రైతుల ఎక్స్ గ్రేషియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయడం వైఎస్సార్ సీపీ విజయమని ఆ పార్టీ నేత పార్థసారధి తెలిపారు. రైతుల ఎక్స్ గ్రేషియాపై తదితర ఆంశాలకు సంబంధించి శుక్రవారం మీడియాతో మాట్లాడిన పార్థసారధి.. ఇది తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయమని పేర్కొన్నారు. గతంలో రైతుల ఆత్మహత్యలను భూతద్దంలో చూపిస్తోందని వైఎస్సార్ సీపీని ప్రభుత్వం విమర్శించిందన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు అండగా ఉండేందుకు వైఎస్ జగన్ భరోసా యాత్ర చేయబోతున్నారని తెలిసే ప్రభుత్వం ఈ జీవో జారీ చేసిందన్నారు.