ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సింగపూర్ బృందం రహస్యంగా పర్యటిస్తోంది. ఈ బృందం నిన్న అమరావతితో పాటు తుళ్లూరులో పర్యటించింది.
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో సింగపూర్ బృందం రహస్యంగా పర్యటిస్తోంది. ఈ బృందం నిన్న అమరావతితో పాటు తుళ్లూరులో పర్యటించింది. శనివారం సింగపూర్ సభ్యులు గుంటూరులో పర్యటిస్తున్నారు. ఆర్డీవో భాస్కరనాయుడు దగ్గరుండి సింగపూర్ బృందాన్ని గ్రామాల్లో తిప్పుతున్నారు. కాగా ఏపీ రాజధాని పరిధిలోని భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్రామాల ప్రజలు.... సింగపూర్ బృందాన్ని అడ్డుకుంటారని వారిని ఏపీ సర్కార్ రహస్యంగా తిప్పుతోంది.