ఏపీలో సంచలనం సృష్టించిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో దొంగలను పట్టుకునే దమ్ము టీడీపీ ప్రభుత్వానికి లేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి వ్యాఖ్యానించారు. మహిళలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇక్కడి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మల్లాది విష్ణుతో పాటు వందలాది మంది ఆయన అనుచరులు వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం పార్థసారధి మాట్లాడుతూ.. ‘నేడు చాలా సంతోషకరమైన రోజు. దివంగత నేత వైఎస్ఆర్ గారి ప్రియ శిష్యుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేరిక పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుంది. పార్టీ బలోపేతానికి మల్లాది విష్ణు కృషి చేస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది.
టీడీపీ పతనం ప్రారంభమైంది: పార్థసారధి
Published Thu, Jul 27 2017 6:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement