విజయవాడ : టీడీపీ ఫిరాయింపు రాజకీయాలను ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తుందని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి శుక్రవారం తెలిపారు. టీడీపీ వైఖరికి వ్యతిరేకంగా శనివారం 'సేవ్ డెమోక్రసీ' అనే నినాదంతో కొవ్వొత్తులతో నగరంలో ర్యాలీ చేయనున్నట్లు ఆయన వివరించారు. వైఎస్సార్సీపీపై విమర్శలు చేసినవారికే చంద్రబాబు ఉత్తమ ర్యాంకులు కట్టబెట్టారని అన్నారు. ఆర్థికమంత్రి యనమల తన స్థాయి మించి విమర్శలు చేస్తున్నారని పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు.