
బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు అపోహలు: చంద్రబాబు
ఢిల్లీ : బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు అపోహలున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జన్ధన్-ఆధార్-మొబైల్తో అవినీతిరహిత పాలన అందించే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. నేషనల్ ఎకనమిక్ ఎన్క్లేవ్లో శుక్రవారం ఆయన పాల్గొని జన్ధన్-ఆధార్-మొబైల్ అంశంపై ప్రసంగించారు. రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలను జన్ధన్-ఆధార్-మొబైల్ తో లింక్ చేస్తామన్నారు. సబ్సిడీలు, సంక్షేమ రంగంలో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, పారదర్శకత సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్తో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై చర్చించాం, త్వరలోనే నివేదిక ఇస్తామని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలపై చర్చించి గిరిజనుల ప్రయోజనాల మేరకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్వచ్ఛ్ భారత్ పటిష్ట అమలుకు పన్నులను సిఫారసు చేశామని ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు.