పాల్గొన్న మహిళలు, దళిత సంఘాల నాయకులు
తాడికొండ: రాజధాని పేరిట రైతుల నుంచి 32 వేల ఎకరాలను సేకరించిన చంద్రబాబు.. ఆ రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ప్రశ్నించారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 53వ రోజు రిలే దీక్షలు కొనసాగాయి. దీక్షలలో పాల్గొన్న పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. మూడు రాజధానులతోనే అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు సమంగా ఎదుగుతాయన్నారు.
అమరావతిలో చంద్రబాబు తాత్కాలికం పేరిట కోట్లాది రూపాయలను నిర్మాణ కంపెనీలకు దోచిపెట్టడంతో పాటు, కార్పొరేట్ కంపెనీలకు కారు చౌకగా భూములను దోచిపెట్టారని విమర్శించారు. అమరావతి ఉద్యమం పేరిట చంద్రబాబు వర్గానికి చెందిన 10 మంది రైతులు కూడా లేని శిబిరాల్లో వందల మంది పాల్గొంటున్నట్లు ఎల్లో మీడియాలో చూపిస్తూ ఈ ప్రాంత రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితికి చెందిన వివిధ సంఘాల నాయకులు చెట్టే రాజు, జేటీ రామారావు, మాధగాని గురునాధం, ఆకుమర్తి చిన్నా, నత్తా యోనరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment