దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చాలా బాగుందని, వైఎస్సార్ పాటించిన విలువలు, విదేయతలను తెరపై ఆవిష్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు చక్కగా చూపించారని చెప్పారు.