అధికారులకు పార్థసారధి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేసేం దుకు సిద్ధంగా ఉండాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి అధికారులను ఆదేశించారు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయన బుధవారం వ్యవసాయశాఖలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్నందున రైతుకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రధానంగా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు రైతులకు అందజేయాలని కోరారు. బ్లాక్‌మార్కెట్‌కు వెళ్లకుండా వాటిని ముందస్తుగా అవసరమైన స్టాకును జిల్లాల్లో సిద్ధంగా ఉంచాలని కోరారు. ఈ సమావేశంలో ఆ శాఖ డెరైక్టర్ ప్రియదర్శిని, ఎరువుల విభాగం డిప్యూటీ డెరైక్టర్ రాములు ఇతర అధికారులు పాల్గొన్నారు.