చింతపల్లికి వందేళ్లుగా వస్తున్న ఆ అతిధుల జాడేది..! | Chintapalli Keenly Waits For Siberian Cranes | Sakshi
Sakshi News home page

చింతపల్లికి వందేళ్లుగా వస్తున్న ఆ అతిధుల జాడేది..! రెండేళ్లుగా కనిపించని..

Published Thu, Feb 1 2024 4:57 PM | Last Updated on Thu, Feb 1 2024 5:17 PM

Chintapalli Keenly Waits For Siberian Cranes - Sakshi

చింతపల్లిలో ఈ ఏడాది కూడా సైబీరియా పక్షుల సందడి లేకుండాపోయింది...వందేళ్ల నుంచి వేసవి విడిదిగా వస్తున్న పక్షులు మూడేళ్ల నుంచి రావటంలేదు..ప్రతీ ఏటా వేసవి ప్రారంభంకన్న ముందు వచ్చి వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యే సమయంలో తిరిగి వెళ్తుంటాయి. అయితే చింతపల్లి గ్రామానికి విదేశీ అతిథిలు రాకపోవడానికి కారణాలేంటి..గ్రామస్తులు చెప్పుతున్న కారణం ఏమిటి.

ఖమ్మం జిల్లాలోని చింతపల్లి ప్రాంతం విదేశీ సైబీరియా పక్షులకు అడ్డగా మారిన విషయం తెలిసిందే..ప్రతి ఏటా జనవరి నెలలో ఇక్కడి వస్తాయి...చింతపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున చింతచెట్లు,వేపచెట్లు ఉంటాయి....ప్రతీ ఇంటికి ఒక చింత చెట్టు....రెండు ఇళ్లకు ఒక వేప చెట్టు ఉంటుంది. దీంతో వాటి అవాసంకు ఇది అనుకులమైన ప్రాంతమైంది. వేసవికాలం రాగానే ఈ చింతచెట్లపైన మొదట గూళ్లు కట్టుకుంటాయి.. ఆరు నెలల పాటు ఇక్కడే ఉంటాయి..ఇక్కడే పొదిగి పిల్లలను తీసుకోని జూలై నెల చివరి వారంలో తిరిగి ప్రయాణమవుతాయి. ప్రతీ ఏడాది జనవరి వచ్చిదంటే చాలు తమ అతిథిల కోసం చింతపల్లి గ్రామస్తులు ఎదురుచూస్తు ఉంటారు...

అయితే ఈ ఏడాది కూడా విదేశీ అతిధి రాలేదు..ఈ ఒక్క ఏడాదే కాదు వరుసగా పక్షులు రాక ఇది మూడవ ఏడాది...అయితే పక్షులు రాకపోవడానికి కారణం కోతుల బెడద ప్రదాన కారణమంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. తమ గ్రామంలో ప్రతి ఏటా జనవరిలో పక్షలు ఇక్కడికి వచ్చి చక్కర్లు కొడుతు కనువిందు చేస్తు ఉంటాయని వరుసగా మూడేళ్ల నుంచి రాకపోవడంతో కొంత భాద కలిగిస్తుందని చెబుతున్నారు గ్రామస్తులు. వాటిని అలా చూస్తుండిపోతామని, అంతలా ఆ పక్షులకు మాకు తెలియని ఓ అవినాభవ సంబంధం ఏర్పడిందంటున్నారు. రంగు రంగుల ఆకారంలో ఉండే ఈ పక్షులంటే ఇక్కడి గ్రామస్తులకే కాదు పర్యాటకులను కూడ ఎంతగానో ఆకర్షిస్తాయని చెబుతున్నారు.

సైబీరియా పక్షులు చింతపల్లి గ్రామానికి మా తాతల కాలం నుంచే వస్తున్నయని చెబుతున్నారు గ్రామస్తులు. ప్రతీ ఏటా సైబీరియా అతిథిలు వచ్చి ఇక్కడ ఉంటేనే పంటలు బాగా పండి తమకు లాభం జరుగుతుందనేది తమ నమ్మకం అని కూడా చెబుతున్నారు గ్రామస్తులు. అయితే ఈసారి కూడా అవి రాకపోవడంతో  పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతుతన్నామంటున్నారు గ్రామస్తులు. ఒక్కో సైబీరియా కొంగ దాదాపు మూడు కేజిల పైనే బరువు ఉంటుంది. దీంతో బయట నుంచి వచ్చినవారు ఎవ్వరైనా వాటిని వెంటాడి చంపే ప్రయత్నం చేస్తే అస్సలు ఊరుకోరు. జరిమాన విధిస్తారు. గతంలో వెటాడిన సందర్బాలు సైతం ఉండటంతో ఆరు నెలల పాటు పక్షులకు ఫుల్ సెక్యూరిటిగా ఉండి మరీ దగ్గరుండి చూసుకుంటామని చెబుతున్నారు గ్రామస్తులు. అందువల్లే వీటిని ఎవ్వరూ వేటాడే ప్రయత్నం చేయరని ధీమాగా చెబుతున్నారు.

అలాగే నిరంతరం గ్రామస్తుల నిఘా ఉంటుంది. ఇంత ఇష్టంగా వీటిని గ్రామస్తులు చూసుకుంటున్నా.. కోతుల బెడదతో ఈసారి రాకపోవడంతో వారు భాదపడుతున్నారు. "ఆకాశ మార్గన వేల కీలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ సరిగ్గా వేసవి కాలం వచ్చే ముందు ఇక్కడకు చేరుకుంటాయి...ప్రతీ ఏటా అనుకున్న సమయం కల్లా కచ్చితంగా ఇక్కడికి చేరుకుంటాయి...అందుకే ఈ పక్షులకు అంతటి ప్రత్యేకత....ఆడ, మగ కొంగలు గూళ్ళు ఏర్పాటు చేసుకుని పిల్లలను కంటాయి..ఈ సమయంలో ఆడ కొంగ పిల్లలకు తోడుగా ఉంటే మగ కొంగ ఆహరం తీసుకు వస్తుంది..అయితే ప్రతి ఏటా కోతుల బెడద అతిథి విహాంగాలకు ముప్పుగా మారింది.

దీంతో పక్షులు వచ్చిన సమయంలో గ్రామస్తులు వాటికి ఇబ్బందులు కలగకుండా కోతులను బెదర కొడుతుంటారు. ప్రతీ ఏటా వేసవికాలం ప్రారంభంకన్నా ముందు అతిథిలుగా వచ్చి వర్షకాలం ప్రారంభమవుతున్న సమయంలో తిరిగి వెళ్తాయి. గత మూడేళ్ల నుంచి కోతుల భయంతో మొత్తానికి రావడం మానేశాయి సైబీరియా పక్షులు. ఆరు నెలల పాటు చింతపల్లి గ్రామంలో సందడి చేసే ఈ సైబీరియా కొంగలను చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తువుంటారు...తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. ఎక్కువగా హైదరాబాద్ నుంచి వస్తారు.. అయితే వరుసగా మూడేళ్ల నుంచి పక్షులు రాకపోవడంతో అటు పర్యాటకులు ఇటు గ్రామస్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు".

(చదవండి: పట్టుచీర! ఏది అసలు? ఏది నకిలీ?..ఇలా గుర్తించండి!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement