చీర లాగేసి.. కిందపడేసి.. | TDP activist molest on women | Sakshi
Sakshi News home page

చీర లాగేసి.. కిందపడేసి..

Published Sun, Feb 5 2017 7:13 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

చీర లాగేసి.. కిందపడేసి.. - Sakshi

చీర లాగేసి.. కిందపడేసి..

  • వివాహితపై టీడీపీ కార్యకర్త అత్యాచారయత్నం
  • పెనుగులాడి.. కేకలు వేసి తప్పించుకున్న మహిళ
  • భర్తతో కలసి పోలీసులకు ఫిర్యాదు
  • పెనుకొండ :  రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. అధికారం అండ చూసుకుని తాము అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా బరితెగిస్తున్నారు. అనంతపురం జిల్లాలో అయితే వీరి దౌర్జన్యకాండ మరీ మితిమీరింది. ఇటీవల కూడేరు మండలం జల్లిపల్లిలో తమ మాట వినలేదన్న చిన్న కారణంతో ఓ మహిళను నడి వీధిలో జుట్టు పట్టుకుని ఈడ్చేని చెప్పు కాళ్లతో తన్నిన వైనం మరచిపోక ముందే రొద్దం మండలంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళపై అత్యాచారయత్నం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం మేరకు.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి ఎమ్యెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం బొక్సంపల్లికి చెందిన వివాహిత ఈ నెల 2వ తేదీన ఎల్‌జీబీ నగర్‌ సమీపంలోని తన మామిడి తోటకు కాపలాగా వెళ్లింది. భర్త వెంట రావడం ఆలస్యమైంది.

    (చదవండి : ఇది దుర్యోధన.. దుశ్శాసన రాజ్యం )

    ఈ విషయాన్ని గమనించి అప్పటికే అక్కడ మాటువేసిన టీడీపీ కార్యకర్త గొల్ల వెంకటేశులు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆమెను బలాత్కరించబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో చీరను లాగేసి, కిందపడేసి పట్టుకుని వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకోవడానికి ఆమె శతవిధాలా ప్రయత్నించింది. పెనుగులాడుతూ ‘అదో నా మొగుడు వస్తున్నాడు..’ అంటే ‘నీ మొగుడేమైనా పరిటాల రవి అనుకున్నావా..’ అంటూ బలవంతం చేశాడు. ‘త్వరగా రా..’అంటూ గట్టిగా కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి ద్విచక్ర వాహనంలో పారిపోయాడు. ఈ విషయమై బాధితురాలు శనివారం భర్తతో కలిసి రొద్దం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంకటేశులుపై అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లు రొద్దం ఎస్‌ఐ మునీర్‌ అహ్మద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement