baxite mining
-
చంద్రబాబు అండ్ కో పంచభూతాలను దోచుకున్నారు
సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు 2014 నుంచి 2019 వరకు పంచభూతాలను దోచుకుతిన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి ప్రాంతంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ప్రభుత్వం అడ్డుకున్నట్లు చంద్రబాబు ట్విట్టర్లో శుక్రవారం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సున్నిత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసుల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఎటువంటి అనుమతులు లేకుండా సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకుంటే వారితో గొడవపడడం దుర్మార్గమన్నారు. ఇక్కడి పార్టీ నగర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గనులు, ఖనిజాలు దోచుకున్నది టీడీపీ నేతలే విశాఖ మన్యంలో గంజాయి, లేటరైట్ వ్యాపారం చేసింది టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులేనని అమర్నాథ్ స్పష్టంచేశారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు, లోకేష్‌లు కలిసి విశాఖలో లేటరైట్‌ను దోచుకున్నారని మండిపడ్డారు. వారి అక్రమ మైనింగ్‌కు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు బలైపోయారన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన కిడారిని మభ్యపెట్టి టీడీపీలోకి లాక్కొని అతని హత్యకు కారణమయ్యారని మండిపడ్డారు. ఆయన హత్యలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే అని అన్నారు. మరోవైపు.. టీడీపీ హయాంలో ఇసుకలో రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగిందని అందులో చంద్రబాబు వాటా రూ.5 వేల కోట్లని అమర్నాథ్ ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో ఇసుకను దోచుకుంటే.. గుంటూరు జిల్లాలో యరపతినేని శ్రీనివాస్ అక్రమ క్వారియింగ్‌కు పాల్పడ్డారని, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావులు అక్రమ మైనింగ్‌లతో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్ర సంపదను దోచుకుని రూ.2 లక్షల కోట్లు ఆర్జించారని ధ్వజమెత్తారు. వారి అక్రమాలను గుర్తించే రాష్ట్ర ప్రజలు వారిని గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం చేశారని అమర్నాథ్ గుర్తుచేశారు. గిరిజనాభివృద్ధే సీఎం లక్ష్యం ఎన్నికలకు ముందు చింతపల్లి బహిరంగ సభలో అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకుంటామని గిరిజన ప్రజలకు వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని అమర్నాథ్ గుర్తుచేశారు. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మైనింగ్‌కు కూడా లీజు అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేశారు. కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకుని మైనింగ్ చేస్తున్నది టీడీపీ వారేనన్నారు. చీమకుర్తి వంటి ప్రాంతాల్లో ఖనిజాలు దోచుకుతిన్న వారిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.2,500 కోట్ల మేర జరిమానా విధించిందన్నారు. గిరిజన అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని స్పష్టంచేశారు. రాష్ట్ర సంపదను కాపాడుతూ అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న నమ్మకంతోనే వైఎస్సార్సీపీని గెలిపించారని అమర్నాథ్ వివరించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నాం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని గుడివాడ అమర్నాథ్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖలు రాయడంతోపాటు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్లో ఈ విషయంపై ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్న బీజేపీని కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు కార్మికులు, ఉద్యోగులు, ఇతర సంఘాలు చేస్తున్న ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. -
వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ.. టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు తవ్వకాలు జరపడం సరికాదన్నారు. బాక్సైట్ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇక నుంచి ఏజెన్సీలో మైనింగ్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.. మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. కాగా వైఎస్ జగన్ గతంలో చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని అనేక సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నెలకోసారి తప్పనిసరి పర్యటించాలని సీఎం ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా రిత్యా... అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఒకేసారి ఆయా ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రజలందరికీ ప్రభుత్వం సేవలు అందుతున్నాయా.? లేదా అన్నదానిపై సమీక్ష నిర్వహించాలన్నారు. గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారి అభిమానాన్ని చూరగొనాలని సీఎం ఆదేశించారు. -
‘కొత్త ఉత్సాహంతో చంద్రబాబు పచ్చి అబద్దాలు’
సాక్షి, విజయవాడ : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను కాపాడలేని చంద్రబాబు సర్కార్ తమపై బురద జల్లుతోందని వైఎస్సార్సీసీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విదేశాలకు వెళ్లి వచ్చి కొత్త ఉత్సాహంతో పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దోపిడీ కోసం మైనింగ్ చట్టాలను మార్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాలకు ఒప్పందాలు చేసుకుంది నిజం కాదా అని నిలదీశారు. 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అవగానే బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. తవ్వకాల కోసం జీవో 97 తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. వైఎస్ జగన్ మన్యంలో సభపెట్టి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బాక్సైట్ మైనింగ్ జీవోని నిలిపివేశారని పార్థసారధి పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం అంటే ఏంటో చంద్రబాబు చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసుపై చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. -
దోపిడీ కోసం మైనింగ్ చట్టాలను మార్చింది చంద్రబాబు
-
బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు అపోహలు
-
బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు అపోహలు: చంద్రబాబు
ఢిల్లీ : బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు అపోహలున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జన్‌ధన్-ఆధార్-మొబైల్‌తో అవినీతిరహిత పాలన అందించే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. నేషనల్ ఎకనమిక్ ఎన్‌క్లేవ్‌లో శుక్రవారం ఆయన పాల్గొని జన్‌ధన్-ఆధార్-మొబైల్ అంశంపై ప్రసంగించారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను జన్‌ధన్-ఆధార్-మొబైల్ తో లింక్ చేస్తామన్నారు. సబ్సిడీలు, సంక్షేమ రంగంలో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, పారదర్శకత సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌తో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై చర్చించాం, త్వరలోనే నివేదిక ఇస్తామని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలపై చర్చించి గిరిజనుల ప్రయోజనాల మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్వచ్ఛ్ భారత్ పటిష్ట అమలుకు పన్నులను సిఫారసు చేశామని ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు.