ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ప్రకటించినప్పటి నుంచి తుళ్లూరు ప్రాంతం నిత్య పండుగలతో తుళ్లిపడుతోంది.
ఇప్పటి వరకూ నాలుగు వేడుకలకు నెలవైన తుళ్లూరు
రేపు ఐదో పండుగకు ముస్తాబు
సంతోషం వ్యక్తం చేస్తున్న ఆ ప్రాంతవాసులు
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ప్రకటించినప్పటి నుంచి తుళ్లూరు ప్రాంతం నిత్య పండుగలతో తుళ్లిపడుతోంది. ప్రభుత్వ వేడుకలన్నీ తన ముంగిట్లో జరుగుతుండడంతో మురిసిపోతోంది..ఈ ప్రాంత ప్రజల లోగిళ్లను.. సంబరాల్లో ముంచెత్తుతోంది..ఇలా నాలుగు వేడుకలకు నెలవైన తుళ్లూరు.. ఐదో వేడుకకు ముస్తాబయింది..శంకుస్థాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నానని మరోసారి గర్వంతో.. చిరుదరహాసం చిందిస్తోంది..
తాడికొండ: అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం వేడుకలు నిర్వహించుకునేందుకు పుట్టినిల్లుగా మారింది. 2015 తొలి నుంచి రాష్ట్ర స్థాయి వేడుకలన్నీ ఈ ప్రాంతంలోనే చేపట్టారు. ఇప్పటి వరకు నాలుగు భారీ స్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. రేపు శంకుస్థాపన పర్వదినాన్నీ ఈ మండలంలోనే చేపట్టారు.
రుద్రమదేవి నడయాడిన నేల
క్రీస్తుశకం 1000 సంవత్సరం నుంచి కాకతీ యులు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించారు. వారి పాలనలోనే 1199 నుంచి 1289సంవత్సరం వరకు గణపతిదేవుని కుమా ర్తె రుద్రమదేవి తుళ్లూరు మండలంలోని మల్కాపురం, మందడం, తాళ్లాయిపాలెం ప్రాంతాలను పరిపాలించి ఆలయాలు, శిలాశాసనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2015 నుం చి నవ్యాంధ్ర రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి కార్యక్రమాలను ఈ ప్రాంతంలోనే చేపడుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా జనవరి 1న నూతన సంవత్సర వేడుకలను తుళ్లూరులో సీఎం చంద్రబాబు వైభవంగా నిర్వహించారు. జనవరి 14న ఇదే తుళ్లూరులో ప్రభుత్వం తరఫున సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.
మార్చి 21న తెలుగు సంవత్సరం ఉగాది వేడుకలను అనంతవరం వెంకన్న సన్నిధిలో భక్తిభావంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొన్నాళ్ల వి రామం తరువాత జూన్ 6న ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణానికి భూమిపూ జ కార్యక్రమాన్ని ఇదే మండలంలోని మంద డం, తాళ్లాయిపాలెం గ్రామాల మధ్య పొలాల్లో వేద మంత్రాల నడుమ చేపట్టారు. గురువారం రాజధాని శంకుస్థాపన దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా నిర్వహించనున్నారు.