
సాక్షి, తిరుమల : అమరావతిలోని తుళ్లూరులో రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే రూ.79 కోట్లతో తిరుమల గోవర్ధన అతిథి గృహం వద్ద నూతన యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా 2015లో సవరించిన పీఆర్‌సీ ప్రకారం టీటీడీ రవాణా విభాగంలో పని చేస్తున్న 65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు రూ. 15 వేల నుంచి 24 వేలకు వేతనం పెంచుతూ మంగళవారమిక్కడ సమావేశమైన టీటీడీ పాలకమండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
అలాగే తిరుమలలోని హోటల్‌లలో ధరల నియంత్రణకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి గృహాన్ని ఏపీ టూరిజంకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కల్యాణమండపాల అభివృద్ధి పనులకు రూ.37 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment