
పరిపాలన అనుమతులివ్వలేదు
కొండవీటి వాగు వరద నీటి ఎత్తిపోతల పథకానికి ఇంకా పరిపాలన అనుమతులివ్వలేదని, అందువల్ల అవినీతి జరిగే అవకాశం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.
కొండవీటి వాగుపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
సాక్షి, విజయవాడ: కొండవీటి వాగు వరద నీటి ఎత్తిపోతల పథకానికి ఇంకా పరిపాలన అనుమతులివ్వలేదని, అందువల్ల అవినీతి జరిగే అవకాశం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఆదివారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి ఎస్‌ఈ, సీఈలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాతే పరిపాలన అనుమతులిస్తామన్నారు. కొండవీటి వాగుకు వచ్చే వరదనీటిని కృష్ణానదికి లేదా బకింగ్‌హామ్ కాలువకు ఎలా పంపాలనే విషయంపై ఇంజనీర్లు ఒక ప్రతిపాదన తయారుచేసి ప్రభుత్వానికి పంపితే.. దీనిపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.