
సాక్షి, విజయవాడ : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాపాడలేని చంద్రబాబు సర్కార్ తమపై బురద జల్లుతోందని వైఎస్సార్‌సీసీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విదేశాలకు వెళ్లి వచ్చి కొత్త ఉత్సాహంతో పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దోపిడీ కోసం మైనింగ్ చట్టాలను మార్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాలకు ఒప్పందాలు చేసుకుంది నిజం కాదా అని నిలదీశారు.
2014లో చంద్రబాబు నాయుడు సీఎం అవగానే బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. తవ్వకాల కోసం జీవో 97 తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. వైఎస్ జగన్ మన్యంలో సభపెట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బాక్సైట్ మైనింగ్ జీవోని నిలిపివేశారని పార్థసారధి పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం అంటే ఏంటో చంద్రబాబు చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసుపై చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment