లు బాధితుడు వాపోయాడు.