
తుళ్లూరులో ఏపీ తాత్కాలిక అసెంబ్లీ
గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక అసెంబ్లీని నిర్మించనున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. అసెంబ్లీ నిర్మాణ కోసం వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయించారు. యుద్ధప్రాతిపదికను నిర్మాణం పనులు చేపట్టాలని, 5 రోజుల పాటు తుళ్లూరులోనే సమావేశాలు జరపనున్నట్టు కోడెల చెప్పారు.
రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి సమీపంలో తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నారు. ఏపీ శాసనమండలి సమావేశాలు కూడా తుళ్లూరులోనే జరపాలని నిర్ణయించారు.