
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును అక్రమ ఆదాయ వనరుగా మార్చుకునేం దుకు సీఎం చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని, దీనిని ఒక మాయా ప్రాజెక్టుగా మారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి విమర్శించారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి దాని వ్యయం ఎంతకు చేరుతుందో కేంద్రానికిగానీ, రాష్ట్ర ప్రజలకుగానీ అర్థంకాని విధంగా ప్రభుత్వం మాయ చేస్తోందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తిచేసి, అప్పగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటే, రాష్ట్రప్రభుత్వం ఏం ఆశించి కేంద్రం నుంచి పోలవరాన్ని లాక్కుందో స్పష్టం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment