వినియోగదారుల అవ సరాలు గుర్తించి వారికి అనుగుణంగా నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సర సమైన ధరలకు అందుబాటులోకితెస్తే వ్యవసాయరంగం మరింత అభివృద్ధి..
వ్యవసాయ శాఖ కార్యదర్శి
సాక్షి,హైదరాబాద్: వినియోగదారుల అవ సరాలు గుర్తించి వారికి అనుగుణంగా నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సర సమైన ధరలకు అందుబాటులోకితెస్తే వ్యవసాయరంగం మరింత అభివృద్ధి చెందుతుందని వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి చెప్పారు. ప్రస్తుతం చాలామంది సేంద్రియ ఉత్పత్తులు కోరుకుంటున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా అందిస్తే సేంద్రియ వ్యవసాయం పురోగమిస్తుందన్నారు. పీపుల్స్‌ప్లాజాలో ‘మేనేజ్’ ఆధ్వర్యంలో జరుగుతున్న ఔత్సాహిక వ్యవసాయ పారిశ్రామికవేత్తల సదస్సు గురువారం ముగిసింది.
వ్యవసాయంలో సాం కేతికత పెరగడం ద్వారా దిగుబడి 4 రెట్లు పెరిగిందని పార్థసారథి చెప్పారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలకు చెందిన 125 అగ్రి స్టార్టప్స్ పాల్గొన్నాయన్నారు. వినూ త్నమైన ఆలోచనలతో ముందుకొచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సిర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సుజిత్ కుమార్, మేనేజ్ సంస్థ డైరెక్టర్లు శర్వానంద్, చంద్రశేఖర్, వీపీ శర్మ పాల్గొన్నారు.